యూనిట్ -1
కర్ర సామాగ్రి వివిధ భాగములను కలిపెడి జాయింట్లు
ఉపోద్ఘాతము :
బీరువాలు, బల్లలు, కుర్చీలు, తలుపులు, కిటికీలు మొదలగు వివిధ
కర్రసామాగ్రులను తయారు చేయుటకు గాను ఆయా వస్తువుల
విడిభాగములను ముందుగా చేసుకొని, వాటిని కలుపుకొనవలసి
యుంటుంది. అనగా తగిన సైజు మరియు ఆకారముగల వివిధ
కర్రముక్కలను కలుపుకొనుట ద్వారా కావలసిన ఆకారముతో
కర్రసామాగ్రి తయారు చేయబడుతుంది. రెండు కర్రముక్కలను
కలుపుకొని ఒక భాగముగా చేయుటను
" కర్ర ముక్కలను జతచేయుట " ( Wooden joinery ) అని అంటారు. ఈ
విధముగా కర్రముక్కలను జతచేయుట మూడు విధములుగా
అవసరమవుతుంది.
1. కర్రముక్కలను కలుపుకొనుట ద్వారా కర్రవస్తువు యొక్క పొడవు,
వెడల్పు, మందము మున్నగు కొలతలను పెంచవచ్చును.
2. ఒకే దిశలో కాకుండా వివిధ దశలలో కర్రమక్కలను కలుపుకొని
కర్రవస్తువునకు కావలసిన ఆకారమును యివ్వగలము.
3. కర్రముక్కలను కలుపుకొని , వాటిమధ్య కావలసిన రీతిలో
కదలికను పొందవచ్చును.
రెండు కర్రముక్కలను ఒక వస్తువుగా కలిపెడి భాగమును ' కీలు '
' జాయింట్ ' ( Joint ) అని అంటారు. కర్రముక్కలను గట్టిగా కానీ
లేదా వదులుగా కాని జత చేయవచ్చును. అనగా తగిన జాయింట్
ను యేర్పరుచుట ద్వారా రెండు కర్రముక్కలు గట్టిగా
బిగింపబడుటలేదా వాటి మధ్య కదలిక యుండునట్లుగా
బిగింపబడుట చేయవచ్చును.
6.2 వివిధ రకముల జాయింట్లు :
కర్ర పని యందు ఉపయోగపడెడి జాయింట్లను రెండు విధములుగా
విభజింపవచ్చును.
1. పొడవును పెంచు జాయింట్లు :—
ఈ జాయింటు ద్వారా విడి విదములుగా యున్న కర్రముక్కలను
కలుపుకొని కర్రవస్తువు కొలతను ( పొడవు, వెడల్పు, మందము
మొదలగు వాటిని ) పెంచవచ్చును.
2. ఆకారము నొసెగెడి జాయింట్ :—
ఇది వివిధ ఆకారములు, కొలత యేర్పరిచిన విడి కర్రముక్కలను
కలుపుకొని ఆ సముదాయంతో ఆకారమును పొందుటకు
వుపయోగించెడి జాయింట్.
6.3 జాయింట్ కు వుండవలసిన ధర్మములు :—
కర్రముక్కల జాయింట్ తగినంత పటిష్టతను కలిగియుండాలి.
కాకుండా కంటికి యింపైన తగిన రూపమును కలిగియుండాలి.
జాయింట్ యొక్క పటిష్టత ఆ కర్రముక్కల ను కలుపుకొని
జాయింట్ ను యేర్పరచవలెను. చూపిన నైపుణ్యత పైన ఆధారపడి
యుంటుంది. ఖచ్చితంగా యేర్పరచవలెను జాయింట్ పటిష్టంగా
వుండుటయే కాకుండా ఆకర్షణీయంగా వుంటుంది. జతచేయబడిన
కర్రముక్కల పటిష్టతను పెంచుటకు వాటిని మేకులు, స్ర్కూ
పిన్నులు లేదా జిగురు ( Glue ) మన్నగు వాటివల్ల వాటిని గట్టిగా
బిగించవచ్చును.
6.4 కర్రసామాగ్రి తయారీలో వుపయోగించెడి సాధారణ జాయింట్ :—
కర్రసామాగ్రి తయారీయందు వుపయోగించెడి ముఖ్యమైన కొన్ని
జాయింట్ ను గురించి క్రింద వివరింపమైనది.
1. బట్ జాయింట్ ( Butt joint ):—
దీనియందు ఒక ముక్కవైపు ప్రక్కభాగము తగులునట్లు అమర్చబడి,
అవి రెండు జిగురు లేదా స్ర్కూ ల వలన కలపబడతాయి. ఈ
జాయింట్ సాధారణంగా ఎక్కువ పటిష్టత అవసరములేని
పనులకుపయోపడుతుంది. ఈ జాయింట్ దాదాపు అన్ని రకముల
కర్రసామాగ్రుల తయారీలలో రాయబడుతుంది. రెండు రకముల
బట్ జాయింట్ల పటము6.1 లో చూపబడ్డాయి.
2. మీటర్ జాయింట్ :—
ఇది ప్రత్యేకమైన బట్ జాయింట్. ఒకే వెడల్పు గల రెండు
కర్రముక్కలను కలుపుటకు యిడి వాడబడుతుంది. రెండు
కర్రముక్కల కలపవలసిన ప్రక్క భాగములను ఏటవాలుగా కోసి, ఆ
రెండు భాగములను జిగురుతో కలుపుట ద్వారా యీ జాయింట్
యేర్పడుతుంది. ఏటవాలుగా కోయునపుడు రెండు కర్రముక్కలు ఒకే
కోణమును కలిగియుండాలి. ఈ కోణము 90॰ కన్నా తక్కువ
యుండాలి. 45॰ కోణములో యేర్పడిన మీటర్ జాయింట్ పటము
6.2 లో చూపబడినది. స్ర్కూలు, పిన్నులు లేక సన్నని కర్రముక్కల
నుపయోగించి యీ జాయింట్ పటిష్టతను పెంచవచ్చును. ఫోటో
ఫ్రేలు మొదలగు తేలికరపు పనులలో యీ జాయింట్ ఎక్కువగా
వుపయోగపడుతుంది.
3. డవెల్ జాయింట్ :-
బట్ జాయింట్ నకు ఎక్కువ పటిష్టతను కలుగజేయుటకుగాను
డవెల్ పిన్నుల నుపయోగించి జాయింట్ ను ఏర్పరచవచ్చును.
దీనిని ' డవెల్ జాయింట్ ' అంటారు. ( పటము 6.6;6.7 ) గుండ్రని
ఆకారములో సన్నని పిన్నుల ఆకారముతో గట్టి కర్రతో చేయబడిన
చిన్న కర్రముక్కలను ' డవెల్ పిన్నులు ' అంటారు. ఈ పిన్నుల
నుపయోగించి రెండు కర్రముక్కలను సరిగా అమర్చుకొని
జతచేయుట వీలగుతుంది.
4. ల్యాప్ జాయింట్ ( Lap Joint ) :-
ఈ జాయింట్ ద్వారా రెండు కర్రముక్కలను కలుపుటకుగాను
వాటి యందు కొంత వెడల్పును కలిగియుండునట్లు ఒక చీలికను
యేర్పరుచుట ద్వారా ఆ కర్రముక్కల మందమును తగ్గించి
సగము చేస్తారు. దీనిని ' సగము చేయుట ' ( Halving ) అని అంటారు.
ఈ విధముగా మందము తగ్గింపబడిన కర్రముక్కల భాగములను
ఒకదానిపై మరియొకటి అమర్చి కలిపిన యెడల ' ల్యాప్ జాయింట్
' యేర్పడుతుంది. ఈ విధముగా కలపబడిన రెండు కర్రముక్కల
జాయింట్ వద్ద జిగురునుపయోగించి లేదా పైకి కనపడకుండా
అమర్చబడి స్ర్కూల నుపయోగించి జాయింట్
పటిష్టతను పెంచవచ్చును. వివిధ రకములుగా కలపబడిన ల్యాప్
జాయింట్ పటము 6.8, 6.9, 6.10 లలో చూపబడ్డాయి. ల్యాప్
జాయింట్ వివిధ కర్రసామాగ్రులను తయారు చేయుటకుగాను
స్ర్టెచర్లు, స్టాండ్లు, ఫ్రేములు, గృహనిర్మాణమునకు అవసరమగు
కర్రసామాగ్రియందు ఉపయోగిస్తారు.
5. టాంగ్ మరియు గ్రూప్ జాయింట్ :—
కర్రముక్కలచివర భాగములను కలిపెడి బట్ జాయింట్ వలె ఈ
జాయింట్ ను యేర్పరుస్తారు. ఇందుకుగాను ఒక కర్రవస్తువు
చివరభాగములో సన్నని చీలిక చేయవలసి యుంటుంది.దీనిని ' గ్రూవ్
' ( Groove ) అంటారు. చీలిక వద్ద తొలగింపబడిన కర్రమందమును
కలిగిన మొన ( Tongue ) భాగము రెండవ వస్తువులో చివరభాగము
చేయబడియుంటుంది. చొచ్చుకు పోయినట్లుగా వున్న ఈ
మొనభాగము రెండవ కర్రవస్తువుయందు చేయబడిన చీలికలో
అమర్చుకొని జాయింట్ ను యేర్పరచవచ్చును. రెండవరకము టాంగ్
మరియు గ్రూప్ జాయింట్ యందు రండు కర్రముక్కల
చివరభాగములలో చీలికలు చేయబడి, ఆ చీలికల మందముతో
సమానమైన మందముగల ఒక కర్రముక్కను ఆ రెండు చీలికలోనికి
జొప్పించి ఆ కర్రముక్కలను కలుపవచ్చును ( పటము 6. 13) ఈ
జాయింట్ డ్రాయింగ్ బోర్డుల, తలుపులకుగల పలకలు, కర్రతో
చేయబడిన నేలభాగములను చేయుటకు వుపయోగపడుతుంది.
యూనిట్ -2
6. మోర్ టైస్ మరియు టెనస్ జాయింట్ :—
ఈ జాయింట్ ను ఏర్పరుచటానికి గాను రెండు కర్రముక్కలలో
ఒకదానియందు దీర్ఘచతురస్రాకారపు రంధ్రము చేస్తారు. ఈ
రంధ్రము ' మోర్ టైస్ ' లేదా ' సాకెట్ ' అని అంటారు. కొన్ని
సందర్భములలో రెండు రంధ్రములు కూడా చేయబడతాయి. సాకెట్
యందు సరిగ్గా అమరునట్లుగా రెండవ కర్రముక్క ఒకప్రక్క ( కొన )
భాగమందు దాని మందమును కొద్దిగా తగ్గించి దీర్ఘచతురస్రాకారపు
కడ్డీ ఆకారమును కలిగియుండునట్లుగా చేస్తారు. దీనిని ' ఫింగర్ ' లేదా
' టెనెన్ ' అని అంటారు. టెనెన్ మోర్ టైస్ లో అమర్చుట ద్వారా
జాయింట్ యోర్పడి రెండు కర్రముక్కలు కలపబడతాయి. డవెల్
పిన్నులు లేదా జిగురును ఉపయోగించి జాయింట్ పటిష్టతను
పెంచవచ్చును. వివిధ రకముల మోర్ టైస్ మరియు టెనెన్
జాయింట్ల పటము 6.14, 6.15, 6.16 లలో చూపబడ్డాయి
.7. బ్రిడిల్ జాయింట్ :—
పెంకుటింటి పైకప్పున ఏటవాలుగా యున్న ఇంటి
వాసములను అడ్డముగా నున్న దూలమునకు కలిపి
బిగించటానికి జాయింట్ ను ఎక్కువగా వుపయోగిస్తారు.
ఈ జాయింట్ కూడా మోర్ టైస్ మరియు టెనెన్ జాయింట్ ను
ఏర్పరచబడుతుంది. ఒక కర్రముక్క చివరభాగమున
దీర్ఘచతురస్రాకారపు టెనెన్ చేయబడుతుంది. రెండవ కర్రముక్క
చివర భాగమున అదే ఆకారము చీలిక చేయబడుతుంది.
సాధారణంగా దూలమును టెనెన్ మరియు వాసములకు చివర
చీలిక చేయబడుతుంది. టెనెన్ భాగమును చీలిక లో దూలము
అమర్చుట ద్వారా అవి కలపబడతాయ. పటము 6.17 మరియు 6.18
చూపబడినట్లుగా రెండురకముల బ్రిడిల్ జాయింట్వాడవచ్చు
మూలలందు కలపబడెడి జాయింటును ' కార్నర్ బ్రిడెల్ జాయింట్ '
అని మరియు అడ్డముగా కలపబడెడి బ్రిడెల్ జాయింట్ ను T —
బ్రిడెల్ జాయింట్ అనియు పిలుస్తారు.
పైన తెలిపిన విధముగా టెనెన్ మరియు చీలికలను ఎక్కువ
సంఖ్యలో ఏర్పరిచి జాయింట్ ను చేసిన యెడల దానిని ' ఫింగర్
జాయింట్ ' లేదా ' బాక్స్ జాయింట్ ' అని పిలుస్తారు.
8. డవ్ టెయిల్ జాయింట్ :—
ఇది కూడా ' ఫింగర్ జాయింట్ ' వలెనె యేర్పరచబడుతుంది.
అయితే దీర్ఘచతురస్రాకారపు బదులు ఏటవాలుగా వెడల్పుతో
ట్రెపీజియం ఆకారమును కలిగియుండునట్లుగా చీలికలు మరియు
టెనెన్ లు యేర్పరచబతాయి. చీలికల వెలుపలి భాగము ఎక్కువ
వెడల్పు మరియు లోపల భాగము తక్కువ వెడల్పు ను
కలిగియుంటాయి. టెనెన్ ల వెడల్పు భాగము తక్కువ వెడల్పు
మరియు లోపల భాగము ఎక్కువ వెడల్పు కలిగియుంటాయి.
పటము 6.20 లో చూపబడినట్లుగా టెనెన్ చీలికలలో సరిగ్గా
అమర్చబడి జాయింట్ యేర్పరచబడుతుంది.
డవ్ టెయిల్ జాయింట్ ఎక్కువ పటిష్టతను కలిగియుండి ఎక్కువ
కాలము మన్నికగా వుంటుంది.
వివిధ రకముల డవ్ టెయిల్ జాయింట్ల పటము 6.12 లో
చూపబడ్డాయి.
No comments:
Post a Comment