యూనిట్ - 1
కర్రవస్తువు పై కొలతలను గుర్తించుట
1.1 ఉపోద్ఘాతము :
మార్కెట్ లో లభ్యమగు కలపను కొని దానిని తగిన ఆకారము మరియు
పరిమాణముగల కర్రసామగ్రిగా మార్చుటకుగాను
ఉపయోగించెడి వివిధరకముల పనిముట్లనుగురించి మనము ఎనిమిదవ తరగతిలో
తెలుసుకొనున్నాము. ఈ పనిముట్లను ఉపయోగించెడి విధానమును గురించి, ఆ
పనిముట్ల ద్వారా వివిధ పనులు నెరవేర్చుకొను విధానమును గురించి యీ తరగతిలో
వివరముగా తెలుసుకుందాము.
కర్రవస్తువును మనకు కావలసిన ఆకారము మరియు పరిమాణముగల సామాగ్రిగా
మార్చుటకుగాను చేయవలసిన వివిధ పనులు యీ క్రింది విధముగా వుంటవి.
1. ముందుగా కర్రసామాగ్రి యొక్క కోలతలను నిర్దారించాలి. అనగా దాని
ఆకారముతోబాటు పొడవు, వెడల్పు , మందము, ఎత్తు మొదలగు వివిధ కొలతలను
నిర్ణయించుకొనాలి.
2. పైన తెలిపిన కొలతలను సూచించినట్లు యివ్వబడిన కర్రవస్తువుపై కావలసిన
ఆకారమును, కొలతలను సరిగా గుర్తించాలి. ఇందుకు తగిన పనిముట్లను
ఉపయోగించాలి.
3. గుర్తించిన కొలతల ప్రకారము తగిన పనిముట్టును ఉపయోగించి కర్రవస్తువును
ఖండించాలి.
4. ఖండించబడిన వస్తుతలమును చదును పరచి , నునుపు పరచాలి.
5. విడివిడి భాగములుగా తయారైన కర్రసామాగ్రి భాగములను కలిపి సరిగా బిగించుట
ద్వారా కర్రసామాగ్రిని పొందవచ్చును.
6. తగిన ఆకారము మరియు పరిమానముగల కర్రసామాగ్రిని పైన పేర్కొనిన విధముగా
పొందినపిదప దానిని ఆకర్షణీయంగా వుంచుటకు మరయు ఎక్కువకాలము మన్నికగా
వుండుటకుగాను దానిపై వార్నిష్ లేదా పెయింట్ ను పూయవలసి యుంటుంది.
ముందుగా కర్రవస్తువుపై వివిధ కొలతలను గురించి తెలుసుకుందాము.
1.2 కొలతలను గుర్తించు విధానము :
కర్రవస్తువుపై వివిధకొలతలను గుర్తించెడి పనిముట్లనుగురించి, వాటిని ఉపయోగించెడి
విధానమును గురించి ఎనిమిదవ తరగతిలో చదివినది మరల జ్ఞప్తికి తెచ్చుకొనండి.
కర్రవస్తువుపై కొలతలను గుర్తించుటకై రెండుపనులు చేయవలసియుంటుంది.
కొలతలను సూచించినట్లుగా ముందుగా పనిముట్టును సరిగా అమర్చవలెను. దీనినే
' సెట్టింగ్ '
( అమరిక ) అని అంటారు. సెట్టింగ్ చేసినపిదప ఆ పనిముట్టు నుపయోగించి
కర్రవస్తువుపై కొలతలను గుర్తించాలి. ఈ విధముగా గుర్తించినపుడు పనిముట్టును సరిగ్గా
వుపయోగించాలి.
ఉదాహరణకు, కర్రవస్తువుపై వృత్తమును గుర్తించవలెననుకొందాము. ఇందుకుగాను
వృత్తలేఖినిని ( పెన్సిల్ కంపాస్ ను ) ఉపయోగించవచ్చును కదా! ముందుగా
గీయవలసిన వృత్తము యొక్క వ్యాసార్థము కొలతకు సమానముగా వుండునట్లు
వృత్తలేఖిని రెండు భుజముల అడుగుభాగపు మధ్యదూరము యుండునట్లు ఆ
భుజములను జరుపుకొని సరిగా అమర్చాలి. స్టీలురూలు పై గల కొలతల
ఆధారముగా వృత్తలేఖిని భుజములను జరుపుకొని తగినంత దూరమును వాటిమధ్య
అమర్చవచ్చును. ఈ విధముగా వృత్తలేఖినిని అమర్చుటను ' సెట్టింగ్ ' అంటారు.
ఇది ముందుగా చేయవలసినపని. పిదప వృత్తలేఖినిని సరిగా వుపయోగిస్తూ
కర్రవస్తువుపై తగిన స్థలములో వృత్తమును సరిగా గీయవలెను. ఈ విధముగా
వృత్తమును గీయునపుడు వృత్తలేఖిని పై అమర్చబడిన వ్యాసార్థముకొలత జరిగి
చెదిరిపోకుండా వుండాలి. అనగా పనిముట్టును సరిగా ఉపయోగిస్తూ వృత్తమును
గీయవలసియుంటుంది.
2. గేజి నుపయోగించి రేఖలను గుర్తించుట :—
మార్కికింగ్ గేజి హెడ్ యొక్క ముఖభాగమునకు మరియు దాని దిమ్మకు
బిగింపబడియున్న పిన్నుకుగల మధ్యదూరమును మార్చుకొని కావలసిన కొలతకు
సమానముగా వుండునట్లు అమర్చుకోవాలి.
కుడిచేతిలో హెడ్ భాగమును పట్టుకొని, దాని ముఖభాగమును కర్రఅంచునకు
ఆనించి నొక్కిపెట్టాలి. మార్కికింగ్ గేజి దిమ్మ సమతలములోయుండి, దానికి అమర్చిన
పిన్ను కొద్దిగా వెనకవైపునకు తిరిగియుండునట్లు పట్టుకొని కర్ర ఉపరితలమునకు
పిన్ను తగులునట్లుగా నొక్కి పెట్టియుంచాలి. చేతిని ముందునకు కదిలించుట
ద్వారా పిన్ను కర్ర ఉపరితలముపై కదిలి దానిపై రేఖను గీస్తుంది. ఈ విధంగా
గుర్తింపు బడిన రేఖ కర్ర అంచుకు సమాతరంగాయుంటుంది. ( పటము 1.2 )
మార్కికింగ్ గేజి ద్వారా సుమారు 100 మి.మీ. పొడవువరకు ( అనగా అంచు నుండి 100
మి.మీ. దూరమువరకు ) సమాంతర రేఖలను గీయవచ్చు.
1.3. స్టీల్ రూలు, పెన్సిల్ ద్వారా గుర్తించుట :-
అంచునకు ఎక్కువదూరములో దానికి సమాంతరంగా రేఖలను గుర్తిచుటకు పై
రెండు పద్ధతులు పనికిరావు. స్టీల్ రూలు మరియు పెన్సిల్ ను ఉపయోగించుచు
ఎక్కువ దూరములో రేఖలను గుర్తించవచ్చును. స్టీల్ రూలు ద్వారా ముందుగా
అంచు నుండి కావలసిన కొలతకు సమానమైన దూరములో యుండునట్లు కర్ర
ఉపరితలము పై అక్కడక్కడ బిందువులను గుర్తించిలి. ఈ బిందువులను స్టీల్ రూలు
ద్వారా కలుపుచు పెన్సిల్ తో రేఖలను గీయవచ్చును. ఈ రేఖ అంచు నుండి
కావలసిన కొలతతో సమాంతరముగా వుంటుంది.
1.4. కోణములను గుర్తించు విధానము :-
ఒక్కొక్కసారి కర్రవస్తువుపై వివిధదశలలో రేఖలను గుర్తించవలసియుంటుంది. ఈ
రేఖలు ఏదేని యివ్వబడిన కొలతనుండి కొంత కోణమును చేయునట్లు ఏటవాలుగా యుండవచ్చును. వివిధ కోణములను గుర్తించు విధానము క్రింద తెలుపబడింది.
1. 45॰ కోణము గుర్తించుట :-
45॰ డిగ్రీలు 90 డిగ్రీల కోణములను ట్రైస్క్వేర్ , మీటర్ స్క్వేర్ , కాంబినేషన్ స్క్వేర్
నుపయోగించి గుర్తించవచ్చును. పటములో 1.4లో ట్రైస్క్వేర్ నుపయోగించి 45॰
కోణమును గుర్తించు విధానము చూపబడినది. T—బివెల్ ను ఉపయోగించి 45॰
కోణమేకాకయితర యేకోణమైననను గుర్తించవచ్చును, పటము 1.5 లో చూపినట్లు
ముందుగా కోణమానిని ఉపయోగిస్తూ T—బివెల్ ను తగిన కోణములో ( అనగా 45॰
కోణములో ) అమర్చవలెను. ఈ విధంగా అమర్చిన పిదప T—బివెల్ ను ఉపయోగిస్తు
కర్రవస్తువుపై తగిన కోణములో రేఖలను గుర్తించవచ్చును.
వివిధ కోణములో యేర్పరిచిన కర్రవస్తువు వివిధ కొలతలను కొలుచుటకుగాను T—
బివెల్ ను ఉపయోగించెడి విధానము పటము 1.6 లో చూపబడింది. కాంబినేషన్ సెట్
పై అమర్చబడి T—బివెల్ ద్వారా కోణమును కొలుచుటయున్న 'ఆంగిల్ డివైడర్'
అనబడు కోణములను గుర్తించెడి పరికరము ద్వారా కోణమును గుర్తించవచ్చును. ఇది
రెండు బ్లేడులను కలిగియుండి, వాటికిమధ్యగల కోణమును మార్చుకొని తగినంత
వుండునట్లు అమర్చుకొన వీలుకలిగియుంటుంది. బహుభుజిని త్వరగా గుర్తించుటకు
యిది సదుపాయముగా వుంటుంది.
2. 90॰ కోణమును కొలుచుట లేదా గుర్తించుట :-
ట్రైస్క్వేర్ , మీటర్ స్క్వేర్ , కాంబినేషన్ స్క్వేర్ మొదలగు పరికరముల ద్వారా 90॰
కోణమును గుర్తించవచ్చును. మీటర్ స్క్వేర్ , కాంబినేషన్ స్క్వేర్ ను
ఉయోగించునపుడు 45॰ కోణమును గీయుపద్ధతిలోనే ముందుగా కోణమానిని
ఉపయోగిస్తూ 90॰ కోణమును వీటిపై అమర్చి, పిదప వాటిని ఉపయోగించాలి.
ట్రైస్క్వేర్ ను ఉపయోగించి కర్రవస్తువు ఒక అంచునకు సమకోనములో రేఖను
గుర్తించుట పటము 1.8 లో చూపబడింది. ట్రైస్క్వేర్ యొక్క స్టాక్ ను కర్రవస్తువు
అంచునకు నొక్కిపెట్టి, దాని బ్లేడును స్టీలురూలువలె ఉపయోగిస్తూ రేఖను
గీసినయెడల, అది స్టాక్ తగిలించబడిన అంచునకు సమకోణములో వుంటుంది.
కర్రవస్తువు రెండు ప్రక్కతలములు ఒకదానితోనొకటి సమకోణములో యేర్పరచబడి
వున్నవా లేదా పరిశీలించుటకు ట్రైస్క్వేర్ ఉపయోగిస్తుంది. పటము 1.9 లో
చూపిన విధముగా ట్రైస్క్వేర్ యొక్క స్టాక్ ను కర్రవస్తువు ఒక తలమును నొక్కిపెట్టి
దానిబ్లేడు అంచుభాగము కర్రవస్తువు రెండవ తలమునకు తగులునట్లుగా
అమర్చాలి. ఈవిధంగా అమర్చిన పిదప కర్రవస్తువును ట్రైస్క్వేర్ ను చేతితో
పట్టుకొని వెలుతురు వచ్చుదిశకు ఎదురుగా వుండునట్లు కంటికి ముందు అమర్చి
పరిశీలించాలి. బ్లేడు అంచునకు, కర్రఉపరితలమునకు మధ్య యేవిధమైన
ఖాలిస్థలము లేనియెడల ( అనగా ఆ రెండిటి మధ్యనుండి వెలుతురు కనపడనియెడల )
ఆ రెండు తలములు ఖచ్చితముగా సమకోణములో వున్నట్లు నిర్ధారింపవచ్చును.
కర్రవస్టువు ఉపరితయము సమానముగా వున్నది, లేనిది పరిశీలించుటకుగాను
ట్రైస్వ్కేర్ ను ఉపయోగించు విధానము పటము 1.10లో చూపబడినది.
1.5 వృత్తములను మరియు చాపరేఖలను గుర్తించుట :—
ఇందుకుగాను పెన్సిల్ కంపాస్ లేదా డివైడర్ లేదా ట్రామెల్ మొనలను
ఉపయోగించవచ్చును పెన్సిల్ కంపాస్ ద్వారా వృతమునుగీయుట పటము 1.11లో
చూపబడినది. ట్రామెల్ మొనల ద్వారా కర్రవస్టువుపై వృత్తమును లేదా
చాపమునుగీయుట తటము 1.12 లో చూపబడినది ఎక్కువ వ్యాసముగల పెద్ద
చాపములను గుర్తించుటకు ట్రామెల్ మొనల లేదా పెన్సిల్ కంపాస్ పనికిరావు.
ఇందుకుగానుపలుచని స్కేలు ఆకారముగల వంచుటకు వీలైనటువంటి కర్రముక్కను
ఉపయోగించాలి దానిని తగిన ఆకారములోనికివంచుకొనీ దానిని స్కేలువలె
ఉతయోగిస్తూ పెన్సిల్ తో చాపములను గీయవచ్చును.
1.6 ఇతర ఆకృతలను గుర్తించుట :—
కర్రవస్తువుపై క్రమబధ్ధమైన రేఖాపటములు మరియు ఆకర్షణీయమైన నగిషీ
రేఖలను గుర్తించి, ఆ ప్రత్యేక ఆకారములో కర్రను కోయుటవలన కావలసిన ప్రత్యేక
ఆకృత్తి లో కర్రసామాగ్రిని పొందవచ్చును. త్రిభుజము, పంచభుజి, షట్భుజి మొదలగు
క్రమ రేఖాపటములు మరియు ఆకర్షణీయమగు వంపు గీతలను గుర్తించు విధానము
మనము 10 వ తరగతిలో తెలుసుకొనెడము.
అభ్యాసము
1. కొలతలను గుర్తించునపుడు చేయవలసిన రెండు పనులను వివరింపుము.
2. పటము 1.14లో సూచింపబడిన దీర్ఘచతురస్రాకారపు కర్రవస్తువును అడ్డముగా మూడు
సమభాగములుగా చేయుటకుగాను దానిపై గుర్తులు పెట్టుకొను విధానము వివరింపుము.
3. పైన పేర్కొనబడిన దిమ్మ మధ్యభాగమున 20మి.మీ. రంధ్రములను చేయుటకుగాను
వృతమును గుర్తించెడి విధానము వివరింపుము.
4. ఒక కర్రపలకయందు 50మి.మీ. వృత్తమును గుర్తించి, దానిని 6 భాగములుగా
విభజించెడి రేఖలను గుర్తించెడి విధానము వివరింపుము.
5. మార్కింగ్ గేజితో పటము 1.14 లో సూచింపబడిన కర్రవస్తువు పొడవైన అంచునుండి
10 మి.మీ. , 20 మి.మీ. , 35 మి.మీ. , దూరముతో సమాంతర రేఖలు గీసెడి విధానము
వివరింపుము.
No comments:
Post a Comment