Showing posts with label 4.వడ్రంగి పని. Show all posts
Showing posts with label 4.వడ్రంగి పని. Show all posts

Tuesday, August 27, 2019

4. వడ్రంగి పని

                      వడ్రంగి  పని

 కర్ర సామాగ్రిని   తయారు చేయు   పనిని   వడ్రంగిపని అని

 అంటారు .   చెట్టునుండి లభ్యమగు కలపను   ముఖ్యముగా

   కోయుట  కోసిన ముక్కలను    నునుపు చేయుట    ఈ

 ముక్కలను కలుపుకుని   కర్ర సామాగ్రి    భాగములను

  చేయుట మొదలగు పనుల     వలన   మనకు   కావలసిన 

వివిధ వస్తువులను    తయారు చేసుకోనవచ్చును వివిధ

 వడ్రంగి   పనులకు గాను ఉపయోగపడు ముఖ్య పనిముట్లు

  వాటిని ఉపయోగించెడి విధానములో అవలంబించవలసిన

   మెలకువలు మొదలగునవి   నేర్చుకొని    ఈ పనిని

 జీవనోపాధిగా  ఒక వ్యక్తి నిర్ణయించుకొన  వచ్చును  .    పెద్ద

 ఎత్తున   ఈ పనులను   సాధించుటకై   వడ్రంగి పనిలో

   నిపుణులైన   కొందరు   వ్యక్తులు.  కలిసి  ఒక 

పరిశ్రమగా   నెలకొల్పుకొనవలెను . పెద్ద ఎత్తున  పనులను
 
  సకాలంలో    నిర్వహించుటకు గాను 

సాధారణ   పనిముట్లు కాకుండా    కర్ర సామాగ్రిని తయారు

 చేయు    వివిధ యంత్రములు మరియు 

విరివిగా   ఉపయోగపడు పనిముట్లు   అరిగి  పోయినప్పుడు 

  వాటిని పదును   పెట్టుకుని 

మరమ్మత్తు  చేసుకొనెడి  యంత్రములు  ఉపయోగపడతాయి

 .ఈ యంత్రము లను వర్క్   షాపులో   అమర్చుకొని

 నప్పుడు    సరిగ్గా ఆలోచించి  ఉత్తమమైన    ఏర్పాటును

 అవలంబించాలి .  తగిన  పద్ధతిలో   వీటిని   

   అమర్చుకుంటే   తద్వారా   కర్ర సామాగ్రిని

 తయారు  చేయుట   త్వరితముగా   జరుగుటయే    కాకుండా

 తక్కువ  స్థలంలో   అన్ని  యంత్రములు

 నెలకొల్పవచ్చును.   

సరిగా యోచించి   నెలకొల్పిన   వర్క్ షాపు  వలన

 క్రింద  పేర్కొనబడిన లాభములు కలవు.

1.  తక్కువ కాలంలో   ఎక్కువ సంఖ్యలో    కర్రసామాగ్రిని

  తయారు చేయవచ్చును .

2.పని   సరిగా.   జరుగుతుందో   లేదో   పరీక్షించుకొనుట

   సులభము .

3 .అపాయములు    జరగకుండా   నివారించుటకు

   తోడ్పడుతుంది.

కర్ర సామాగ్రిని   తయారు చేయు   వర్క్ షాప్ లో వివిధ

   యంత్రములను    నెలకొల్పు విధానము 

చూపబడినది .    

చూపబడిన   యంత్రములు అవి   పని చేయు విధానము 

   గురించి    రాబోయే యూనిట్ లో తెలుపబడింది.    ఒక

 క్రమ పద్ధతి    ననుసరించి    అమర్చిన    విధానము

 యంత్రము ,  యంత్రము    మధ్య    తగినంత    ఖాళీ

 స్థలముఏర్పరచుట    వ్యక్తులు   నడుచుటకు    తగినంత 

ఖాళీ స్థలమును      ఏర్పరచుట    మొదలగు   విషయములు

   ముఖ్యంగా   గమనించదగినవి.