Tuesday, September 3, 2019

8. కలప నిచ్చే వృక్షములు రకములు

 కలప నిచ్చే వృక్షములను రెండు రకములుగా విభజించవచ్చును.
 ( i ).బహిర్జాత   వృక్షములు ( Exogenous  trees ):---ఈ రకపు

వృక్షములు    పెరిగినప్పుడు   చెట్టు

కాండము    వెలుపలి    వైపుకు   అనగా

అడ్డంగా   పెరుగుతుంది .   క్రమక్రమంగా

పెరిగే    కాండపు    పెరుగుదలను

సూచించే   ఏకకేంద్ర   వృత్తాకారపు

రింగులు    కాండంలో    ఏర్పడతాయి.

కాండాన్ని   ఖండించి నప్పుడు   ఈ

రింగులు   స్పష్టంగా   కనబడతాయి .ఈ

రింగులను  'వార్షిక వలయాలు'   లేదా

ఆన్యులర్   రింగులు  అని  అంటారు.  ప్రతి

ఒక్కరింగు   ఒక   సంవత్సరపు

పెరుగుదలను   సూచిస్తుంది.  ఈ  రకపు

వృక్షములను    తిరిగి   రెండు రకములుగా

విభజించవచ్చును.

 (a ) సతత  హరిత   వృక్షములు(

Evergreen Trees ) :--- ఇవి

మృదువైన  కాండము ను  కలిగి

ఉంటాయి.  వీటినే  కోనిఫర్  వృక్షములు

అని అంటారు.  వీటికి   ఉదాహరణగా

దేవదారు ,  అక్రోటు ,  ఫర్   వృక్షములను

పేర్కొనవచ్చును.

( b)   వెడల్పైన   ఆకులు   గలవృక్షములు

(Broad leaf trees ):--- ఇవి గట్టి 

కర్రను   కలిగి   ఉండి   వివిధ   కలప

సామాగ్రిని  తయారు చేయుటకు  విరివిగా

ఉపయోగపడతాయి. వీటినే   ఆకులు

రాల్చెడి  వృక్షములు  ( Decidous trees)

అని అంటారు.  మద్ది , టేకు ,  సింధూర ,

అశోక వృక్షములు   ఈ రకమునకు చెందినవి .

2. అంతర్జాత   వృక్షములు (

Endogenous  trees ) :--- ఈ 

వృక్షములు   పొడవుగా

 వృద్ధిచెందుతాయి.  వృక్షము 

పెరిగినప్పుడు   క్రమక్రమంగా   ఒక వరుస

పై మరియొక వరుస  అమర్చబడ్తూ

అడ్డంగా   కాకుండా   లోపలి వైపునకు

వరుసలు  అమర్చబడతాయి . ఈ విధంగా

చెట్టు  పెరిగే  క్రమాన్ని  బట్టి  కణములు

(Cells ) ఏర్పరచబడుతూ   చెట్టు

పెరుగుతుంది. తాడి,  ఈత , వెదురు

వృక్షములు    ఈ   రకమునకు  చెందినవి.

No comments:

Post a Comment