Showing posts with label 9. వృక్షకాండము యొక్క ముఖ్యభాగములు. Show all posts
Showing posts with label 9. వృక్షకాండము యొక్క ముఖ్యభాగములు. Show all posts

Tuesday, September 3, 2019

9. వృక్షకాండము యొక్క ముఖ్యభాగములు

 వృక్ష కాండము  యొక్క  ముఖ్య భాగములు :—

వృక్ష కాండము   యొక్క అవచ్ఛేదము

పటములో చూపబడినది. వృక్షము 

యొక్క   కర్ర  నారల   (Fibres )   వంటి 

పదార్థంతో   చేయబడింది ఉంటుంది .

వృక్షము   పొడవుగా   పెరిగిన కొలది,

దాని   పొడవు   దిశలో   నారలు

పెరుగుతాయి .  ఈ  నారలు   గొట్టం

ఆకారంలో   ఉండి   వృక్ష కాండపు

కేంద్రము   వద్ద  గల  ' దవ్వ ' లేక  'బెండు'

(Pith   or  Medulla )  చుట్టూ

అమర్చబడి ఉంటాయి. ఈ  నారలు

వృక్షకణములచే   చేయబడి   పెరిగిన

కొలది,  కణములు   వ్యాపించెడి  దిశలో

ఏర్పరచబడుతుంటవి.  ఈ  నారలనే   వృక్ష

కణాలు ( Cells  or  Grains ) అని

కూడా అంటారు.   కణములు   వృక్షము

యొక్క   పొడవు   దిశలోనే   పెరుగుతూ

నారల   వలె  ఏర్పడతాయి.   ఈ నారల

ద్వారా   వృక్షమునుండి   లభించు  కర్ర

తగిన   పటిష్టతను   కలిగి   ఉంటుంది .

అంతే   కాకుండా  యీ   నారల   ద్వారా

వృక్ష కాండము   అడుగు భాగమున   కల

వ్రేళ్ళ నుండి   ఆహారపదార్ధములు

కొమ్మలకు,  ఆకులకు 

అందించబడతాయి.వృక్షకాండపు 

వెలుపలి   బెరడు ( outer bark  ) చెట్టు

ను  వాతావరణపు   వైపరీత్యాలకు

గురికాకుండా   కాపాడుతుంది .దీనినే  '

బహిశ్చర్మము '  అని అంటారు. బెండు

చుట్టూ  వర్తులాకారములో   అమర్చబడిన

వృక్ష భాగము   గట్టిగా   నల్లగా   ఉంటుంది

.దీనిని 'హృత్కాష్ఠము" లేదా గట్టి  కర్ర

లేదా  హార్ట్   వుడ్ (Heart  wood )   

అని   అంటారు. దీని  గుండా  నీరు గాని,

ద్రావణములుగాని ప్రసరింపవు. ఈ

వృక్షభాగము  తగిన దారుడ్యతను

కలిగియుండి  ఎక్కువకాలము  మన్నికగా

ఉంటుంది .దీనికి,  కాంబియమ్  పొర

(Cambium   layer )  అనబడెడి

వెలుపలి పొరకు  మధ్యగల  కర్ర

భాగమును 'రసదారువు'( Sap wood )

అంటారు .  దీని గుండా నీరు ,లవణ

ద్రవములు  ప్రసరించుట  వలన  ఇది

తేమను   కలిగి యుండి   బలహీనంగా

ఉంటుంది .  ఈ   వృక్ష భాగము  కర్ర

సామాగ్రిని   తయారు   చేయుటకు

పనికిరాదు.  రసదారువునకు,  వెలుపలి 

బెరడునకు   మధ్యగల  పొరవలెయున్న

వృక్షకాండపు  భాగమును  'కాంబియమ్

పొర  ' అని   అంటారు.
                     
                         బెరడు  నుండి  కేంద్ర

భాగమున   గల  'దవ్వ '  వైపునకు

వ్యాసార్థ  దిశలో   అమర్చబడియున్న 

కణాముుల      అమరికను  'దవ్వ 

రేఖలు'   లేదా   'మెడ్యూల్లరీ  రేఖలు'  అని

అంటారు.
                        కాంబియమ్  పొర నుండి

బెండువైపునకు    ప్రతి   సంవత్సరము

ఒక  వలయమువలె   యేర్పడు

దారువలయములను 'వార్షిక

వలయములు'  (Annual  rings )

లేదా  ' ఆన్యుయల్  రింగులు  '  అని

అంటారు.  వృక్షకాండమును   అడ్డముగా

కోసినపిదప     ఈ     రింగుల   సంఖ్యను 

లెక్కించుకొని    వృక్షము   యొక్క

వయస్సును    నిర్ణయించుకొనవచ్చును.

వృక్షము పెరిగిన    కొలది    మెత్తని

రసదారువు   గట్టిగా   మారుతూ   గట్టి  కర్ర

భాగము   పెరుగుతుంది.