Thursday, August 29, 2019

5. కర్ర సామగ్రిని తయారుచేయు పనియందు పాటించవలసిన రక్షక నియమములు.

కర్ర   సామగ్రిని   తయారుచేయు  పనియందు పాటించవలసిన  రక్షక నియమములు:--


కర్ర   సామాగ్రిని   తయారు చేయు   పనియందు  వివిధ రకముల   ఖండించండి 

పనిముట్లు    యంత్రములు   ఉపయోగించవలసి ఉంటుంది . రంపము 

ఉలి , చిత్రిక మొదలగు ఖండించే   పనిముట్లు ఉపయోగించినప్పుడు డ్రిల్లింగ్ 

యంత్రము ,గ్రైండింగ్   యంత్రము ,   కర్ర సామాగ్రిని తరిమరి  పెట్టెడి

  యంత్రము  మొదలగు వాటిపై   పనిచేయునప్పుడు అపాయము లకు    గురి 

కాకుండా   ముందు   జాగ్రత్తగా   పాటించవలసిన కొన్ని    రక్షక    సూత్రములు 

ఏర్పరచబడినది   . ఈ సూత్రములను  సరిగా   పాటించి   పనులు   చేసుకొని న 

యెడల    ఏ విధమైన    అడ్డంకులు  లేకుండా   త్వరితముగా పనులు 

జరుగుతాయి. యంత్రములతో   పనిచేయనప్పుడు    అజాగ్రత్తగా ఉన్న 

ఎడల పనిచేయు వ్యక్తికి లేదా పరిసరాలలో  ఉన్న వ్యక్తులకు హాని  

జరుగుటయేకాకుండా   పనిముట్లు లేదా  యంత్రములు   దెబ్బతినుట 

జరుగవచ్చును అపాయము నకు గురి అయిన వ్యక్తికి సరైన వైద్య సంరక్షణ 

గావించుట   మరియు దెబ్బతిన్న పనిముట్లు యంత్రములు మరమ్మత్తు 

చేసుకొనుటకు ఖర్చుతో కూడిన పనులు అపాయము   జరుగకుండా

 నివారించిన  యెడల   అనవసరమైన  యీ  ఖర్చును   తొలగించవచ్చును

 అపాయం జరుగునని ముందుగా తెలుసుకొనలేము కదా ఆకస్మికంగా జరిగే

 అపాయం నుండి నివారించు కొనుటకు గాను  రక్షక 

సూత్రములు మనకు ఉపయోగపడును. 

Tuesday, August 27, 2019

4. వడ్రంగి పని

                      వడ్రంగి  పని

 కర్ర సామాగ్రిని   తయారు చేయు   పనిని   వడ్రంగిపని అని

 అంటారు .   చెట్టునుండి లభ్యమగు కలపను   ముఖ్యముగా

   కోయుట  కోసిన ముక్కలను    నునుపు చేయుట    ఈ

 ముక్కలను కలుపుకుని   కర్ర సామాగ్రి    భాగములను

  చేయుట మొదలగు పనుల     వలన   మనకు   కావలసిన 

వివిధ వస్తువులను    తయారు చేసుకోనవచ్చును వివిధ

 వడ్రంగి   పనులకు గాను ఉపయోగపడు ముఖ్య పనిముట్లు

  వాటిని ఉపయోగించెడి విధానములో అవలంబించవలసిన

   మెలకువలు మొదలగునవి   నేర్చుకొని    ఈ పనిని

 జీవనోపాధిగా  ఒక వ్యక్తి నిర్ణయించుకొన  వచ్చును  .    పెద్ద

 ఎత్తున   ఈ పనులను   సాధించుటకై   వడ్రంగి పనిలో

   నిపుణులైన   కొందరు   వ్యక్తులు.  కలిసి  ఒక 

పరిశ్రమగా   నెలకొల్పుకొనవలెను . పెద్ద ఎత్తున  పనులను
 
  సకాలంలో    నిర్వహించుటకు గాను 

సాధారణ   పనిముట్లు కాకుండా    కర్ర సామాగ్రిని తయారు

 చేయు    వివిధ యంత్రములు మరియు 

విరివిగా   ఉపయోగపడు పనిముట్లు   అరిగి  పోయినప్పుడు 

  వాటిని పదును   పెట్టుకుని 

మరమ్మత్తు  చేసుకొనెడి  యంత్రములు  ఉపయోగపడతాయి

 .ఈ యంత్రము లను వర్క్   షాపులో   అమర్చుకొని

 నప్పుడు    సరిగ్గా ఆలోచించి  ఉత్తమమైన    ఏర్పాటును

 అవలంబించాలి .  తగిన  పద్ధతిలో   వీటిని   

   అమర్చుకుంటే   తద్వారా   కర్ర సామాగ్రిని

 తయారు  చేయుట   త్వరితముగా   జరుగుటయే    కాకుండా

 తక్కువ  స్థలంలో   అన్ని  యంత్రములు

 నెలకొల్పవచ్చును.   

సరిగా యోచించి   నెలకొల్పిన   వర్క్ షాపు  వలన

 క్రింద  పేర్కొనబడిన లాభములు కలవు.

1.  తక్కువ కాలంలో   ఎక్కువ సంఖ్యలో    కర్రసామాగ్రిని

  తయారు చేయవచ్చును .

2.పని   సరిగా.   జరుగుతుందో   లేదో   పరీక్షించుకొనుట

   సులభము .

3 .అపాయములు    జరగకుండా   నివారించుటకు

   తోడ్పడుతుంది.

కర్ర సామాగ్రిని   తయారు చేయు   వర్క్ షాప్ లో వివిధ

   యంత్రములను    నెలకొల్పు విధానము 

చూపబడినది .    

చూపబడిన   యంత్రములు అవి   పని చేయు విధానము 

   గురించి    రాబోయే యూనిట్ లో తెలుపబడింది.    ఒక

 క్రమ పద్ధతి    ననుసరించి    అమర్చిన    విధానము

 యంత్రము ,  యంత్రము    మధ్య    తగినంత    ఖాళీ

 స్థలముఏర్పరచుట    వ్యక్తులు   నడుచుటకు    తగినంత 

ఖాళీ స్థలమును      ఏర్పరచుట    మొదలగు   విషయములు

   ముఖ్యంగా   గమనించదగినవి.

Monday, August 26, 2019

కర్ర సామగ్రిని తయారుచేయు పని


కర్ర  సామగ్రిని  తయారుచేయుపని

ఉపోద్ఘాతము:—

ప్రకృతిలో   లభ్యమగు  వివిధ  సహజవనరులు

 మానవుని  అవసరాలను  తీర్చడానికి  

ఉపయోగపడుచున్నవి.  మన నిత్య 

జీవితంలో  అనేక  విధములుగా  

ఉపయోగపడెడి ప్రకృతి వనరులలో   

కర్ర  ఒకటి.  ప్రకృతిలో   సమృద్ధిగా  గల  

వృక్ష సంపదనుండి   లభించే  కర్ర  

వివిధ  సామగ్రిని  తయారు చేయుటకు  

ఉపయోగపడుచున్నది.  

మొట్టమొదటగా  మానవుడు  చెట్టు  

కొమ్మల  ద్వారా   లభించెడి  పొడవైన  

కర్రల  మొనలు  పదును పెట్టుకొని   

ఆయుధములుగా   తయారుచేసుకొని  

వాటితో  జంతువులను   వేటాడేవాడు.  

క్రమేణా  కర్ర నుపయోగించి  ఇండ్లు 

  కట్టుకొనుట   ,బండ్లు తయారుచేయుట

 ,  ఓడలు  నిర్మించుట   మరియు  

యితర  గృహోపకరణములు   
తయారు  

చేసుకొనుట  మొదలైనవి.  ఈ  విధంగా  

 కర్ర  వుపయోగము  మానవ  నాగరికత   
వికాసానికి  తోడ్పడసాగింది.
                        
అయితే  చెట్టు  నుంచి  

లభ్యమగు  కర్రను   మానవుని  

ఉపయోగానికి  అవసరమైన సామగ్రిగా  

రూపొందించడానికి  కొన్ని  పనిముట్లు   

అవసరముంటుంది .  కర్ర  సామగ్రిని  

తయారుచేసే  మొట్టమొదటి  

పనిముట్లు  రాతితో  చేయబడేవి. 

అయితే  రాతితో  చేయబడిన  

పనిముట్లు  మొరటుగా  వుండుటయే  

కాకుండగా  వీటిని  పదును 

పెట్టుకొనుట  ,  ఎక్కువ  కాలము  

మన్నికగా  వుపయోగించుట  

సాధ్యపడెడిది  కాదు.  కాలక్రమేణా  యీ 

పనిముట్లను  తయారు చేయుటలో   

రాయి  స్థానంలో  లోహము  

ప్రవేశించింది.

తొలుదొల్తగా  వీటి తయారీలో  ' రాగి '  

ని   ఉపయోగించేవారు. అయితే  రాగి 

మెత్తటి  లోహము కనుక  అది ఎక్కువ 

మన్నికగా  వుండకపోయెడిది.  రాగి 

స్థానంలో  ' కంచు'

ప్రవేశించి దానితో  తయారుచేసిన  

వివిధ  పనిముట్లు  కొన్ని వందల  

సంవత్సరాలు వాడబడ్డాయి.  క్రమేణా 

కంచుస్థానములోనికి ఇనుము ప్రవేశించి 

ఇనుప  పనిముట్లు వాడుక పెరుగుతూ 

వచ్చింది.
                   కర్ర   సామగ్రిని   

తయారుచేయుటకు  నేడు  ఉపకరించు  

వివిధపరికరములు  ' ఉక్కు ' అనబడు  

మేలురకపు  ఇనుముతో   చేయబడి  

విరివిగా   వాడబడుతున్నాయి.  

రంపము , చిత్రిక , ఉలి , బోరింగ్ బిట్లు  

మొదలగునవి  యీ  విధముగా   

తయారుచేయబడ్డ  పనిముట్లు  . 

అయితే   యీ    పనిచేయించుకొనుట   

ద్వారా  ఉపయోగపడుట  వలన  వీటిని   
'చేతిపనిముట్లు  '  అని  అంటారు . 

త్వరితముగా  పనులను  సాధించుటకై  

చేతి పనిముట్లతో  పాటు  యంత్ర  

పనిముట్ల  ఆవశ్యకత యేర్పడింది.  కర్ర 

సామాగ్రిని   తయారుచేయు   యంత్ర 

పనిముట్లు   సుమారు   రెండు 

శతాబ్దముల క్రింద  రూపొందించబడి  

క్రమేణా  అభివృధ్ధి పరచబడ్డాయి.
                  
 కర్ర సామాగ్రిని   తయారు చేయుట   ఒక 

కళ గా   పరిగణింప వచ్చును.   ఈ కళ 

యందు   నైపుణ్యతను   సాధించుటకు 

గాను   దీనిపై   అభిరుచి తో   పాటు   ఈ 
కళకు   సంబంధించి ఈ కళకు చెందిన 

వివిధ   పనులను నేర్చుకొని , వాటిని 

సరిగా అమలు పరచు  కొనుటకు గాని 

ఎల్లప్పుడు  సాధన  చేయవలసి  

ఉంటుంది తగినంత అనుభవం సాధించి 

ఈ కళ  యందు నేర్పరిగా ఏర్పడుటకు 

గాను ఈ విధమైన   సాధన   అవసరం  

అవుతుంది .ఇందుకు గాను ముందుగా 

కర్ర సామాగ్రిని తయారు చేయుటలో 

ఉపకరించు వివిధ పనిముట్లు, వాటిని 

ఉపయోగించే విధానం వివరంగా 

తెలుసుకోవాలి.

కార్పెంటరీ పరికరాలు

కార్పెంటరీ
                        స్కూౄ  డ్త్రెవర్

                         బాడితి

కార్పెంటరీ పరికరములు -1

కార్పెంటరీ 

                           ఉలి

                           సుత్తులు