Monday, September 9, 2019

14.కర్రను సీజనింగ్ చేయుట (Wood seasoning )

           కర్రను  సీజనింగ్  చేయుట
            Wood  Seasoning)
చెట్టు    నుండి    పడగొట్టిన    కర్రలో    నీరు  మరియు  లవణ  

ద్రావణములతో    కూడిన    తేమ  ( Sap)   వుండుట    

మూలముగా    అది    కొద్దికాలము   తర్వాత    సంకోచించుట,  

వంగిపోవుట    జరిగి    దాని  యందు  పగుళ్ళు  యేర్పడవచ్చును. 

అంతే    కాకుండా   అది  బలహీనంగా  తయారై  కొద్ది  కాలానికి  

క్షీణించిపోతుంది  కూడ.   కాబట్టి    మనకు  కావలసిన  

ఉపకరణములను  తయారుచేయుటకు  చెట్టునుండి  లభ్యమయ్యే 

కర్రను    నేరుగా    ఉపయోగించరాదు.   దాని  లోని    తేమను  

తొలగించుట    ద్వారా   యేవిధమైన   లవణ  ద్రావణములు   

లేకుండా    చేసి    రసదారువును  గట్టిపరచుటను  ' సీజనింగ్ '  

అంటారు. కర్రను    సీజనింగ్  చేయుట   వలన    ఈ    క్రింద 

పేర్కొనబడిన    లాభములుంటాయి.
  1. తేమను  తొలగించుటచే   కర్ర  బరువు  తగ్గుతుంది.
  2. కర్ర  యొక్క  దారుఢ్యత  పెరిగి  ,  దానిపై  వివిధ  పనిముట్లతో  తేలికగా  పనిచేయుటకు  వీలుంటుంది.
  3. కర్ర   ఎక్కువ  కాలము  మన్నిక  గా   వుంటుంది.  సంకోచించుట  వంగిపోవుట   ,  పగుళ్ళను  కలిగియుండుట ,  క్షీణించుట  మొదలగు  దుష్ఫలితములు   తగ్గుతాయి.




No comments:

Post a Comment