Monday, September 9, 2019

15.కర్రను సీజనింగ్ చేయు విధానములు

కర్రను సీజనింగ్  చేయు విధానములు

కర్రను  సీజనింగ్   చేయుటకు  రెండు  పద్ధతులు  కలవు.


1. సహజమైన  పద్ధతిలో  సీజనింగ్  చేయుట.
     ( Natural  Seasoning  )

2. కృత్రిమ  పద్ధతిలో   సీజనింగ్  చేయుట.
    ( Artificial  seasoning )

1. సహజమైన  పద్ధతిలో  సీజనింగ్  చేయుట:--
  ( Natural  Seasoning  )

దీని    యందు  వాతావరణములోని  గాలిని     ప్రసరింప  చేయుట  ద్వారా  సీజనింగ్  


చేయబడుతుంది.   దీనిని   'గాలి  ప్రసరణ  వల్ల   సీజనింగ్ చేయు  విధానము' (Air   seasoning )   

అని  అనవచ్చును.   కోయబడిన   కర్ర దూలముల  పైకి  గాలిని   తగిలినట్లుగా   ప్రసరింప  చేయడం   

ద్వారా   
సీజనింగు     చేయబడుతుంది.    కోయబడిన  కర్ర  దూలములను  మధ్య   మధ్య 

తగినంత   ఖాళీ   స్థలము  కలిగి యుండునట్లుగా    పేర్చుకొనాలి.   ఈ విధంగా పేర్చుకున్నపుడు 

అడుగున   ఉన్న దూలములు  కాకుండా   నేలనుండి  తగినంత   ఎత్తులో   ఉండునట్లు  చూడాలి.  దీని 

వలన   ఇవి  నేలలోని  తేమకు, నేలపై  ప్రసరించు   నీటికి  గురికాకుండా  ఉంటాయి.  పేర్చబడిన  

దూలములకు  పై  భాగమున  సరియైన  "పై కప్పు" 
(Roof)  అమర్చుకొనినచో,   పైన గల దూలములు  

సూర్యకిరణములకు, వర్షములకు గురికాకుండా   వుంటాయి.  పేర్చబడిన  కర్రదూలముల మధ్య  గల  

ఖాళీ  స్థలముల గుండా  గాలి  ప్రసరించి వాటి నుండి  తేమను  గ్రహించుట  జరుగుతుంది.  ఈ  పద్ధతి  

 సులభమైనదే   కాకుండా   మేలురకమైనది కూడా.  అయితే   ఈ   సీజనింగు  చేయుటకు   2  నుండి  4  

సంవత్సరాలు పడుతుంది.




2. కృత్రిమ పద్ధతిలో సీజన్ చేయు విధానము:— 


కృత్రిమంగా   సీజనింగ్   చేయుట వలన కర్రను   త్వరితంగా  సీజనింగు  చేయ వీలుంటుంది. 

ముఖ్యమైన   కొన్ని   కృత్రిమ సీజనింగు   విధానములను  గురించి వివరించబడింది. 



1. నీటిచే    సీజనింగుచేయు   విధానము :—ఈ పద్ధతిలో  చిన్న భాగములుగా   కోయబడిన   కర్రను

 ప్రవహించే    నీటిలో   మునిగి   ఉండునట్లు   నిలువయుంచుతారు.   ఈ విధంగా సుమారు  15


రోజుల   వరకు   వాటిని   వెలుపలికి తీసి   గాలిలో  ఆరబెడతారు.  ఈ పద్ధతి వల్ల   కలప 

వంగిపోవుట   లేదా  దానిపై  పగుళ్ళు  యేర్పడుట   తగ్గుతుంది.  అయితే   దాని దారుఢ్యత   

తగ్గి పోతుంది.     ఎక్కువగా    తేమను   కలిగిన  కర్రలకు  యీ  పద్ధతి   ఎక్కువ   లభిస్తుంది. 

పురుగులచే   తిని  వేయబడుట   లేదా   ఫంగస్ 
వలన    క్షీణింపబడుట    నివారించుటకు   యీ  

 సీజనింగ్    పద్ధతి  తోడ్పడుతుంది.




2.  నీటిలో  మరగబెట్టుటచే   సీజనింగు  చేయు విధానము :—



కలప   ముక్కలను,    మరుగుచున్న  నీటిలో  గాని,  నీటి   ఆవిరి  లో  గాని   సుమారు  4   గంటల  దాకా 

వుంచి,  పిదప   వాటిని  నెమ్మదిగా   ఆరబెట్టి   
సీజనింగు    చేయవచ్చును.  దీనివలన   కలప  

దారుఢ్యత   పెరిగి   దాని   స్థితిస్థాపకత్వము (
Elasticity )   ఎక్కువగుతుంది.



3. రసాయనిక  పద్ధతిలో  సీజనింగు  చేయుట (Chemical seasoning ) :—

ఈ  విధానములో  తేమకలిగిన   కర్రభాగములను   ముందుగా  సంతృప్త

లవణ  ద్రావణములో  నానబెట్టి ,   అవి  పూర్తిగా  నానిన  పిదప,  వాటిని

వెలుపలికి   తీసి  గాలిలో  ఆరబెడతారు.  దీని  వలన  ముందుగా  కరార  లోపలి

పొరలలోని  తేమ బహిశ్చర్మము  ఉపరితలము  నుండి  తేమ   తొలగింపబడుతుంది.


4. బట్టీలో   సీజనింగు చేయు విధానము( Kiln  seasoning ):—

కృత్రిమ  సీజనింగు  పద్ధతులలో  యిది  అత్యంత  మేలు  రకమైనది.  ఈ

విధానములో  ఇటుకలచే   గది   ఆకారములో  కట్టబడిన  బట్టీ

యందుకలప  ముక్కలు   వాటి   మధ్య  ఖాళీ  స్థలముండునట్లుగా 

పేర్చబడతాయి.    వీటి గుండా   ముందుగా     నీటి ఆవిరిని    ప్రసరింప   

చేస్తారు.  పిదప   వేడి  చేయబడిన   
గాలిని   ప్రసరింపచేస్తారు.  కలప   

ముక్కలలోని    తేమను   ముందుగా 
నీటిఆవిరి   కొంత  గ్రహిస్తుంది.   

మిగిలిన   తేమను   వేడిగాలి    
గ్రహించి  తీసివేస్తుంది.    ఈ   పద్ధతిని   

'డెస్సికేటింగ్  విధానము ( 
Dessicating   process)  అని   కూడ   అంటారు.

5. విద్యుత్   శక్తి    నుపయోగించి   


సీజనింగ్  చేయుట :—   Electric 
seasoning ):--- ఈ    

విధానమందు    ఎక్కువ    ఫ్రీక్వెన్సీ ( 

Frequency )   తో   

కూడిన  ఆల్టర్ నేటింగ్    విద్యుత్  ప్రవాహమును  (  A. C.)  


ఉపయోగించి   కలపను  


వేడిచేస్తారు.   ఈ  విధంగా  


 వేడిచేయుటను    'డై ఎలక్ట్రిక్   పద్ధతిలో    వేడిచేయుట  


 ( Dielectric  heating )  అని అంటారు.   ఈ  పద్ధతి    ప్లైవుడ్   


తయారీలో    ఎక్కువ  ఉపయోగపడుతుంది.   అయితే  ఇది   

ఎక్కువ   ఖర్చుతో  కూడుకున్న  పద్ధతి.


ఉపయోగమునకై     కలపను     మార్చుకొనెడి   విధానము  ( conversion  of  timber ):--

చెట్టునుండి    లభించు   కలపను   తగిన   రూపము   లోనికి    మార్చుకొనుటకు   గాను   


దాని    సైజును   తగ్గించాలి  . ఇందుకుగాను   దానిని   రంపములతో    కోసి   వివిధ   


సైజులలోనికి  మార్చుకొనవలసి  ఉంటుంది .  ఈ   విధంగా     కోయుటను   '  కలప   


మార్పిడి  '  అని   అంటారు.   ఇందుకు    గాను    మూడు   పద్దతులలో    కలప  


కోయబడుతుంది .   వాటిని    గురించి  క్రింద   వివరింపబడింది . 


1.  లైవ్   సాయింగ్   (  Live   sawing  ):--  


ఈ   పద్ధతి  లో      కర్ర   సన్నని   


పలకలుగా      కోయబడుతుంది .   కర్ర   
మొద్దును  తిప్ప  కుండానే      కర్ర    

పొడవుకు   నిలువుగా    కోసి ,  
ఒకకోతకు ,    రెండవ    కోతకు  మధ్య    

కొంత   స్థలమును   వదలి    సమాంతరమైన    కోతలతో  

కోయుటవలన   కర్ర  చిన్న   పలకలుగా  
కోయబడుతుంది   .    ఈ    విధముగా    

కోయుటవలన    యే    విధమైన  
నష్టము   లేకుండా    మొత్తము   కర్ర   

కోయబడుతుంది .   అయితే    సన్నని  
పలకలుగా   కోయబడ్డ   కర్రముక్కలు     

కొద్ది    కాలమునకు    వంగిపోవుటకు   
అవకాశమున్నది  .     ఈ    పద్ధతి   కర్ర   

డబ్బాలను    చేయుటకు    ఉపయోగపడి    కర్ర   పలకల   తయారీలో     మరియు   

చౌకబారు   నిర్మాణములకు    అవసరపడెడి   కర్ర   పలకల   తయారీలో   ఎక్కువగా    

ఉపయోగపడుతుంది .  



2.   బ్యాక్    సాయింగ్    ( Back   sawing ):---

ఈ   పద్దతిలో    కర్ర    మొద్దు   యందు  
యేర్పరచబడిన    వార్షిక    వలయములను  

 స్పర్శించునటుల     కర్ర   కోయబడుతుంది.   ఇందుకుగాను    కర్ర   మొద్దును  


 త్రిప్పుకొని   కోతపని   సాగించవలసి   ఉంటుంది  .    ఈ   విధముగా    కోయబడిన   

కర్రభాగములు    త్వరగా   సీజనింగు  
చేయబడతాయి .  అంతే    కాకుండా   కోయబడిన  

 కర్రయందు    కణముల    అమరిక     ఒక    క్రమపద్ధతిలో   లేకుండా    ఆకర్షణీయమైన   

నమూనాలను    యేర్పరుస్తుంది .  
కాబట్టి    ఈ   కర్ర   అలంకారిక   సామాగ్రి   . 

ఉపరితలముల  తయారీలో   ఉపయోగిస్తుంది .  

3.   '  క్వార్టర్   సాయింగ్   '   (  Quarter   sawing  ) :--


ఈ    పద్దతిలో     వ్యాసార్ధదిశలో    కర్ర  
కోయబడుతుంది  .   ఈ   విధముగా    

కోయబడిన  కర్ర    అమరిక   కూడా    
ఆకర్షణీయ పద్దతిలో  

యేర్పరచబడి  అలంకారిక   సామాగ్రి   
ఉపరితలములను    చేయుటకు   

ఉపయోగపడుతుంది.  సీజనింగు   చేయునప్పుడు   ఈ   కర్ర  సంకోచించదు .   కానీ  ,  


దీనిని సీజనింగు   చేయుటకు   లేదా  ఆరబెట్టుటకు   ఎక్కువ   కాలము పడుతుంది  .   ఈ 

  విధంగా    కోయబడ్డ  కర్ర   ఎక్కువగా  ఉపయోగిస్తుంది .  ఈ పద్దతిలో    కర్రను   

కోయుటలో   కొంత  కర్రను   కోయుటలో    కొంత కర్ర   నష్టపడుతుంది  .











No comments:

Post a Comment