Showing posts with label 5. కర్ర సామగ్రిని తయారుచేయు పనియందు పాటించవలసిన రక్షక నియమములు. Show all posts
Showing posts with label 5. కర్ర సామగ్రిని తయారుచేయు పనియందు పాటించవలసిన రక్షక నియమములు. Show all posts

Thursday, August 29, 2019

5. కర్ర సామగ్రిని తయారుచేయు పనియందు పాటించవలసిన రక్షక నియమములు.

కర్ర   సామగ్రిని   తయారుచేయు  పనియందు పాటించవలసిన  రక్షక నియమములు:--


కర్ర   సామాగ్రిని   తయారు చేయు   పనియందు  వివిధ రకముల   ఖండించండి 

పనిముట్లు    యంత్రములు   ఉపయోగించవలసి ఉంటుంది . రంపము 

ఉలి , చిత్రిక మొదలగు ఖండించే   పనిముట్లు ఉపయోగించినప్పుడు డ్రిల్లింగ్ 

యంత్రము ,గ్రైండింగ్   యంత్రము ,   కర్ర సామాగ్రిని తరిమరి  పెట్టెడి

  యంత్రము  మొదలగు వాటిపై   పనిచేయునప్పుడు అపాయము లకు    గురి 

కాకుండా   ముందు   జాగ్రత్తగా   పాటించవలసిన కొన్ని    రక్షక    సూత్రములు 

ఏర్పరచబడినది   . ఈ సూత్రములను  సరిగా   పాటించి   పనులు   చేసుకొని న 

యెడల    ఏ విధమైన    అడ్డంకులు  లేకుండా   త్వరితముగా పనులు 

జరుగుతాయి. యంత్రములతో   పనిచేయనప్పుడు    అజాగ్రత్తగా ఉన్న 

ఎడల పనిచేయు వ్యక్తికి లేదా పరిసరాలలో  ఉన్న వ్యక్తులకు హాని  

జరుగుటయేకాకుండా   పనిముట్లు లేదా  యంత్రములు   దెబ్బతినుట 

జరుగవచ్చును అపాయము నకు గురి అయిన వ్యక్తికి సరైన వైద్య సంరక్షణ 

గావించుట   మరియు దెబ్బతిన్న పనిముట్లు యంత్రములు మరమ్మత్తు 

చేసుకొనుటకు ఖర్చుతో కూడిన పనులు అపాయము   జరుగకుండా

 నివారించిన  యెడల   అనవసరమైన  యీ  ఖర్చును   తొలగించవచ్చును

 అపాయం జరుగునని ముందుగా తెలుసుకొనలేము కదా ఆకస్మికంగా జరిగే

 అపాయం నుండి నివారించు కొనుటకు గాను  రక్షక 

సూత్రములు మనకు ఉపయోగపడును.