కర్రవస్తువు ఉపరితలమును సమపరచెడి పనిముట్లు
కర్రవస్తువు ఉపరితలము పైన గల ఎగుడుదిగుడులను తొలగించి దానిని
సమపరచి చదునుగా చేయుటకుగాను ఉపకరించు పనిముట్టును ' చిత్రిక ' లేదా
' ప్లేన్ ' ( Plane ) అని అంటారు. దీని ద్వారా కర్రవస్తువు ఉపరితలమును
నునుపుపరుచుట కూడా సాధ్యపడుతుంది. కర్రసామాగ్రిని
తయారుచేయుపనియందు వుపయోగపడెడి వివిధ ప్లేనులను గురించి క్రింద
వివరించనైనది.
1. జాక్ ప్లేన్ (Jack plane ):-
దీనితో కర్రవస్తువు ఉపరితలమును సమపరచవచ్చును. అయితే ఇది
వస్తువు ఉపరితలమును నునుపుపరచజాలదు. కాబట్టి ఎక్కువ
నునుపుదనము అవసరము లేని సాధారణ పనులకు ఇది ఎక్కువగా
వాడబడుతుంది. ఇది కర్రతో గాని, లోహముతోగాని చేయబడి వుంటుంది.
కర్రతో చేయబడిన జాక్ ప్లేన్ యొక్క బాడీ ( Body ) దీర్ఘ
చతురస్రాకారపు దిమ్మ ఆకారములో గట్టి కర్రతో చేయబడి వుంటుంది.
దీనిని 'స్టాక్ ' కర్రతో చేయబడిన జాక్ ప్లేన్ ( Stock ) అని అంటారు.
దీని అడుగు భాగము నునుపుగా చేయబడి యుంటుంది . దీనిని ' సోల్ ' (
Sole ) అని అంటారు. ఈ దిమ్మకు వెనుకవైపునగల ఒక రంధ్రముయందు
కర్రతో చేయబడిన హాండిల్ అమర్చబడి యుంటుంది. దిమ్మకు
మధ్యభాగములో గల వెడల్పైన చీలికలో కర్రను ఖండించుటకు
ఉపయోగపడు బ్లేడు అమర్చబడి యుంటుంది. దీర్ఘచడతురస్రాకారపు పలక
ఆకారపు బ్లేడు అడుగుభాగము పదునైన అంచును కలిగియుంటుంది. దీనికి
ఆధారముగా వెనుకవైపున మరియొక దీర్ఘచతురస్రాకారపు పలక అదే చీలికలో
అమర్చబడి యుంటుంది. ఈ రెండు పలకలు మేలురకమైన పోత యినుము
( Cast steel ) తో చేయబడి వుంటాయి. పటములో చూపినట్లుగా ఆధారపు
పలకకు ముందుగా బ్లేడును అమర్చి ఏటవాలుగాయున్న తలములతో కర్రతో
చేయబడిన వెడ్జ్ ( Wedge ) ను బ్లేడుకు ముందు భాగములో చీలికలోనికి
దింపుట ద్వారా బ్లేడు, ఆధారపు పలక కదలకుండా చీలికలో బిగింపబడతాయి.
బ్లేడు, ఆధారపు పలక దిమ్మ అడుగుభాగమునకు సుమారు 45॰ కోణములో
యుండునట్లు అమర్చబడి వుంటాయి. వెడ్జ్ ను, బ్లేడును మరియు ఆధారపు
పలకను కలుపుతూ స్క్రూ ఒకటి అమర్చబడి యుంటాయి. ఆధారపు పలకకు
అమర్చబడిన నట్టుయందు స్క్రూ బిగింపబడి యుంటుంది.
దీనివలన వెడ్జ్, బ్లేడు మరియు ఆధారపు పలక ఒకే భాగంగా కలపబడి
వుంటాయి. వెడ్జ్ ను కావలసినంత మేరకు చీలికలోనికి దింపుకొని స్కూను
బిగించుటవలన బ్లేడును కావలసిన కోణములో అమర్చుకొనవచ్చును.
ఆధారపుపలక అడుగు అంచుభాగమునండు బ్లేడు పదునైన అంచు ఎంత
ఎక్కువ పొడవూగా అమర్చాలి అన్న విషయము చదునుచేయవలసిన
కర్రవస్తువు గట్టిదనాన్నిబట్టివుంటుంది. మెత్తని సున్నితపు కర్రవస్తువుకు యీ
పొడవు 3 మి.మీ మరియు గట్టి కర్రవస్తువుకు 1.5 మి.మీ. వుండాలి. కర్రతో
చేయబడిన జాక్ ప్లేన్ సుమారు 350 మి.మీ. నుండి 425 మి.మీ. పొడవులో
లభ్యమగుతున్నది. దీని బ్లేడు వెడల్పు 50 నుండి 75 మి.మీ. వరకు వుంటుంది.
లోహముతో చేయబడిన బాడీనికలిగియున్న జాక్ ప్లేన్ కన్నా ఎక్కువ
కాలము మన్నికగా వుండుటయే కాకుండా చదునుపరచెడి ఉపరితలమునూ
ఎక్కువుగా నునుపుపరుస్తాయి. ఇది పోతయిన లేదా గన్ మెటల్ (Gun metal )
తో చేయబడిన చట్రము లేదా బాడిని కలిగియుండి దానికి వెనుక
భాగమును కర్రతో చేయబడిన హాండిల్ ను కలిగియుంటుంది. ఒక చేతితో
హాండిల్ ను, రెండవ చేతితో మేకును పట్టుకొని కర్రవస్తువు ఉపరితలము పై
దీనిని నొక్కిపెట్తూ ముందునకు కదిలించాలి. ఇది 125 మి.మీ. నుండి 250
మి.మీ. వరకు పొడవును కలిగియుండి బ్లేడు వెడల్పు 30 నుండి 60 మి.మీ.
వరకు కలిగియుంటుంది.
2. ట్రైయింగ్ ప్లేన్ ( Trying plane ) :
ఇది జాక్ ప్లేన్ వలనే యుండి ఎక్కువ పొడవును కలిగియుంటుంది
ఎక్కువ విస్తీర్ణముగల ఉపరితలమును చదునుపరుచుటకు ఇది ఉపకరిస్తుంది.
దీని బ్లేడు అడుగుభాగమును తగినంత పొడవుతో అమర్చుకొని కర్రవస్తువు
ఉపరితలాన్ని సన్నని పొరలుగా ఖండిస్తూ వస్తువు ఉపరితలమును ఎక్కువ
నునుపు పరచ్చవచ్చును. దీని పొడవు 550 మి.మీ. నుండి 650 మి.మీ. వరకు
వుండి దీని బ్లేడు 60 మి.మీ వరకు వెడల్పును కలిగియుంటుంది.
3. ఎక్కువుగా నునుపు పరచెడి ప్లేన్ (Smoothing plane ) :
ఇది కూడా జాక్ ప్లేన్ వలెనే యుంటుంది. జాక్ ప్లేను మరియు
ట్రైయింగ్ ప్లేనుల నుపయోగించిన పిదప దీని నుపయోగించి చదును
పరచబడిన వస్తు ఉపరితలమును ఎక్కువ నునుపుగా చేసుకొని మెరుగు
పట్టుకొనవచ్చును. దీని పొడవు 200 మి.మీ. నుండి 250 మి.మీ. వరకు
నునుపుపరెచెడి ప్లేన్ నుండి దీని బ్లేడు 70 మి.మీ. వెడల్పును
కలిగియుంటుంది. దీనికి హాండిల్ ఉండదు. బాడిని చేతితో పట్టుకొని
దీనిని ముందుకూ వెనుకకూ కదిలించుట ద్వారా దీని నుపయోగించాలి.
4. రిబేట్ ప్లేన్ ( Rebate plane ):
దీనియందు ఆధారపు పలక వుండడు. అడుగుభాగమును పదునైన అంచుగల
బ్లేడు వెడ్జ్ ద్వారా ప్లేన్ కుగల బాడియందు బిగింపబడియుంటుంది. దీని
నుపయోగించి కర్రవస్తువునకు ఒకవైపు అంచుపై కొద్ది మందముతో కర్రను
తొలగించి, ఆ అంచుపై సన్నని మెట్టు ఆకారమును పొందవచ్చును. ఇదే
విధంగా రెండవ కర్రవస్తువు అంచుయందు కూడ మెట్టు నేర్పరచి, ఈ
రెండు మెట్లను ఒకదానితో నొకటి తగులునట్లుగా ఒకదానిపై ఇంకోకటి
అమర్చుట ద్వారా ఆ కర్రవస్తువులను కలుపుకొనవచ్చును. కర్రవస్తువు
అంచుయందు యేర్పడిన మెట్టు ఆకారమును ' రిబేట్ ' అనీ, దీని ద్వారా
రెండు కర్రవస్తువునులను కలుపుకొనుటను ' రిబేటింగ్ ' అనీ అంటారు.
తలుపులు, కిటికీలలో అద్దములు అమర్చుటకు ' రిబేటింగ్ ' ఉపయోగపడుతుంది
. ఈ ప్లేన్ బ్లేడు రెండు వైపులా పదునైన అంచును కలిగియుంటుంది.
5. ప్లౌ ప్లేన్ ( Plough plane ):
దీని ద్వారా కర్రవస్తువుయందు వివిధ ఆకారముల మరియు వివిధ సైజుల
చీలికలు యేర్పరచవచ్చును. ఒక కర్రవస్తువుయందు ఈ విధముగా చీలిక
యేర్పరచి, రెండవ వస్తువుయందు చీలిక సైజును కలిగిన పొడిగింపబడిన
మెట్టు ( Projection ) ను యేర్పరచి, చీలికలో దానిని అమర్చుట ద్వారా యీ
రెండు కర్రవస్తువులను కలుపుకొనవచ్చును. తలుపులు మరియు కిటికీల
చట్రములకు కర్రపలకలను బిగించుటకు యీ విధానము వుపయోగపడుతుంది.
ప్లౌ ప్లేన్ ద్వారా కర్రయందు కణములు ( Grains ) అమర్చబడిన దిశలో
చీలికలను యేర్పరచవచ్చును. దీనిచే చేయబడు చీలిక లోతును
క్రమబద్ధము చేసుకొనుటకు గాను దీని బాడీకి ' డెప్త్ గేజి ' ( Depth gauge ) అను
పరికరము అమర్చబడి యుంటుంది. బాడీకిపైన అమర్చబడిన స్క్రూను
చేతితో త్రిప్పుకొనుట ద్వారా డెప్త్ గేజిని పనిచేయించుకొనవచ్చును. దీనిచే
చేయబడు చీలిక వెడల్పు, దీని బ్లేడు వెడల్పుపై ఆధారపడియుంటుంది.
వివిధ వెడల్పులతో చీలికలను పొందుటకుగాను యీ ప్లేన్ తోపాటు 3 నుండి
15 మి.మీ. వరకు వెడల్పుగల 8 లేక 9 బ్లేడులు సప్లై చేయబడతాయి. కావలసిన
బ్లేడును ప్లేను బాడీలో అమర్చుకొని తగినంత వెడల్పుగల చీలికను
కర్రనస్తువుయందు పొందవచ్చును. ఈ ప్లేను ద్వారా 30 మి.మీ. వరకు లోతుగల
చీలికలను యేర్పరచవచ్చును.
6. రూటర్ ప్లేన్ ( Router plane ):
ఱంపము, ఉలి మొదలగు పనిముట్ల ద్వారా కర్రవస్తువుయందు
యేర్పరచబడిన చీలికల లోతును ఎక్కువచేసి, చీలికల అడుగుభాగమును
సమపరుచుటకుగాను యిది ఉపయోగపడుతుంది. దీని బ్లేడు 3 మి.మీ. నుండి 12
మి.మీ. వరకు వెడల్పును కలిగియుంటుంది.
7. స్పోక్ షేవ్ ( Spoke shave ):
ఇది రెండు ప్రక్కల రెండు హాండిల్ లను కలిగియుంటుంది. ఈ ప్లేను
ద్వారా వస్తువుయొక్క వంపు దిరిగిన ఉపరితలమును నునుపుపరచుట
సాధ్యపడుతుంది. ఉబ్బెత్తుగాయున్న లేదా లోతుకలిగియున్న
వట్రుతలములను లేదా దగ్గర దగ్గరగా వంపుదిరిగిన అంచులుగల వస్తువు
వట్రుతలములను నునుపుపరచుటకు యిది పనికివస్తుంది. దీనిని రెండు
చేతులతో పట్టుకొని కర్రవస్తువుయందు కణములు ( Grains ) అమర్చబడిన
దిశలో దీనిని కదలించాలి. దీని పై అమర్చబడిన స్క్రూ ను త్రిప్పుకొనుట
ద్వారా కర్రవస్తువు పై యిది పొరలుగా ఖండించెడి కర్ర మందమును
క్రమబద్ధము చేసుకొనవచ్చును.
8. ఇతర ప్లేనులు :
పైన పేర్కొనబడిన ప్లేనులే కాకుండా, మరికొన్ని ప్లేనులు కొన్ని
ప్రత్యేక పనులకుగాను వుపయోగపడతాయి. వాటిని గురించి క్రింద
వివరించనైనది.
( a )బ్లాక్ ప్లేన్ ( Block plane ) :-
దీని ద్వారా కర్రవస్తువుపై కణములు అమర్చబడిన దిశకు అడ్డముగా
ఖండించి ఉపరితలమును సమపరుచుట సాధ్యపడుతుంది. ఈ ప్లేను ఒకే
ఒకబ్లేడును కలిగియుండి, దానిని సుమారు 12 నుండి 20 డిగ్రీల కోణములో
అమర్చుకొనవచ్చును. ఈ ప్లేను చిన్న సైజులో వుండుట మూలముగా దీని
ద్వారా సులభముగా పనిచేయించుకొనవచ్చును. ఇతర ప్లేనుల ద్వారా
సాధ్యపడని చిన్నసైజు కర్రవస్తువుపై దీని నుపయోగించవచ్చును.
(b) హాలో ప్లేను ( Hollow plane ) :
దీనిద్వారా కర్రవస్తువుపైన ఉబ్బత్తు వట్రుతలమును పొంది, దానిని
నునుపుపరచవచ్చును. ఈ ప్లేను బాడీ అడుగుభాగము పటములో చూపినట్లుగా
పైకి వంపుతిరిగి యుంటుంది. దీనినే
' హాలో ప్లేన్ ' అంటారు.
(c) గుండ్రని అడుగుగల ప్లేను ( Round plane ):
కర్రవస్తువుపై న లోతు కలిగిన వట్రుతలమును యేర్పరిచి,
నునుపుపరచుటకు యిది వుపయోగపడుతుంది. దీని బాడీ అడుగుభాగము
క్రిందవైపు వంపుతిరిగి ఉబ్బెత్తుగాయున్న వట్రుతలమును కలిగియుంటుంది.
అభ్యాసము
1. జాక్ ప్లేన్ వుపయోగమును తెలుపుము. దాని పటమును గీచి వివిధ గుర్తించుము.
2. జాక్ ప్లేన్ కు మరియు ట్రైయింగ్ ప్లేన్ కు గల భేదములను వివరించుము.
3. రిబేటింగ్ ప్లేను పటమును గీచి వివిధ భాగములను గుర్తింపుము.
4. ప్లౌ ప్లేన్ కు మరియు జాక్ ప్లేనుకుగల భేధమును వివరించి, ప్లౌ ప్లేన్
వుపయోగమును తెలుపుము.
5. స్పోక్ షేవ్ ను వుపయోగించు విధానమును తెలుపుము.
6. హాలో ప్లేన్ కు మరియు రౌండ్ ప్లేనుకు గల భేధములను వివరింపుము.







