Tuesday, September 28, 2021

బుక్ బైండింగ్ - 8 - కాగితపు అట్టలు

 కాగితపు   అట్టలు  :—

           పుస్తకములు   బైండింగ్   చేయుటకు   అట్టలు   చాలా    ముఖ్యమైనవి.   అట్టలలో   రకరకాలు   గలవు.   అట్టలను   గడ్డి,   పాతబట్టలు,   కాగితము,  చెరుకు  పిప్పి   మొదలగు  పీచుపదార్థములతో,   మరికొన్ని   రసాయనపదార్థములు   కలిపి   గుజ్జుగా   చేసి,  అట్టి    గుజ్జును    రకరకాల   మందముల్లోను,  సైజుల్లోనుపోసి   అట్టలుచేస్తారు.   గడ్డితో   చేసిన  అట్టలు  దృడముగాను   బరువుగాను  వుంటాయి.   కాని   వంచినయెడల   వెంటనే   విరిగిపోయే  స్వభావముగలదు.    సాధారణముగా   ఈ   అట్టలు  25"  x  30"  సైజులోను,   1 lb,  1 1/2  lb   మరియు  2 lb   మందములో   దొరకును.   యింకా   మందమైన   అట్టలు   కావలసిన   యెడల   రెండుఅట్టలను    కలిపి    అంటించవలయును.   ఈ    అట్టలను   పుస్తకాల    బైండింగ్   చేయుటకు,   స్వీట్సు   పెట్టెలు   ( Sweets  boxes )   తయారీలోను,   రైటింగ్   ప్యాడ్సుకు   విరివిగా   వాడుతారు.  ఈ   అట్టలలోని   ఇతర   రకములు   ఏవనగా   చిప్  బోర్డ్సు   ( Chip boards ),   గ్రే  బోర్డ్సు   ( Gray  boards ),   పల్పు  బోర్డ్సు   ( Pulp boards )   మరియు   కారుగేటెడ్   బోర్డ్సు  ( Corrugated  boards ).   సాధారణముగా   ఈ   రకపు   అట్టలు   0.05m.m.   మందమునుండి  4.50 m.m   మందము   వరకు   వుండును.  అనేక   సైజులు,   రంగులలో   దొరుకును.   అట్టల   రకములలో   Straw  boards   తప్ప   మిగతా   అన్నిరకములు   సున్నితముగా,   కావలసిన   పద్ధతులలో   వంచుకొనవచ్చును.   అట్టిస్వభావము   కల్గినందువలన   పల్పు  బోర్డ్సును   ఎక్కువగా   కార్టన్   ( Cartons )   తయారీలో   ఉపయోగించుచున్నారు.   ఈ    అట్టలను   కూడా    తగుజాగ్రత్తలో    దాచిపెట్టవలయును.   లేనిచో   అవి   వంకరలు   తిరిగిపోవును.   ఉపయోగించుటకు   కష్టముగానుండును.   పుస్తకముల   నాణ్యత   చెడిపోవును.

     పుస్తకములకు   కవరు   వేయుటకు   ఉపయోగించు  వస్తువులు   ( Covering Materals ) :—  కవరు   వేయుటకు    రకములైన   వస్తువులను    వాడుతారు.    అట్టివాటిలో   కాగితము,  గుడ్డు,  క్యాలికో,   రెక్సిన్  మరియు   తోలు   ముఖ్యమైనవి.   పైన   తెల్పిన   రకములలో   కావలసిన    వస్తువును,  అవసరమునుబట్టి   పుస్తకాల    ఖరీదును  బట్టి   ఉపయోగించుకొంటారు.   విలువైన  పుస్తకాలకు   తోలు   లేదా   క్యాన్ వాన్   వాడతారు.   పైన   తెల్పిన    వస్తువులను  అట్టలకు   అంటించుటకు   మైదా   ( Paste )ను  జాని   లేదా   గ్లూ ( Glue )ను  గాని   వాడుదురు.    తోళ్ళలో   వివిధ    రకములైన   నాణ్యతగలవు.

      దారపు  వస్తువులు ( Textile Materials ) :—

   దారములను,   లెనిన్ ,  ప్రత్తి,  మరియు ' నైలాన్ 'ద్వారా   తయారుచేయుదురు.   మంచిరకపు   దారమును   ఎనుకొనవలయును.  నైలాన్  దారమువలన    పుస్తకము    ఎక్కువలావురాదు.  దారములు   కండెలల   లభించును.  వీటికి   రంగు పూత   వేయబడియుండును.   కార్స్డ్ అనునవి  దారములకన్నా   మందముగానుండును.   వీటినికూడా   పుస్తకము  కుట్టుటలో     ఉపయోగింతురు.  ' సిల్కు   రిబ్బన్స్ '   మరియు  సూయింగ్  టేపులు,   లేసులు   మొదలగునవి  కూడా   అప్పుడప్పుడు   కొనిరకముల  బైండింగ్    పనులకు  వాడుతారు.

లోహాపు   వస్తువులు  ( Metal Items ) :—

            పుస్తకాలు   కుట్టుటకు   ఉపయోగించు   తీగలు  కోటింగ్   వేయబడి   వివిధ   గేజ్ లలో   దొరుకును.    స్ర్పింగ్   తీగ   చుట్టలు  ( Spirals ) కుడా  ఒక  రకమైన   బైండింగ్   పద్థతికి   వాడుతారు.   క్యాలండర్    రిమ్మింగ్   ప్లేటులు   మొదలైన  లోహాసంబందమైన   వస్తువులు    కూడా   కవలసియుండును.

అంటించుటకు   ఉపయోగించు  వస్తువులు ( Adhesives ) :— 

    ' గ్లూ '   మరియు   పేస్టు   అనునవి   సాధారణముగా   అంటించుటకు   ఉపయోగించు   వస్తువులు    ' గ్లూ '     అనునది  జంతుసంబంధమైన   వస్తువు.   ఇది   చిన్న  చిన్న   కేకులరూపములో   దొరకును.   దీనిని    ప్రత్యేకమైన   పాత్రలో   కరుగపెట్టుదురు.    దీనిని   వేడిచేసి   ఉపయోగించవలయును.   పేస్టు   అనునది   మైదా   పిండితో   ఉడికించి   తయారుచేస్తారు.   దీనిలో   క్రిమిసంహారకపు   మందీలు   కూడా   వాడుతారు.     ' గ్లూ '   వెంటనే   అంటుకొనును.   పేస్టు   అంటుకొనుటకు   కొంత   వ్యవధి   పట్టును.  P.V.G  అను  అంటించు   పదార్థమును   కూడా       పుస్తకాలు   బైండింగ్   చేయుటలో    వాడుచున్నారు.   ఈ    అతికీంచు   పదార్థములను   జాగ్రతపరచవలెను.   లేనిచో    బూజుపట్టి   చెడిపోవును.   వాటిలొ   నాణ్యత   లోపించును.

                           ప్రశ్నలు

1. బైండింగ్ కు   కావలసిన   వస్తువులను   ఎనుకొనుటలో   ఏమి   జాగ్రత్తలు   పాటింతురు?

2. కాగితములు    కొనునప్పుడు  ఏ  విషయములను   గుర్తుంచుకొనవలెను? 

3. పుస్తకములు   కవరుచేయుటకు   ఉపయోగించు   వస్తువులేవి?

4. పుస్తకాలు   అతికించుటకు 

  ఉపయోగించు  పదార్ధములేవి?

అధ్యాయము—7

బైండింగ్  వస్తువులను  ఉంచు   గిడ్డంగీ  మరియు  అందుచేయు   వివిధ  పనులు ( Binding Ware House )

      బైండింగ్    వేర్  హౌసు   ( Ware House ) అనగా   బైండింగ్ కు   కావలసిన    వివిధ   రకముల   వస్తువులను   బద్రపరచునటువంటి   గిడ్డంగీ  అని   అర్ధము.  ఈ   గీడ్డంగులను   ముఖ్యముగా   రెండు   వీధములుగా  విభజించవచ్చును.   మొదటిది   తెల్ల    కాగితము   గిడ్డంగి  ( White Paper Ware House )అనియు,  రెండవదిముద్రిత   కాగితముల   గిడ్డంగి ( Printed Paper Ware House )  అనియు  అంటారు.  తెల్ల  కాగితముల   గిడ్డంగి   బైండింగ్    షాపునకు   దగ్గరలో   ఉండవలయును.   అందువలన   బైండింగ్ కు   కావలసిన   వివిధ   రకముల  వస్తువులను    పదార్థములను   సులువుగా,   వసతిగా   చేరవేసుకోవచ్చును.    ఈ    గిడ్డంగులలో   వస్తువులను   బద్రపరచుటకు   శాస్తీయ   పద్థతులు   గలవు.   కాగితపు   కట్టలను    ఎత్తుగా    కొయ్య    చట్రములలో   ( Racks  )  పెట్టవలయును.   ఆవిధముగా   పెట్టిన    కాగితపు   కట్టలకు    సంబందించిన    వివరములను   అంటే    ఆ    కాగితము    యొక్క   కొలతలు   మందము,   తయారుచేసిన   కంపెనీ,   కొన్న    తారీఖు,   ఎన్ని   కొన్నది,   మరియు,   ఎన్ని    మిగులు   వున్నవి   అనే   వివరములు   తెలుపు   పట్టీని   తయారుచేసి    ఒక్కొక్కరకపు   కాగితము   అరలకు   లేదా   ఇతర   వస్తువులకు,   వాటిని   బద్రపరచిన   చట్రములకు   వ్రేలాడదీయవలయును.    అట్లా    చేయకపోయిన   గిడ్డంగిలో   ఏ  యే    వస్తువులు   ఎంతెంత   వున్నవి   తెలియదు.   అవసరమునకు    కావలసిన   వస్తువులు   లేకపోయిన   పని   అంతా   స్థంభించిపోవును.   దానివలన   కావలసిన   వస్తువులు   అనుకొన్న   సమయానికి   దొరకకపోవచ్చును.   అందువలన   గిడ్డంగిలోని   వస్తువుల    వివరములను   ముందుగానే   తెలిసికొని,   వాటిని   కొని   బద్రపరచినయెడల   పైన    తెల్పిన    ఇబ్బందులను   ఎదుర్కొనుటకు   వీలుకల్గును.    పెద్ద   పెద్ద   ముద్రణాలయములలో   దీనికిగాను   ప్రత్యేకముగా   గిడ్డంగి   అధికారులు   వుంటారు.  వారు   గిడ్డంగి   నిర్వహణ   వ్యవహారములు  చూస్తారు.

      పేపర్   ర్యాక్స్ ను   పెట్టునప్పుడు   అవి   గోడలకుగాని,   క్రింద   నేలకుగాని    తగులకుండా   వుంచవలయును.   అందువలన   కాగితములకు   చదలుపట్టకుండా  వుండును.   పేపర్సుకు   బాగా   గాలి    వెల్తురు    తగులునట్లుగా   వుండవలెను.   

కాగితములు   ఏ   యే   పనికి   ఎంతెంత   విడుదలచేసినది   వివరముగా   పట్టీలో   వ్రాసి,   సంతకము    చేయవలయును.   కాగితములు   వాతావరణ    పరిస్థితులకు   మార్పుచెందును.   అందువలన    ముద్రించునప్పుడుగాని   లేదా   బైండింగ్   చేయునప్పుడు   గాని    ఇబ్బందులు   ఏర్పడును.   కాబట్టి    కాగితముల   గిడ్డంగిలో    వాతావరణమును   క్రమబద్ధము    చేయవలయును.   గిడ్డంగిలోని   గాలిలోని   తేమ   సుమారు   50॰  నుండి  60॰   వుండులాగున   చూడవలయును.    ఉష్ణోగ్రత   20॰ — 21॰C   వుండులాగున   చూడవలయును.    పైనతెల్పిన   పరిస్థితులలో    కాగితములు   ఏమి    చెడిపోవు.   ఒక్కొక్క   పనికి   ఎంత   కాగితముకావలసినది,  ' పనిచీటి '   ప్రకారము   లెక్కించి  సరఫరా   చేయవలయును.

ముద్రణా   కాగితముల   గిడ్డంగి   ( Printed paper Ware  House ) :

         ఇది   బైండింగ్   సెక్షన్   లోనే   ఒక   ప్రత్యేక   ప్రదేశములో   కేటాయించుతారు.   ముద్రణాలయములో   వివిధ   పద్ధతులలో   ముద్రించబడిన   కాగితములు   పుస్తకాలుగా   తయారుచేయుట   కొరకై   బైండింగ్ కు   వచ్చును.    ఒక    పుస్తకములోని    వివిధ   ఫారములు   ఒకేసారి   బైండింగుకు   చేరవు.   కాని   క్రమేణ   వస్తూనే    వుంటాయి.   అట్లా   వచ్చిన   వివిధ   ఫారములకు   సంబంధించిన   కాగితములను   లెక్కించి   తీసుకొనవలెను.   లేనిచో   చివరికి   కొన్ని    పుస్తకములు   తక్కువగును.   ముందుగా  ఒక్కొక్క   ఫారమును   లెక్కించి,   తక్కువకాబడ్డ  కాగితముల    వివరములను    తెల్పినయెడల,   ముద్రించి    సరఫరాచేయగలరు.   లేనిచో    అనుకున్నదానికన్నా   తక్కువ   పుస్తకములు   చేయుట   జరుగును.   ఇంకొక    ముఖ్యమైన   విషయమేమనగా   బైండింగ్ లోనికి   ఫారములు   పుచ్చుకొనునప్పుడు,   అవి    రెండువైపుల   ముద్రించబడ్డవా?  లేదా?   అనేది   చూడాలి    తరువాత  అన్నిరంగులు   ముద్రించబడ్డవా?  లేదా?   అనేది   చూడాలి.    జబ్  డాకెట్టు   ప్రకారము   అన్ని   ఫారాలు,   కాపీలు   ముద్రించినది   లేనిది   కూడా   తెలుసుకొనవలయును.

ఆ   విధముగా   ప్రింటు   అయివచ్చిన    కాగితములను   లెక్కవ్రాసి    పెట్టుకొనవలెను.   ప్రింటింగ్   అయిన   కాగితములను   జాగ్రత్తగా   ఉపయోగించవలెను.   బైండింగ్   అగుచున్న    కాపీలను   పదిలపరచుటకు   తగిన   స్థలము   వుండవలెను.   ఈ   ప్రదేశమునకు   గాలి   వెలుతురు   బాగుగా  ఉండవలయును.   


       బైండింగ్    గిడ్డంగిలో   చేయు   వివిధ   

                           పనులు

            ( Ware  House  Operation )

1.   కాగితములు   లెక్కపెట్టుట    ( Counting ) :

          తెల్లకాగితములు   గాని,   ముద్రించిన   కాగితములు   గాని    ముందుగా   లెక్కించవలయును.  కాగితములను   ఒక   పద్ధతిలో   ఏటవాలుగా   వంచి,  కాగితములను   కుడిచేతితో   పట్టుకొని   ఎడమచేతి   బ్రొటనవ్రేలితో

 లెక్కించవలెను.   లెక్కించిన    కాగితములను  శుభ్రమైన   ప్రదేశములో   పెట్టవలెను.   లెక్కించునప్పుడు   చేతులు   శుభ్రముగా   నుండవలెను.   చిరిగిన   కాగితములను,   బాగా   ముద్రణకాని   కాగితములను   లెక్కలోనికి   తీసుకొనరాదు.   కాగితములను   కచ్చితముగా   లెక్కపెట్టి   ఎక్కువ   తక్కువ   కాకుండా   చూడవలెను.

2.  కాగితములను  ఆరపెట్టు   పద్ధతి  ( Hot  and  Cold Pressing )  :

           ఒక్కొక్కసారి   ప్రింటు   అయిన   కాగితములు    వెంటవెంటనే   పుస్తకము   తయారు   చేయవలసియుండును.   అటువంటి   పరిస్థితులలో   ప్రింటు   సరిగా  ఆరిపోదు.   అప్పుడు   ప్రింటు   అయిన   కాగితములను  రెండు   నున్నని  ఇనుప   వేడి   రోలర్సు   మధ్యనుండి   పంపుదురు.  ఆ  వేడికి   ప్రింటు   ఆరిపోవును.

            మరి   ఒక    పద్ధతిలో   ప్రింటు   అయిన   కాగితముల   పై   వేరొక    మామూలు    కాగితమును   పరచి  ( Slip Sheeting )  కొన్ని  కాగితములను   ఒకేమారు   హార్డుప్రెస్   క్రింద   కొంతసేపు   కదిలించకుండా   వుంచుతారు.   దీనిని   కోల్డు   ప్రెస్  ( Cold Press )  అని  అంటారు.   దీనివలన   ప్రింటు   చెడిపోదు.  కాని   వ్యవధి   ఎక్కువగా   పట్టును.

3.  జాగింగ్  ( Jogging ):

            దీనివలన     కాగితములమధ్య  నున్నటువంటి   చినిగిపోయిన   కాగితములు,   దుమ్ము, గాలి,  వగైరాలు   బయటకు  నెట్టబడి,   కాగితములు  సమాన   అంచులుగా   ఏర్పడును. కాగితము   చదునుగా  ఏర్పడును.  మరకలు   పడకుండా    కాగితములను   శుభ్రముగా   నుంచవలెను.  జాగింగ్   చేసిన   కాగితములు  యంత్రములలోకి    పంపుటకు  ( Feeding )  బాగా   వుండును.

4.  కాగితములు  మడచుట  ( Folding ) :

            కాగితములను  చేతితోగాని,   యంత్రముల   సహాయమునగాని   మడవవచ్చును.   కాగితములు  మడచునప్పుడు   జాగ్రత్తలు   తీసుకొని   ఎక్కువ  వృధా   కాకుండా   చుడవలెను.  మడతలు   సరిఅయిన   పద్ధతిలో   చేయవలెను.   లేనిచో   ముందు   పేజీలు   వెనుకకు,  వెనుకవి    ముందుకువచ్చును.  కాగితములు  మడచునప్పుడు   ఫారమ్ నంబరును  ( లేదా )  సిగ్నేచరు   మార్కును   గైడుగా   పెట్టుకొని   మడవవలెను.   ఒక్కొక్కసారి    యింపోజింగు   స్కీమును   కూడా   ఆలోచించి   మడవవలెను.   మందమైన   కాగితములు  మడచునప్పుడు    మడతల   మధ్య   గాలి   బంధించబడును.   దానిని   జాగ్రత్తగా    తొలగించవలెను.   మడతలు   వేయునప్పుడు   ఫోల్డింగ్  టు   ప్రింటు   అనియు   ఫోల్డు   టు   పేపరు   అనియు   రెండు   పద్ధతులుగలవు.   అందులో   మొదటి    పద్ధతి   చేయునప్పుడు   తగుజాగ్రత్తతో   నిదానముగా   చేయవలెను.

5.  కట్టలు   కట్టుట  ( Bundling ) :

            మడచిన    కాగితములను    జాగ్రత్తగా   కట్టలు   కట్టవలెను.   అట్లాచేసినందు   వలన   సెక్షన్ లు   శుభ్రముగా   నుండును.   వేరే   సెక్షన్స్ లో     కలిసిపోవు.    ప్రమాదముండదు.   సెక్షన్    మధ్య   గాలి   బయటకువెళ్ళగొట్టబడుటచే   అవి   చదునుగా    నుండును.    కట్టలను   గుర్తుగా   ఒకచోట   పెట్టవలెను.   ఈ   కట్టలు   కట్టు     విధానము   చేతితోగాని,   యంత్రముల   సహాయమునగాని     చేయవచ్చును.

6.  గేదరింగ్  ( Gathering ) :

            గేదరింగ్   అనగా   ఫోల్డు   అయినటువంటి      సెక్షన్ లన్నిటిని   వరుసక్రమములో   జమచేయడము.   ఈ    పనిని    చేయుటకు   ముందు   సెక్షన్ లను    అన్నిటిని    వరుసక్రమములో    పేర్చుకొనవలెను.   అటుపిమ్మట     ఆఖరు    సెక్షన్   నుండి    మొదలుపెట్టి    మొదటి    సెక్షను   వరకు    ఒక్కొక్క    సెక్షన్ ను    వరుసక్రమములో    తీసుకొనవలెను.   అప్పుడు    ఆఖరి    సెక్షన్     మొదలుపేజి    పైకివచ్చును.   ఈ   విధముగా   కూర్చిన   పుస్తకాలు    టేబుల్  పై    పెట్టి,   మళ్ళీ    అదే     విధముగా   అన్ని    పుస్తకాలు   అయిపోవువరకు    గేదరింగ్   చేయవలెను.   ఈ   గేదరింగ్    పద్ధతిని   యంత్రముల    సహాయమున     కూడా    చేయవచ్చును.   గేదరింగ్    అయిన    సెక్షన్స్ ను    మరియొక    మారు   సరిగా    వున్నదీ    లేనిదీ    పరీక్షచేయవలెను.   ఆ   విధముగా   పరీక్షచేయుటను   "  కొలేటింగ్ "  ( Collating )   అని    అంటారు.  ఫారమ్   నంబర్లు   అన్నీ   సరిగా    వున్నవా  లేదా !   ఏవైన   సెక్షన్ లు    తలక్రిందులుగా    పెట్టబడినవా!   అన్ని   సెక్షన్ లు       ఒకేపనికి   సంబంధించినవా   లేదా!   అనే   విషయములు   ముఖ్యముగా   గమనించవలసిన    పనులు.   తదుపరి    పుస్తకమును    కుట్టుటకు   తీసుకొనిపోవుదురు.   

             పైన   తెల్పిన    పనులేకాకుండా   ఇంకా   ఇతరత్రా  ( Miscellaneous )  పనులు  చాలా   గలవు.   అట్టివాటిలో   Punching ,  Drilling ,  Eyeleting ,  Index  cutting ,  Round  cornering ,   Label  punching ,  Gumming ,  Guarding ,  మరియు  Numbering   అనునవి   గలవు.

                         ప్రశ్నలు

1.  కాగితపు   గిడ్డంగులు   ఎన్నిరకములు ?   వాటి   ఉపయోగమేమిటి  ?

2.  కాగితపు   గిడ్డంగి   నిర్వహణాధికారి  భాధ్యతలేవి?

3.  కాగితములు   ఏ   విధముగా   జాగ్రత్తపరచుదురు?

4.  ముద్రణా   కాగితపు   గిడ్డంగిలో    తీసుకొనవలసిన   జాగ్రత్తలేవి?

5.  కాగితపు   కౌంటింగ్   వలన   ఏమి  లాభము ?

6.  గేదరింగ్   అనగానేమి?  దానివలన   ఉపయోగములేమిటి?  

7.  Ware  House  Operations  ఏవి?

అధ్యాయము —8

             పుస్తకాలు   కుట్టు   పద్ధతులు

                  ( Book  Stitching )

        వేర్   హౌస్   ఆపరేషన్స్   అయిన   తరువాత    ముఖ్యంగా   గేదరింగ్   పని   అయిన   తరువాత,   కుట్టడము   మొదలవుతుంది.   పుస్తకాలు   కుట్టుటకు  ముందుగా   ఏ   విధంగా   కుట్టవలయునో,   ఏ   విధంగా   బైండింగ్   చేయవలయునో   అనే   అనేక   విషయాలు   వాటివల్ల   వచ్చు   ఇబ్బందులు   ఆలోచించుకోవాలి.   పుస్తకాలను   స్వల్పవ్యవధిలో    అందించాలి    అనుకుంటే   మెషిన్ కుట్టు   చాలా   త్వరగాను,   తక్కువ   ఖర్చుతోను   అగును.  మెషిన్ కుట్టుకు   ' తీగ '   నుపయోగించి   కుట్టుతారు.   ఆ   పద్ధతి   చాలా   ఆదాయమైన   పద్ధతి.   దారమును   ఉపయోగించి   మెషిన్   సహాయమున   ( Machine  Sewing )  కూడా   పుస్తకాలను   కుట్టవచ్చును.   తక్కువ   కాపీలు   కుట్టవలసినప్పుడు    చేతితో    కుట్టుదురు.   అట్లాంటప్పుడు   3  రంధ్రాలు,  5  రంధ్రాలు   లేక 7   

రంధ్రాలు   వేసి   కుట్టుతారు.   పుస్తకాల    సైజునుబట్టి    రంధ్రాలను   నిర్ణయించుకోవాలి.   పై     పద్ధతులను   అనుసరించి   పుస్తకాలను   ప్రక్కవైపునుండిగాని   లేదా    మధ్యవైపునుండిగాని         కుట్టవచ్చును.

            పుస్తకాలు    కుట్టుపద్ధతిలో   మరియొక   విధమును   సూయింగ్   ( Sewing )  అని   అంటారు.   ఇందులో    పైన    తెల్పిన   విధముగా    అన్ని    సెక్షన్ లను   ఒకేమారు   కుట్టరు.   ఒక్కొక్క  

సెక్షన్ ను   అల్లిక    పద్ధతిలో   కుట్టుతారు.   ఒక   సెక్షన్   కుట్టడము   అయిన    తరువాత,    దానిని   మరియొక    సెక్షన్ తో    కలిపి   మెలికముడి    వేసి,   క్రొత్త    సెక్షన్ ను   పూర్వపు   పద్ధతిలోనే   కుట్టుతారు.    ఆ  విధంగా   ఆఖరి    సెక్షన్ తో     మొదలుపెట్టి   మొదటిసెక్షన్   పైకి    వచ్చులాగున    కుట్టుతారు.   ఈ    సూయింగ్    చేయడానికి   ముందు,   పుస్తకము   వెనుకభాగమున    రంపముతో   గాట్లు    చేస్తారు.   ( సూయింగ్   సాకట్సు )   ఈ   సాకట్సు   సంఖ్యను   పుస్తకము   పొడవునుబట్టి   నిర్ణయించుకోవాలి.   ఆ   తరువాత    సూయింగ్  టేపుగాని,   సూయింగ్   కార్డు    ( Cord )  గాని    ఉపయోగించుతారు.   ఈ    

సెక్షన్ ల    రెండు   చివరలయందు   కెటిల్   స్టిచ్  ( Kettle  Stitch )  వేయుటకుగాను   రెండుగాట్లు   వేస్తారు.   అందువలన   సూదిని   సులభముగా   కాగితములలోనికి   దింపుటకు   వీలు   అవుతుంది.

           సూయింగ్    చేతితో   చేయునప్పుడు   సూయింగ్   ఫ్రేమ్ ను    ఉపయోగించి   చేయవచ్చును.   సూయింగ్   పద్ధతిలో     పుస్తకము   ఎంత   లావుగానైనా   కుట్టవచ్చును.   అదే  స్టిచ్చింగ్   పద్ధతిలో     పుస్తకాలను   పరిమితమైన    మందమువరకే    కుట్టవచ్చును.    పుస్తకము   ఎక్కువ   మందముగా   వుండిన    స్టిచ్చింగ్   బాగా   పడదు.    పైగా   పుస్తకాన్ని    తెరచుట   చాలా   కష్టముగానుండి,    చదువుటకు    వీలుకాదు.    కావున   తక్కువ    పేజీలువున్న   పుస్తకాలను    వైర్    స్టిచ్చింగ్    పద్ధతిలోగాని   దారపు    స్టిచ్చింగ్    పద్ధతిలోగాని   కుట్టుతారు.   ఎక్కవ   పేజీలు   ఉన్న    పుస్తకాలను    సూయింగ్

పద్ధతిలో   కుట్టుతారు.   సూయింగ్   అయిన    పుస్తకాలు    బైండింగ్    చేయటానికి   బాగా   వుంటాయి.

దారముతో   కుట్టువిధానము   ( Thread  Stitching ) :

          పుస్తకములోని    అన్ని   ఫారమ్సును   మడిచిన   తరువాత   వాటిని   గేదరింగ్   చేసి,    కుట్టవలయును.    కుట్టుటకుముందు    ఎన్ని    రంధ్రములువేసి   కుట్టవలయునో   నిర్ణయించుకోవాలి.   మూడు   రంధ్రముల   కుట్టునకు   బాడ్ కిన్    సహాయముతో    పుస్తకమునకు   వెనుకవైపునుండి   సుమారుగా  1/8"  అంగుళస్థళమువదలి    సమాన    దూరములో   3    రంధ్రములు   చేయాలి.   అదేమాదిరి   పుస్తకము   పై  వైపున    క్రింద   వైపున   తగిన   మార్జిన్   చూసుకోవాలి.   తరువాత   సూదికి   దారము   ఎక్కించుకొని    రెండవ   రంధ్రమునుండి   కుట్టుట   మొదలుపెట్టాలి.   సూది   2వ   రంధ్రము   క్రింది   నుండి   వచ్చి  3వ   రంధ్రము    ద్వారా   పైకివచ్చును.   తరువాత   సూది   తిరిగి    మూడవ   రంధ్రము   నుండి   రెండవ   రంధ్రములోనికి   పోవును.   అక్కడ  నుండి    1వ   రంధ్రము  పై  నుండి   క్రిందికి   వచ్చును.   ప్రస్తుతం   2వ   రంధ్రమువద్ద   దారము   ముడి   వేయుదురు.   

దారమును   గట్టిగాలాగి   ముడి   వేయవలయును.   రెండు   ముడులువేసిన    తరువాత   కత్తెరతో   మిగులు   దారమును    కత్తిరించవలయును.   ఇదే   ప్రకారము  అన్ని   కాపీలు   కుట్టవలయును.   5  రంధ్రాల   కుట్టునకు  

 సూది   మూడవ   రంధ్రము   నుండి     మొదలగును.  7  రంధ్రాల   కుట్టుకు   4వ రంధ్రము   నుండి     మొదలగును.    పుస్తకము  సైజునుబట్టి  రంధ్రాలను   వేసుకోవాలి.   దారముతో   కుట్టు   పుస్తకాలు  1  అంగుళము   మందముకన్నా   ఎక్కువ   వుండిన   అట్టివాటిని   వైర్  స్టిచ్చింగ్   ద్వారా   కుట్టుట  మంచిది.  పుస్తకాల   మందము  2  అంగుళముల  పైన   వుండిన   అట్టివాటిని   సూయింగ్   పద్ధతి   ద్వారా  కుట్టుట   మంచిది.


పుస్తకాలను   తీగకుట్టు   యంత్రముతో  కుట్టు   విధానము  ( Wire  stitching ) :

       ఎక్కువ   పుస్తకాలను   అతితక్కువ   ఖర్చుతో 

అతితక్కువ  కాలములో   ఈ   తీగకుట్టు   యంత్రమును   ఉపయోగించి   కుట్టవచ్చును.    ఈ   తీగకుట్టు   యంత్రములను,   మోటారు   సహాయముతోగాని   లేదా   కాలి   పెడల్   సహాయముతోగాని   నడపవచ్చును.   కాలి   పెడల్ తో    కుట్టుయంత్రములు    1  అంగుళము  మందమును  మించి   కుట్టలేవు.   కాని   మోటారుతో    నడపబడు   యంత్రములు  2  అంగుళముల  మందమునుండి    సుమారు   4  అంగుళముల   వరకు   కూడా  కుట్టగలవు.   కాని   ఎక్కువ   మందముగల   పుస్తకాలను   ఈ   పద్ధతిలో   కుట్టుటవలన    అట్టి   పుస్తకాల   మధ్య   పేజీలను   తెరచి   చదువుటకు   కష్టముగా  నుండును.   అందువలన   పుస్తకమునకు   పైన   క్రీంది   అంచీలు   గల    కాగితములు   త్వరగా   చిరిగి   ఊడిపోవును.   ఎక్కువ    మందముగల   పుస్తకాలను   సూయింగ్   చేయుట   మంచిది.

ఈ    యంత్రములకు     తీగచుట్టలు   బిగింపబడి   యుండును.   తీగచుట్టలలో   అనేక    రకములైన   మందముగల   తీగలుగలవు.   అనగా   16 గేజి,  18 గేజి,  22 గేజి,  24 గేజి   అనెడి   రకములు   గలవు.   తక్కువ   గేజిగల   తీగలు   మందము   ఎక్కువగా   నుండును.   పుస్తకము   సైజునుబట్టి   ఏదో   ఒక   రకపు   తీగను   నిర్ణయించుకొనవలయును.   తరువాత   తీగచుట్ట   నుండి    తీగను   చక్కబరచు   రంధ్రములనుండి    కుట్టు   ప్రదేశమునకు   అందించవలయును.   పుస్తకము   మందమును,   గేజి   సహాయమును   కొల్పుకొనవలెను.   మిషన్   బ్యాక్   గేజిని,   ప్రక్కవైపు  గేజిని   సవరించుకొనవలయును.   తరువాత   పుస్తకమును   కుట్టు   ప్రదేశమున   వుంచి,   పెడల్ ను   కాలితో   అదమవలెను.  అప్పుడు   యంత్రము   కుట్టును.   కుట్టుపడిన   వెంటనే   కాలి   పెడల్   పై   నుండి   తీయవలయును.   లేనిచో   యంత్రము   వరుసగా   కుట్టుచునే   వుండును.   అందువలన   యంత్రము   త్వరలో   చెడిపోవును.

            ఈ     కుట్టు   యంత్రములు    అనేకరకములు.   వీటిలో   కొన్నింటికి   రెండు  తీగచుట్టలు   బిగించి    కుట్టు   వసతులుగలవు.   అన్ని   యంత్రములలోను,    పుస్తకాలమధ్యనుండి   గాని,    ప్రక్కవైపునుండిగాని   కుట్టుటకు   వసతిగలదు.      ఈ    యంత్రములు   నడుపువాడు   వానిని   నడుతుపద్ధతులు   బాగా   తెలిసికొని   వుండవలెను.   లేనిచో    పుస్తకములు     సరిగా   కుట్టబడవు.   మరియు   యంత్రముకూడా    అతిత్వరలో   చెడిపోవును.   యంత్రమును   వాడుటకుముందు   దానిని   శుభ్రముగా   తుడిచి,   చమురువేసి,   తరువాత   పనిచేయవలను.

         

                            ప్రశ్నలు

1.  పుస్తకములు   కుట్టుటకు   ముందు   ఏ   విషయములను   గురించి   ఆలోచించాలి.  

2.  Book  Stitching  నకు   Book  Sewing  నకు   గల   తేడా   ఏమిటి?

3.  Thread  Stitching   ఏ   విధముగా   చేస్తారు?

4.  Wire  Stitching   ఏ   విధముగా   చేస్తారు?


                     అధ్యాయము —9

        పుస్తకాలకు   అట్టలువేయు    పద్ధతులు

                     ( Book  Covering )


             పుస్తకాలకు   అట్టలువేయడము    అనేది    అన్నిపనులవలెనే    ముఖ్యమైనది.    పుస్తకముల     యొక్క    అందము,   ఆకర్షణ   ఈ   కవరింగ్    పద్ధతులపైననే     ముఖ్యముగా   ఆధారపడియుండును.   కావున   పుస్తకాలకు   కవరింగ్    చేయునపుడు   వాటి   విలువను,   వాడునట్టి   విధానమును   దృష్టిలో   వుంచుకొని   వాటికి   తగినటువంటి   కవరింగ్    వస్తువులను   ఎన్నుకొనవలయును.   ఉదా :    తోలు,   రెక్సిన్ ,   కేన్ వాస్   అను   కవరింగ్    వస్తువులను   ఖరీదు   అయిన    పుస్తకాలకు   ఎక్కువకాలము    మన్నిక   కల్గి   యుండుటకు   వాడుతారు.   ఇవి   ఖరీదు   అయిన    వస్తువులు.    తక్కువ   ధరగల   పుస్తకాలకు   క్యాలికో,   గుడ్డ,   మరియు   రంగు   కాగితములు   వాడుతారు.   ప్రస్తుతం   ప్లాస్టిక్    అట్టలను   కూడా   తయారుచేసి   పుస్తకములకు   బిగించుచున్నారు.   ఇట్టి    ప్లాస్టిక్   కవరులను   అంటించు  అవసరములేదు.   వాటిని   కేవలము   పుస్తకమునకు   తొడగవలసి   యుండును.   అందువలన   పేస్ట్    గాని   లేదా   ' గ్లూ '   అనే    పదార్థములను   అతికించుటకు   వాడనవసరములేదు.   కొన్ని    ప్రత్యేకమైన    కాగితములు    చూచుటకు   ' తోలు '    మాదిరి   ( Leathered  paper )   గాను   లేదా   ప్లాస్టిక్   షీటు   ( Plastic  paper )   మాదిరిగాను   వుండి   చూచుటకు   అందముగా   నుండును.   కాని   అవి   ఒక    ప్రత్యేక    పద్ధతిలో    చేయబడిన   కాగితములే.   అందువలన    వాటిని   తక్కువ   ధరలో   కొని,   అట్టపై    కవరింగ్ కు   వాడుతారు.

    

       పుస్తకములను   కవరింగుచేయు   పద్ధతులు

1.   కాగితపు   అట్టవేయు    పద్ధతి  ( Paper Wrapper )  :—

         పుస్తకములు   కుట్టిన   తరువాత,   వాటిపై   దళసరి    అట్టలను   వేసెదరు.   ఈ   అట్టలను   పుస్తకపు   వెనుక   భాగమున   మైదాతో   అతికించుతారు.   అందువలన    అట్ట    పుస్తకమునుండి  విడిపోదు.

2.  కాగితపు   కవరింగ్   అట్టపద్ధతి  ( Paper  Covering )  :

           ఈ    పద్ధతిలో   పై   విధముగానే    అట్టలను   వేయుదురు.   కాని   అట్టను   పుస్తకము  యొక్క    వెనుక   భాగమున,   ప్రక్క   వైపులను    మైదాతో   అతికించుతారు.  అందువలన    అట్ట   పుస్తకమును    పూర్తిగా   అంటియుండును.   ఇది   పై   పద్ధతి   కన్నా   కొంచెము   గట్టి    పద్ధతి.

3.  అట్టలు    పుస్తకముకన్నా    కొంచెము   పెద్దగా   కవరింగ్ చేయు   పద్ధతి   ( Paper  covered  and  overlapped ) :

            ఈ    పద్ధతిలో    అట్టను     పై   విధముగానే      అతికించుతారు.   కాని   అట్టయొక్క    అంచులు   పుస్తకముకన్నా    1/8"  అంగుళము   పెద్దవిగా   నుండి,   మూడువైపులా   కొంచెము    ముందుకు   వచ్చియుండును.   అందువలన   పుస్తకపు   అంచులు   చెడిపోకుండా   వుండును.

4.  కాగితపు    అట్టలు   పెద్దవిగావేయుట  ( Paper  wrapper  and  overlapped ) :

              ఈ    పద్ధతిలో    అట్టలను    పుస్తకపు   వెనుకభాగమునకు   మాత్రమే    అంటించుతారు.    ప్రక్కవైపున   అంటించరు.   అట్టయొక్క   అంచులు   పుస్తకముకన్నా    కొంచెము   ముందుకువచ్చియుండును.

5.  కాగితపు   అట్టను  అంచులయందు  లోనికి  ముడుచు   పద్ధతి  ( Paper  wrapper  and  turned - in )  :—

          ఈ    విధానములో   అట్టను   పుస్తకపు   వెనుకకు   అంటించుతారు.     ఎక్కువగా   వున్న     కాగితమును    పుస్తకపు   అంచులకు   సమానముగా    వుండునట్లుగా   లోనికి    ముడిచెదరు.

6.   గుడ్డతో   అతికించుట  ( Cloth covered )

             ఈ    పద్ధతి,   పైనతెల్పిన    పద్ధతులకన్నా    గట్టిపద్ధతి.    గుడ్డతో   అట్టవేసిన    కవర్సు   త్వరగా   చినిగిపోవు.   మరియు   కాగితపు   అట్టవలె   నలిగిపోదు.   గుడ్డను   పుస్తకమునకు   పైన    పూర్తిగా    అతికించుతారు.   

7.  కాగితపు   లేక   గుడ్డను   పల్పుబోర్డునకు   అతికించి   దానిని   అట్టగావేయు   పద్ధతి  ( Cloth  or  paper  stiffened )  :

           కాగితముతో    అట్టవేసి   వెనుకవైపున   మాత్రము   పల్పు   బోర్డు   ముక్కను   గాని   లేదా   గుడ్డనుగాని    అతికించుతారు.   ఈ    విధముగా   అట్టవేయుట   వలన   కవరింగ్ కు    ఉపయోగించిన    గుడ్డగాని   లేదా   కాగితముగాని    మడతలు   లేకుండా   చినిగిపోకుండా   గట్టిగావుండును.    ఈ   పద్ధతిలో   కవరుచేసిన   పుస్తకాలు   పై   అన్ని    పద్ధతులకన్నా   గట్టిగా   నుండును.

         పైన     తెల్పిన   రకరకముల   అట్టలువేయు    పద్ధతులను,   తక్కువఖరీదు    పుస్తకాలకు,   వాటి   విలువను   బట్టి   ఎక్కువ   రోజులు   మన్నికగావుండుటకు   తక్కువ   ధరలో   సులభ   పద్ధతిలో   చేయవచ్చును.   ఉదా :—   దేశపటములు,   సర్వీసు   రిజిష్టర్సు,   లైసెన్సు   పుస్తకాలు  ( Maps,  Service  registers,  pass  books,   Lisence  book  Etc.  )  మొదలగునవి.

               పైన    తెల్పిన     పద్ధతులే    కాకుండా   వేరే   బైండింగ్   చేయు   పద్ధతులు   కూడా   గలవు.   ఈ   బైండింగ్    పద్ధతులు   మూడు   రకములు.  ఒక్కొక్క    పద్ధతికి    కొన్ని   ప్రత్యేకతలుగలవు.    అందువలన   ఈ   పద్ధతులు   అనుసరించుటకుముందు   పుస్తకము   యొక్క   స్వభావము,   దాని   ఖరీదు,   వాడు  విధానము   మరియు   పుస్తకాలను   అందించవలసిన    గడువునుకూడా   ఆలోచించుకొని,   బైండింగ్   పద్ధతిని   అనుసరించాలి.

No comments:

Post a Comment