Monday, September 9, 2019

13. మార్కెట్లో లభ్యమగు వివిధ సైజుల కలపలు

 మార్కెట్లో    లభ్యమగు   వివిధ   సైజుల కలపలు:—చెట్టును   పడగొట్టుట

వేసవికాలంలో   ( ఏప్రిల్,  మే  మాసాలలో )
లేదా   శీతాకాలపు   మధ్యభాగము

( డిసెంబరు , జనవరి   మాసాలలో )

చేయవలసి   ఉంటుంది .  ఈ   కాలంలో

 వృక్ష కాండము లోని  తేమ  కదలకుండా

నిశ్చల   స్థితిలో   నుండుటయే  దానికి

కారణము.  చెట్టు  పూర్తిగా పెరిగి దాని

పెరుగుదల   నిలిచిపోయినపుడు మాత్రమే

చెట్టును   పడగొట్టుట   జరుగుతుంది.

పడగొట్టిన   చెట్టునుండి   కర్రను

రంపములతో   కోసుకొని  వివిధ

సైజులలోనికి     మార్చి   ఆ పిదప

 'సీజనింగ్ '  చేస్తారు.   వివిధ   సైజులలో

కోయబడ్డ    కర్రరూపములు  మార్కెట్ లో

యీ   క్రింది   పేర్లతో  లభ్యమగుతున్నాయి.

( a ) .  కర్ర  మొద్దు ( Log ):--- కొమ్మలు

లేని    చెట్టు  ప్రకాండమును   ' కర్రమొద్దు'

అంటారు.

 (b ) దూలము ( Balk ):--  కాండము

యొక్క  బహిశ్చర్మమును 

తొలిగించునట్లుగా   దానిని  కోసుకొని 

చదరపు  అవచ్ఛేదము  కలిగి

యుండునట్లుగా   మార్చుకొంటారు. ఈ

విధముగా  లభ్యముగు  కర్రను

దూలములు  అంటారు.

( c )   స్తంభములు  ( posts  ) :  — 

ఇవి  చదరపు

ఆకారము  లేదా  గుండ్రముగా  గానీ

అవచ్ఛేదమును   కలిగియుండి పొడవుగా

వుంటాయి.  చదరపు   ఆకారములో

యున్న  దీని  భుజము  పొడవు  లేదా

గుండ్రని  ఆకారపు  వ్యాసము  పొడవు

175 మి.మీ.  నుండి  300 మి.మీ . వరకు

వుంటుంది.

( d)  డీల్  కర్ర  ( Deal  ) :-- ఇవి  225

మి.మీ.  వెడల్పు   తో   సుమారు

100మి.మీ.  మందమును   కలిగిన

దీర్ఘచతురస్రాకారపు   పలకల రూపములో

వుంటాయి.

(  e )  కర్ర   పలకలు  ( Planks  ) :--ఇవి

కూడ  దీర్ఘచతురస్రాకారములో   3 నుండి

7  మీటర్ల  పొడవును  కలిగియుండి  50

నుండి  100  మి.మీ. మందము ,  275

  నుండి   300 మి.మీ  వెడల్పును  కలిగి

వుంటాయి.

(  f ) బోర్డులు (  Boards  or  Battens) :-- ఇవి   25  నుండి   50   మి.మీ.

మందమును   మరియు   125 నుండి

175 మి.మీ  వెడల్పును   కలిగి

యుంటాయి.

No comments:

Post a Comment