Friday, September 6, 2019

12. కలప లో గల లోపములు

        12. కలప  లో   గల  లోపములు

 1. ముళ్ళు ( Knots) :---వృక్ష కాండము

నుండి    వెలువడిన    కొమ్మలు

విరిగిపోయినప్పుడు   కాండముపై 

ఏర్పడు   గుర్తులను ' ముళ్ళు'(నాట్స్)

అంటారు.   ఈ   గుర్తులు   స్పష్టం గా

యేర్పరచబడతాయి.   చిన్న సైజులో

యేర్పడ్డ   ముళ్ళను  'టైట్ నాట్స్ ' (

Tight  knots )  అని అంటారు.   ఈ

ముళ్ళు    యేర్పడ్డ    కర్రభాగము దృఢంగా

యుండుట   చేత    ఇది    లోపంగా

పరిగణింపబడదు.   కానీ ,   పెద్ద సైజులో ,

వదులుగా  నున్న  ముళ్ళు  ముఖ్య  కలప

భాగము  నుండి  పెలుసులుగా

విడిపోతాయి.  ఈ  లోపమును  కలిగిన

 కలప  తగినంత    దారుఢ్యతను   కలిగి

ఉండదు.
---------------------------------------------------

2 .మెలి  తిరిగిన  ఫైబర్లు :—   చెట్టు

కొొమ్మలగుండా   వేగంగా   వీచెడి

  గాలులు    తుఫానుల   తాకిడివలన 

వృక్షకాండము   యొక్క   పొరలు  (

ఫైబర్లు)   మెలితిరిగి    పోవుట   వలన ఈ

లోపము   ఏర్పడుతుంది .
---------------------------------------------------

3. హార్ట్   షేక్ (  Heart  shake ):—

వృక్ష కాండపు  కేంద్రము   వద్ద   గల 'హార్ట్ '

భాగము   నుండి   కాండపు   వెలుపలి

వైపున గల   'సాప్ వుడ్  ' ( Sapwood)

భాగమునకు  వ్యాపించెడి   చీలికలను  '

హా ర్ట్    షేక్  '  అని  అంటారు.

 --------------------------------------------------

4 .స్టార్ షేక్  (  Star  shake ):--

వృక్షకాండపు   వెలుపలిపొర  లోపలి

తలము   నుండి   కాండపు  కేంద్ర 

భాగమునకు  వ్యాపించెడి   చీలికలను

'స్టార్  షేక్  '  అని  అంటారు. 

వేసవికాలంలో  అమితమైన   ఉష్ణోగ్రతకు

 మరియు   శీతాకాలంలో  అతి చల్లని

వాతావరణమునకు   గురి  అగుటవలన

వృక్షకాండపు   పొరలు  కాలిపోవుట

లేదా  పికిలిపోవుట  జరిగి  యీ  లోపము

యేర్పడుతుంది.
---------------------------------------------------

కప్    మరియు  రింగ్  షేక్ (Cup &  Ring  shake  ):--వృక్షకాండములో

వృత్తాకారములో   అమర్చబడిన  రెండు

ప్రక్క  ప్రక్క  ఆన్యులర్  రింగులమధ్య 

సన్నని    చీలిక    ఉత్పన్నమై,  క్రమేణా

వృద్ధి  పొంది  పెద్ద  చీలికగా   మారుతుంది.

ఈ   విధంగా    సన్నని   చీలిక గా

మారుతుంది.    ఈ    విధంగా    యేర్పడ్డ 

లోపమును   ' కప్  మరియు  రింగ్ షేక్  '

అని   అంటారు.   శీతాకాలంలో వృక్ష

కాండంలో గల    తేమ   ఘనీభవించుట 

వలన   లేదా   వృక్షకాండపు

అడుగుభాగమున   గల   వ్రేళ్ళ   ద్వారా

 కావలసిన   దాని  కన్నా  ఎక్కువగా   

నీటిని    గ్రహించుట    వలన  కూడ  యీ   

లోపము  ఏర్పడుతుంది .

6. హనీ  కోంబింగ్ ( Honey   combing):--  కర్రను    సరిగా 

సీజనింగ్    చేయక  పోవుట   వలన   ఈ

లోపము  ఏర్పడుతుంది.   సీజనింగ్

తొలిదశలో   తేమను  తొలగించుట

కావలసిన   దానికన్నా   ఎక్కువ వేగంగా

జరిగినప్పుడు   కలప  లోపలి  పొరలలో

చీలికలు  యేర్పడుట  ద్వారా   యీ

లోపము  జరుగుతుంది.  తేనెపట్టు

గదులవలె  యీ  చీలికలు  యేర్పడుట

చేత  దీనిని  'హనీ  కోంబిం గ్'   అని

అంటారు.


7. రిండ్    గాల్  ( Ring  gall ):-- వృక్ష

కాండము   నుండి   కొమ్మలు   కొట్టివేసిన

పిదప  తెగిపోగా   మిగిలిన

కొమ్మభాగములో   రసదారువు   (Sap

wood )    పెరిగిపోవుట   వలన   ఈ

లోపము   ఏర్పడుతుంది.   దీని మూలంగా

ఆ  కొమ్మ   యందు  డొల్లగా  యేర్పడిన

రంధ్రములు    యేర్పడి ,  అక్కడి నుండి

క్షీణించుట   ప్రారంభమై   యితరభాగాలకు

వ్యాపిస్తుంది .

8.  నశించిపోయిన   కర్ర ( Dead  wood) :—నిర్ణీత 

జీవితకాలమును   దాటిన   పిదప

వృక్షమును   పడగొట్టి    దానినుండి  కర్రను

పొందినపుడు    ఆ   కర్ర  లో  యీ

లోపము   కనపడుతుంది .  ఈ కర్ర

సాధారణ బరువు    కంటే   తక్కువ

బరువుతో   బలహీనంగా   ఉంటుంది.

No comments:

Post a Comment