Showing posts with label కొలుచుటకు మరియు గుర్తు పెట్టుటకు ఉపయోగపడు పనిముట్లు. Show all posts
Showing posts with label కొలుచుటకు మరియు గుర్తు పెట్టుటకు ఉపయోగపడు పనిముట్లు. Show all posts

Saturday, October 26, 2019

16.కొలుచుటకు మరియు గుర్తు పెట్టుటకు ఉపయోగపడు పనిముట్లు

16 . కొలుచుటకు       మరియు   గుర్తు  పెట్టుటకు  

ఉపయోగపడు   పనిముట్లు 


ఉపోద్ఘాతము:— 


మనకు  అవసరమగు  కర్రసామగ్రిని   తయారు   చేయునప్పుడు  కలపను.తగిన 


సైజులో    మరియు   ఆకారములో   కోసి  ,     దానిపై  వివిధ  వడ్రంగి   పనులను 

నిర్వహించవలసియుంటుంది.  కర్రవస్తువులను   తగిన   ఆకారములోనికి 


మార్చుకున్నప్పుడు  దాని   సరియైన సైజును   నిర్ణయించటానికి వివిధ  


కొలతలు  ఉపయోగపడతాయి.   పొడవు  వెడల్పు , మందము  మొదలగు  కొలతలు 


సరిగా   వుండేటట్లుగా   కర్ర  వస్తువు  ఆకారము  ,  సైజును  మార్చుకొనవలసి  

యుంటుంది.  వివిధ   వడ్రంగి   పనులు  చేయునప్పుడు   కర్రవస్తువు   కొలతలను


నిర్ధారించుటకై     ఉపకరించు  పనిముట్లను  ' కొలుచుటకు ఉపయోగపడు  పనిముట్లు  '  (


Measuring   instruments )   అని  అంటారు.   అదే  విధంగా  మనకు  కావలసిన  


కొలతలను  కర్రవస్తువు  పై   తగిన  స్థలములలో  సూచించుటకు  కొన్ని 


గుర్తులు  పెట్టవలసి  ఉంటుంది.  కొలతలను  ' గుర్తించుటకు  ఉపయోగపడు  పనిమూట్ల'  

ను     (Marking  tools )  ఇందుకు   ఉపయోగిస్తారు.  కొలుచుటకు   మరియు 


గుర్తుపెట్టుటకు  సరియైన  పరికరములు  లేకుండా   తయారు చేసిన  కర్రసామగ్రి 


తగిన  సైజు  మరియు   ఆకారము  లేకుండా  లోపముతో   కూడియుంటుంది. 


వడ్రంగి  పనియందు  కొలుచుటకు   మరియు  గుర్తుపెట్టుటకు  ఉపకరించు 


వివిధ   పనిముట్లను   గురించి ,  వాటిని  సరిగా  వుపయోగించెడి   విధానమును 


గురించి క్రింద  వివరించనైనది.