ఉలి ( Chisel ) :
దీనితో కర్రను పొరలు, పొరలుగా ఖండించవచ్చును.
కర్రవస్తువును ఖండించి దానిలో వెడల్పైన చీలికలు, చదరపు
రంధ్రములు చేయుటకు యిది ఉపయోగపడుతుంది. పటము 4.18
లో చూపినట్లు యిది పొడవైన సమతల చతురస్రపు పలక
ఆకారముగల బ్లేడును కలిగియుంటుంది. ఇది మేలురకపు చెక్కతో
చేయబడి దీని ఒక చివరన సన్నని కడ్డీ ఆకారపు ' టాంగ్ ' (
Tong ) ను కలిగియుంటుంది. గట్టి కర్రతో చేయబడిన ' హాండిల్ '
నకు గల రంధ్రములో టాంగా అమర్చుకొనుట ద్వారా బ్లేడు
హాండిల్ నకు కలుపబడుతుంది. బ్లేడు రెండవ చివర అంచు
పదునైన మొనగా ఏర్పరచబడి యుంటుంది. పదునైన మొనగా
అంచు ద్వారా కర్రవస్తువును పెచ్చులు, పెచ్చులుగా
ఖండించవచ్చును. ఈ అంచును 'ఖండించెడి అంచు' ( Cutting edge
) అని అంటారు.
ఉలి సైజు దాని బ్లేడు వెడల్పు పైన ఆధారపడియుంటుంది.
బ్లేడు సైజుతో పాటు దాని ఆకారము మరియు దానిద్వారా
కర్రవస్తువును ఖండించెడి విధానము మొదలైన విషయములు
ఉలిని ఏ పనికి ఉయోగించాలో నిర్ణయించుటకు తోడ్పడుతవి.
వివిధ రకముల ఉలులు, వాటి నిర్మాణ వివరములు. వాటిని
యే పనులకు ఉపయోగించుకొనవలయునన్నది క్రింద
వివరించనైనది.
1. ఫర్మర్ ఉలి ( Firmer chisel )
ఇది మందమైన బ్లేడును కలిగియుండి ఉలి ద్వారా చేయబడు
అన్నిరకముల పనులను చేసుకొనుటకు ఉపయోగపడుతుంది. దీని
పదునైన అంచును కర్రపలకపై ఏటవాలుగా పెట్టుకొని హాండిల్ ను
చేతితో పట్టుకొని నొక్కిపెడ్తూ, హాండిల్ ను చేతితో గానీ, మాలెట్ (
కర్రతో చేయబడిన సుత్తె ) తో గాని కొట్టుట ద్వారా పదునైన అంచు
కర్రవస్తువులోనికి దిగబడుతుంది. దీని ద్వారా చదరపు,
దీర్ఘచతురస్రాకారపు చీలికలు, రంధ్రములు యేర్పరచవచ్చును. దీని
బ్లేడు వెడల్పు 5 మి.మీ. నుండి 50 మి.మీ. వరకు మరియు పొడవు
125 మి.మీ. దాకా యుంటుంది. బ్లేడు రెండు ప్రక్కల చదునుగా
యుండి పదునైన మొనవద్ద మాత్రము కోసుగా వుంటుంది. పదునైన
అంచుగల చూస్తే దీనిబ్లేడు దీర్ఘచతురస్రాకారంగా వుంటుంది.
2. బివెల్ ఆకారపు అంచుగల ఉలి ( Bevel edge chisel ) :-
ఇది కూడా ఫర్మర్ ఉలి సైజులోనే యుంటుంది. అయితే దీని
బ్లేడు క్రింది ఉపరితలము సమతలంగా వుండి వెడల్పు
ఎక్కువగా వుంటుంది. పై ఉపరితలము రెండు ప్రక్కల ఏటవాలుగా
యుండి మధ్యభాగము చదునుగా యుంటుంది. పటము 4.20.
పదునైన అంచువైపు నుండి చూచినపుడు ఇది ట్రెపీజియం
ఆకారమును కలిగియుంటుంది. సాధారణ ఫర్మల్ ఉలితో
పనిచేయుటకు కర్రవస్తువు మూలలయందు బివెల్ అంచు ఫర్మల్
ఉలి ఉపయోగపడుతుంది.
3. పేరింగ్ ఉలి ( Paring Chisel ) :-
ఇది కూడా ఫర్మర్ ఉలి లేదా 'బివెల్ అంచు ఫర్మల్
ఉలి' వలెనే చేయబడి ఎక్కువ పొడవును కలిగిన బ్లేడును
కలిగియుంటుంది. ఎక్కువ లోతుగల కర్రవస్తువులపై
పనిచేయునపుడు ఫర్మర్ ఉలి బ్లేడు పొడవు సరిపోనందున దీనిని
ఉపయోగించినపుడు దీని హాండిల్ ను చేతితో మాత్రమే నొక్కిపెడ్తూ
లేదా హాండిల్ పై అరచేతితో కొడ్తూ దీనితో మెల్లిగా
పనిచేసుకొనాలి. అంతేకాని దీని హాండిల్ పైన మాలెట్ తో
కొట్టరాదు. దీని బ్లేడు పొడవు 225 నుండి 800 మి.మీ. వరకు
మరియు వెడల్పు 5 నుండి 50 మి.మీ. వరకు వుంటుంది.
4. మోర్ టైస్ ఉలి ( Mortise Chisel ) :-
దీనిని భారీ పనులకు ఉపయోగిస్తారు. కర్రను లోతుగా (
ఎక్కువ మందముతో ) ఖండించినపుడు ఉలి పై ఎక్కువ భారము
పడుతుంది. అట్టి పరిస్ధితులలో ఉలిని ఉపయోగించినపుడు ఆ
భారము తట్టుకునే విధంగావుండాలి. అందుకుగాను బ్లేడు ఎక్కువ
మందముతో గల మోర్ టైస్ ఉలిని ఉపయోగిస్తారు. దీని పదునైన
అంచు కర్రవస్తువులోనికి ఎక్కువ లోతుతో చొచ్చుకొనిపోవుటకుగాను
దీని హాండిల్ ను ఎక్కువ శక్తితో కొట్టుటకుగాను కర్రతోచేసిన సుత్తె
బదులు సాధారణ సుత్తెను ఉపయోగిస్తారు. ఈ విధముగా
కొట్టినపుడు హాండిల్ దెబ్బతినిపోకుండా యుండుటకుగాను
హాండిల్ చివర ఇనుపతొడుగు బిగింపబడి యుంటుంది.
దీని బ్లేడు హాండిల్ వైపు ఎక్కువ మందమును పదునైన
అంచువైపు తక్కువ మందమును కలిగి యుండునట్లు ఏటవాలుగా
వుంటుంది. బ్లేడు వెడల్పు 3మి.మీ. నుండి 15మి.మీ. వరకు
వుంటుంది. కరర్రవస్తువుయందు చదరపు రంధ్రములను చేయుటకు
( వీటిని 'మోర్ టైస్' అంటారు ) గాను, కొద్దిలోతును కలిగిన
రంధ్రములను చేయుటకుగాను యిది ఎక్కువగా
వుపయోగపడుతుంది.
5. సాకెట్ ఉలి ( Socket Chisel ) :-
దీని బ్లేడు ఫర్మర్ బ్లేడువలెనేయుండి 20 మి.మీ. నుండి
50మి.మీ. వరకు వెడల్పును కలిగియుంటుంది. బ్లేడు రెండువైపులగల
ఉపరితలము చదునుగాయుండి బ్లేడు చివరిభాగము మాత్రము
పదునైన అంచును కలిగియుంటుంది. అయితే హాండిల్ కు బ్లేడు
బిగింపబడినచోట సాకెట్ అనబడు వెడల్పైన లోతైన గొట్టమును
కలిగియుండి దానికి హాండిల్ బిగింపబడి యుంటుంది.
ఆకారపు సాకెట్ ఉక్కు లేదా యిత్తడి లోహముతో చేయబడి
యుంటుంది. భారిపనులను చేయుటకు ఇది ఉపయోగపడుతుంది.
ఎక్కువ శక్తితో కూడిన దెబ్బను హాండిల్ పై కొట్టినపుడు హాండిల్
కర్ర విరుగుట లేదా దానియందు పగుళ్లు యేర్పడకుండా సాకెట్
ఉపయోగిస్తుంది. దీనిని ఫర్మర్ ఉలిని సాధారణ పనులకు కూడా
ఉపయోగించవచ్చు.
ఆకారమును కలిగియుంటుంది. దీని నుపయోగించి
కర్రవస్తువుయండు గుండ్రపు రంధ్రములను యేర్పరుచటుకు
వీలుంటుంది. కర్రవస్తువుకుగాను ఉపయోగపడెడి లేత్
యంత్రములపై దీనిని ఎక్కువగా వుపయోగిస్తారు. బ్లేడు
ఆకారమునుబట్టి రెండు రకముల ' గౌజులు ' వున్నాయి. వంపు
తిరిగిన ఆకారము బ్లేడులో తలముయందు పదునైన అంచు
కలిగిన గౌజును ' ఇన్ సైడ్ గౌజ్ ' ( Inside gouge ) అని అంటారు.
వంపు దిరిగిన బ్లేడు వెలుపలి తలముయందు అంచును
కలిగియున్న గౌజును ' అవుట్ సైడ్ గౌజు ' ( Outside gouge ) అని
అంటారు. ఇవి 5 మి.మీ. నుండి 25 మి.మీ. వరుకు వెడల్పును
కలిగియుంటాయి.
ఉలిని ఉపయోగించు విధానము :
కర్రవస్తువుయందు కణములు అమర్చబడిన దిశలోనే ఉలిని
ఉపయోగిస్తు వస్తువును ఖండించాలి. ఉలిని ఉపయోగించటానికి
ముందు వస్తువును ' ' మోర్ టైస్ ' యందుగానీ లేదా ఇతర
గట్టి ఆధారముతోగాని అమర్చి బిగించుకొనాలి. దీనివలన
ఉలిని పట్టుకొని సుత్తెతో దానిని కొట్టుటకు రెండు చేతులను
వుపయోగించవచ్చును.
కర్రవస్తువు పై ఉలికి గల పదునైన అంచుకుగల ఏటవాలు
తలము పైకి వుండునట్లుగా పెట్టుకొనాలి. ఉలి బ్లేడును
ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో హాండిల్ ను నొక్కి
పెట్టుట ద్వారా ఉలిని ముందుకు కదిలిస్తూ కర్రవస్తువు
ఉపరితలమును చదునుపరిచి నునుపుపరచవచ్చును.
పెద్దమొత్తములో కర్రవస్తువును ఖండించుటకు హాండిల్ పై మాలెట్
తో కొట్టవలసి వుంటుంది. ఉలితో వస్తువును ఖంఢించినపుడు
పనిచేయువ్యక్తి శరీరమునకు దూరముగా దానితో పనిచేయవలెను.
ఉలినుపయోగించుటకు ముందు దాని పదునైన అంచు
సరాగా వుందా లేదా గమనించాలి. పదునులేని అంచును '
గ్రైండ్ ' చేసుకొని పదును పెట్టుకొనాలి. ఉలి హాండిల్
పగుళ్ళను కలిగియున్న యెడల దానిని తొలగించి క్రొత్త
హాండిల్ ను అమర్చుకొనాలి. ఉలినుపయెగించుటకు ముందు
మలినపదార్థములు, గ్రీజు, నూనె మొదలగు యితర
పదార్థములను మరియు బ్లేడు పైన, హాండిల్ పైన లేకుండా
వాటిని శుభ్రపరుచుకొనాలి.
అభ్యాసము
1. ఱంపము పటమును గీచి వివిధ
భాగములను గుర్తించుము.
2. ఱంపమును ఉపయోగించుటకు ముందు
గమనించవలసిన వివరములను
పేర్కొనము.
3. కర్రవస్తువు యందు అమర్చబడిన
కణములకు అడ్డముగా కోయుటకు
వుపకరించు ఱంపము నొకదానిని
పేర్కొని, దానిని ఉపయోగించు
విధానము తెలుపుము.
4. రిప్ ఱంపము పటమును గీచి, అది
పనిచేయు విధానమును గురించి
వివరించుము.
5. ఱంపము సైజును యే విధముగా
పేర్కొందురు ? ఱంపమును పదును
పెట్టుకొను విధానమును వివరించుము.
6. ' బౌ ఱంపము ' పటమును గీచి,
వివిధ
భాగములను గుర్తింపుము.
7. కంపాస్ ఱంపము ఉపయోగమును
తెలుపుము.
8. కర్రవస్తువుయందు వంపు తిరిగిన
దిశలో ఖండించుటకు ఉపయోగపడెడి
వివిధ ఱంపమును పేర్కొని, వాటిలో
ఒకదానిని వివరింపుము.
9. ' ఉలి ' యొక్క పటమును గీచి, దాని
వివిధ భాగములను గుర్తించుము.
10. ఉలి సైజును యేవిధముగా పేర్కొందురు?
ఉలిని ఉపయోగించెడి విధానము
తెలుపుము.
11. ' మోర్ టైస్ ఉలి ' ని ఉపయోగించు
విధానమును తెలుపుము.
12. ' గౌజ్ ' మరియు ' ఉలి ' కి గల
భేదములను వివరించుము.
రెండురకముల గౌజుల పేర్లను పేర్కొని,
వాటి మధ్యగల భేదములను
వివరింపుము.
No comments:
Post a Comment