యూనిట్ - 6
ఇతర పనిముట్లు
ఉపోద్ఘాతము :
వడ్రంగి పనికి సంబందించిన ప్రత్యేక పనులను చేయుటకు ఉపకరించు
వివిధ పనిముట్లను గురించి క్రిందటి యూనిట్లలో మనము తెలుసుకున్నాము. అయితే
మరికొన్ని సాధారణ పనిముట్లు గూడ యీ పనియందు విరివిరిగా వాడబడుతున్నాయి.
వీటిని గురించి క్రింద వివరించనైనది.
1. ఆకురాయి :---
ఒక వస్తుతలమును అరగదీసి నునుపుపరచుటకు ఆకురాయి.
ఉపయోగపడుతుంది. ఎగుదిగుడులుగా యున్న వస్తుతలముపై ' ఫైల్ ' ( Fiel )
అనబడు ఆకురాయిని అదిమిపట్టి రాపిడి గావించుట ద్వారా ఆ తలమును అరగదీసి
నునుపుపరచవచ్చును. వడ్రంగిపనియందు కర్రవస్తువును నునుపుపరచుటకుగాను
రెండు రకములైన ఆకురాళ్లను ఉపయోగిస్తారు. వీటిని
' రాస్ప్ ' ( Rasp ) మరియు ' ఫైల్ ' ( File ) అని పిలుస్తారు. ఈ రెండు రకములైన ఫైళ్లు
కూడా ' హాండిల్ ' మరియు 'బాడీ'
( Body ) అనబడు రెండు భాగములను కలిగియుంటాయి. హాండిల్ భాగము గట్టి కర్రతో
చేయబడి ఒక వైపు చిన్న రంధ్రములను కలిగియుంటుంది. బాడీకి వెనుక భాగమున
సన్నగా కాడవలెయుండు ' టాంగ్ '
( Tongue ) అనబడు భాగము యీ రధ్రములో అమర్చుకొని బిగింపబడియుంటుంది.
చేతికి తగిన పట్టు ( Grip ) యిచ్చెడి ఆకారములో హాండిల్ చేయబడియుంటుంది.
టాంగ్ ను హాండిల్ రంధ్రములో బిగించినపుడు రంధ్రము చుట్టూవున్న కర్ర
బీటలువారకుండ సన్నని యినుపరింగు బిగింపబడియుంటుంది. బాడీ భాగము
ఉక్కుతో చేయబడి దాని ముఖభాగమున ( Face ) పదునైన పండ్లను ( Cutting teeth )
కలిగియుంటుంది.
' రాప్స్ ' అనబడు ఫైల్ కర్రవస్తువును త్వరగా అరగదీయుటకు పనికి వస్తుంది.
దీనికిగల పండ్ల వస్తువును ఎక్కువగా నునుపుపరచటానికి పనికిరావు. రాస్ప్ ఫైల్
అవచ్ఛేదము ( Cross section ) సాధారణంగా అర్ధవృత్తాకారపు ఆకారంలో వుంటుంది.
ఫైల్ లేదా ' వుడ్ ఫైల్ ' ( Wood file ) అనబడు ఆకురాయి వస్తుతలమును ఎక్కువగా
నునుపుపరచటానికి ఉపయోగపడుతుంది. రాస్ప్ ఫైల్ ను రఫ్ పనికి మరియు వుడ్ ఫైల్
ను ఫినిషింగ్ పనికి వుపయోగిస్తారు. రాస్ప్ ఫైల్ నుపయోగించినపుడు కర్రవస్తువుపై
యేర్పడిన సన్నని గీతలను తొలగించి వస్తుతలమును మెరుగుపరచటానికి వుడ్ ఫైల్
ఉపయోగపడుతుంది.
రాస్ప్ నుగానీ, ఫైల్ నుగానీ వాడినపిదప వాటిని శుభ్రపరచుటకుగాను మేలురకమైన
బ్రష్ నుపయోగించాలి.
2. స్ర్కేపర్ ( Scraper ) :
ఇది సన్నని ఉక్కురేకుతో చేయబడి తగిన దారుఢ్యతను కలిగియుండుటకుగాను
టెంపర్ చేయబడియుంటుంది. దీనిని సాధారణంగా తెగిపొయిన కణములు ( Torn
grains ) తొలగించుటకు లేదా ప్లేన్ ద్వారా కర్రవస్తువును నునుపుపరచిన పిదప
దానిపై యేర్పడిన ప్లేను అడుగుభాగపు గుర్తులను తొలగించుటకువాడతారు.
తక్కువ మందముతో సన్నగా దీర్ఘచతురస్రాకారపు ఆకారంలో పొడవుగా యున్న
స్ర్కేపర్ ఒకవైపు పదునైన అంచును కలిగియుంటుంది. ఎడమచేతి బొటనవ్రేలితో
పదునైన అంచును కర్రవస్తువుపై నొక్కిపెట్టి కుడిచేతితో స్ర్కేపరును ముందుకు
కదిలించుట ద్వారా కర్రవస్తువు ఉపరితలమునుండి అతి సన్నని
పొరలుగా విడదీయవచ్చును.
3. పిన్సర్ ( Pincer ) :-
కర్రవస్తువులనుండి మేకులను బయటకు లాగుటకు ' పిన్సర్ ' ఉపయోగపడుతుంది.
పటములో చూపిన విధముగా ఇది ' 'పట్టకారు ' ఆకారమును కలిగియుంటుంది. దీని
రెండు భుజములు ఉక్కుతో చేయబడి ఒక పిన్ను ద్వారా ' క్రాస్ ' ( x ) ఆకారములో
కలుపబడియుంటాయి. ఈ పిన్ను ఆధారమునకు ఒకవైపు పొడవుగాయున్న
భుజములను చేతితో పట్టుకొని కదిలించుటద్వారా దగ్గరకు లేదా దూరమునకు
మార్చుకొనవచ్చును. పిన్నుకు రెండవవైపు పొడవు తక్కుగాయుండి వంపు
తిరిగియున్న భుజములను ' జాలు ' ( Jaws )
అని అంటారు. పొడవుగాయున్న భుజములను కదిలించినపుడు జాలు కూడా కదిలి
దగ్గరగానీ, దూరముగాగాని జరుగుతాయి. వంపు తిరిగిన యీ జాల, వెలుపలి
తలము చదునుగా యుండి లోపలి వైపు ఏటవాలుగా యుండుట మూలముగా జాల
చివరి అంచులు సన్నగా, పదునుగా యుంటాయి. ఈ సన్నని అంచుల మధ్య
మేకును నొక్కిపెట్టి బయటకు లాగవచ్చును.
4. స్ర్కూడ్రైవర్ ( Screw driver ) :-
కర్రసామాగ్రిని తయారుచేయునపుడు వివిధ భాగములను కలిపెడి మరలను (
స్ర్కులను ) బిగించుటకు లేదా ఆ భాగములను విడదీయున్నపుడు స్ర్కులను
వదులుచేసి విడదీయుటకు స్ర్కూడ్రైవర్ ఉపయోగపడుతుంది. స్ర్కూడ్రైవర్
హాండిల్, షాంక్ మరియు బ్లేడు అనబడు మూడు భాగములను కలిగియుంటుంది.
హాండిల్ భాగము చేతికి తగిన పట్టును యిచ్చు ఆకారములో గట్టికర్రతో
చేయబడియుంటుంది. దీనికి ఒకవైపునగల రంధ్రములో సన్నని కడ్డీ ఆకారముగల
షాంక్ ( Shank ) ఒక చివర బిగింపబడియుంటుంది. గట్టిఉక్కుతో చేయబడిన షాంక్
రెంఢవ చివరభాగము పదునైన అంచును కలిగియుంటుంది. ఈ పదునైన
అంచుభాగమును ' బ్లేడు ' ( Blade ) అని అంటారు. పదునైన బ్లేడు భాగమును స్ర్కూ
హెడ్ పైన గల సన్నని చీలికలో అమర్చి స్ర్కూడ్రైవర్ హాండిల్ ను గుండ్రముగా
త్రిప్పుటద్వారా స్ర్కూను త్రిప్పుకొని దానిని వదులుచేయుట లేదా బిగించుట
చేసుకొనవచ్చును. స్ర్కూడ్రైవర్ వివిధ పొడవులలో లభ్యమగుతుంది. 30 మి.మీ. నుండి
450 మి.మీ. దాకా పొడవుగల బ్లేడుతో సాధారణ స్ర్కూడ్రైవర్లు లభ్యమగుతాయి. ఇవి
కాకుండా ' ఆఫ్ సెట్ స్ర్కూడ్రైవర్ ' ( Offset screw driver ) మరియు ' రాచెట్ ఆఫ్ సెట్
స్ర్కూడ్రైవర్ ' (Ratchet Offset screw driver )
మొదలగు ప్రత్యేక స్ర్కూడ్రైవర్లు సాధారణ స్ర్కూడ్రైవర్ నుపయోగింపలేని స్థలములలో
ఉపయోగించటానికి తోడ్పడతాయి. అదేవిధంగా
' x ' ఆకారములో స్ర్కూ హెడ్ పైన చీలిక కలిగిన స్ర్కూలను విడదీయుటకు ( లేదా
బిగించుటకు ) ' ఫిలిప్స్ స్ర్కూడ్రైవర్ ' ( phillips screw driver ) ఉపయోగపడుతుంది. దీని
పడునైన అంచు x ఆకారంలో చేయబడియుంటుంది. ప్రత్యేకరకమైన స్ర్కూడ్రైవర్లు
పటములో చూపబడ్డాయి.
కర్రసామాగ్రిని విరివిగా పెద్దఎత్తున తయారుచేయు పరిశ్రమలలో విద్యుత్తుతో గానీ,
అతిపీడనముతో కూడిన గాలితో కాని పనిచేయు స్ర్కూడ్రైవర్లు ఉపయోగిస్తారు. ఇవి ఒక
నిముషమునకు 500, 800, 1600, లేదా 2500 చుట్లు తిరుగుచు వేగంగా స్ర్కూలను
బిగించుటకు ఉపయోగపడతాయి.
స్ర్కూడ్రైవర్ ను ఉపయోగించుటకు ముందు దాని బ్లేడు పదునుగా యుండునట్లు
చూడాలి. స్ర్కూడ్రైవర్ ను ఉపయోగించనపుడు దాని షాంక్ కు మరియు పదునైన
అంచుకు నూనెను పూయాలి. స్ర్కూడ్రైవర్ హాండిల్ ను శుభ్రంగా వుంచాలి.
యూనిట్ - 7
5. ఱంపము బ్లేడు పండ్లను సరిచేయు పనిముట్లు :
ఱంపము బ్లేడుపండ్లను పదును పెట్టిన పిదప వాటికి తగిన ఆకారములో
వంచుటకుగాను ఉపయోగపడు పనిముట్టును
' సాసెట్ ' ( Sawset ) అని అంటారు. ఎక్కువకాలం ఉపయోగించిన ఱంపము బ్లేడు
పండ్లు అరిగిపోయి, వాటి అమరిక చెదిరిపొవచ్చును. అప్పుడు బ్లేడు పండ్లను తిరిగి
పదును పెట్టుకొని, వాటి అమరికను సరిచేయవలసి యుంటుంది. ఱంపము బ్లేడు
పండ్లు బ్లేడునకు కొని ఎడమవైపు మరికొన్ని కుడి వైపు వంచబడి యుంటాయి. ఒకటి
వదిలి ఇంకొకటి ఎడమవైపునకు వంచబడితే ఆ పండ్లకు మధ్యగా వచ్చెడి మిగిలిన
పండ్లు కుడివైపుకు వంపబడి యుంటాయి ( పటము 9.7 ). చెదిరిపోయిన ఈ
అమరికను తిరిగి సరిచేయుటకుగాను సాసెట్ ఉపయోగపడుతుంది.
ఇది సన్నని ఉక్కురేకుతో చేరబడి పటములో 9.8 లో చూపినట్లు రెండువైపులా
సన్నని చీలికలను కలిగియుంటుంది. దీనికి అమర్చిన హాండిల్ ను పట్టుకొని
పండ్లను కలిగియున్న ఱంపము అంచున తగిన చీలికలో అమర్చి బ్లేడును హాండిల్
వైపునకు వంచుటద్వారా బ్లేడు పండ్లు హాండిల్ వైపునకు వంచబడతాయి. హాండిల్ కు
కుడావైపు అమర్చిన చీలికలో బ్లేడును అమర్చి బ్లేడు పండ్లను ఒకదానిని విడిచి
మరియొకటి ఒకవైపునకు వంచుకొనవచ్చును. మిగిలిన పండ్లను అరెండువైపునకు
వంచుటకుగాను బ్లేడును హాండిల్ కు ఎడమ వైపు అమర్చిన చీలికలో
బిగింపవలసియుంటుంది.
అభ్యాసము
1. ఫైల్ యొక్క ఉపయోగమును వివరింపుము.
2. రాస్ప్ నకు, ఫైల్ నకు గల భేధములను వివరింపుము.
3. పిన్సర్ ను వుపయోగించు విధానము తెలుపుము.
4. స్ర్కూ డ్రైవర్ ను ఉపయోగించు విధానము తెలుపుము
5. సాసెట్ ఉపయోగమును తెలుపుము.
No comments:
Post a Comment