Wednesday, September 4, 2019

10. మన దేశంలో పెరిగెడి కలప వృక్షములు

 మన  దేశంలో  పెరిగెడి  కలప   వృక్షములు:—
మన  దేశంలో  పెరిగెడి  కలప   వృక్షములు  

 క్రింద పేర్కొనబడినవి.
1.  తుమ్మ చెట్టు:— ఇది   దేశమంతటా

పెరుగుతుంది . ఇది   దగ్గర దగ్గరగా   గల

కణములను   కలిగి యుండి   పటిష్టంగా

ఉంటుంది. దీని   కాండం  అవచ్ఛేదము

లేత   ఎర్రని   రంగును   కలిగి ఉంటుంది .

2 .దేవదారు  వృక్షము:—ఇది   కొండ

ప్రాంతంలో పెరుగుతుంది. 

దీని   కలప   పటిష్టంగా   ఉండి   ఎక్కువ

కాలం   మన్నికగా   ఉంటుంది.  గృహ

నిర్మాణం   మరియు   రైలు పట్టాల క్రింద

పరిచెడి  స్లీపర్లను   తయారు చేయడంలో

ఇది ఉపయోగ పడుతుంది.

 3.  మామిడి చెట్టు  :— ఇది 

దేశమంతటా   పెరుగుతుంది. ఇది

దూరదూరంగా   అమర్చబడినయున్న 

పెద్ద   కణములను   కలిగి   ఉంటుంది.

దీని   కలప   తక్కువ   నాణ్యత   కలిగి

ఉంటుంది .  తలుపులు  మరియు

గృహోపకరణాలను   తయారు చేయుటలో

ఇది   ఉపయోగపడుతుంది.   ఇంజనీరింగ్

పరికరములను   తయారు చేయుటకు

ఇది   పనికిరాదు .

4 .మల్బరీ   చెట్టు :— ఇది   దృఢంగా

ఉండి   తగినంత   స్థితిస్థాపకత 

(Elasticity ) కలిగి

ఉంటుంది.   దీనిని    టెన్నిస్   మరియు

బ్యాడ్మింటన్    రాకెట్   హాకీ   కర్రలు , క్రికెట్

బ్యాటులు   మరియు   ఇతర   ఆట

వస్తువులు    తయారు చేయుటకు

ఉపయోగిస్తారు.

 5.  టేకు చెట్టు :—  ఇది   ధృడంగా 

ఉండి   ఎక్కువ కాలం   మన్నికగా

ఉండుటయే   కాకుండా  కలపను  నునుపు

పరచుట    సులభంగా   సాధ్యపడుతుంది.

కొన్ని   ప్రత్యేక   నూనెల   మూలంగా   ఇది

కీటకములకు   గురికాకుండా    చాలా

కాలము  మన్నికగా  వుండుట

జరుగుతుంది. వివిధ  గృహోపకరణాలను

తయారుచేయుటకు  ఉపయోగపడుతుంది .

6. మద్దిచెట్టు :—ఇది   ఎక్కువ   గట్టి గా

మరియు   దారుడ్యతతో   ఎక్కువ

బరువును   కలిగి   ఉంటుంది.   ఇది కూడా

చదలకు  మరియు   ఇతర   కీటకములకు

గురికాకుండా   చాలా కాలం  మన్నికగా

ఉంటుంది.   రైల్వేస్లీపర్లు , వంతెనలు,

గృహ నిర్మాణమున   కవసరమగు    కర్ర

సామాగ్రి,   ఓడలు   తయారు చేయుటలో

ఇది   ఉపయోగపడుతుంది .

7 .మహోగని (mahogany )వృక్షము:--

 ఇది   తిన్నగా  యున్న  కణములను  కలిగి

యుండి,  ముదురు   ఎరుపు రంగును

కలిగి ఉంటుంది.   ఇది   కూడా చెదలకు,

ఇతర కీటకములకు   గురికాకుండా   చాలా

కాలం   మన్నికగా   ఉంటుంది .  అయితే

తేమకు   గురి   అయినప్పుడు   దీని

నాణ్యత   తగ్గుతుంది.   దీనిని 

బీరువాలు  ( Cabinets )  ఇతర  మేలు

రకపు  గృహోపకరణాలు    మరియు

ఓడల  తయారీలో ఉపయోగిస్తారు.

 8 .అక్రోటు చెట్టు :—ఇది   చిన్న సైజు

గల   కణములను   కలిగి   ఉండి   లేత

రంగులో ఉంటుంది.   ఇది   కొద్ది

దారుఢ్యతను    కలిగియుండి 

నునుపుపరచి   అందంగా   తయారు

చేయుటకు      వీలు కలిగి ఉంటుంది. ఇది

కూడా   కీటకములకు  గురికాదు.  దీనిని

అలంకరణ సామగ్రి ,

గృహోపకరణములు,  బీరువాల  తయారీకి

ఉపయోగిస్తారు .

9 .వెదురు చెట్టు :—ఇది అంతర్జాత

వృక్షము.   దీనిని   గృహ నిర్మాణముులో

మరియు   గెడకర్రల ( Scaffoldings )

తయారీలో   ఉపయోగిస్తారు.

No comments:

Post a Comment