యూనిట్ -5
పట్టుకొనుటకు ఉపకరించు పరికరములు
కర్రవస్తువు పై వివిధ వడ్రంగి పనిముట్ల నుపయోగించి తగిన కర్రసామాగ్రిగా మార్చుకొనునపుడు కర్రవస్తువు కదలకుండా వుండుటకుగాను దానిని గట్టిగా పట్టుకొనియండు పనిముట్లు మరియు పరికరములను పట్టుకొనెది పరికరములు ( Holding tools ) అని అంటారు. కర్రవస్తువును గట్టిగా పట్టుకొనప్పుడే దాని పై వుపయోగించెడి పనిముట్లు ఒత్తిడిని అది తట్టుకొనగలిగి వివిధ వడ్రంగి పనులను సులభముగా నెరవేర్చుటకుగాను తోడ్పడుతుంది. అంతేకాకుండా కర్రవస్తువుపై వుపయోగించెడి పనిముట్టు జారిపోవుటవలన మరియు వదులుగానున్న కర్రవస్తువు కదులుట వలన వడ్రంగిపని చేయువ్యక్తి కిగాని, దగ్గరగావున్న యితర వ్యక్తులకుగాని దెబ్బతగులుట జరుగవచ్చును. వివిధ వడ్రంగిపనిముట్ల నుపయోగించి కర్రవస్తువును కోయుట, ఖండించుట, దానిపై గుర్తులు పెట్టుకొనుట, చీలికలు చేయుట, నునుపుపరచుట మొదలగు పనులు సరిగా నిర్వహించుటకుగాను క్రింద పేర్కొనబడిన వివిధ పరికరములు వుపయోగపడ్తాయి.
1. బెంచి వైస్ ( Bench vice):-
వివిధ వడ్రంగి పనిముట్లు నుపయోగించి వడ్రంగి పనిచేయు వ్యక్తి నిలబడి సులువుగా పనిచేసుకొనుటకుగాను కర్రవస్తువు తగ్గినంత ఎత్తులో అమర్చబడి యుండాలి. ఇందుకుగాను వుపయోగపడు బెంచి సుమారు 700. మి.మీ. ఎత్తులో వుంటుంది. ఈ బెంచికి బిగింపబడిన ' వైస్'
లో కర్రవస్తువును అమర్చుకొని తగిన పట్టు యిచ్చునట్లు బిగించుకొనవచ్చును.
పటములో చూపినట్లు బెంచి వైస్ రెండు ' జా ' ( Jaws ) లను కలిగి యుంటుంది. వీటిలో స్థిరంగాయున్న జా వర్కు బెంచికి ముందువైపు బిగింపబడియుంటుంది. స్థిరంగా యున్నయీ జాకు లంభదిశలో పొడవుగా అమర్చిన సన్నని కడ్డీ మరల లేదా త్రెడ్లు ( Screw threads ) కలిగియుంటుంది. దీనిపై కదిలెడి జా అమర్చబడి యుంటుంది. ఈ రెండవ జాకు మధ్యలో కలిగిన రంధ్రమునకుగల స్ర్కూ త్రెడ్లు కడ్డీ కిగల స్ర్కూ త్రెడ్లచే కలపబడి యుంటాయి. దీనివలన కడ్డీని గుండ్రముగా త్రప్పినపుడు దానిపై కదిలెడి జా కదులుతుంటుంది. స్థిరంగాయున్న ఒక నట్టుకు కడిలెడి జా బిగింపబడి యుండుటమూలముగా కడ్డీ గుండ్రముగా తిరిగినపుడు జా దానిపై కదలగలుగుతుంది. కడ్డీ కి ముందుభాగమున అమర్చబడిన హాండిల్ ను చేతితో గుండ్రముగా త్రిప్పుట ద్వారా కడ్డీని గుండ్రముగా త్రిప్పుకొని కదిలెడి జాను కదిలించవచ్చును. హాండిల్ ను సవ్యదిశలో త్రిప్పినపుడు కదిలెడి జా స్ధిరమైన జా కు దగ్గరగా జరిగి వాటి మధ్య దూరము తగ్గుతుంది. హాండిల్ ను అపసవ్యదిశలో త్రిప్పినపుడు వాటి మధ్య దూరము హెచ్చుతుంది. కర్రవస్తువు సైజుకు అనుగుణంగా రెండు జా ల మధ్యదూరమును మార్చుకొని వాటి మధ్య వస్తువును బిగించుకొనవచ్చును. ఈ రెండు జాల లోపలి తలములు గట్టికర్ర పలకలచే
2. బెంచి స్టాప్ ( Bench stop ) :-
ప్లేన్ ను ఉపయోగించి కర్రవస్తువు ఉపరితలమును నునుపుచేయునపుడు కర్రవస్తువు కడలకుండా యుండుటకుగాను బెంచి స్టాప్ ఉపయోగపడుతుంది. ఇది దీర్ఘచతురస్రాకారపు దిమ్మ ఆకారములో గట్టికర్రతో చేయబడి యుంటుంది. దీనిని స్ర్కూల సహాయముతో బెంచికి బిగించుకొనవచ్చును. కర్రవస్తువు ముందువైపు అంచును బెంచి స్తాప్ కు తగులునట్లు కర్రవస్తువును బెంచిపైన అమర్చుకొని ప్లేన్ నుపయోగించి, వస్తువు ఉపరితలమును నునుపుపరచ్చవచ్చును. వస్తువుపై ప్లేన్ ను ముందుకు నెట్టినపుడు దానితోపాటు వస్తువు ముందుకు కదలకుండా బెంచి స్టాప్ నిరోధిస్తుంది.
3. టీ - క్రాంప్ ( Tea - Cramp ) :-
దీనినే సాష్ క్రాంప్ ( Sash Cramp ) లేదా ' బార్ క్రాంప్ ' ( Bar Cramp ) అని అంటారు. తలుపులు, కిటికీ చట్రములు మొదలగు ఎక్కువ వెడల్పుగల కర్రవస్తులను దీనిలో బిగించుకొని పట్టుకొనుటకుగాను యిది ఉపయోగపడుతుంది.
ఇది టీ - ఆకారపు అవచ్ఛేదము గల పొడవైన ఉక్కు కడ్డీని కలిగియుంటుంది. దీని పొడవు వ్యాపించిన దిశలో ప్రక్క భాగములో సమాన దూరములలో చేయబడిన అనేక రంధ్రములుంటాయి. కడ్డీ ముందువైపు భాగము బెంచికి బిగింపబడియుంటుంది. మరల కలిగియున్న ఒక కడ్డీకి ముందుభాగమును అమర్చబడియున్న ఒక జా T - ఆకారపు కడ్డీకి ముందుభాగమున బిగింపబడియుంటుంది. ఈ కడ్డీకి అమర్చిన హాండిల్ ను గుండ్రముగా త్రిప్పుటద్వారా అది స్థిరంగా యున్న నట్టు ఒకదానిలో తిరుగుటద్వారా ' జా ' ఒకదానిని ముందునకు కదుపుతుంది. దీనిని కదిలెడి జా ( Moveable Jaw ) అంటారు. స్థిరంగా వుండెడి మరియొక జా T - ఆకారపు కడ్డీకి ప్రక్కగాయున్న రంధ్రములలో ఒకదానికి ఒక పిన్ను ద్వారా కలుపబడియుంటుంది. పిన్నును తగినరంధ్రములో అమర్చుటద్వారా రెండు జా ల మధ్యదూరమును కర్రవస్తువు సైజునుబట్టి ఎక్కువ లేక తక్కువ చేసుకొనవచ్చును రెండు జా ల మధ్య వస్తువును అమర్చిన పిదప హాండిల్ ను గుండ్రముగా త్రిప్పుకొని కదిలెడి జాను ముందునకు కదిపి వస్తువుపై ఒత్తిడి కలిగించుటద్వారా వస్తువు రెండు జాల మధ్య బిగింపబడుతుంది.
4. జీ - క్రాంప్ ( G-Cramp ) :-
దీనినే ' సీ— క్రాంప్ ' ( C—Cramp) అని కూడా అంటారు. ఇది ' C ' ఆకారములో యుండి తెరచుకొనియున్న దాని రెండు భుజములలో ఒకదాని లోపలి తలమునకు గట్టి కర్రతో చేయబడిన ' జా ' అమర్చబడియుంటుంది. దీనిని స్థిరమైన జా అంటారు. కదిలెడి మరియొక ' జా ' మరలు కలిగిన ఒక కడ్డీకి ముందుభాగమున అమర్చబడి యుండి ఆ కడ్డీ C- క్రాంప్ యొక్క తెరచుకున్న రెండవ భుజమునకు కలిగిన రంధ్రముగుండా అమర్చబడియుంటుంది. ఈ రంధ్రములోపలి తలమున మరలు అమర్చబడియుండి కడ్డీ మరలు, యీ మరలచే కలుపబడి వుంటాయి. ఈ కడ్డీ వెనుకవైపు భాగమున హాండిల్ అమర్చబడియుంటుంది. హాండిల్ ను గుండ్రముగా త్రిప్పుట ద్వారా స్ర్కూ కడ్డీ ముందునకు వెనుకకు కదులుట ద్వారా రెండు జాల మధ్యదూరమును మార్చుకొనవచ్చును. ' C ' క్రాంప్ రెండు జాల మధ్య యేర్పడు గరిష్ఠ దూరమునుబట్టి దాని సైజు నిర్ణయింపబడుతుంది. ఇది 125 నుండి 300 మి.మీ. వరకు వివిధ సైజులలో లభ్యమగుతుంది.
5. హాండ్ స్ర్కూ క్రాంప్ ( Hand Screw Cramp ) :-
పైన తెలిపిన పరికరముల ద్వారా కర్రవస్తువు రెండు జాల మధ్య మాత్రమే పట్టుకొనబడుట ద్వారా బిగింపబడియుంటుంది. అనగా పెద్ద సైజు కలిగిన వస్తువులో కొద్ది భాగము మాత్రమే ( అనగా జాల మధ్య మాత్రమే ) పట్టుదొరికి ఆ వస్తువు బిగింపబడియుంటుంది. అయితే దీని మూలంగా జాలకు దూరంగా వస్తువు పై వడ్రంగి పనిచేయునపుడు ఆ వస్తువుపై జాల వల్ల దొరికిన పట్టు సరిపోక ఆ వస్తువు కదిలిపోవుట జరగవచ్చును. అటువంటప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో వస్తువును పట్టుకొనుటకుగాను హాండ్ స్ర్కూ క్రాంప్ ఉపయోగపడుతుంది.
ఇది పటము 8.5 లో చూపినట్లు రెండు కర్రదిమ్మలతో చేసిన జాలను కలిగియుండి రెండు మర ( స్ర్కూ )ల ద్వారా అవి కలపబడియుంటాయి. ఈ మరలను త్రిప్పుకొని వీటి మధ్య దూరము ఎక్కువ లేదా తక్కువ చేసుకొనవచ్చును. పొడవు ఎక్కువుగా గల కర్రదిమ్మలలో బిగించుట ద్వారా కర్రవస్తువునకు ఎక్కువ విస్తీర్ణంలో పట్టు దొరుకుతుంది ఇవి తెరుచుకునప్పుడు వాటి మధ్య వుండే గరిష్ఠ దూరమును బట్టి హాండ్ స్ర్కూ క్రాప్ సైజు నిర్ణయింపబడుతుంది. ఇది సాధారణగి 150 నుండి 350 మి.మీ. పొడవులలో లభ్యమగుతుంది.
అభ్యాసము
1. కర్రవస్తువును పట్టుకొను ఆవశ్యకతను వివరింపుము.
2. బెంచి వైస్ ద్వారా కర్రవస్తువు యేవిధముగా పట్టుకొనబడుతుందో వివరింపుము.
3. బెంచి స్టాప్ ఉపయోగమును వివరింపుము.
4. ' టీ క్రాంప్ ' యేవిధముగా పనిచేస్తుండి వివరింపుము.
5. హాండ్ స్ర్కూ క్రాంప్ ద్వారా వస్తువును పట్టుకొనిడి విధానము వివరింపుము.
No comments:
Post a Comment