Friday, September 6, 2019

12. కలప లో గల లోపములు

        12. కలప  లో   గల  లోపములు

 1. ముళ్ళు ( Knots) :---వృక్ష కాండము

నుండి    వెలువడిన    కొమ్మలు

విరిగిపోయినప్పుడు   కాండముపై 

ఏర్పడు   గుర్తులను ' ముళ్ళు'(నాట్స్)

అంటారు.   ఈ   గుర్తులు   స్పష్టం గా

యేర్పరచబడతాయి.   చిన్న సైజులో

యేర్పడ్డ   ముళ్ళను  'టైట్ నాట్స్ ' (

Tight  knots )  అని అంటారు.   ఈ

ముళ్ళు    యేర్పడ్డ    కర్రభాగము దృఢంగా

యుండుట   చేత    ఇది    లోపంగా

పరిగణింపబడదు.   కానీ ,   పెద్ద సైజులో ,

వదులుగా  నున్న  ముళ్ళు  ముఖ్య  కలప

భాగము  నుండి  పెలుసులుగా

విడిపోతాయి.  ఈ  లోపమును  కలిగిన

 కలప  తగినంత    దారుఢ్యతను   కలిగి

ఉండదు.
---------------------------------------------------

2 .మెలి  తిరిగిన  ఫైబర్లు :—   చెట్టు

కొొమ్మలగుండా   వేగంగా   వీచెడి

  గాలులు    తుఫానుల   తాకిడివలన 

వృక్షకాండము   యొక్క   పొరలు  (

ఫైబర్లు)   మెలితిరిగి    పోవుట   వలన ఈ

లోపము   ఏర్పడుతుంది .
---------------------------------------------------

3. హార్ట్   షేక్ (  Heart  shake ):—

వృక్ష కాండపు  కేంద్రము   వద్ద   గల 'హార్ట్ '

భాగము   నుండి   కాండపు   వెలుపలి

వైపున గల   'సాప్ వుడ్  ' ( Sapwood)

భాగమునకు  వ్యాపించెడి   చీలికలను  '

హా ర్ట్    షేక్  '  అని  అంటారు.

 --------------------------------------------------

4 .స్టార్ షేక్  (  Star  shake ):--

వృక్షకాండపు   వెలుపలిపొర  లోపలి

తలము   నుండి   కాండపు  కేంద్ర 

భాగమునకు  వ్యాపించెడి   చీలికలను

'స్టార్  షేక్  '  అని  అంటారు. 

వేసవికాలంలో  అమితమైన   ఉష్ణోగ్రతకు

 మరియు   శీతాకాలంలో  అతి చల్లని

వాతావరణమునకు   గురి  అగుటవలన

వృక్షకాండపు   పొరలు  కాలిపోవుట

లేదా  పికిలిపోవుట  జరిగి  యీ  లోపము

యేర్పడుతుంది.
---------------------------------------------------

కప్    మరియు  రింగ్  షేక్ (Cup &  Ring  shake  ):--వృక్షకాండములో

వృత్తాకారములో   అమర్చబడిన  రెండు

ప్రక్క  ప్రక్క  ఆన్యులర్  రింగులమధ్య 

సన్నని    చీలిక    ఉత్పన్నమై,  క్రమేణా

వృద్ధి  పొంది  పెద్ద  చీలికగా   మారుతుంది.

ఈ   విధంగా    సన్నని   చీలిక గా

మారుతుంది.    ఈ    విధంగా    యేర్పడ్డ 

లోపమును   ' కప్  మరియు  రింగ్ షేక్  '

అని   అంటారు.   శీతాకాలంలో వృక్ష

కాండంలో గల    తేమ   ఘనీభవించుట 

వలన   లేదా   వృక్షకాండపు

అడుగుభాగమున   గల   వ్రేళ్ళ   ద్వారా

 కావలసిన   దాని  కన్నా  ఎక్కువగా   

నీటిని    గ్రహించుట    వలన  కూడ  యీ   

లోపము  ఏర్పడుతుంది .

6. హనీ  కోంబింగ్ ( Honey   combing):--  కర్రను    సరిగా 

సీజనింగ్    చేయక  పోవుట   వలన   ఈ

లోపము  ఏర్పడుతుంది.   సీజనింగ్

తొలిదశలో   తేమను  తొలగించుట

కావలసిన   దానికన్నా   ఎక్కువ వేగంగా

జరిగినప్పుడు   కలప  లోపలి  పొరలలో

చీలికలు  యేర్పడుట  ద్వారా   యీ

లోపము  జరుగుతుంది.  తేనెపట్టు

గదులవలె  యీ  చీలికలు  యేర్పడుట

చేత  దీనిని  'హనీ  కోంబిం గ్'   అని

అంటారు.


7. రిండ్    గాల్  ( Ring  gall ):-- వృక్ష

కాండము   నుండి   కొమ్మలు   కొట్టివేసిన

పిదప  తెగిపోగా   మిగిలిన

కొమ్మభాగములో   రసదారువు   (Sap

wood )    పెరిగిపోవుట   వలన   ఈ

లోపము   ఏర్పడుతుంది.   దీని మూలంగా

ఆ  కొమ్మ   యందు  డొల్లగా  యేర్పడిన

రంధ్రములు    యేర్పడి ,  అక్కడి నుండి

క్షీణించుట   ప్రారంభమై   యితరభాగాలకు

వ్యాపిస్తుంది .

8.  నశించిపోయిన   కర్ర ( Dead  wood) :—నిర్ణీత 

జీవితకాలమును   దాటిన   పిదప

వృక్షమును   పడగొట్టి    దానినుండి  కర్రను

పొందినపుడు    ఆ   కర్ర  లో  యీ

లోపము   కనపడుతుంది .  ఈ కర్ర

సాధారణ బరువు    కంటే   తక్కువ

బరువుతో   బలహీనంగా   ఉంటుంది.

Thursday, September 5, 2019

11.కలపకు సోకెడి కొన్ని వ్యాధులు

 కలపకు సోకేడి  కొన్ని   వ్యాధులు :— 

కలప    ముఖ్యంగా    మూడు రకముల

వ్యాధులకు   గురి   అవుతుంది .  వీటిని

1.  డ్ర్రె  రాట్  ( Dry  rot )

2.   వెట్  రాట్  (Wet  rot )

3.  వృత్తాకారపు సంకోచము 
(Circumfrential  shrinkage)

 అని   పేర్కొంటారు.   వీటిని   గురించి

 వివరంగా   తెలుసుకుందాము.

 1. డ్రై రాట్ :—' ఫంగస్' (Fungus )

మూలంగా   కలప   క్షీణించడాన్ని

 ' డ్ర్రె  రా ట్  '   అని   అంటారు .  ఈ

వ్యాధి    సోకిన  కర్ర భాగము 

కొద్దికాలానికి   పొడిపొడిగా   మార్పు

చెంది  తరిగిపోతుంది.   తగినంత   గాలి

లేని    ప్రదేశంలో   కలపను 

నిలువయుంచుట    మూలంగా   అది  ఈ

వ్యాధికి   గురి  అగుతుంది.   ఈ వ్యాధి

నుండి   నివారించడానికి   కలపను   తగిన

విధంగా  "   సీజనింగు"   చేసి   దాని 

నుండి  తేమను   తొలగించాలి.   కాపర్

సల్ఫేట్    ద్రావణాన్ని   కలప పై   పెయింట్

చేయడం   ద్వారా   డ్రై రాట్  నుండి 

కాపాడుకొన   వచ్చును.

2.   వెట్  రాట్ :—  ఎక్కువగా  తేేమకు

గురి    అగుట వలన    కలప   రసాయనిక

మార్పులు   చెంది   తద్వారా క్షీణించటాన్ని

వెట్ రాట్   అంటారు. ఈ   వ్యాధికి   గురైన

కలప భాగము    ఎర్రని   డాగులతో 

కూడి  యుండి   క్రమేణా  పొడిగా మార్పు

చెంది   తరిగి పోతుంది.   ఈ వ్యాధిని

నివారించటానికి    సరైన విధంగా

సీజనింగ్   చేయుటయే   కాకుండా ,దానిపై

తారు   పూయుట   లేదా  పెయింట్

చేయుట  వలన   దానిని

కాపాడుకొనవచ్చును .

3. వృత్తాకారపు దిశలో సంకోచము:—

ఈ   వ్యాధి   వృక్ష కాండము   వెలుపలి

భాగము నుండి    మధ్యలో   గల   కేంద్ర

భాగమునకు    వ్యాసార్థ దిశలో   కర్రను

చీలికలుగా   విడగొట్తూ  వ్వాపిస్తుంది.

వృక్ష  కాండపు   వెలుపలి  పొరలు  లోపలి

వైపు  పొరల   కన్నా  త్వరగా   తేమను

కోల్పోవటం    వలన   వృక్ష కాండము  ఈ

వ్యాధికి   గురి   అవుతుంది .

పైన   తెలిపిన   విధంగా   తగినంత   గాలి

లేకపోవుట ,  ఎక్కువగా  తేమకు  గురి

అగుట   మొదలగు   కారణాల వలన కర్ర

క్షీణిస్తుంది.  అంతేకాకుండా   వాతావరణ

వైపరీత్యాలకు   గురి అగుట   మరియు

ఇతర   కారణముల   వలన   కొన్ని

లోపములను   కలిగి   ఉండవచ్చును.  ఈ

లోపములను   గురించి  క్రింద

వివరించడమైనది. ముఖ్యమైన

ఇంజినీరింగ్   పనులకు

 ఉపయోగించుటకు   కర్ర   సామాగ్రిని

తయారు చేయునప్పుడు   ఈ 

లోపములు  కలిగిన   కలపను

ఉపయోగించరాదు.

Wednesday, September 4, 2019

10. మన దేశంలో పెరిగెడి కలప వృక్షములు

 మన  దేశంలో  పెరిగెడి  కలప   వృక్షములు:—
మన  దేశంలో  పెరిగెడి  కలప   వృక్షములు  

 క్రింద పేర్కొనబడినవి.
1.  తుమ్మ చెట్టు:— ఇది   దేశమంతటా

పెరుగుతుంది . ఇది   దగ్గర దగ్గరగా   గల

కణములను   కలిగి యుండి   పటిష్టంగా

ఉంటుంది. దీని   కాండం  అవచ్ఛేదము

లేత   ఎర్రని   రంగును   కలిగి ఉంటుంది .

2 .దేవదారు  వృక్షము:—ఇది   కొండ

ప్రాంతంలో పెరుగుతుంది. 

దీని   కలప   పటిష్టంగా   ఉండి   ఎక్కువ

కాలం   మన్నికగా   ఉంటుంది.  గృహ

నిర్మాణం   మరియు   రైలు పట్టాల క్రింద

పరిచెడి  స్లీపర్లను   తయారు చేయడంలో

ఇది ఉపయోగ పడుతుంది.

 3.  మామిడి చెట్టు  :— ఇది 

దేశమంతటా   పెరుగుతుంది. ఇది

దూరదూరంగా   అమర్చబడినయున్న 

పెద్ద   కణములను   కలిగి   ఉంటుంది.

దీని   కలప   తక్కువ   నాణ్యత   కలిగి

ఉంటుంది .  తలుపులు  మరియు

గృహోపకరణాలను   తయారు చేయుటలో

ఇది   ఉపయోగపడుతుంది.   ఇంజనీరింగ్

పరికరములను   తయారు చేయుటకు

ఇది   పనికిరాదు .

4 .మల్బరీ   చెట్టు :— ఇది   దృఢంగా

ఉండి   తగినంత   స్థితిస్థాపకత 

(Elasticity ) కలిగి

ఉంటుంది.   దీనిని    టెన్నిస్   మరియు

బ్యాడ్మింటన్    రాకెట్   హాకీ   కర్రలు , క్రికెట్

బ్యాటులు   మరియు   ఇతర   ఆట

వస్తువులు    తయారు చేయుటకు

ఉపయోగిస్తారు.

 5.  టేకు చెట్టు :—  ఇది   ధృడంగా 

ఉండి   ఎక్కువ కాలం   మన్నికగా

ఉండుటయే   కాకుండా  కలపను  నునుపు

పరచుట    సులభంగా   సాధ్యపడుతుంది.

కొన్ని   ప్రత్యేక   నూనెల   మూలంగా   ఇది

కీటకములకు   గురికాకుండా    చాలా

కాలము  మన్నికగా  వుండుట

జరుగుతుంది. వివిధ  గృహోపకరణాలను

తయారుచేయుటకు  ఉపయోగపడుతుంది .

6. మద్దిచెట్టు :—ఇది   ఎక్కువ   గట్టి గా

మరియు   దారుడ్యతతో   ఎక్కువ

బరువును   కలిగి   ఉంటుంది.   ఇది కూడా

చదలకు  మరియు   ఇతర   కీటకములకు

గురికాకుండా   చాలా కాలం  మన్నికగా

ఉంటుంది.   రైల్వేస్లీపర్లు , వంతెనలు,

గృహ నిర్మాణమున   కవసరమగు    కర్ర

సామాగ్రి,   ఓడలు   తయారు చేయుటలో

ఇది   ఉపయోగపడుతుంది .

7 .మహోగని (mahogany )వృక్షము:--

 ఇది   తిన్నగా  యున్న  కణములను  కలిగి

యుండి,  ముదురు   ఎరుపు రంగును

కలిగి ఉంటుంది.   ఇది   కూడా చెదలకు,

ఇతర కీటకములకు   గురికాకుండా   చాలా

కాలం   మన్నికగా   ఉంటుంది .  అయితే

తేమకు   గురి   అయినప్పుడు   దీని

నాణ్యత   తగ్గుతుంది.   దీనిని 

బీరువాలు  ( Cabinets )  ఇతర  మేలు

రకపు  గృహోపకరణాలు    మరియు

ఓడల  తయారీలో ఉపయోగిస్తారు.

 8 .అక్రోటు చెట్టు :—ఇది   చిన్న సైజు

గల   కణములను   కలిగి   ఉండి   లేత

రంగులో ఉంటుంది.   ఇది   కొద్ది

దారుఢ్యతను    కలిగియుండి 

నునుపుపరచి   అందంగా   తయారు

చేయుటకు      వీలు కలిగి ఉంటుంది. ఇది

కూడా   కీటకములకు  గురికాదు.  దీనిని

అలంకరణ సామగ్రి ,

గృహోపకరణములు,  బీరువాల  తయారీకి

ఉపయోగిస్తారు .

9 .వెదురు చెట్టు :—ఇది అంతర్జాత

వృక్షము.   దీనిని   గృహ నిర్మాణముులో

మరియు   గెడకర్రల ( Scaffoldings )

తయారీలో   ఉపయోగిస్తారు.

Tuesday, September 3, 2019

9. వృక్షకాండము యొక్క ముఖ్యభాగములు

 వృక్ష కాండము  యొక్క  ముఖ్య భాగములు :—

వృక్ష కాండము   యొక్క అవచ్ఛేదము

పటములో చూపబడినది. వృక్షము 

యొక్క   కర్ర  నారల   (Fibres )   వంటి 

పదార్థంతో   చేయబడింది ఉంటుంది .

వృక్షము   పొడవుగా   పెరిగిన కొలది,

దాని   పొడవు   దిశలో   నారలు

పెరుగుతాయి .  ఈ  నారలు   గొట్టం

ఆకారంలో   ఉండి   వృక్ష కాండపు

కేంద్రము   వద్ద  గల  ' దవ్వ ' లేక  'బెండు'

(Pith   or  Medulla )  చుట్టూ

అమర్చబడి ఉంటాయి. ఈ  నారలు

వృక్షకణములచే   చేయబడి   పెరిగిన

కొలది,  కణములు   వ్యాపించెడి  దిశలో

ఏర్పరచబడుతుంటవి.  ఈ  నారలనే   వృక్ష

కణాలు ( Cells  or  Grains ) అని

కూడా అంటారు.   కణములు   వృక్షము

యొక్క   పొడవు   దిశలోనే   పెరుగుతూ

నారల   వలె  ఏర్పడతాయి.   ఈ నారల

ద్వారా   వృక్షమునుండి   లభించు  కర్ర

తగిన   పటిష్టతను   కలిగి   ఉంటుంది .

అంతే   కాకుండా  యీ   నారల   ద్వారా

వృక్ష కాండము   అడుగు భాగమున   కల

వ్రేళ్ళ నుండి   ఆహారపదార్ధములు

కొమ్మలకు,  ఆకులకు 

అందించబడతాయి.వృక్షకాండపు 

వెలుపలి   బెరడు ( outer bark  ) చెట్టు

ను  వాతావరణపు   వైపరీత్యాలకు

గురికాకుండా   కాపాడుతుంది .దీనినే  '

బహిశ్చర్మము '  అని అంటారు. బెండు

చుట్టూ  వర్తులాకారములో   అమర్చబడిన

వృక్ష భాగము   గట్టిగా   నల్లగా   ఉంటుంది

.దీనిని 'హృత్కాష్ఠము" లేదా గట్టి  కర్ర

లేదా  హార్ట్   వుడ్ (Heart  wood )   

అని   అంటారు. దీని  గుండా  నీరు గాని,

ద్రావణములుగాని ప్రసరింపవు. ఈ

వృక్షభాగము  తగిన దారుడ్యతను

కలిగియుండి  ఎక్కువకాలము  మన్నికగా

ఉంటుంది .దీనికి,  కాంబియమ్  పొర

(Cambium   layer )  అనబడెడి

వెలుపలి పొరకు  మధ్యగల  కర్ర

భాగమును 'రసదారువు'( Sap wood )

అంటారు .  దీని గుండా నీరు ,లవణ

ద్రవములు  ప్రసరించుట  వలన  ఇది

తేమను   కలిగి యుండి   బలహీనంగా

ఉంటుంది .  ఈ   వృక్ష భాగము  కర్ర

సామాగ్రిని   తయారు   చేయుటకు

పనికిరాదు.  రసదారువునకు,  వెలుపలి 

బెరడునకు   మధ్యగల  పొరవలెయున్న

వృక్షకాండపు  భాగమును  'కాంబియమ్

పొర  ' అని   అంటారు.
                     
                         బెరడు  నుండి  కేంద్ర

భాగమున   గల  'దవ్వ '  వైపునకు

వ్యాసార్థ  దిశలో   అమర్చబడియున్న 

కణాముుల      అమరికను  'దవ్వ 

రేఖలు'   లేదా   'మెడ్యూల్లరీ  రేఖలు'  అని

అంటారు.
                        కాంబియమ్  పొర నుండి

బెండువైపునకు    ప్రతి   సంవత్సరము

ఒక  వలయమువలె   యేర్పడు

దారువలయములను 'వార్షిక

వలయములు'  (Annual  rings )

లేదా  ' ఆన్యుయల్  రింగులు  '  అని

అంటారు.  వృక్షకాండమును   అడ్డముగా

కోసినపిదప     ఈ     రింగుల   సంఖ్యను 

లెక్కించుకొని    వృక్షము   యొక్క

వయస్సును    నిర్ణయించుకొనవచ్చును.

వృక్షము పెరిగిన    కొలది    మెత్తని

రసదారువు   గట్టిగా   మారుతూ   గట్టి  కర్ర

భాగము   పెరుగుతుంది.  

8. కలప నిచ్చే వృక్షములు రకములు

 కలప నిచ్చే వృక్షములను రెండు రకములుగా విభజించవచ్చును.
 ( i ).బహిర్జాత   వృక్షములు ( Exogenous  trees ):---ఈ రకపు

వృక్షములు    పెరిగినప్పుడు   చెట్టు

కాండము    వెలుపలి    వైపుకు   అనగా

అడ్డంగా   పెరుగుతుంది .   క్రమక్రమంగా

పెరిగే    కాండపు    పెరుగుదలను

సూచించే   ఏకకేంద్ర   వృత్తాకారపు

రింగులు    కాండంలో    ఏర్పడతాయి.

కాండాన్ని   ఖండించి నప్పుడు   ఈ

రింగులు   స్పష్టంగా   కనబడతాయి .ఈ

రింగులను  'వార్షిక వలయాలు'   లేదా

ఆన్యులర్   రింగులు  అని  అంటారు.  ప్రతి

ఒక్కరింగు   ఒక   సంవత్సరపు

పెరుగుదలను   సూచిస్తుంది.  ఈ  రకపు

వృక్షములను    తిరిగి   రెండు రకములుగా

విభజించవచ్చును.

 (a ) సతత  హరిత   వృక్షములు(

Evergreen Trees ) :--- ఇవి

మృదువైన  కాండము ను  కలిగి

ఉంటాయి.  వీటినే  కోనిఫర్  వృక్షములు

అని అంటారు.  వీటికి   ఉదాహరణగా

దేవదారు ,  అక్రోటు ,  ఫర్   వృక్షములను

పేర్కొనవచ్చును.

( b)   వెడల్పైన   ఆకులు   గలవృక్షములు

(Broad leaf trees ):--- ఇవి గట్టి 

కర్రను   కలిగి   ఉండి   వివిధ   కలప

సామాగ్రిని  తయారు చేయుటకు  విరివిగా

ఉపయోగపడతాయి. వీటినే   ఆకులు

రాల్చెడి  వృక్షములు  ( Decidous trees)

అని అంటారు.  మద్ది , టేకు ,  సింధూర ,

అశోక వృక్షములు   ఈ రకమునకు చెందినవి .

2. అంతర్జాత   వృక్షములు (

Endogenous  trees ) :--- ఈ 

వృక్షములు   పొడవుగా

 వృద్ధిచెందుతాయి.  వృక్షము 

పెరిగినప్పుడు   క్రమక్రమంగా   ఒక వరుస

పై మరియొక వరుస  అమర్చబడ్తూ

అడ్డంగా   కాకుండా   లోపలి వైపునకు

వరుసలు  అమర్చబడతాయి . ఈ విధంగా

చెట్టు  పెరిగే  క్రమాన్ని  బట్టి  కణములు

(Cells ) ఏర్పరచబడుతూ   చెట్టు

పెరుగుతుంది. తాడి,  ఈత , వెదురు

వృక్షములు    ఈ   రకమునకు  చెందినవి.

Monday, September 2, 2019

7. కలప జాతి వృక్షములు

  కలప జాతి వృక్షములు    
1. ఉపోద్ఘాతము :—
               చెట్టు   నుండి లభ్యమగు

 కర్రను   గృహ   నిర్మాణంలో మరియు 

ఇతర   ఉపయోగకర   సామాగ్రిని 

తయారు   చేయుటకు ఉపయోగకరంగా 

ఉండుటకు   గాను  దానిని    కలపగా 

మార్చుతారు   బరువు తక్కువగా   ఉండి 

తగినంత   పటిష్టత కలిగియుండుట 

మూలముగా   వివిధ ఇంజినీరింగ్ 

పరికరములను   తయారు చేయుటకు 

గాను   ఇతర లోహముల కన్నా   కలప

ఎక్కువగా   వాడబడుతున్నది .కలపను 

కావలసిన    ఆకారము   లోనికి

మార్చుటకు   గాను    తేలిక    రకమైన

పనిముట్ల   ద్వారా    సులభముగా

సాధించవచ్చును.    కలపతో    చేసిన

వస్తువులను   జాగ్రత్తగా   వాడుకొనిన

యెడల    అవి   చాలా   కాలం   మన్నికగా

ఉంటాయి .

2.  మేలురకపు    కలపకు    ఉండవలసిన గుణములు:— 
               
      కర్ర సామాగ్రిని తయారు

చేయుటకు   ఉపకరించు   మేలు రకపు

కలపను    ఎన్నుకొనుట కు   గాను   అనేక

వివరాలను    పరిశీలించవలసి  ఉంటుంది.

కలప    గట్టితనం,   మన్నిక ,  బరువు,  కర్ర

యందు   అమర్చబడిన   కణములు

మొదలగు   సాధారణ   విషయాలే

కాకుండా   ఒక్కసారి   దాని   అగ్ని  నిరోధక

గుణము    త్వరగా  నునుపు  చేయ

బడుతుందా   లేదా   అన్న    విషయం

మొదలగు    ఇతర    వివరాలను

పరిశీలించి    తగిన    కలపను

ఎన్నుకొనవలసిన   ఉంటుంది.   సాధారణ

వడ్రంగి   పనికి   గాను   ఉపయోగపడే

కలప   ఈ   క్రింది   గుణములను   కలిగి

ఉండాలి .

1. సరి యైన    వార్షిక వలయముల

(Annual  rings ) ను   కలిగి   ఉండి

రంపముతో   కోయునప్పుడు   రంపము

పండ్లు    నిరోధించ   బడకుండా   ఉండాలి.

2. కలపలో    తేమ    ఉండకూడదు .

3. కలపలో   ఉండే    సాధారణ 

లోపములు    కలిగి    ఉండరాదు.

4. కలప   ' సీజనింగ్ '  చేయబడి ఉండాలి

5 .కలపను    కొట్టినప్పుడు    శ్రావ్యమైన

శబ్దము  నివ్వగలగాలి.

3. కలప  నిచ్చే   వృక్షములు :—
     
మేలు రకపు     కలప    ప్రతి

వృక్షమును   నుండి   లభించదు .  కొన్ని

ప్రత్యేక   వృక్షముల   నుండి   లభించు కర్ర

మాత్రమే  మేలు  రకపు  కలపకు 

కావలసిన  గుణములను  కలిగి ఉంటుంది.

కలప  నొసగే   వృక్షము   పొడవుగా ఉండి,

లావైన  కాండమును   కలిగి   ఉండి

మేలురకమైన  కర్ర   నివ్వగలిగి  ఉండాలి.

Thursday, August 29, 2019

6.కర్ర సామాగ్రి తయారు చేయు పనియందు పాటించవలసిన వివిధ రక్షక సూత్రములు .


కర్ర   సామాగ్రి   తయారు చేయు  పని



యందు   పాటించవలసిన   వివిధ రక్షక 



సూత్రములు   క్రింద   సూచింపబడినవి.



.పని చేయు వ్యక్తి   బిగువైన   దుస్తులు 



ధరించాలి .  ముఖ్యంగా యంత్రము ల పై 



పని   చేయునప్పుడు   వదులైన  



 దుస్తులను ధరించాలి .పొడుగు చేతుల 



చొక్కాలు    ధరించిన    యెడల   చొక్కా 



చేతులను    మోచేతుల   వరకు 



మడుచుకొనవలెను .   పనిని 



ప్రారంభించుటకు   ముందు   ఉంగరము 



,చేతి గడియారం    మొదలగు   వాటిని 



తీసి   వైచి   పని   ముగించిన   పిదప 



మరల   వాటిని   ధరించాలి .  



2. బట్టలు   మురికి కాకుండా   ముందు 



వైపు కట్టుకునే   గుడ్డను   ధరించాలి.దీనిని 



"ఆ ప్రాన్" అంటారు   



3.కర్ర    సామాగ్రిని   పెద్ద   ఎత్తున 



తయారు  చేయు   పరిశ్రమలో 



పనిచేయునప్పుడు    కాళ్లకు బూట్లు లేదా  



 తోలుతో    చేయబడిన   పాదరక్షలు 



ధరించాలి    ఉత్తి కాళ్లతో   లేదా రబ్బరు 



చెప్పులతో    పని చేయరాదు  . 



4.  పనిచేయునప్పుడు    దానిపైనే 



మనస్సును   కేంద్రీకరించాలి.   ఇతర 



విషయములను   ఆలోచిస్తూ   కర్ర   పని 



చేయుట  వలన   హాని   జరుగవచ్చును 



.5.తగినంత    వెలుతురు లేని 



ప్రదేశములలో    పని చేయరాదు.   



6. పనిముట్లను    ఉపయోగించే   



విధానము   పూర్తిగా   తెలుసుకున్న 



పిదపనే   వాటిని   ఉపయోగించాలి 



.చేయవలసిన   పనికి   ఉపయోగపడే 



సరియైన   పనిముట్టును   ఆ పనికి 



ఉపయోగించాలి .  తప్పుడు పనిముట్లను 



ఉపయోగించిన ఎడల    ఆ   పనిముట్లు 



మరియు   కర్ర   వస్తువు   దెబ్బతినుట 



జరుగుటయే   కాకుండా   దానిని 



ఉపయోగించు   వ్యక్తికి   హాని 



జరగవచ్చును .



7. గ్రైండింగ్   ,  డ్రిల్లింగ్   మొదలగు 



పనులకు   మరియు   ఉలిని 



ఉపయోగించినపుడు   కండ్లకు   రక్షక  



అద్దములు ( safety  goggles)   



ధరించాలి..



8. ఉలీ , సుత్తి   మొదలగు   పనిముట్లను 



ఉపయోగించినప్పుడు   చేతికి   చెమట 



చమురు   మరియు   ఇతర   మలిన 



పదార్థాలు    లేకుండా    శుభ్రంగా 



తుడుచుకోవాలి.    లేని  యెడల   ఇవిచేతి 



నుండి జారి పోయి దూరంగా ఎగిరి 



పడవచ్చును.   



9. పనిముట్లను ముఖ్యంగా   వాటి 



హ్యాండిల్  



 భాగములను   శుభ్రంగా ఉంచాలి . గ్రీజు 



నూనె    మరియు    ఇతర   మలిన 



పదార్ధాలు   లేకుండా   శుభ్రపరచాలి.  



10. వదులుగా   ఉన్న   హ్యాండిల్ ను 



సరిగా   బిగించుకొనిన    పనిముట్లను 



ఉపయోగించుకోవాలి .  పగుళ్లు ఏర్పడిన 



హ్యాండిల్నను    దాని స్థానంలో    క్రొత్త 



దానిని   అమర్చుకోవాలి.



11.  ఖండింపబడిన   కర్ర   పొట్టును 



తొలగించుటకు   బ్రష్ ను 



ఉపయోగించవలెను.   చేతితో   తొలగింప 



రాదు .



12.వస్తువును  ఖండించుటకు, కోయుటకు 



ముందు అది   కదలకుండా 'వైస్' లో 



దానిని   గట్టిగా   పట్టుకొని 'వైస్ "లో



వస్తువు 



వదులుగా   లేకుండా   గమనించుకుని పని 



ప్రారంభించాలి. 



13. పనిముట్ల   సైజును   గమనించి   సరి 



అయిన   సైజు   గల   పనిముట్లు  



 మాత్రమే ఉపయోగించాలి .



14 .యంత్రముల పై   పని  చేయునప్పుడు 



వస్తువు   లేదా   పనిముట్లను   యంత్రంపై 



సరిగా   బిగించాలి.  తగిన   రీతిలో  తగిన 



పొడవు తో   సరి   అయిన   పట్టుతో  



 వీటిని    బిగించిన   పిదపనే    పనిని 



ఆరంభించాలి. 



15. యంత్రము   పనిచేయు   వివిధ 



వేగములను   గమనించుకుని  



అవసరమగు   వేగముల తో   దానిని 



నడుపుకొని   పని   చేసుకోవాలి.



16. యంత్రం   పని  చేయునప్పుడు 



అనగా   వస్తువు   లేదా   పనిముట్టు 



కదిలినప్పుడు    కొలతలు  తీసుకొనరాదు. 



యంత్రమును  కొలతలు  తీసుకుని 



అవసరమైనచో   తిరిగి   యంత్రమును పని   చేయించవలెను.