యూనిట్ - 4
కర్రవస్తువును తగిన పొడవునకు సరిచేయుట :
1. చదునుచేసి గుర్తింపబడిన ప్రక్కభాగమునుండి కర్రవస్తువునకు కావలసిన పొడవును కొలచి గుర్తించాలి. పెన్సిల్ తోగానీ, మార్కింగ్ చాకుతోగానీ కర్రవస్తువు పై పొడవుగల దిశకు అడ్డముగా ఒక రేఖనుగీయాలి. ఱంపముతో యీ రేఖకు కొద్దిగా వెలుపలివైపు వుండునట్లు కర్రవస్తువును కోయాలి. దీనితో కర్రవస్తువు కావలసిన పొడవుకన్న కొద్దిగా ఎక్కువ పొడవును కలిగియుంటుంది.
2. పిదప కర్రవస్తువును వైస్ యందు లేదా బెంచిహుక్ పైన అమర్చి కోయబడిన ప్రక్కభాగమును పెన్సిల్ తో గుర్తింపబడిన రేఖవరకు ప్లేన్ తో చదునుపరచి నునుపుచేయాలి. ఈ విధముగా చదునుచేయబడిన భాగమును ట్రైస్క్వేర్ ద్వారా పరిశీలించాలి.
( E ) కర్రవస్తువునకు కావలసిన వెడల్పును నిర్ణయించి, మార్కింగ్ గేజిని దానికి సమానముగా అమర్చాలి. పిదప చదునుపరచిన అంచునకు మార్కింగ్ గేజి హెడ్ భాగమును ఆనించి నొక్కిపెట్టి, గేజికిగల పిన్నుద్వారా కర్రవస్తువు రెండు ముఖతలములపై అంచునకు సమాంతరముగా రేఖలు గీయాలి. ( పటము3.9 ) 10 సెం. మీ. వెడల్పువరకు మార్కింగ్ గేజిని ఉపయోగించవచ్చును. అంతకన్నా ఎక్కువగల వెడల్పును గుర్తించుటకు మార్కింగ్ గేజి పనికిరాదు. అపుడు స్టీలురూలు లేదా యితర కొలబద్దల నుపయోగించి కావలసిన వెడల్పును కొలిచి గర్తుపెట్టుకొనాలి. ఈ గుర్తులను కలుపుచు రేఖను గీసినయెడల అది వెడల్పును సూచిస్తుంది.
2. పిదప కర్రవస్తువును వైస్ లో బిగించి గుర్తింపబడిన రేఖ వెంబడి ప్లేన్ ద్వారా కర్రను పొరలుగా తొలగించి , చదునుపరచాలి. పిదప ట్రైస్క్వేర్ తో సరిచూడాలి.
( F ) కర్రవస్తువు మందమును చదునుచేయుట :
1. కర్రవస్తువునకు కావలసిన మందమును నిర్ణయించి, దానికి సమానమైన పొడవుతో మార్కింగ్ గేజిని అమర్చి కర్రవస్తువు రెండువైపుల గుర్తించాలి. ఇందుకుగాను మార్కింగ్ గేజ్ హెడ్ భాగము కర్రవస్తువుపై చదునుచేయబడిన ముఖతలమునకు నొక్కిపెట్టి, గేజికిగల పిన్ను ద్వారా రేఖను గీయాలి. ఈ విధముగా అంచులపై గీయబడిన రెండు చివరలను కలుపుచూ కర్రవస్తువు ప్రక్కభాగమునకూడా ఒక రేఖను గీయాలి.
2. కర్రవస్తువును బెంచి స్టాప్ వైపు నొక్కిపెట్టుచు బెంచిపైన బిగించాలి. పిదప మందమును గుర్తించెడి రేఖలవరకు కర్రను తొలగించునట్లు పదునుచేయాలి.
3. ట్రైస్క్వేర్ ( లేదా తిన్నని అంచు )తో చదునుపరచబడును రెండవ ముఖతలమును పరీక్షించాలి.
3.3 గమనించవలసిన విషయములు:
1. ప్లేనింగ్ చేయుటకు ముందు కర్రవస్తువును సరిగా బిగించాలి.
2. ప్లేన్ కుగల బ్లేడును సరిగ్గా అమర్చి, తగినంత మందముగల పొరలతో కర్రను చీల్చునట్లు చూడాలి.
3. ప్లేనింగ్ చేయునపుడు, మనస్సును, దృష్టిని చేయుచున్నపని మీదనే కేంద్రీకరించాలి.
అభ్యాసము
1. దీర్ఘచతురస్రాకారపు కర్రపలక వివిధ అంచులను, ముఖతలములను సమతల విధానమును వివరింపుము.
2. 6 సెం.మీ. మందము, 30 సెం.మీ. వెడల్పు మరియు 100 సెం.మీ. పొడవుగల కర్రపలకనుండి కర్రను తొలగించి దాని సైజును 5 సెం.మీ. మందము, 20 సెం.మీ. వెడల్పు 80 సెం.మీ. పొడవు కర్రవస్తువుగా మార్చవలసియుంది. ఇందుకుగాను
( a ) కావలసిన పనిముట్లను పేర్కొనుము.
( b )పనిముట్లు నుపయోగించి చేయవలసిన పనులను వివరింపుము.
( c )కొలతలు సరిగా వున్నదీ లేనిది పరీక్షించు విధానము వివరింపుము.
No comments:
Post a Comment