Monday, January 25, 2021

31. కర్రవస్తువుయందు రంధ్రములను చేయు బోరింగ్ పని

 యూనిట్ -6

కర్రవస్తువు యందు    రంధ్రములను   చేయు   బోరింగ్  పని

5.1  ఉపోద్ఘాతము  :

     బోరింగు    బిట్టు   లేదా  డ్రిల్లింగ్    బిట్టును    ఉపయోగించి   కర్రవస్తువు   యందు   గుండ్రటి   రంధ్రములను    చేయవచ్చునని    8వ    తరగతిలో      తెలుసుకొని   యున్నాము.   కర్రయందు   చేయబడెడి   రంధ్రములను   రెండు   రకములుగా    విభజించవచ్చును.

1.   కర్రవస్తువు   ఒక   ప్రక్కనుండి    రెండవ   ప్రక్కకు    పూర్తిగా   చేయబడెడి   రంధ్రము.   దీనిని   " పూర్తి   రంధ్రము "( Through hole ) అని  అంటారు.   ఇది   పటము  5.1 లో   చూపబడింది.

2.  కర్రవస్తువు  మందములో   ( లేదా   యితర  యేదేని   కొలతలో ) పూర్తిగా   కాకుండా    కొంతవరకు   మాత్రమే   యేర్పరచబడెడి   రంధ్రము.   దీనిని  " అసంపూర్ణ    రంధ్రము "  ( Blind  hlole or   stop hole )  అని   అంటారు.   పటము  5.2 లో   చూపబడింది.

        పైన    తెలిపిన    రెండు   రకముల    రంధ్రములు    యీ    క్రింద    సూచింపబడినట్లు   రెండువిధములుగా   యుండవచ్చును.

( a )   కర్ర   ఉపరితలమునందు   చేయబడెడి    రంధ్రము     ఆ    ఉపరితలమునకు   సమకోణములో    వుంటుంది.  దీనిని   ' తిన్నని    రంధ్రము '   ( Straight  hole ) అని   అంటారు.   పటము  5.1   మరియు  5.2  లలో   చూపబడిన   రధ్రములు   ఈ   రకమునకు    చెందినవి.   

( b )    కర్ర   ఉపరితలములో   చేయబడెడి    రంధ్రము,   ఆ    ఉపరితలమునకు   సమకోణము    కాకుండా    యితర   యేదేని   కోణమును  చేయునటుల   యేర్పాటు   చేయబడుతుంది.   ఇటువంటి    రంధ్రము    ఉపరితలమునకు   యేటవాలుగ    వుంటుంది.   దీనిని  "  ఏటవాలు    రంధ్రము "   ( Inclined  hole )   అని   అంటారు.   ఇది   పటము  5.3లో  చూపబడింది.

        కర్రవస్తువుయందు    రంధ్రమును   చేసెడి    బోరింగ్ బిట్టు,   డ్రిల్ బిట్టు,   బిట్   బ్రేస్    మరియు      హాండ్    డ్రిల్ లను    గురించి   8వ    తరగతిలో   చదివినది    మరల    పునర్విమర్శించుకొనుము.   

5.2  కర్రవస్తువుయందు    రంధ్రమునుచేయువిధానము :

      కర్రవస్తువుయందు    రంధ్రమును     చేయుటను    రెండు     భాగములుగా   విభజించవచ్చును.

1.   రంధ్రము   చేయవలసిన     స్థలమును    సరిగా    గుర్తించుట.   దీనిని        ' మార్కింగ్ '   అని   అంటారు.

2.   గుర్తింపబడిన   చోట   బోరింగ్   బిట్టు   లేదా   డ్రిల్   బిట్టు   ద్వారా   రంధ్రమును   చేయుట   దీనిని  ' బోరింగ్ '  లేదా   ' డ్రిల్లింగ్ '   అని   అంటారు.  

 2.1   మార్కింగ్   చేయువిధానము :—

        కర్ర   ఉపరితలముపై   రంధ్రములను   చేయవలసిన   సరియైన   స్ధలమును   కచ్చితముగా   గుర్తించాలి.   ఇందుకుగాను   చేయవలసిన     రంధ్రముయొక్క     కేంద్రబిందువును     కర్ర   ఉపరితలముపై   గుర్తించాలి.    రెండు   సరళరేఖలను   గీసి     అవి  బిగించుకొనుట     ద్వారా    యేర్పడిన    బిందువూను    రంధ్రము   యొక్క   కేంద్రబిందువుగా    గుర్తించుట    ఉత్తమమైన    పధ్ధతి.    ఈ    విధముగా    యేర్పడిన   బిందువుపై ' పంచ్ '   అనబడు    మార్కింగ్    పరికరము    వాడిమొనచే     గుర్తు   పెట్టాలి.

5.2   బోరింగ్    బిట్ చే    పూర్తి    రంధ్రమును  చేయుట  :—

1.    రంధ్రము    సైజు    దాని   వ్యాసముచే     సూచింపబడుతుంది. ముందుగా   చేయవలసిన   రంధ్రమును    సైజుగల   ' ఆగర్  బిట్ ను '    ఎన్నుకొనవలెను.  దానిని   బిట్ బ్రేస్ నకు  గల   చక్   పండ్లలో    అమర్చి    బిగించిలి. 

2.  రంధ్రమును   చేయవలసిన   కర్రవస్తువు   కదలకుండా   దానినిబిగించి   పట్టుకొనాలి.   వైస్ యందుగాని   లేదా   యితర    పట్టుకొనే  పరికరములనుపయోగించిగాని   కర్రవస్తువును   బిగించాలి.   ఈ    విధముగా   బిగించినపుడు   రంధ్రము  చేయవలసిన    కర్రవస్తువు  ఉపరితలమును   సులభముగా   బోరింగ్ చేయుటకు     వీలైన    స్ధితిలో   వుంచాలి.   తిన్నని రంధ్రములను   చేయునపుడు  బోరింగ్ చేయు    రంధ్రము    ఉపరితలమునకు    లంభముగా   వుండాలి.   ఏటవాలు   రంధ్రములకు    ఉపరితలము   బోరింగ్    బిట్టునకు   తగిన   కోణములో   అమర్చబడివుండాలి.   కర్రవస్తువును   తగిన   స్ధితిలో    బిగించుటవలన    బిట్   బ్రేస్ ను   చేతితోపట్టుకొని    సులభముగా    రంధ్రమును   వీలుంటుంది.    బోరింగ్   పనిని   క్రమబద్ధము   చేసుకొను    కూడా   సులభమవుతుంది.

3. కర్రవస్తువుయందు    గుర్తింపబడిన    కేంద్రబిందువు వద్ద     ఆగి    బిట్    అడుగుభాగమునగల    స్ర్కూ    మొనను    ఆనించాలి.    బిట్   బ్రేస్   పై   భాగమును   కుడిచేతితో    పట్టుకొని,    ఆగర్   బిట్   నిలువుగా ( అనగా  కర్రవస్తువు  ఉపరితలమునకు   లంభముగా )    యుండునట్లు  దానిని   పట్టుకొనాలి.   ఎడమచేతితో   బిట్   బ్రేస్   యెక్క   ' క్రేంక్ '   లేదా    ' స్వింగ్ ' ను    పట్టుకొని    సవ్యదిశకుదానిని   త్రిప్పినయెడల    ఆగర్   బిట్   గుండ్రముగా    తిరిగి    దాని   వాడిమొనచే   కర్రయందు   రంధ్రమును   చేస్తుంది.   కుడిచేతితో   హెడ్ పైనగల   హాండిల్ పై   ఒత్తిడిని    కలగచేయుచు     ఎడమచేతితో    ' స్వింగ్ ' ను  త్రిప్పుకుంటూ   రంధ్రము    లోతును   పెంచవచ్చును.

4. బోరింగ్ బిట్    కర్రవస్తువును    ఖండించిదానిలో   రంధ్రమును   చేయుట    ప్రారంభించిన   వెంటనే,  రంధ్రము   సరియైనదిశలో    ( నిలువుగా   లేదా   కావలసినకోణములో  ఏటవాలుగా )   యేర్పడతున్నదీ,    లేనిది    పరిశీలించాలి.   ఇందుకుగాను    ట్రైస్క్వేర్    లేదా    బివెల్   స్క్వేర్ ను    ఉపయోగింపవచ్చును.    ( పటము 5.4 మరియు 5.5 )  ఈ   పనిముట్లను    బోరింగ్   బిట్ నకు   బిట్ నకు   దగ్గరగా    యుండునట్లు   కర్ర   ఉపరితలముపై    అమర్చి,    ఈ   పరికరములు    బ్లేడు   భాగము  ఆగర్  బిట్ నకు    సమాతరముగా    వున్నదీ,   లేనిదీ   పరిశీలించాలి.    మరియెక    సులభమైన   పద్ధతియందు,  ఆగర్  బిట్ నకు    సమాతరంగా   వున్నదీ,   లేనిదీ   పరిశీలించాలి.   మరియెక   సులభమైన   పద్ధతి   యందు,  ఆగర్  బిట్ ను    ఏవేవి   రెండు   ప్రక్కల నుండి   పరీక్షించిచూచుట    ద్వారా,  అది   సరియైన   దిశలో   రంధ్రమును    చేయుచున్నదీ,  లేనిదీ   అవగతమగును.

5.  పైన   పేర్కొనిన    విధముగా   రంధ్రములోతును పెంచుచు,   బోరింగ్  బిట్టు   అడుగును  గల స్ర్కూమొనభాగము   మాత్రము   కర్ర    రెండవ    ప్రక్కనుండి  ( అనగా   క్రిందవైపు )   బయటకు   వచ్చువరకు   రంధ్రము   చేయాలి.   ( పటము5.6 ) అంతేకాని,    బోరింగ్ బిట్టు   కర్రవస్తువు   రెండవ   ప్రక్కనుండి    బయటకు    వచ్చునట్లు    రంధ్రము   పూర్తిగాచేయరాదు.    ఈ    విధముగా   చేసినయెడల   పూర్తి రంధ్రము   ఏర్పడును,    కాని   కర్ర రెండవప్రక్క     రంధ్రము   చుట్టు   చీలికలుగా   ఏర్పడును.

6. బిట్ బ్రేస్ ను     రంధ్రము   నుండి   తొలగించుటకుగాను   స్వింగ్ ను    సవ్యదిశలో   రెండుసార్లు    త్రిప్పి,    తిరిగి   సవ్యదిశలో   దానిని   త్రిప్పుచూ    హెడ్ ను   పైకిలాగినట్లయినచో   బిట్    బయటకు    వస్తుంది.   అంతేకాని    స్వింగ్ ను    వ్యతిరేఖ    దిశలో   త్రిప్పుచు   బిట్ ను    రంధ్రము   నుండి     బయటకు   లాగరాదు.   విధముగా   చేసినయెడల   చేయబడిన    రంధ్రముయందు   చీలికలు    యేర్పడును.

No comments:

Post a Comment