క్వార్టరు బౌండు కవరింగ్ పద్ధతి :—
ఈ పద్ధతిలో పుస్తకము యొక్క వెడల్పులో వెనుకనుండి 1/4 వ భాగమునకు ఒక రకమైన కవరింగ్ వస్తువును, మిగిలిన 3/4 వ భాగమునకు, వేరే రకపు కవరింగ్ వస్తువునుమా వాడుతారు. అందువలన ఈ పద్ధతికి క్వార్టర్ కవరింగ్ అని పేరుకల్గినది. బ్యాక్ కవరింగ్ వస్తువును తీసుకొనునప్పుడు పుస్తకము మందమును మరియు పుస్తకము వెడల్పులో సగముకన్నా కొంచెము ఎక్కువ వెడల్పుగల కొలతలలో కవరింగ్ వస్తువును తీసుకొనవలయును. Turned - in పద్ధతి ప్రకారము కవరింగ్ చేయునట్లయిన పుస్తకము పొడవుకన్నా 2 అం. ఎక్కువగా Bank Covering material ను తీసుకొనవలయును. వెడల్పులో ఏమీ మార్పు వుండదు. తరువాత
కవరింగ్ చేయునప్పుడు రెండు వైపులా 1 అం. చొప్పున అట్టలలోనికి మడిచెదరు. పుస్తకముయొక్క మిగిలిన 3/4 భాగమును వేరే వస్తువుతో కవరింగ్ చేయునప్పుడు కూడా 1 అం. ఎక్కువగా కవరింగ్ వస్తువును తీసుకొనవలయును. దీనిని అంటించునప్పుడు సరిగా 1/4 భాగమునుండి మిగిలిన భాగము మిాద అంటించవలెను. ఎక్కువగా వున్నభాగమును అట్టలలోనికి Head, Tail, Fore edge ల అట్టలోపలి వైపునకు మడిచి అంటించవలెను. ఈ విధముగా అట్టలకు రెండు వైపులా చేయవలెను. చివరిగా ఎండ్ పేపరు మీద గట్టి పేస్టును రాసి అట్టలోపలి భాగమునకు అంటించవలెను. ఆ తరువాత పుస్తకమును కదిలించరాదు. తేలిక అయిన బరువు క్రింద వుంచవలెను. ఈ విధముగా క్వార్టర్ బౌండు కవరింగ్ తయారగును.
హాఫ్ బౌండు ( Half Bound )కవరింగ్ పద్థతి :—
ఇందుకు కూడా రెండు రకాల వస్తువులను కవరింగ్ కు వాడతారు. కానీ రెండు వస్తువులు పుస్తకము యొక్క వెడల్పులో సగముగా నుండును. కొంత మంది వెనుక భాగమున, మరియు పుస్తకము మూలలయందు ఒక రకమును వాడుతారు. వీటి మధ్యగల ఖాళీస్థలమును వేరొక వస్తువుతో అతికించుతారు. మరికొంతమంది ఈ పద్థతిని వేరే విధముగా చేస్తారు. అది వెనుకవైపున 1\4 న భాగము, ముందు అంచులయందు 1\4 వ భాగము అనగా మొత్తము 1\2 భాగమునకు సమానముగా ఒక వస్తువును, మధ్య ఖాళీగావున్న 1\2 భాగము వెడల్పునందు వేరే వస్తువును వాడతారు. వస్తువులను కత్తిరించనప్పుడు కొంచెము పెద్దవిగా తీసుకొనవలెను. వాటిని Turned-in చేయుటకు వీలుగా వుండాలి. కార్నర్సును 45॰ లో కత్తిరించి అంటించవలెను. అంచులయందు కోసుగా నుండవలెను. కొంతమంది రౌండ్ కార్నర్సు కూడా చేస్తారు. Half bound అనునది చాలా మన్నిక గల పద్థతి. దీనికి తోలును ఎక్కువగా వాడుతారు. మధ్యప్రదేశములో క్యాలికో, రెక్జిన్ లేదా క్యాన్ వాస్ ను వాడుతారు. తోలును ఉపయోగించి కవరింగ్ చేయునపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొనవలెను. తోలులో మరకలు, చిల్లులు లేకుండా శుభ్రముగా నుండవలెను. ఎక్కువ మందముగా వుండరాదు. అంచులను చెక్కవలెను, లేనిచో సరిగా కరుచుకొనదు. ఇందుకుగాను ప్యారింగ్ కత్తిని ఉపయోగించాలి. తోలును ' గ్లూ ' తో అతికించవలెను. ' గ్లూ ' త్వరగా ఆరిపోవు స్వభావము గలది. paste ను తోలుకు వాడరాదు, తోలు చెడిపోవును. తోలు సాధారణముగా వంకరలుగా నుండును. అట్టిదానినుండి మనకు కావలసిన కొలతలలో తోలును కత్తిరించుకొనవలెను. మిగిలిపోయిన తోలు ముక్కలను కార్నర్స్ కు, Rasied bands కు వినియోగించుకొని, తోలును వైధా కాకుండా వాడుకోవాలి.
తోలుకు రంగు, వార్నిష్ వేయాలి. తోలును కావలసిన కొలతలకన్నా కొంచెము ఎక్కువగా తీసుకొని అంచులను సన్నపరుచుకొనవలెను. కార్నర్సు అంటించునప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. తోలు ఫ్రెంచ్ గ్రూప్ నందు సరిగా అంటుకొనదు. అందువలన ఫోల్డరు సహాయమున ' గ్రూప్ ' నందు గట్టిగా అదిమి రుద్దవలెను. లేదా దారముతో గట్టిగా బిగించి ఆరపెట్టవలెను. దీనినే tying అంటారు. తోలు మందముగల కవరింగ్ వస్తువు. కావున దీని ప్రక్కన అతికించు వస్తువు అంత మందముగా వుండదు. అందువలన ముందుగా waste paper ను అతికించి దానిపైన రెండవ convering వస్తువును అంటించాలి. అప్పుడు తోలు, మరియు రెండవ కవరింగ్ వస్తువు ఒకే మందముగా నుండి తేడా కన్పించదు. ఈ పద్థతిని filling the boards అంటారు. ఇదే మాదిరి అట్ట యొక్క లోపల భాగమునందు కూడా మడిచిన తోలు అంచులుండును. కావున అక్కడ కూడా waste paper తో తేడా లేకుండా అంటించవలెను. లేనిచో ఎండ్ పేపర్ సరిగా అంటుకొనదు. చివరగా ఎండ్ పేపరుకు పేష్టును అంటించి అట్ట లోపలి వైపున అంటించవలెను. రెండు వైపులా ఇదే ప్రకారముగా చేయవలెను. అట్ట మీద తోలును శుభ్రముగా తుడవవలయును. తరువాత తేలిక బరువు. క్రింద కదల్చకుండా కొద్ది సేపు వుంచవలెను. ఈ విధముగా Half bound ను చేయుట నేర్చుకొనవలెను.
ఫుల్ బౌండ్ ను చేయు పద్థతి :—
ఇది చాలా ఖరీదు అయిన కవరింగ్ పద్థతి. పుస్తకమును పూర్తిగా ఒకే రకము వస్తువుతో కవరింగ్ చేస్తారు. కావుననే దీనిని full bound పద్థతి అంటారు. ఈ పద్థతికీ ఒకే రకం కవరింగ్ వస్తువు ఎక్కువ మొత్తంలో కావలయును. సాధారణముగా క్యాలికో రెక్సిన్ , క్యాన్ వాస్ గుడ్డలను వాడతారు. తోలు full bound కు వాడుటలో కొన్ని ఇబ్బందులుగలవు. పైగా మనకు సరిపడు కొలతలలో, పెద్ద మొత్తంలో తోలులభించుట కష్టము. చాలా ఖరీదు అయినది. అందువలన full bound లకు ముందుగా తెలిపిన వస్తువులనే వాడుతారు.
full bound చేయుటకు పుస్తకము యొక్క రూండు వెడల్పులు, మందము మరియు ఎక్కువగా 2 అం వుండునట్లుగా తీసుకొనవలెను. అదే మాదిరి పొడవులో కూడా 2 అం ఎక్కువగా వుండునట్లు తీసుకొనవలెను. ఈ ప్రకారము తీసుకున్న కవరింగ్ వస్తువును నాల్గు అంచులయందు సుమారు 1\2 అం లోపలికి 45॰ వాలుగా, నాల్గు అంచులయందు కత్తిరించవలెను. తరువాత కవరింగ్ వస్తువుయొక్క గరుకు వైపున ( rough side ) ' గ్లూ ' ను రాయవలెను. ఈ పనిని waste paper క్రింద నుంచి చేయవలెను. పుస్తకమును సరిగా కవరింగ్ వస్తువుమధ్యలో వుంచవలయును. తరువాతగ్లూ వ్రాసిన భాగమును పుస్తకము మిదికి తేవలయును. మడతలు లేకుండా చేయవలయును. పైన, క్రింది వైపున అంచులను మడవవలయును. ఫ్రెంచి గ్రూప్ నందు గట్టిగా అదమవలెను. తరువాత Fore edge ని లోనికి మడవవలెను. ఇదే ప్రకారము రెండవ వైపునకూడా చేయవలెను. పుస్తకము వెనుకవైపున రైజ్ డ్ బ్యాండ్సునుకూడా folder సహాయమున ప్రక్కల రుద్దవలయును. అట్లు చేసినందువలన ' గ్లూ ' రైజ్ డ్ బ్యాండ్సు ప్రక్కల బాగా అంటుకొనును. రైజ్ డ్ బ్యాండ్సు ఎత్తుగా కనుపించును. చివరగా end papers ను అట్టలోపల వైపున కరిపించవలయును. కవరింగ్ వస్తువుమీద మరకలు లేకుండా తుడవవలయును. ఈ విధముగా full bound తయారగును. కొద్ది సేపు తేలికబరువు క్రింద వుంచవలెను.
ప్రశ్నలు
1. కవరింగ్ ఆవశ్యకత ఏమి?
2. కవరింగ్ కు ఉపయోగించు వస్తువులేవి?
3. క్వార్టరు బౌండ్ చేయువిధమును తెల్పుము?
అధ్యాయము —11
స్టేషనరీ బైండింగ్ పనులు
( Stationery Binding )
మీరు క్రింది తరగతిలో స్టేషనరీ బైండింగ్ గూర్చి తెలుసుకొంటిరి ఈ పద్థతి, వ్రాయుటకు ఉపయోగించు అన్ని రకాల పుస్తకాలకు వర్తించును. మనము ముఖ్యంగా ఎక్స్ ర్ సైజు పుస్తకాలను తయారు చేయుటకు గుర్తించు అకౌంటు పుస్తకాలు రూల్సు వేయుట, టెర్ ఆఫ్ ప్యాడ్సును, మరియు బిల్లు పుస్తకాల తయారీని గురించి తెలుసుకొందాము.
పుస్తకాలకు గళ్ళ కొట్టుటకు రెండు పద్థతులు గలవు. అవి ఏవనగా ( 1 ) పెన్ రూలింగ్ యంత్రము ద్వారా ( 2 ) డిస్క్ రూలింగ్ యంత్రము ద్వారా. కాని దీని ఉపయోగము అకౌంటు పుస్తకాలు రూళ్ళు వేయుటకుప్రింటు అయిన కాగితముల మీద ( spot ruling ) వేయుటకు ఎంతో ఉపయోగపడును. పెన్ రూలింగ్ యంత్రమునకు ఫీడ్ బోర్డు, రూలింగ్ యూనిట్, డెలివరి పట్ట, డెలవరి టేబుల్ అనునవి ముఖ్యమైన భాగాలు. యింకు యూనిట్ నందు యింక్ డక్టు, Felt piece, Nibs అనునవి వుండును.
పనిచేయు విధానము :—
పెన్ స్టాండునందు నిబ్బులను, కావలసిన దూరములో అమర్చుకొను వసతిగలదు. ఫీడ్ టేబుల్ నందు సరియగుమార్జిన్ లు వుండునట్లు Side lay ని అమర్చుకొనవలెను. కావలసిన రంగు సిరాన కలుపుకొనవలెను. సిరాపొడిని వేడినీటిలో కలుపవలెను. మనకు కావలసన చిక్కదనములో చేసుకొనవచ్చును. రూల్సు ఎక్కువ డార్కుగా వుండరాదు. Felt బట్టను యింకుతో తడపవలెను. Felt నుండి యింకు నిబ్స్ లోని చేరును. బట్ట ఆరిపోకుండా యింకుతో తుడుపుచుండవలెను. యింకు నిబ్స్ లోనికి పోకుండా చూడాలి. కొన్ని నిబ్స్ సరిగా గీయవు. అట్టివాటిని వెంటనే సరిచేయవలయును లేదా మార్చవలెను.
ఫీడ్ బోర్డు నుండి కాగితము రెండు ఇనుప చట్రముల మధ్యకు పంపవలెను. అవి గుండ్రముగా తిరుగుచూ కాగితమును ముందుకు నెట్టును. ఆ విధముగా కాగితము కన్వేయరుబట్టమీద ప్రయాణించుచూవచ్చి పెన్ స్టాండ్ క్రిందికివచ్చును. ఒక ప్రత్యేక లీవరు సహాయమును నిబ్స్ ను కాగితముపైన వుంచుదురు. కాగితము నిబ్స్ క్రింద నుండి పయనించుటచే దాని మీద గీతలు పడును ఈ విధముగా గీతలు పడ్డ కాగితములు ఎగిరీపోకుండా కన్వేయర్ బట్ట మీద దారములు అమర్చియుంచుదురు, రూల్సు అయిన కాగితము ' రన్నర్సు ' సహాయమును డెలివరీ బోర్డుకు చేరును. కన్వేయర్ గుడ్డ కాగితమును feeding దగ్గర నుండి డెలివరి వరకు మోయును. కన్వేయరు పట్ట ఫీడింగ్ , డెలవరి అంచుల మధ్య నిర్వారానుముగా తిరుగుచుండును. ఈ పట్ట ఫీడింగ్ , డెలవరీ అంచుల మధ్య నిర్విరానుముగా తిరుగుచుండును. ఈ పట్టపైన యింకు పడకుండా చూడవలెను. లేనిచో సెట్ ఆఫ్ అను పొరపాటు జరుగును. పట్టను బ్లాటింగ్ కాగితముతో తగులునట్లుగా అమర్చవలెను. అందువలన పట్టమీద వున్న సిరాతడిని బ్లాటింగ్ కాగితము పీల్చుకొనును. డెలివరీ టేబుల్ పై కాగితములను క్రమపద్థతిలో వుంచవలెను. రూలింగ్ అయిన కాగితములను శుభ్రమైన ప్రదేశములో ఎగిరిపోకుండా బద్రపరచవలెను.
అకౌంట్ రూల్సు అనేక పద్థతులలో గలవు
( 1 ) ఒకే రంగు గీతలు
( 2 ) మార్జిన్ మరియు గీతలు (రెండురకములుగా )
( 3 ) మార్జిన్, అడ్డ గీతలు, నిలువుగా రూపాయిలు, పైసలు గీతలు
( 4 ) జమ, ఖర్చు, రూపాయలు, మిగులు చూపు గీతలు
( 5 ) జర్నలు లెడ్జర్ గీతలు
ఈ విధముగా బ్యాంక్ లెడ్జర్సుకు గీతలు వేయుదురు. గీతలు కొట్టిన కాగితములను మడిచి సెక్షన్స్ గాచేసి పుస్తకాలు కుట్టుదురు. తక్కువరకం పుస్తకాలను Wire stich చేస్తారు.
బుక్ బైండింగ్
అధ్యాయము -1
పుస్తకములు కుట్టు పద్ధతి
( Book Sewing in detail )
క్రింది తరగతిలో వేర్ హౌసింగ్ , ఫార్ వార్డింగ్ , మరియు ఫినిషింగ్ అని మూడు విధములైన బైండింగ్ పనులను తెలిసికొని యుంటిరి. ఈ విధముగా విభజించుట వలన పనిని అర్థముచేసునుకొట సులభము. పెద్ద పెద్ద బైండింగ్ షాపులలో ఒక్కొక్కపనికి ప్రత్యేకముగా సెక్షన్లు వుండును. మనము సూయింగ్ ను గురించి క్లుప్తముగా తెలిసికొని యున్నాము. ప్రస్తుతము లైబ్రెరీ సూయింగ్ , సాన్ ఇన్ సూయింగ్ చేయువిధానమును గూర్చి వివరముగా తెలుసుకొందాము.
వేర్ హౌసింగ్ పనులు అయిన వెంటనే సూయింగ్ పని ప్రారంభమగును సూయింగ్ కి ముందు కొన్ని విషయములను గ్రహించవలయును. ఆ ప్రకారము ఏదో ఒక సూయింగ్ ను నిర్ణయించుకోవలయును. గమనించదగ్గ విషయములేవనగా, పుస్తకము సైజు , దానిలోని పేజీల సంఖ్య , వాడుక విధానము, ఖరీదు, ఎంత కాలములో చేసి ఇవ్వవలయును అనువిషయాలు ముఖ్యం. అతిత్వరలో ఎక్కువ కాపీలను అందించవలెనన్న ' తీగకుట్టు ' పద్ధతి మంచిది. కాని ఇది తక్కువరకము పుస్తకాలకు వాడెదరు. తీగతో ఎక్కువ మందము కుట్టలేము. వాడుకలో ఇబ్బందులు ఎదురగును. అందువలన సూయింగ్ విధానము మంచిది. సూయింగ్ యంత్రములకన్నా చేతితో కుట్టినది మన్నికగా వుండును.
సూయింగ్ ఏర్పాట్లు :--
లైబ్రెరీ సూయింగ్ విధానమును గూర్చి తెలుసుకొందాము. ఈ పద్ధతిని అధికముగా లైబ్రెరీ పుస్తకాల తయారీలో అనుసరించుదురు. పబ్లిషర్స్ బైండింగ్ కు కూడా వాడవచ్చును. సెక్షన్లు అన్నింటిని " సిగ్నేచర్సు " ప్రకారము వరుసగా అమర్చుకొనవలయును. అన్నింటిని ప్రెస్సింగ్ లో కొంతసేపు వుంచవలయును. ఈ విధముగా చేయుటవలన సెక్షన్ మడతలు సరిగా ఏర్పడి, వాటిలోని గాలి బయటకు నెట్టబడును. కుట్టిన తరువాత సెక్షన్లలోని దారము వదులుగాకుండా వుండును. సెక్షన్లు అన్నింటిని లైయింగ్ ప్రెస్ లో బిగించి వాటిని వెనుకవైపున పెన్సిల్ తో సూయింగ్ గుర్తులు పెట్టవలయును. పుస్తకము పొడవునుబట్టి సూయింగ్ టేపుల సంఖ్యను నిర్ణయించుకోవాలి. సూయింగ్ టేపులు పుస్తకము మందముకన్నా రెండు అంగుళములు పెద్దవిగా నుండవలయును. సాధారణముగా 1 లేక 2 టేపులు చాలును. టేపుకు టేపుకు మధ్యన సమాన దూరముండవలయును. పుస్తకము పై వైపున 1 1/2 సెం.మిా. క్రింది వైపున 2 సెం.మిా. ల స్థలము వదిలి కెటిల్ ముడికి గాట్లు వేయవలయును. ఒక్క టేపునకు రెండువైపులా సరైన కొలతలో గాట్లు చేయాలి. గాట్లు పుస్తకము మధ్య కాగితము వరకు పడునట్లుగా చేయాలి. ఎక్కువలోతు చేయరాదు. గాట్లు వంకరగా వుండరాదు. అందువలన సెక్షన్ లు అటు ఇటు జరిగిపోవును. సూయింగ్ ఫ్రేమ్ ను వాడినప్పుడు టేపులను సరైన దూరములో బిగించుకొనవలయును. సూయింగ్ ఫ్రేమ్ నందు వెనుకవైపున కొంతభాగము గాడిగావుండును. ఇందులో " సూయింగ్ కీస్ " కు దారమును బిగించవలయును. పైవైపున టేపును సవరించుటకు వీలయినటువంటి క్రాస్ బార్ నకు బిగించవలెను. ఈ విధముగా సూయింగ్ ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి.
సూయింగ్ చేయువిధము :--
ఆఖరి సెక్షన్ ను ముందుగా తీసుకోవాలి. సిగ్నేచరు గుర్తు పైకి అగుపించునట్లుగా సూయింగ్ ఫ్రేమ్ మీద, గుర్తును కుడివైపునకు వచ్చులాగున వుంచవలయూను. గట్టి దారమును సూదిలోనికి ఎక్కించవలెను. దారమును కావలసినమటుకు తీసుకోవాలి. మరీ ఎక్కువ అయిన చిక్కుపడును. కాగితములను చించును. సెక్షన్ మధ్యలో ఎడమ చేతిని వుంచి, కుడిచేతితో దారము నింపిన సూదిని మొదటి రంధ్రము వెలుపలనుండి లోనికి నెట్టవలయును. సూదిని రెండవ రంధ్రమునుండి బయటకు తీసి, తిరిగి మూడవ రంధ్రము ద్వారా లోనికి నెట్టవలయును. దారముటేపు పై నుండి పోవును. సూదిని 4వ రంధ్రము నుండి బయటకు నెట్టి 5 వ రంధ్రము ద్వారా లోనికి పంపవలయును. ఈ విధముగా రెండవ టేపు పై నుండి దారము వెళ్ళును. చివరగా 6 వ రంధ్రము నుండి సూది బైటికి వచ్చును. మొదటి రంధ్రమువద్ద సుమారు 3 అం॥ దారమును వుంచి, మిగిలినదానిని కాగితములు చినుగకుండా దారము దిశలో లాగవలయును. ప్రస్తుతం టేపులను సరిగా సవరించుకొనవలయును. చివరినుండి రెండవ సెక్షన్ ను, సిగ్నేచరు పైకీ అగుపించులాగున కుట్టిన సెక్షన్ పైన పెట్టవలయును. ప్రస్తుతం సూది 6వ రంధ్రము నుండి 1వ రంధ్రము వరకు ఇది వరకు మాదిరే వ్యతిరేఖదిశలో పంపబడును. చివరిగా 1వ రంధ్రము వద్ద దారమునులాగి, క్రింది సెక్షన్ కు వ్రేలాడుచున్న దారముతోకలిపి, ముడి వేయుదురు. దీనిని కెటిల్ ముడి అంటారు. ఇందువలన రెండుసెక్షన్ లు ఒకదానితో నొకటి కలుసుకొనియుండును.
చివరనుండి మూడవ సెక్షన్ ను ఇంతకముందు మాదిరే కుట్టిన వాటి మీద వుంచి, వెనుకవైపున, పైవైపున సమానముగా వుండులాగున తటాటవలయును. సూది 1వ రంధ్రము నుండి 6వ రంధ్రము వరకు మొదటి సెక్షన్ మాదిరే వచ్చును.
చివరిగా దారమును వదులులేకుండా లాగి, సూదిని చివరి రెండు సెక్షన్ ల మధ్య నుండి తీసి మెలిక ముడిని వేయాలి. ఈ మెలిక ముడివలన, పైవైపున సెక్షన్ లు ఒకదానితో ఒకటి బిగింపబడుచున్నవి. ఈ ప్రకారము ఒక్కొక్క సెక్షన్ ను కుట్టవలయును. చివరిగా మొదటి సెక్షన్ పైకివచ్చును. కెటిల్ ముడిని గట్టిగా రెండుసార్లు వేసి 1\2 సెం.మీ. దారమును వదిలి కత్తిరించాలి. ఈ దారము కొసను సెక్షన్ ల మధ్యకు నెట్టాలి. పుస్తకము మందమునుబట్టి సూయింగ్ ఫ్రేమ్ లో 8 నుండి 10 పుస్తకాలు కుట్టవచ్చును. దారము టేపుల మీద నుండి పోవుటకు గమనించండి.
సాన్ యిన్ సూయింగ్ పద్థతి :
ఈ పద్థతి లైబ్రరీ సూయింగ్ కన్నా కొంత గట్టిది. ఈ పద్థతిని " లేసింగ్ యిన్ "
బోర్డ్సు విధానమునకు వాడెదరు. ఈ పద్థతికి టేపు సూయింగ్ పద్థతికి కొన్ని ముఖ్యమైన తేడాలు గలవు. ఇక్కడ టేపులకు బదులుగా లావుదారమును లేదా ( పురికొసను ) వాడెదరు. ఒక్కొక్క దారమునకు ఒకగాటునే చేస్తారు. ఈ గాటును ' V ' ఆకారములో చేస్తారు. దారము ' V ' ఆకారపుగాడిలో వుండి పైకి కనిపించదు. ఈ కుట్టుపద్థతిలో దారము కార్డు పైనుండి వెళ్ళును. సూది దారము కార్డునకు ఒకవైపునుండి బయటకువచ్చి, దాని మీద నుండి , అదే రంధ్రములోనికి పోవును. ఈ విధముగా మిగిలిన కార్డ్సు మీదగుండా వెళ్ళి చివరి రంధ్రమును. చేరును. మొదటి రంధ్రము వద్ద కొంతదారమును వుంచి చివరి కొసను లాగవలయును. మిగిలిన పద్థతులు, ఏర్పాట్లు అన్నీ టేపు సూయింగ్ మాదిరే వుండును. సూయింగ్ అయిన తరువాత, మొదటి రెండు సెక్షన్ లను, చివరి రెండు సెక్షన్ లను ' టప్పింగ్ ఆన్ ' పద్థతిలో అంటించి ప్రెస్సింగ్ చేయాలి.
దారము టేపు సూయింగ్ మాదిరె పోవుటను గమనించండి. ఒకే రంధ్రమునుండి సూది బయటకు వచ్చి అదే రంధ్రమునుండి లోనికి పోవుటకు గమనించండి.
ప్రశ్నలు
1. సూయీంగ్ పనిని ఎప్పుడు ప్రారంభించెదరు?
2. సూయింగ్ కు ముందు తీసుకొనవలసిన నిర్ణయములేవి?
3. లైబ్రెరీ సూయింగ్ కు ఏ విధముగా ఏర్పాట్లు చేసుకోవాలి?
4. కెటిల్ ముడి వలన కలుగు లాభమేమి?
5. సాకెట్స్ చేయునపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలేవి?
6. సెక్షన్స్ ను సూయింగ్ కు ముందు ఎందుకు ప్రెస్ చేయాలి?
7. లైబ్రెరీ సూయింగ్ కు సాన్ యిన్ సూయింగ్ కు గల తేడాలేవి?
8. సాన్ యిన్ సూయింగ్ ను పటము ద్వారా వివరించుము?
No comments:
Post a Comment