17. గుర్తించుటకు ఉపయోగపడు పనిముట్లు
1. పెన్సిల్
2. వృత్తలేఖిని ( Pencil compass)
3. డివైడర్ ( Divider)
4. ట్రామెల్ మొనలు ( Trammel points )
5. కొలబద్ద ( Scale )
(a) స్టీల్ రూల్ ( Steel rule)
(b) నాలుగు మడతల స్కేలు
(C) స్టీలు టేపు
1. పెన్సిల్ :—
దీని ద్వారా కర్ర వస్తువుపై తగిన చోట గుర్తులు పెట్టుకొనవచ్చును.
H, HB మరియు B గ్రేడు పెన్సిళ్లలో దేనినైనా వుపయోగించి కర్రవస్తువుపై కొలతలను
గుర్తించుటకు కావలసిన రేఖలను గీయుట చేసుకొనవచ్చును.
2. వృత్త లేఖిని :—
వృత్తలేఖిని లేదా డివైడర్ ను వుపయోగించి చిన్న వృత్తములు గీయవచ్చును
వీటిద్వారా గుర్తించలేని ఎక్కువ వ్యాసమును కలిగిన పెద్ద సైజు వృత్తములను ,
చాపరేఖల. కర్ర వస్తువుపై గుర్తించుటకు ' ట్రామెల్ ' ఉపయోగపడుతుంది .ఇది
నునుపు పరచబడిన దీర్ఘ చతురస్రాకారపు కర్ర దిమ్మ లేదా కర్ర పలకను లేదా
ఉక్కు కడ్డీని కలిగి ఉంటుంది. పాలక అంచులు చదునుగా వుంది దాని పై రెండు
స్క్రూల ద్వారా బిగింపబడిన రెండు చట్రములు లేదా బ్రాకెట్లను కలిగి ఉంటుంది . ఈ చట్రముల అడుగు భాగమున రెండు ఉక్కు పిన్నులు అమర్చబడి వుంటాయి. స్క్రూలను చేతితో త్రిప్పుకొని వదులు చేయుట ద్వారా చట్రముల మధ్యదూరమునుమార్చుకొనవచ్చును. అనగా రెండు పిన్నుల పదునైన మొనల మధ్యదూరము ఎక్కువ లేదా తక్కువ చేసుకొనవచ్చును. దీని వలన గీయవలసిన వృత్తము లేదా చాపరేఖ వ్యాసమును ఎక్కువ లేదా తక్కువ చేయుట ద్వారా కావలసిన సైజుతో గుర్తులను పెట్టుకొనవచ్చును.
చట్రమునకు తగిలించుకొనెడి పిన్ను మొనభాగము పదునుగా కాకుండా యితర ఆకారములను కలిగియుండ వచ్చును. మనకు కావలసిన పిన్నును చట్రమునకు అమర్చుకొనుట ద్వారా ట్రామెల్ ను చాపరేఖలు గీయు వృత్తలేఖిని లాగా లేదా ఇన్ సైడ్ కాలిపర్ మరియు అవుట్ సైడ్ కాలిపర్ లాగా ఉపయోగించు కొనవచ్చును.
5. కొలబద్ద ( Scale ) :---
పొడవులను సరిగా గుర్తించుటకు
గాను మరియు వస్తువు కొలతలను తెలుసుకొనుటకుగాను కొలబద్ద లేదా స్కేలు ఉపయోగపడుతుంది. స్కేలుపై గుర్తింపబడిన కొలతల ఆధారముగా మనకు కావలసిన పొడవును డివైడర్ ద్వారా కొలిచి దానిని కర్ర వస్తువు పై గుర్తించవచ్చును. కర్ర వస్తువు పొడవు ,వెడల్పు , మందము మొదలగువాటిని నేరుగా స్కేలు నుపయోగించుట ద్వారా కొలువవచ్చును.
వడ్రంగి పనియందు మూడురకముల స్కేళ్ళు ఉపయోగపడుతున్నాయి. వాటిని గురించి క్రింద వివరించనైనది.
( a ) స్టీల్ రూల్ ( steel rule ) :---
కొలతలను గుర్తించుటకు ఎక్కువగా
ఉపయోగపడెడి కొలబద్ద స్టీల్ రూల్ .
ఇది మేలు రకపు ఉక్కుతో
చేయబడి పొడవైన పలుచని రేకును
కలిగి యుండి దానిపై కొలతలు
అంగుళములలో మరియు
సెంటీమీటర్లలో గుర్తింపబడి
వుండును. ఇది 25 మి.మీ.
వెడల్పుతో 15 సెం.మీ . నుండి
120 సెం.మీ . వరకు వివిధ
పొడవులలో లభ్యమగును. 30
సెం.మీ ( 12 అంగుళముల )
పొడవుగల స్టీల్ రూల్ సాధారణ
పనులకు ఉపయోగపడుతుంది.
దీనిపై ఒక వైపు సెం.మీ , మి.మీ.
మరియొక వైపు అంగుళములు
గుర్తించబడి వుంటాయి. 0.5 మి.మీ.
మరియు 1/64 అంగుళముల
కనీసపు పొడవులను గుర్తించగల
స్కేలు అన్ని పనులకు పనికి
వస్తుంది.
( b) నాలుగు మడతల స్కేలు :—
ఇది కర్రతో నాలుగు భాగములుగా
చేయబడి వుంటుంది. ప్రతి భాగము
15 సెం.మి . పొడవును కలిగియుండి
దానిపై మి.మీ ., సెంటీమీటర్లు
కొలతలు ఒకవైపు , అంగుళముల
కొలతలు రెండవవైపు గుర్తింపబడి
వుంటాయి. ఈ నాలుగు భాగములు
ఒకదానితో ఒకటి వదులైన పిన్నుల
ద్వారా వదులుగా కలుపబడి
వుంటాయి. ఈ విధంగా
కలుపబడిన అంచుల ఆధారముగా
నాలుగు భాగములను మడిచి దీనిని
చిన్నగా ( అనగా 15 సెం . మీ
పొడవుతో ) అమర్చుకొనవచ్చును.
ఈ స్కేలును ఉపయోగించినపుడు
మడచిన ఈ భాగములను విడదీసి
దానిని పొడవుగా ( అనగా 4 x 15
= 60 సెం. మీ పొడవుతో )
అమర్చుకొనవచ్చును. స్కేలును
ఉపయోగించునపుడు మడచుకొనిన
ఈ స్కేలును జేబులో
పెట్టుకొనవచ్చును. దీని వెడల్పు
సుమారు 2.5 సెం.మీ వుంటుంది.
( c ) స్టీలు టేపు :—
ఉక్కు రేకుతో చేయబడిన స్కేలును ' స్టీలు టేపు ' అంటారు. ఇది సుమారు 1 సెం.మీ . వెడల్పుతో 200 సెం.మీ పొడవును కలిగి వుంటుంది. పెట్టెలాగా మూయబడియున్న కేసింగ్ ( Casing ) మధ్యభాగమున గల ఒక కడ్డీ పైన ఈ స్కేలు గుండ్రముగా చుట్టబడియుంటుంది. కేసింగ్ కు ఒకవైపు గల సన్నని చీలికగుండా స్కేలు ఒక కొన భాగము వెలుపలికి తీయబడి దానిని చేతితో పట్టుకొనుటకు వీలుగా దానికి ఒక చిన్న కొక్కెము ( Hook) అమర్చబడి యుంటుంది. కొక్కెమును పట్టుకొని స్కేలును బయటకు లాగి పొడవుగా చేసుకొనవచ్చును. స్కేలు తయారు చేయబడిన ఉక్కురేకు స్ప్రింగు దనము (Springness ) కలిగియుంటుంది. దీనివలన స్కేలును ఉపయోగించనప్పుడు
కేసింగ్ ను చేతితో పట్టుకొని కదిలించినపుడు బయటకు లాగబడిన స్కేలు భాగము తిరిగి కేసింగ్ లోనికి లాగబడి లోపల గల కడ్డీ పైన తిరిగి చుట్టబడుతుంది. మడతలుగల స్కేలుకన్నా దీని ద్వారా ఎక్కువ పొడవులను కొలువవచ్చును.
6. తిన్నగాయున్న అంచు (Straight edge )
కర్ర వస్తువు ఉపరితలము చదునుగా వున్నదా లేదా పరిశీలించుటకు ఇది ఉపయోగపడుతుంది. ఉక్కుతో చేయబడిన సన్నని పొడవైన విడిభాగములు కలుపబడుట ద్వారా యిది చేయబడుతుంది. ఈ విడిభాగములు ఒక వైపు అంచు కొద్దిగా ఏటవాలుగా వుండి కొలతలను గుర్తు పెట్టుటకు ఉపయోగపడుతుంది. వస్తువు యొక్క ఉపరితలములను తిన్నగా యున్న దీని అంచుతో వివిధ ద
శలలో అమర్చుకొని పోల్చి చూచుటమూలముగా ఆ ఉపరితలము సమతలముగా వున్నది లేనిది తెలుస్తుంది.
7 .ట్రై స్క్వేరు ( Try square ) :---
కర్ర వస్తువు రెండు ప్రక్క ప్రక్క అంచులు సమకోణంలో వున్నాయా లేదా తెలుసుకొనుటకు మరియు కర్ర వస్తువు యేదేని అంచుకు లంబకోణములో రేఖలను గీయుటకు యిది పనికివస్తుంది. ఇది కర్రతో లేదా ఉక్కుతో నునుపుగా మరియు సమముగా చేయబడిన ఒక పలకను కలిగి వుంటుంది. ఖచ్చితమైన కొలతలతో చేయబడిన దీనిని 'స్టాక్ ' (Stock ) అని అంటారు. దీర్ఘచతురస్రాకారపు ' స్టాక్ ' కు ఒక
వైపున లంబకోణములో బిగించబడిన బ్లేడు స్టాక్ పొడవైన అంచులతో ఖచ్చితమైన 90 డిగ్రీల కోణమును చేస్తూ వుంటుంది. బ్లేడుకూడా ఉక్కురేకుతో చేయబడి దానిపై స్కేలుపై ఉన్నట్లుగా కొలతలు గుర్తింపబడి వుంటాయి. అనగా బ్లేడుభాగమును స్కేలులాగా ఉపయోగించవచ్చును. బ్లేడు పొడవును బట్టి ఇది 100 మి.మీ. , 150 మి.మీ., 300 మి.మీ సైజులలో లభ్యమగుతుంది.
ట్రై స్క్వేర్ నుపయోగించు విధానము పటములో చూపబడింది. స్టాక్ పొడవైన పై అంచును కర్ర వస్తువు అంచుకు తాకునట్లు అమర్చి బ్లేడు నుపయోగిస్తూ ఆ అంచుకు లంబ కోణములో రేఖను గీయవచ్చును. కర్రవస్తువు అంచు పై స్టాక్ ను మెల్లిగా కదిలిస్తూ బ్లేడు నుపయోగిస్తూ ఈ విధమైన లంబరేఖలు గీయవచ్చును. కర్రవస్తువు అంచుకు లంబకోణములో గీచిన ఆ రేఖలన్నియు ఒకదానితో ఒకటి సమాంతరంగా వుంటాయి గదా.
అదేవిధంగా కర్ర వస్తువు ఒక అంచు చివర స్టాక్ ను తగిలించి బ్లేడు అంచును కర్రవస్తువు పై అంచుకు ప్రక్కగా నున్న అంచుకు తగిలించి వాటి మధ్య ఖాళీ స్థలమున్నదీ లేనిదీ పరీక్షించుట ద్వారా కర్రవస్తువు రెండు అంచులు ఒకదానితో ఒకటి లంబకోణములో వున్నదీ లేనిదీ తెలుసుకొనవచ్చును.
8.బివెల్ స్క్వే ర్ :— ట్రై స్క్వేర్ ద్వారా 90 డిగ్రీల కోణమును మాత్రమే గుర్తించగలము. దీనితో పాటు ఇతర కోణములను ( అనగా 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు) గుర్తించుటకు మరియు కొలుచుటకుగాను బివెల్ స్క్వేర్ ఉపయోగపడుతుంది. కావలసిన కోణమును దీనిపైన అమర్చుకొనుటకు వీలుగా దీనియందు బ్లేడు భాగము స్టాక్ కు మధ్యలో గల చీలికలో స్క్రూ ద్వారా బిగింపబడి యుంటుంది. స్క్రూని వదులుచేసి బ్లేడును స్టాక్ కు తగిలించిన వైపు ఆధారంగా గుండ్రముగా త్రిప్పుకొని స్టాక్ భాగముతో కావలసిన కోణమును ఏర్పడేటట్లు బ్లేడును అమర్చుకొని స్క్రూని బిగించవచ్చును. ఈ విధంగా గుండ్రముగా త్రిప్పుకొనే సదుపాయముంటుంది. కనుక బ్లేడును ' కదిలెడిబ్లేడు ' ( Sliding blade ) అనీ , యీ పనిముట్టును ' కదిలెడి బివెల్ స్క్వేర్ ( sliding bevel square ) అనీ అంటారు. కావలసిన కోణములోనికి బ్లేడును త్రిప్పుకొనినపిదప స్క్రూను బిగించిన పిదపనే దీనిని ఉపయోగించాలి. బ్లేడు పొడవును బట్టి యిది 100 , 150, 200, 250 మి.మీ సైజులలో లభ్యమగుతుంది.
9. మీటర్ స్క్వేర్ (Metre square):--- దీని యందు బ్లేడు భాగము స్టాక్ భాగముతో 45॰ కోణములో అమర్చబడి స్టాక్ కు బిగించబడి యుంటుంది. అనగా 45॰ కోణమును మాత్రమే దీని ద్వారా గుర్తించుట కొలుచుట చేసు

దీనినే "పెన్సిల్ కం పాస్ " ( Pencil compass ) అని అంటారు . దీనికి పెన్సిలు
తగిలించుకొని కర్ర వస్తువు పై చిన్న వృత్తములు , చాప రేఖలు గీయవచ్చును.
వృత్తలేఖిని రెండు భుజములను కలిగియుండి అవి ఒక వైపు పిన్ను ద్వారా
కలపబడి దాని ఆధారంగా వాటిని దగ్గరగా లేదా దూరంగా జరుపుటకు
వీలుగా ఉంటుంది . ఒక భుజము రెండవ చివర ఉక్కుతో చేయబడిన పిన్నును
కలిగి వుండి రెండవ భుజమునకు పెన్సిలును అమర్చుకొను సదుపాయము
ఉంటుంది . రేఖా గణితములో చాపములను, వృత్తములను గీయుటకు
ఉపయోగించినట్లే యీ వృత్తలేఖినిని ఉపయోగించాలి . పదునైన పిన్ను
మొనభాగమును కర్ర వస్తువుపై తగిన చోట నొక్కి పెట్టి , పెన్సిల్ కలిగిన
భుజమును కదిలించుట ద్వారా చాపరేఖలు , వృత్తములను కర్ర వస్తువుపై
గుర్తించవచ్చును. రెండు భుజములను దగ్గరగా లేదా దూరముగా చేసుకొని
వివిధ సైజుల వృత్తములు గీయవచ్చును.
3. డివైడర్ (Divider ) :---
ఇది కూడ వృత్తలేఖిని వలే రెండు భుజములను కలిగివుండి , వాటి
అడుగు భాగమున ఉక్కుతో చేయబడిన పిన్నులను కలిగి ఉంటాయి . అనగా
దీనికి పెన్సిల్ ను అమర్చుకొను సదుపాయము ఉండదు . వృత్తలేఖిని బదులు
దీనినుపయోగించి కర్ర వస్తువుపై చాప రేఖలు , వృత్తములు గీయవచ్చును.
కొలత బద్ద ( Scale ) పై గల కొలతలను డివైడర్ ద్వారా కర్ర వస్తువుపై గుర్తించ
వచ్చును.
4. ట్రామెల్ మొనలు (Trammel points ) :---
వృత్తలేఖిని లేదా డివైడర్ ను వుపయోగించి చిన్న వృత్తములు గీయవచ్చును
వీటిద్వారా గుర్తించలేని ఎక్కువ వ్యాసమును కలిగిన పెద్ద సైజు వృత్తములను ,
చాపరేఖల. కర్ర వస్తువుపై గుర్తించుటకు ' ట్రామెల్ ' ఉపయోగపడుతుంది .ఇది
నునుపు పరచబడిన దీర్ఘ చతురస్రాకారపు కర్ర దిమ్మ లేదా కర్ర పలకను లేదా
ఉక్కు కడ్డీని కలిగి ఉంటుంది. పాలక అంచులు చదునుగా వుంది దాని పై రెండు
స్క్రూల ద్వారా బిగింపబడిన రెండు చట్రములు లేదా బ్రాకెట్లను కలిగి ఉంటుంది . ఈ చట్రముల అడుగు భాగమున రెండు ఉక్కు పిన్నులు అమర్చబడి వుంటాయి. స్క్రూలను చేతితో త్రిప్పుకొని వదులు చేయుట ద్వారా చట్రముల మధ్యదూరమునుమార్చుకొనవచ్చును. అనగా రెండు పిన్నుల పదునైన మొనల మధ్యదూరము ఎక్కువ లేదా తక్కువ చేసుకొనవచ్చును. దీని వలన గీయవలసిన వృత్తము లేదా చాపరేఖ వ్యాసమును ఎక్కువ లేదా తక్కువ చేయుట ద్వారా కావలసిన సైజుతో గుర్తులను పెట్టుకొనవచ్చును.
చట్రమునకు తగిలించుకొనెడి పిన్ను మొనభాగము పదునుగా కాకుండా యితర ఆకారములను కలిగియుండ వచ్చును. మనకు కావలసిన పిన్నును చట్రమునకు అమర్చుకొనుట ద్వారా ట్రామెల్ ను చాపరేఖలు గీయు వృత్తలేఖిని లాగా లేదా ఇన్ సైడ్ కాలిపర్ మరియు అవుట్ సైడ్ కాలిపర్ లాగా ఉపయోగించు కొనవచ్చును.
5. కొలబద్ద ( Scale ) :---
పొడవులను సరిగా గుర్తించుటకు
గాను మరియు వస్తువు కొలతలను తెలుసుకొనుటకుగాను కొలబద్ద లేదా స్కేలు ఉపయోగపడుతుంది. స్కేలుపై గుర్తింపబడిన కొలతల ఆధారముగా మనకు కావలసిన పొడవును డివైడర్ ద్వారా కొలిచి దానిని కర్ర వస్తువు పై గుర్తించవచ్చును. కర్ర వస్తువు పొడవు ,వెడల్పు , మందము మొదలగువాటిని నేరుగా స్కేలు నుపయోగించుట ద్వారా కొలువవచ్చును.
వడ్రంగి పనియందు మూడురకముల స్కేళ్ళు ఉపయోగపడుతున్నాయి. వాటిని గురించి క్రింద వివరించనైనది.
( a ) స్టీల్ రూల్ ( steel rule ) :---
కొలతలను గుర్తించుటకు ఎక్కువగా
ఉపయోగపడెడి కొలబద్ద స్టీల్ రూల్ .
ఇది మేలు రకపు ఉక్కుతో
చేయబడి పొడవైన పలుచని రేకును
కలిగి యుండి దానిపై కొలతలు
అంగుళములలో మరియు
సెంటీమీటర్లలో గుర్తింపబడి
వుండును. ఇది 25 మి.మీ.
వెడల్పుతో 15 సెం.మీ . నుండి
120 సెం.మీ . వరకు వివిధ
పొడవులలో లభ్యమగును. 30
సెం.మీ ( 12 అంగుళముల )
పొడవుగల స్టీల్ రూల్ సాధారణ
పనులకు ఉపయోగపడుతుంది.
దీనిపై ఒక వైపు సెం.మీ , మి.మీ.
మరియొక వైపు అంగుళములు
గుర్తించబడి వుంటాయి. 0.5 మి.మీ.
మరియు 1/64 అంగుళముల
కనీసపు పొడవులను గుర్తించగల
స్కేలు అన్ని పనులకు పనికి
వస్తుంది.
( b) నాలుగు మడతల స్కేలు :—
ఇది కర్రతో నాలుగు భాగములుగా
చేయబడి వుంటుంది. ప్రతి భాగము
15 సెం.మి . పొడవును కలిగియుండి
దానిపై మి.మీ ., సెంటీమీటర్లు
కొలతలు ఒకవైపు , అంగుళముల
కొలతలు రెండవవైపు గుర్తింపబడి
వుంటాయి. ఈ నాలుగు భాగములు
ఒకదానితో ఒకటి వదులైన పిన్నుల
ద్వారా వదులుగా కలుపబడి
వుంటాయి. ఈ విధంగా
కలుపబడిన అంచుల ఆధారముగా
నాలుగు భాగములను మడిచి దీనిని
చిన్నగా ( అనగా 15 సెం . మీ
పొడవుతో ) అమర్చుకొనవచ్చును.
ఈ స్కేలును ఉపయోగించినపుడు
మడచిన ఈ భాగములను విడదీసి
దానిని పొడవుగా ( అనగా 4 x 15
= 60 సెం. మీ పొడవుతో )
అమర్చుకొనవచ్చును. స్కేలును
ఉపయోగించునపుడు మడచుకొనిన
ఈ స్కేలును జేబులో
పెట్టుకొనవచ్చును. దీని వెడల్పు
సుమారు 2.5 సెం.మీ వుంటుంది.
( c ) స్టీలు టేపు :—
ఉక్కు రేకుతో చేయబడిన స్కేలును ' స్టీలు టేపు ' అంటారు. ఇది సుమారు 1 సెం.మీ . వెడల్పుతో 200 సెం.మీ పొడవును కలిగి వుంటుంది. పెట్టెలాగా మూయబడియున్న కేసింగ్ ( Casing ) మధ్యభాగమున గల ఒక కడ్డీ పైన ఈ స్కేలు గుండ్రముగా చుట్టబడియుంటుంది. కేసింగ్ కు ఒకవైపు గల సన్నని చీలికగుండా స్కేలు ఒక కొన భాగము వెలుపలికి తీయబడి దానిని చేతితో పట్టుకొనుటకు వీలుగా దానికి ఒక చిన్న కొక్కెము ( Hook) అమర్చబడి యుంటుంది. కొక్కెమును పట్టుకొని స్కేలును బయటకు లాగి పొడవుగా చేసుకొనవచ్చును. స్కేలు తయారు చేయబడిన ఉక్కురేకు స్ప్రింగు దనము (Springness ) కలిగియుంటుంది. దీనివలన స్కేలును ఉపయోగించనప్పుడు
కేసింగ్ ను చేతితో పట్టుకొని కదిలించినపుడు బయటకు లాగబడిన స్కేలు భాగము తిరిగి కేసింగ్ లోనికి లాగబడి లోపల గల కడ్డీ పైన తిరిగి చుట్టబడుతుంది. మడతలుగల స్కేలుకన్నా దీని ద్వారా ఎక్కువ పొడవులను కొలువవచ్చును.
6. తిన్నగాయున్న అంచు (Straight edge )
కర్ర వస్తువు ఉపరితలము చదునుగా వున్నదా లేదా పరిశీలించుటకు ఇది ఉపయోగపడుతుంది. ఉక్కుతో చేయబడిన సన్నని పొడవైన విడిభాగములు కలుపబడుట ద్వారా యిది చేయబడుతుంది. ఈ విడిభాగములు ఒక వైపు అంచు కొద్దిగా ఏటవాలుగా వుండి కొలతలను గుర్తు పెట్టుటకు ఉపయోగపడుతుంది. వస్తువు యొక్క ఉపరితలములను తిన్నగా యున్న దీని అంచుతో వివిధ ద
శలలో అమర్చుకొని పోల్చి చూచుటమూలముగా ఆ ఉపరితలము సమతలముగా వున్నది లేనిది తెలుస్తుంది.
7 .ట్రై స్క్వేరు ( Try square ) :---
కర్ర వస్తువు రెండు ప్రక్క ప్రక్క అంచులు సమకోణంలో వున్నాయా లేదా తెలుసుకొనుటకు మరియు కర్ర వస్తువు యేదేని అంచుకు లంబకోణములో రేఖలను గీయుటకు యిది పనికివస్తుంది. ఇది కర్రతో లేదా ఉక్కుతో నునుపుగా మరియు సమముగా చేయబడిన ఒక పలకను కలిగి వుంటుంది. ఖచ్చితమైన కొలతలతో చేయబడిన దీనిని 'స్టాక్ ' (Stock ) అని అంటారు. దీర్ఘచతురస్రాకారపు ' స్టాక్ ' కు ఒక
వైపున లంబకోణములో బిగించబడిన బ్లేడు స్టాక్ పొడవైన అంచులతో ఖచ్చితమైన 90 డిగ్రీల కోణమును చేస్తూ వుంటుంది. బ్లేడుకూడా ఉక్కురేకుతో చేయబడి దానిపై స్కేలుపై ఉన్నట్లుగా కొలతలు గుర్తింపబడి వుంటాయి. అనగా బ్లేడుభాగమును స్కేలులాగా ఉపయోగించవచ్చును. బ్లేడు పొడవును బట్టి ఇది 100 మి.మీ. , 150 మి.మీ., 300 మి.మీ సైజులలో లభ్యమగుతుంది.
ట్రై స్క్వేర్ నుపయోగించు విధానము పటములో చూపబడింది. స్టాక్ పొడవైన పై అంచును కర్ర వస్తువు అంచుకు తాకునట్లు అమర్చి బ్లేడు నుపయోగిస్తూ ఆ అంచుకు లంబ కోణములో రేఖను గీయవచ్చును. కర్రవస్తువు అంచు పై స్టాక్ ను మెల్లిగా కదిలిస్తూ బ్లేడు నుపయోగిస్తూ ఈ విధమైన లంబరేఖలు గీయవచ్చును. కర్రవస్తువు అంచుకు లంబకోణములో గీచిన ఆ రేఖలన్నియు ఒకదానితో ఒకటి సమాంతరంగా వుంటాయి గదా.
అదేవిధంగా కర్ర వస్తువు ఒక అంచు చివర స్టాక్ ను తగిలించి బ్లేడు అంచును కర్రవస్తువు పై అంచుకు ప్రక్కగా నున్న అంచుకు తగిలించి వాటి మధ్య ఖాళీ స్థలమున్నదీ లేనిదీ పరీక్షించుట ద్వారా కర్రవస్తువు రెండు అంచులు ఒకదానితో ఒకటి లంబకోణములో వున్నదీ లేనిదీ తెలుసుకొనవచ్చును.
8.బివెల్ స్క్వే ర్ :— ట్రై స్క్వేర్ ద్వారా 90 డిగ్రీల కోణమును మాత్రమే గుర్తించగలము. దీనితో పాటు ఇతర కోణములను ( అనగా 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు) గుర్తించుటకు మరియు కొలుచుటకుగాను బివెల్ స్క్వేర్ ఉపయోగపడుతుంది. కావలసిన కోణమును దీనిపైన అమర్చుకొనుటకు వీలుగా దీనియందు బ్లేడు భాగము స్టాక్ కు మధ్యలో గల చీలికలో స్క్రూ ద్వారా బిగింపబడి యుంటుంది. స్క్రూని వదులుచేసి బ్లేడును స్టాక్ కు తగిలించిన వైపు ఆధారంగా గుండ్రముగా త్రిప్పుకొని స్టాక్ భాగముతో కావలసిన కోణమును ఏర్పడేటట్లు బ్లేడును అమర్చుకొని స్క్రూని బిగించవచ్చును. ఈ విధంగా గుండ్రముగా త్రిప్పుకొనే సదుపాయముంటుంది. కనుక బ్లేడును ' కదిలెడిబ్లేడు ' ( Sliding blade ) అనీ , యీ పనిముట్టును ' కదిలెడి బివెల్ స్క్వేర్ ( sliding bevel square ) అనీ అంటారు. కావలసిన కోణములోనికి బ్లేడును త్రిప్పుకొనినపిదప స్క్రూను బిగించిన పిదపనే దీనిని ఉపయోగించాలి. బ్లేడు పొడవును బట్టి యిది 100 , 150, 200, 250 మి.మీ సైజులలో లభ్యమగుతుంది.
9. మీటర్ స్క్వేర్ (Metre square):--- దీని యందు బ్లేడు భాగము స్టాక్ భాగముతో 45॰ కోణములో అమర్చబడి స్టాక్ కు బిగించబడి యుంటుంది. అనగా 45॰ కోణమును మాత్రమే దీని ద్వారా గుర్తించుట కొలుచుట చేసు
కొనవచ్చును.
10. స్పిరిట్ లెవల్ (Spirit level ) :--దీని ద్వారా యేదేని వస్తువు యొక్క ఉపరితలము చదునుగా మరియు సమతలంగా వుందా లేదా తెలుసుకొనవచ్చును. ఇది కర్రతో లేదా బరువు తక్కువ గల లోహముతో గాని దీర్ఘచతురస్రాకారపు పెట్టె ఆకారములో చేయబడిన ' బాడీ '( Body) ని కలిగి ఉంటుంది . ఒక సన్నని గాజు గొట్టము ఎక్కువ వ్యాసార్థమును కలిగి ఉండునట్లుగా వంచబడి బాడీ లోపల అమర్చబడి ఉంటుంది. ఈ గొట్టము యందు కొద్దిగా ఖాళీ స్థలమును వదలి స్పిరిట్ ద్రవము నింపబడి యుంటుంది. ఈ ఖాళీ స్థలములో యేర్పడిన ' గాలిబుడగ ' ( Air bubble) గొట్టములో ద్రవము పై భాగమునకు చేరుకుంటుంది. స్పిరిట్ లెవల్ బాడీ అడుగుభాగమునకు సమతలంగా యున్న వస్తువు ఉపరితలమునకు తగులునట్లు అమర్చినప్పుడు గాలిబుడగ గాజు గొట్టము మధ్య భాగమునకు చేరుకుంటుంది. గాజు గొట్టము మధ్యభాగము కనబడుటకు గాను దిమ్మ ఆకారపు బాడీలో మధ్యగా ఒక రంధ్రము చేయబడిఉంటుంది. దీని
ద్వారా గాలిబుడగ గాజు గొట్టము మధ్యభాగమునకు చేరిందా లేదా అన్న విషయము గమనించవచ్చును. గాజుగొట్టము మధ్యభాగముపై కొలతలు గుర్తింపబడి యుంటాయి. ఈ కొలతల ఆధారంగా గాలిబుడగ ఖచ్చితంగా మధ్యకు వచ్చిందా లేదా అనానది తెలుసుకొనవచ్చును. స్పిరిట్ లెవల్ బాడి పొడవును బట్టి దీని సైజును సూచిస్తారు. ఉదాహరణకి 200 మి.మీ స్పిరిట్ లెవల్ బాడీ 200 మి.మీ. వుంటుంది.