Thursday, September 5, 2019

11.కలపకు సోకెడి కొన్ని వ్యాధులు

 కలపకు సోకేడి  కొన్ని   వ్యాధులు :— 

కలప    ముఖ్యంగా    మూడు రకముల

వ్యాధులకు   గురి   అవుతుంది .  వీటిని

1.  డ్ర్రె  రాట్  ( Dry  rot )

2.   వెట్  రాట్  (Wet  rot )

3.  వృత్తాకారపు సంకోచము 
(Circumfrential  shrinkage)

 అని   పేర్కొంటారు.   వీటిని   గురించి

 వివరంగా   తెలుసుకుందాము.

 1. డ్రై రాట్ :—' ఫంగస్' (Fungus )

మూలంగా   కలప   క్షీణించడాన్ని

 ' డ్ర్రె  రా ట్  '   అని   అంటారు .  ఈ

వ్యాధి    సోకిన  కర్ర భాగము 

కొద్దికాలానికి   పొడిపొడిగా   మార్పు

చెంది  తరిగిపోతుంది.   తగినంత   గాలి

లేని    ప్రదేశంలో   కలపను 

నిలువయుంచుట    మూలంగా   అది  ఈ

వ్యాధికి   గురి  అగుతుంది.   ఈ వ్యాధి

నుండి   నివారించడానికి   కలపను   తగిన

విధంగా  "   సీజనింగు"   చేసి   దాని 

నుండి  తేమను   తొలగించాలి.   కాపర్

సల్ఫేట్    ద్రావణాన్ని   కలప పై   పెయింట్

చేయడం   ద్వారా   డ్రై రాట్  నుండి 

కాపాడుకొన   వచ్చును.

2.   వెట్  రాట్ :—  ఎక్కువగా  తేేమకు

గురి    అగుట వలన    కలప   రసాయనిక

మార్పులు   చెంది   తద్వారా క్షీణించటాన్ని

వెట్ రాట్   అంటారు. ఈ   వ్యాధికి   గురైన

కలప భాగము    ఎర్రని   డాగులతో 

కూడి  యుండి   క్రమేణా  పొడిగా మార్పు

చెంది   తరిగి పోతుంది.   ఈ వ్యాధిని

నివారించటానికి    సరైన విధంగా

సీజనింగ్   చేయుటయే   కాకుండా ,దానిపై

తారు   పూయుట   లేదా  పెయింట్

చేయుట  వలన   దానిని

కాపాడుకొనవచ్చును .

3. వృత్తాకారపు దిశలో సంకోచము:—

ఈ   వ్యాధి   వృక్ష కాండము   వెలుపలి

భాగము నుండి    మధ్యలో   గల   కేంద్ర

భాగమునకు    వ్యాసార్థ దిశలో   కర్రను

చీలికలుగా   విడగొట్తూ  వ్వాపిస్తుంది.

వృక్ష  కాండపు   వెలుపలి  పొరలు  లోపలి

వైపు  పొరల   కన్నా  త్వరగా   తేమను

కోల్పోవటం    వలన   వృక్ష కాండము  ఈ

వ్యాధికి   గురి   అవుతుంది .

పైన   తెలిపిన   విధంగా   తగినంత   గాలి

లేకపోవుట ,  ఎక్కువగా  తేమకు  గురి

అగుట   మొదలగు   కారణాల వలన కర్ర

క్షీణిస్తుంది.  అంతేకాకుండా   వాతావరణ

వైపరీత్యాలకు   గురి అగుట   మరియు

ఇతర   కారణముల   వలన   కొన్ని

లోపములను   కలిగి   ఉండవచ్చును.  ఈ

లోపములను   గురించి  క్రింద

వివరించడమైనది. ముఖ్యమైన

ఇంజినీరింగ్   పనులకు

 ఉపయోగించుటకు   కర్ర   సామాగ్రిని

తయారు చేయునప్పుడు   ఈ 

లోపములు  కలిగిన   కలపను

ఉపయోగించరాదు.

No comments:

Post a Comment