11. కాంబినేషన్ సెట్ ( combination set) :
ఇది ఎంతో ఉపయోగకరమైన పనిముట్టు. దీని యందు ట్యైస్క్వేర్ కోణమానిని ,
స్పిరిట్లలెవె , స్కేల్ , స్క్రైబర్ అనబడున ఐదు పనిముట్లు అమర్చబడి ఉండి
ఆ పనిముట్లు విశిష్టతను యిది కలిగియుంటుంది. పటములో చూపినట్లుగా యిది
బ్లేడు, స్క్వేర్ హెడ్, కోణమానిని కలిగిన హెడ్, సెంటర్ స్క్వేర్ హెడ్, అనబడు
నాలుగు భాగములను కలిగియుంటుంది. మిగిలిన మూడు భాగములు బ్లేడుకు
తగిలించబడి ఉంటాయి. సన్నని బ్లేడు ఋజువుగా ఉండి దాని పై కొలతలు
గుర్తించబడి వుండుట మూలముగా స్కేలువలె ఉపయెగపడుతుంది. దీని
వెనుకభాగమున మధ్యగా పొడవు దిశలో ఒక చీలిక చేయబడియుంటుంది. బ్లేడును
తగిలించిన ప్రతి హెడ్ భాగము మేకులాంటి కడ్డీని కలిగియుండి, ఆ కడ్డీ బ్లేడుకు
వెనుకవైపున గల చీలికలో అమర్చబడి యుంటుంది. మేకును చీలికలో
కదిలిస్తూ హెడ్ ను బ్లేడుపైన జరపుకోవచ్చును. ఈ విధంగ జరుపుకొన్న హెడ్ ను
కావలసిన స్థానములోనికి తెచుకున్న పిదప హెడ్ పైన గల స్క్రూను బిగించుట
ద్వారా అది బ్లేడుకు బిగింపబడి యుంటుంది . కోణమానిని కలిగియున్న హెడ్
మరియు స్క్వేర్ హెడ్ సాధారణంగా స్పిరిట్ లెవెల్ ను కలిగియుంటాయి.
స్క్వేర్ హెడ్ కొనభాగమున 'స్క్రైబర్' అనబడు గుర్తించెడి సాధనము
అమర్చబడియుంటుంది. స్క్వేర్ హెడ్ పైన అమర్చిన స్క్రూను వదులుచేసి
దానిని బ్లేడుకు లంకోణములో లేదా తగిన కోణములో అమర్చుకొని ట్రైస్క్వేర్
లేదా మీటర్ స్క్వేర్ లాగా ఉయోగించవచ్చును.
12. గుర్తులు పెట్టుటకు ఉపకరించు చాకు
(marking knife) :--
దీని ద్వారా కర్రవస్తువుపై రేఖలుగీయుట మరియు యితర గుర్తులు
పెట్టుట చేయవచ్చును. ఇది ఉక్కుతో చేయబడి ఒకవైపు పదునైన మొన
రెండవ చివర ఏటవాలుగా యున్న పదునైన అంచును కలిగియుంటుంది. దీని
ద్వారా గుర్తులను సరిగ్గా మరియు ఖచ్చితంగా పెట్టుకొనవచ్చును. 'మార్కింగ్
చాకు' అంటారు.
13. గుర్తులు పెట్టుటకు ఉపకరించు సాధనము:---- కర్ర వస్తువు
యొక్క యేదైన ఒక అంచుకు సమాంతరగా గీతను గుర్తించుటకు
పనికివచ్చు యీ సాధనమును 'మార్కింగ్ గేజి' (marking gauge)అని
అంటారు. ముఖ్యమైన పనిముట్టుగా పరిగణింపబడే మార్కింగ్ గేజి
దీర్ఝచతురస్రపు దిమ్మ రూపమును కలిగియుండి గట్టి కర్రతో
చేయబడియుంటుంది. దీని అవచ్చేదము (cross section) చతురస్రాకారం
లేదా దీర్ఘచతురస్రాకారమును కలిగియుండి దీని అడుగు భాగమున ఒక
చివర ఉక్కుతో చేయబడిన పిన్నును కలిగియుంటుంది. ఈ పిన్నుకు గల
పదునైనమొన కర్రవస్తువు మీద గుర్తులు పెట్టుటకు వుపకరిస్తుంది. పిన్ను
పొడవు సుమారు 2 మి.మీ. ఉంటుంది.' హెడ్' అనబడెడి మరియొక కర్ర
పలకకు మధ్యలో చేయబడిన చదరపు ( లేదా దీర్ఘచతురస్రపు) రంధ్రములో
పిన్నుకు తగిలిన 'దిమ్మ' (stem) వదులుగా అమర్చబడి యుంటుంది. హెడ్
పైన అమర్చిన ఒక స్క్రూను చేతితో త్రిప్పుకొని వదులుపరచుట ద్వారా
దిమ్మ పైన హెడ్ ను కదల్చి జరుపుకొనవచ్చును. ఈ విధముగా జరుపుకొనుట
వలన పిన్నుకు, హెడ్ కు మధ్యగల దూరమును మార్చుకొని ఎక్కువ లేదా
తక్కువ చేసుకొనవచ్చును. తిరిగి స్క్రూను బిగించుట ద్వారా హెడ్, దిమ్మపైన
కదలకుండా యుంటుంది. దీనిని ఉయోగించినపుడు ముందుగా పిన్నువైపు
గల హెడ్ ముఖ భాగమును (face) కర్రవస్తువు అంచుకు తగులునట్లు నొక్కి
పెట్టాలి . చేతితో హెడ్ భాగమును పట్టుకొని, పిన్ను పదునైన మొనభాగము
కర్రవస్తువు ఉపరితలము పై తగులునట్లు నొక్కి పెట్తూ, హెడ్ ను ముందునకు
కదిల్చినపుడు పిన్ను ద్వారా కర్రవస్తువు పై సరళరేఖ గుర్తించబడుతుంది.
అయితే హెడ్ ను ముందునకు కదిలించినపుడు దాని ముఖ భాగము
కర్రవస్తువు అంచుకు ఎప్పుడూ తగులునట్లుగా నొక్కిపెట్తూ వుండాలి. అప్పుడే
గీచిన సరళరేఖ కర్రవస్తువు ఆ అంచుకు సమాంతరంగా వుంటుంది. పిన్నుకు,
హెడ్ కు గల మధ్య దూరమును మారుస్తూ ఆ అంచుకు సమాంతరంగా
ఎన్ని సరళరేఖలైన గీయవచ్చు. మార్కింగ్ గేజి నుయోగించు విధానము
పటములో చూపబడింది.
14. రెండు పిన్నుల మార్కింగ్ గేజి :
దీనిని 'మోర్ టైస్ గేజి' (mortise gauge) అని అంటారు.
దీనితో ఒకేసారి రెండు సమాంతర రేఖలను గీయవచ్చును. ఇది
కూడా మార్కింగ్ గేజ్ వలనే యుండి ఒక పిన్నుకు బదులు రెండు
పిన్నులను కలిగియుంటుంది. వీటిలో ఒక పిన్ను దిమ్మకు బిగింపబడి
స్థిరంగా యుంటుంది. దిమ్మకు అడుగుభాగామున గల
దీర్ఘచతురస్రాకారపు చీలికలో కదిలెడి కర్రపలక ఒకటి
అమర్చబడియుంటుంది. ఈ కర్రపలకకు మొదటి పిన్ను వున్నదిశలో
రెండవ పిన్ను బిగింపబడియుంటుంది. కదిలెడి కర్ర పలకను
కదిలించినపుడు యీ రెండవ పిన్ను కదులుటచే దానిని 'కదిలెడి
పిన్ను' (movable pin) అని అంటారు. కర్రపలకను దిమ్మలో
కదలకుండా బిగించుటకుగాను కర్రపలక రెండవ చివర చేతితో
త్రిప్పుకొను స్క్ర ఒకటి అమర్చబడియుంటుంది. దీనిని
వదులుచేసుకొని దిమ్మలోని చీలికలో కర్రపలకను కదల్చి రెండు
పిన్నుల మధ్య దూరమును మార్చుకొనవచ్చును. స్క్రూను బిగించుట
ద్వారా రెండు పిన్నుల మధ్యదూరము మారకుండా స్థిరంగా
వుంటుంది. మార్కింగ్ గేజి వలనే దీని హెడ్ ను కర్రవస్తువు అంచుకు
నొక్కి పెట్తూ దీనిని ముందుకు కదిలించుట ద్వారా ఆ అంచుకు
సమాంతరంగా రెండు సరళరేఖలు ఒకేసారి గుర్తింపబడతాయి. దీని
నుపయోగిస్తూ సన్నని దీర్ఘచతురస్రాకారపు చీలికలను చేయుటకు
సమాంతర రేఖలను గీయుటకు వీలుంటుంది. ఈ చీలికలను 'మోర్
టైస్ చీలికలు' (morertise grooves) అని అంటారు. కాబట్టే ఈ
గేజిని 'మోర్ టైస్ గేజి' అని పిలుస్తారు.
15. సన్నని ఖండించెడి గేజి (cutting gauge) :
ఇది కూడా మార్కింగ్ గేజి ఆకారంలో యుండి
అదేవిధంగా పని చేస్తుంది. అయితే దీనిలో కర్రదిమ్మకు బిగించిన
పిన్నుకు బదులు ఉక్కుతో చేసిన పదునైన బ్లేడు (cutter)
దిమ్మకు బిగించబడియుంటుంది. మార్కింగ్ గేజి వలె ఉయోగిస్తూ
కర్రవస్తువు అంచు ఆధారంగా దీనిని ముందుకు కదిలించినపుడు
ఆ అంచుకు సమాంతరగా కర్రవస్తువును పదునైన బ్లేడు
ఖండిస్తుంది. అయితే ఇది 3 మి.మీ. వరకు మందము గల సన్నని
కర్రవస్తువులను మాత్రమే కోయగలుగుతుంది. ఎక్కువ మందముగల
కర్రవస్తువులపై ఇది లోతైన కొలతలను యేర్పరుస్తుంది. సన్నని కర్రవస్తువు
యేదేని అంచుకు సమాంతరంగా ఆ వస్తువును ఖండి పాయలగా చేయుటకు ఇది
ఉపకరిస్తుంది. దీనిని 'కటింగ్ గేజి' అని పిలుస్తారు.
16.అవుట్ సైడ్ కాలిపర్స్ (outside callipers):
దీని ద్వారా కర్ర వస్తువుల
వెడల్పు, మందము మొదలగు కొలతలను కొలవవచ్చు. ఇది లోపలి
దిక్కుగా వంపు తిరిగిన రెండు భుజములను కలిగియుంటుంది. ఈ రెండు భుజముల పై భాగము ఒక పిన్ను ద్వారా కలపబడివుంటాయి. ఈ పిన్ను ఆధారముగా భుజములను కదిలిస్తూ వాటిని దగ్గరగా లేదా దూరంగా జరుపుకొనవచ్చును. వస్తువు మందమును కొలుచుటకుగాను ముందుగా యీ పనిముట్ల రెండు భుజములను బయటకు నెట్టుచు వాటి మధ్యదూరమును పెంచుకొని వీటి అడుగుభాగపు అంచుల మధ్యగా కర్రవస్తువును అమర్చి, ఆ భుజములకు దగ్గరగా వచ్చునట్లు నొక్కి పట్టాలి. దీని వలన భుజముల అడుగు అంచులకు కర్రవస్తువును రెండు వైపులా తగులునట్లు దగ్గరకు వస్తాయి. పిదప భుజముల మధ్యనుండి కర్రవస్తువును తీసివైచి, వాటి అడుగు అంచులను స్టీలురూలు పై గల కొలతలకు తాకునట్లుగా అమర్చి వాటి మధ్య దూరము కొలవాలి. ఈ కొలత కర్రవస్తువుయొక్క మందము లేదా వెడల్పును సూచిస్తుంది.
అవుట్ సైడ్ కాలిపర్సు రెండు రకములుగా లభ్యమగును. మొదటిరకపు సాధారణ కాలిపర్ పైన తెలిపినట్లు రెండుభుజములను కలిగియుండి వాటి పై భాగము వాషర్ల మధ్య వదులుగా అమర్చియుండుట మూలముగా సులభముగా కదలగలుగుతాయి. రెండవ రకమునకు చెందిన 'స్ప్రింగు కాలిపర్' పైన తెలిపినట్లుగా వదులైన ఆధారపు జాయింట్ కు బదులు గుండ్రముగా వంపుదిరిగిన స్ప్రింగును కలిగియుంటుంది. రెండు భుజములను కలుపుతూ అమర్చబడిన స్క్రూ పైన గల నట్టును త్రిప్పుకొని వీటి మధ్య దూరమును మార్చుకొనవలసి యుంటుంది
17.ఇన్ సైడ్ కాలిపర్స్ (Inside callipers )
కర్రవస్తువుయందు చేయబడిన రంధ్రములు, చీలికలు మొదలగువాటి లోపల కొలతలు (అనగా రంధ్రమయొక్క వ్యాసము, చీలిక వెడల్పు మొదలగునవి) తీసుకొనుటకు ఇది ఉపకరిస్తుంది. ఇది రెండు భుజములను కలిగియుండి వాటి అడుగు అంచులు వెలుపలి వైపుకు వంపు తిరిగి యుంటాయి. రెండు అంచులు రంధ్రములోపలి తలమునకు లేదా చీలిక వెడల్పును సూచించు యెదురెదురు తలములకు తగులునట్లుగా అమర్చి, పిదప దీనిని బయటకు తీసి స్టీలురూలు పైన అమర్చుట ద్వారా కొలతలను తెలుసుకొనవచ్చును. ఇది కూడా సాధారణ ఇన్ సైడ్ కాలిపర్ మరియు స్ప్రంగురకపు ఇన్ సైడ్ కాలిపర్ రెండు రకములుగా లభ్యమగుతుంది.
అభ్యాసము
1. కర్రవస్తువు పై చాపములను, వృత్తములను గుర్తించుటకు ఉపయోగపడెడి పనిముట్లను పేర్కొని, వాటిలో యేదేని ఒకదానిని గురించి వివరించుము.
2. వివిధ రకముల కొలబద్దలను పేర్కొని, నాలుగు మడతల స్కేలుపటమును గీచి దానిని వుపయోగించు విధానమును తెలుపుము.
3. 'ట్రైస్క్వ' పటమును గీచి దానిని వుపయోగించు విధానము తెలుపుతుంది.
4. 'బివెల్ స్క్వేర్' మరియు 'మీటర్ స్క్వేర్ 'ల మధ్యగల వ్యత్యాసము తెలిపి, బివెల్ స్క్వేర్ ను వుయోగించు విధానము తెలుపుము.
5. కాంబినేషన్ సెట్ పటమును గీచి, వివిధ భాగములను గుర్తించుము.
6.స్పిరిట్ లెవెల్ ను ఉపయోగించి విధానము తెలుపుము.
7. మార్కింగ్ గేజిని వుపయోగించు విధానము తెలుపుము.
8.మోర్ టైన్ గేజికి, మార్కింగ్ గేజికి మధ్యగల వ్యత్యాసమును తెలిపి, టైస్ గేజి పనిచేయు విధానమును వివరించుము.
9.అవుట్ సైడ్ కాలిపర్ ఉపయోగమును తెలిపి, వివిధ రకములు అవుట్ సైడ్ కాలిపర్స్ గురించి వివరింపుము.
10.ఇన్ సైడ్ కాలిపర్ ను ఉపయోగించు విధానమును వివరించుము.
No comments:
Post a Comment