Monday, September 2, 2019

7. కలప జాతి వృక్షములు

  కలప జాతి వృక్షములు    
1. ఉపోద్ఘాతము :—
               చెట్టు   నుండి లభ్యమగు

 కర్రను   గృహ   నిర్మాణంలో మరియు 

ఇతర   ఉపయోగకర   సామాగ్రిని 

తయారు   చేయుటకు ఉపయోగకరంగా 

ఉండుటకు   గాను  దానిని    కలపగా 

మార్చుతారు   బరువు తక్కువగా   ఉండి 

తగినంత   పటిష్టత కలిగియుండుట 

మూలముగా   వివిధ ఇంజినీరింగ్ 

పరికరములను   తయారు చేయుటకు 

గాను   ఇతర లోహముల కన్నా   కలప

ఎక్కువగా   వాడబడుతున్నది .కలపను 

కావలసిన    ఆకారము   లోనికి

మార్చుటకు   గాను    తేలిక    రకమైన

పనిముట్ల   ద్వారా    సులభముగా

సాధించవచ్చును.    కలపతో    చేసిన

వస్తువులను   జాగ్రత్తగా   వాడుకొనిన

యెడల    అవి   చాలా   కాలం   మన్నికగా

ఉంటాయి .

2.  మేలురకపు    కలపకు    ఉండవలసిన గుణములు:— 
               
      కర్ర సామాగ్రిని తయారు

చేయుటకు   ఉపకరించు   మేలు రకపు

కలపను    ఎన్నుకొనుట కు   గాను   అనేక

వివరాలను    పరిశీలించవలసి  ఉంటుంది.

కలప    గట్టితనం,   మన్నిక ,  బరువు,  కర్ర

యందు   అమర్చబడిన   కణములు

మొదలగు   సాధారణ   విషయాలే

కాకుండా   ఒక్కసారి   దాని   అగ్ని  నిరోధక

గుణము    త్వరగా  నునుపు  చేయ

బడుతుందా   లేదా   అన్న    విషయం

మొదలగు    ఇతర    వివరాలను

పరిశీలించి    తగిన    కలపను

ఎన్నుకొనవలసిన   ఉంటుంది.   సాధారణ

వడ్రంగి   పనికి   గాను   ఉపయోగపడే

కలప   ఈ   క్రింది   గుణములను   కలిగి

ఉండాలి .

1. సరి యైన    వార్షిక వలయముల

(Annual  rings ) ను   కలిగి   ఉండి

రంపముతో   కోయునప్పుడు   రంపము

పండ్లు    నిరోధించ   బడకుండా   ఉండాలి.

2. కలపలో    తేమ    ఉండకూడదు .

3. కలపలో   ఉండే    సాధారణ 

లోపములు    కలిగి    ఉండరాదు.

4. కలప   ' సీజనింగ్ '  చేయబడి ఉండాలి

5 .కలపను    కొట్టినప్పుడు    శ్రావ్యమైన

శబ్దము  నివ్వగలగాలి.

3. కలప  నిచ్చే   వృక్షములు :—
     
మేలు రకపు     కలప    ప్రతి

వృక్షమును   నుండి   లభించదు .  కొన్ని

ప్రత్యేక   వృక్షముల   నుండి   లభించు కర్ర

మాత్రమే  మేలు  రకపు  కలపకు 

కావలసిన  గుణములను  కలిగి ఉంటుంది.

కలప  నొసగే   వృక్షము   పొడవుగా ఉండి,

లావైన  కాండమును   కలిగి   ఉండి

మేలురకమైన  కర్ర   నివ్వగలిగి  ఉండాలి.

No comments:

Post a Comment