వృక్ష కాండము యొక్క ముఖ్య భాగములు :—
వృక్ష కాండము యొక్క అవచ్ఛేదము
పటములో చూపబడినది. వృక్షము
యొక్క కర్ర నారల (Fibres ) వంటి
పదార్థంతో చేయబడింది ఉంటుంది .
వృక్షము పొడవుగా పెరిగిన కొలది,
దాని పొడవు దిశలో నారలు
పెరుగుతాయి . ఈ నారలు గొట్టం
ఆకారంలో ఉండి వృక్ష కాండపు
కేంద్రము వద్ద గల ' దవ్వ ' లేక 'బెండు'
(Pith or Medulla ) చుట్టూ
అమర్చబడి ఉంటాయి. ఈ నారలు
వృక్షకణములచే చేయబడి పెరిగిన
కొలది, కణములు వ్యాపించెడి దిశలో
ఏర్పరచబడుతుంటవి. ఈ నారలనే వృక్ష
కణాలు ( Cells or Grains ) అని
కూడా అంటారు. కణములు వృక్షము
యొక్క పొడవు దిశలోనే పెరుగుతూ
నారల వలె ఏర్పడతాయి. ఈ నారల
ద్వారా వృక్షమునుండి లభించు కర్ర
తగిన పటిష్టతను కలిగి ఉంటుంది .
అంతే కాకుండా యీ నారల ద్వారా
వృక్ష కాండము అడుగు భాగమున కల
వ్రేళ్ళ నుండి ఆహారపదార్ధములు
కొమ్మలకు, ఆకులకు
అందించబడతాయి.వృక్షకాండపు
వెలుపలి బెరడు ( outer bark ) చెట్టు
ను వాతావరణపు వైపరీత్యాలకు
గురికాకుండా కాపాడుతుంది .దీనినే '
బహిశ్చర్మము ' అని అంటారు. బెండు
చుట్టూ వర్తులాకారములో అమర్చబడిన
వృక్ష భాగము గట్టిగా నల్లగా ఉంటుంది
.దీనిని 'హృత్కాష్ఠము" లేదా గట్టి కర్ర
లేదా హార్ట్ వుడ్ (Heart wood )
అని అంటారు. దీని గుండా నీరు గాని,
ద్రావణములుగాని ప్రసరింపవు. ఈ
వృక్షభాగము తగిన దారుడ్యతను
కలిగియుండి ఎక్కువకాలము మన్నికగా
ఉంటుంది .దీనికి, కాంబియమ్ పొర
(Cambium layer ) అనబడెడి
వెలుపలి పొరకు మధ్యగల కర్ర
భాగమును 'రసదారువు'( Sap wood )
అంటారు . దీని గుండా నీరు ,లవణ
ద్రవములు ప్రసరించుట వలన ఇది
తేమను కలిగి యుండి బలహీనంగా
ఉంటుంది . ఈ వృక్ష భాగము కర్ర
సామాగ్రిని తయారు చేయుటకు
పనికిరాదు. రసదారువునకు, వెలుపలి
బెరడునకు మధ్యగల పొరవలెయున్న
వృక్షకాండపు భాగమును 'కాంబియమ్
పొర ' అని అంటారు.
బెరడు నుండి కేంద్ర
భాగమున గల 'దవ్వ ' వైపునకు
వ్యాసార్థ దిశలో అమర్చబడియున్న
కణాముుల అమరికను 'దవ్వ
రేఖలు' లేదా 'మెడ్యూల్లరీ రేఖలు' అని
అంటారు.
కాంబియమ్ పొర నుండి
బెండువైపునకు ప్రతి సంవత్సరము
ఒక వలయమువలె యేర్పడు
దారువలయములను 'వార్షిక
వలయములు' (Annual rings )
లేదా ' ఆన్యుయల్ రింగులు ' అని
అంటారు. వృక్షకాండమును అడ్డముగా
కోసినపిదప ఈ రింగుల సంఖ్యను
లెక్కించుకొని వృక్షము యొక్క
వయస్సును నిర్ణయించుకొనవచ్చును.
వృక్షము పెరిగిన కొలది మెత్తని
రసదారువు గట్టిగా మారుతూ గట్టి కర్ర
భాగము పెరుగుతుంది.
వృక్ష కాండము యొక్క అవచ్ఛేదము
పటములో చూపబడినది. వృక్షము
యొక్క కర్ర నారల (Fibres ) వంటి
పదార్థంతో చేయబడింది ఉంటుంది .
వృక్షము పొడవుగా పెరిగిన కొలది,
దాని పొడవు దిశలో నారలు
పెరుగుతాయి . ఈ నారలు గొట్టం
ఆకారంలో ఉండి వృక్ష కాండపు
కేంద్రము వద్ద గల ' దవ్వ ' లేక 'బెండు'
(Pith or Medulla ) చుట్టూ
అమర్చబడి ఉంటాయి. ఈ నారలు
వృక్షకణములచే చేయబడి పెరిగిన
కొలది, కణములు వ్యాపించెడి దిశలో
ఏర్పరచబడుతుంటవి. ఈ నారలనే వృక్ష
కణాలు ( Cells or Grains ) అని
కూడా అంటారు. కణములు వృక్షము
యొక్క పొడవు దిశలోనే పెరుగుతూ
నారల వలె ఏర్పడతాయి. ఈ నారల
ద్వారా వృక్షమునుండి లభించు కర్ర
తగిన పటిష్టతను కలిగి ఉంటుంది .
అంతే కాకుండా యీ నారల ద్వారా
వృక్ష కాండము అడుగు భాగమున కల
వ్రేళ్ళ నుండి ఆహారపదార్ధములు
కొమ్మలకు, ఆకులకు
అందించబడతాయి.వృక్షకాండపు
వెలుపలి బెరడు ( outer bark ) చెట్టు
ను వాతావరణపు వైపరీత్యాలకు
గురికాకుండా కాపాడుతుంది .దీనినే '
బహిశ్చర్మము ' అని అంటారు. బెండు
చుట్టూ వర్తులాకారములో అమర్చబడిన
వృక్ష భాగము గట్టిగా నల్లగా ఉంటుంది
.దీనిని 'హృత్కాష్ఠము" లేదా గట్టి కర్ర
లేదా హార్ట్ వుడ్ (Heart wood )
అని అంటారు. దీని గుండా నీరు గాని,
ద్రావణములుగాని ప్రసరింపవు. ఈ
వృక్షభాగము తగిన దారుడ్యతను
కలిగియుండి ఎక్కువకాలము మన్నికగా
ఉంటుంది .దీనికి, కాంబియమ్ పొర
(Cambium layer ) అనబడెడి
వెలుపలి పొరకు మధ్యగల కర్ర
భాగమును 'రసదారువు'( Sap wood )
అంటారు . దీని గుండా నీరు ,లవణ
ద్రవములు ప్రసరించుట వలన ఇది
తేమను కలిగి యుండి బలహీనంగా
ఉంటుంది . ఈ వృక్ష భాగము కర్ర
సామాగ్రిని తయారు చేయుటకు
పనికిరాదు. రసదారువునకు, వెలుపలి
బెరడునకు మధ్యగల పొరవలెయున్న
వృక్షకాండపు భాగమును 'కాంబియమ్
పొర ' అని అంటారు.
బెరడు నుండి కేంద్ర
భాగమున గల 'దవ్వ ' వైపునకు
వ్యాసార్థ దిశలో అమర్చబడియున్న
కణాముుల అమరికను 'దవ్వ
రేఖలు' లేదా 'మెడ్యూల్లరీ రేఖలు' అని
అంటారు.
కాంబియమ్ పొర నుండి
బెండువైపునకు ప్రతి సంవత్సరము
ఒక వలయమువలె యేర్పడు
దారువలయములను 'వార్షిక
వలయములు' (Annual rings )
లేదా ' ఆన్యుయల్ రింగులు ' అని
అంటారు. వృక్షకాండమును అడ్డముగా
కోసినపిదప ఈ రింగుల సంఖ్యను
లెక్కించుకొని వృక్షము యొక్క
వయస్సును నిర్ణయించుకొనవచ్చును.
వృక్షము పెరిగిన కొలది మెత్తని
రసదారువు గట్టిగా మారుతూ గట్టి కర్ర
భాగము పెరుగుతుంది.
No comments:
Post a Comment