కొట్టుటకు ఉపకరించు పనిముట్లు
ఉపోద్ఘాతము :
కర్రముక్కలను కలుపుకొని కర్ర సామాగ్రిని తయారుచేయునపుడు వాటిని
కలుపుకొనుటకుగాను మేకులను దిగగొట్టవలసి యున్నపుడు సుత్తె ( Hammer ) ను
ఉపయోగిస్తారు. ఏదేని వస్తువుపై బలము నుపయోగించలసి వచ్చినపుడు
సుత్తెతో దానిని కొడతారు.
వివిధరకముల సుత్తెలు:
వడ్రంగి పనియందు మూడు రకముల సుత్తెలు ఎక్కువగా
వాడుకలోనున్నాయి. వాటిని గురించి క్రింద వివరించనైనది.
సాధారణ సుత్తె :-
కర్రవస్తువులోనికి మేకులను దిగగొట్టుట లేదా వస్తువుపై
బలమునుపయోగించి కొట్టుటకు దీని నుపయోగిస్తారు. ఇది పోతయిన ( Cast Steel
) తో చేయబడిన తల భాగము( Hammer head ) ను కలిగియుండి దానికి
మధ్యభాగమునుగల రంధ్రమునందు కర్రతో చేయబడిన పిడిభాగము ( హాండిల్ )
బిగింపబడి యుంటుంది. సుత్తె తలభాగము ఒకవైపు చదునుగా యుండి
మరియొకవైైప అర్ధగోళాకారపు ఆకారమును కలిగియుంటుంది. దీనినే " బాల్
పీన్ హామర్ " ( Ball peen hammer ) అని అంటారు.
2. చీలికగల సుత్తె ( Claw hammer ) :-
కర్ర వస్తువులోనికి మేకులను దిగగొట్టుటకు లేదా కర్రవస్తువునుండి
మేకులను బయటకు లాగుటకు దీని నుపయోగిస్తారు. దీనినే ' క్లా హామర్ '
అని అంటారూ.
ఇది కూడా పోత యానుము తో చేయబడిన తలభాగము ( హెడ్ ) ను
కలిగియుండి దానికి మధ్యభాగమునగల రంధ్రముయందు హాండిల్
బిగింపబడియుంటుంది. అయితే సాధారణ సుత్తె వలె కాకుండా దీని తల
భాగము ఒకవైపు చదునుగాయుండి రెండవవైపు రెండు పండ్లను
కలిగియుండునట్లు మధ్యలో పొడవైన చీలికను కలిగియుంటుంది. ఈ
చీలికలో మేకును జొప్పించి , కర్రవస్తువు నుండి మేకును బయటకు
లాగవచ్చును హాండిల్ చివరి భాగమును చేతితో పట్టుకొని చదునైన తల
భాగమును వస్తువుపై కావలసినచోట కొట్టుట ద్వారా వస్తువు పై
బలమునుపయోగించవచ్చును. దీని పండ్లు సన్నగా గానీ , వంపుదిరిగి గానీ
వుంటాయి. పై రెండు రకముల సుత్తెల సైజు వాటి బరువుపై
ఆధారపడియుంటుంది. వీటి బరువు 0.5 నుండి 2 కి.గ్రా. వరుకు వుంటుంది.
3. మాలెట్ ( Mallet ):-
కొన్ని పనులయండు ఎక్కువ శక్తినుపయోగించి వస్తువును కొట్టినయెడల
ఆ వస్తువు విరిగిపోవుట లేదా వంగిపొవుట జరిగి, ఆ వస్తువు
చెడిపోవచ్చును. ముఖ్యంగా సున్నితపు వస్తువులపై పనిచేయునపుడు సాధారణ
సుత్తెను వుపయోగింపరాదు ఇందుకుగాను ఉపయోగించు ప్రత్యేక రకమైన
సుత్తెను ' మాలెట్ ' అని అంటారు. దీని భాగము గట్టి కర్రతో చేయబడి
యుంటుంది.
దీనినే 'కర్రసుత్తె ' (Wood hammer ) అని అంటారు.
కర్రవస్తువుపై ఉలిని ఉపయోగంచినపుడు ఉలిని గల కర్రహాండిల్ ను
కొట్టుటకు దీని నుపయోగిస్తారు. దీని తల భాగము స్ధూపాకాంగా
దీర్ఘచతురస్రాకారపు దిమ్మ ఆకారంలో గాని చేయబడియుంటుంది.
సుత్తెను పరిరక్షించు విధానము :
చదునుగా యున్న సుత్తె తలభాగము యేవిధమైన మలినపదార్ధములు,
జిగురు కలిగియుండకుండా దానిని గాజుకాగితము ( Sand paper) తో శుభ్రపరచాలి.
హాండిల్ ను చేతితో పట్టుకొను ప్రదేశము చెమట మూలముగా లేదా
మలినపదార్ధములు చేరుట మూలముగా చేతికి అంటుకొనవచ్చును. దీనిని
కూడా గాజు కాగితముతో శుభ్రపరచాలి. కర్రతో చేయబడిన హాండిల్ సుత్తె
తలభాగములో వదులుగా వుండకుండా చూడిలి. అవసరమైతే చిన్న
కర్రముక్కలను హాండిల్ కు సుత్తె తలభాగపు రంధ్రము మధ్యగల ఖాళీ
స్ధలములో బిగువుగా పట్టునట్లు జొప్పించాలి. విరిగిపొయిన లేదా బీటలు
వారిన హాండిల్ ను తీసివేసి దాని స్ధానములో క్రొత్త హాండిల్ ను
అమర్చుకోవాలి.
అభ్యాసము
1. సాధారణ సుత్తెకు, క్లా హామర్ నకు గల భేదములు వివరింపుము.
2. మాలెట్ ఉపయోగమును తెలుపుము.
3. చీలిక గల సుత్తె పటమును గీచి దాని భాగములను పేర్కొనము.
4. సుత్తె పరిరక్షణను గురించి వివరించుము.
No comments:
Post a Comment