Sunday, September 19, 2021

బుక్ బైండింగ్ - 7 - బైండింగ్ ఉపకరణములు

 21.  ఫిలెట్స్   ( Fillets ) :

22.  గౌజస్   ( Gouges ) :

23.  ప్యాలెట్స్   ( Pallets )  :

24.  వివిధ  రకములైన   గుర్తులు ( Small pattren Tools ) :

25. చేతితో   ఉపయోగించు  అక్షరములు ( Hand Letters ) :

26. రోల్సు  ( Rolls ) :

27.  స్టౌ( Stove )  :

28.వేడి   పనిముట్లను  చల్లబరచుటకు  వినియోగించు   స్పాంజి ( Goolers ) :

29. మెరుగులు  పెట్టు  దిమ్మె  ( Polishing Iron ) :

30.  బంగారు  పూతరేకులు  పెట్టు   దిండు ( Gold Cushion ):

31. బ్యాండ్  నిప్పర్సు ( Band Nippers ):

32. పదునైన  ఇనుపరేకు ( Steel Scraper ):

33. బర్  నిషర్స్  ( Burnishers ):

34.స్ర్పింగ్  డివైడర్సు 

               మొదలైన   పరికరములు   కావలయును.

                         ప్రశ్నలు

1. బ్యాకింగ్   బోర్స్డు   యొక్క   పటమును   గీచివాటి   ఉపయోగములను   తెల్పుము.

2. ప్రెస్సింగ్  బోర్స్డు   యొక్క  ఉపయోగమేమిటి?

3. పుస్తకములు   మెరుగుపెట్టుటకు   ఉపయోగించు  పరికరములను   తెల్పుము.

4. బైండింగ్   చేయుటకు  ఉపయోగించు   పనిముట్లను   వేటినైనా   ఐదింటినివేసి, వాటి   ఉపయోగములను  వ్రాయుము.

               అధ్యాయము —4

    పుస్తకముల   బైండింగ్   ఉపకరణములు

     BOOK  BINDING  EQUIPMENTS

   పుస్తకముల   బైండింగ్    చేయుటకు   వివిధ   రకములైన   పనిముట్లుతోపాటు   ఇతర   ఉపకరణములను   కూడా   వాడుదురు.   కాబట్టి  బైండింగ్   చేయు    వ్యక్తికి    అన్ని   ఉపకరణములను   వాడు   విధానము,   వాటి  స్థాయిలు   తెలిసికొని   యుండువలయును.   వీటిని   వాడునప్పుడు   తగు   జాగ్రత్తలు    తీసుకొనవలయును.  మనము   కొన్ని    బైండింగ్   ఉపకరణములను    గూర్చి   తెలిసికొందాము.   

1.  కుట్టుచక్రము  ( Sewing  Frame ) :

               దీనిని   పుస్తకాలు   చేతితో   కుట్టునప్పుడు   వాడుతారు.   ఇది  చెక్కతో   చేయబడి   వుండును.  దీనిసహాయమున   లైబ్రెరీ   సూయింగ్   ( Library Sewing ),   ఫ్లక్సబుల్   సూయింగ్   ( Flexible  Sewing ),  సాన్   యిన్   సూయింగ్   ( Sawn - in -  Sewing )  మొదలైన   రకముల  కుట్లువేయుటకు   ఉపయోగింతురు.   ఈ    కుట్టుచక్రములో   సుమారుగా   10 నుండి 15  పుస్తకాలను,   మార్చకుండా   ఒకే  వరుసలో   ఒకదాని   తరువాత   ఒకటి   కుట్టవచ్చును.  దీనికి   9"  x  14"   అంగుళముల   సైజుగల   చదునైన   బెడ్ కలదు.   క్రాసుబార్   మరియు   సూయింగ్   కీస్   ( Keys )  అనునవి  ఈ   చట్రమునకు  ముఖ్యమైనవి.

2.  బోర్డు  కట్టర్   ( Board Cutter ) :

                ఇది   అట్టలు   కత్తిరించుటకు   ఉపయోగింతురు.  అట్టలు  కట్టింగ్  మిషన్   ( Cutting  Machine )లో   కత్తిరించిన,   దాని   కత్తి  అతిత్వరలో   మొద్దుబారిపోవును.   అందువలన   అట్టలను   కత్తిరించుటకు    ప్రత్యేకమైన    కట్టర్ ను   రూపొందించినారు.   ఈ  బోర్డు   కట్టరుకు   సైడు  గేజీ   ( Side gauge ),  ముందుగేజీలు  ( Front gauge )  గలవు.   దీనికి   చదునైన  25"  x  30"  బెడ్  గలదు.   బోర్డులు    కత్తిరించుటకు   పెద్ద   బరువైన   కత్తిగలదు.  దీనిని  చేతితో  నడుపుతారు.  కరెంటు  మోటారు   సహాయమున   అట్టలుకత్తిరించు  యంత్రములు  కూడా  కలవు.

3.   గట్టిగా   ఆదుము   ఉపకరణము  ( Hard press ) :

                 ఇది   నిటారుగా   వుండును.   దీనికి   రెండుగాని   లేదా   నాల్గు   ప్తంభములు   కలిగియుండును.   ఈ   ఆదము    పరికరములు  వివిధ   సైజులలో   లభించును.  దీనికి   రెండు  చదునైన   మందమైన   షలకములు   గలవు.   క్రింది   షలకము   కదలదు.   కాని   పై   షలకము   మరసహాయమున   క్రిందికి   పైకిత్రిప్పవచ్చును.   పుస్తకములను  కుట్టుటకుముందు,   కుట్టిన   తరువాత   అవసరమును   బట్టి,   ఈ   ఆదము    పరికరమును    వాడుతారు.   ఇందులో    పుస్తకములను   ప్రెస్సింగ్   బోర్డ్సు   మధ్యన   పెట్టి   ఆదుమవలయును.   ఈ   విధముగా   చేసినందువలన   పుస్తకములు   చదునుగా   వుండును.

4.  లైయింగ్   ప్రెస్   ( Lying Press ) :

            ఇది   అడ్డముగా   పెట్టుబడి   యుండును.   దీనిని   వసతి  అయిన    ఎత్తులో    టేబుల్ పై    పెట్టుకొనవలయును.  దీనిని   ఉపయోగించుటకు   రెండు  స్ర్కూలు   వుండును.   వాటిని   త్రిప్పినయెడల   లైయింగ్   ప్రెస్   బ్లాకులు   తెరుచుకొనుట   గాని,    మూసుకొనుటగాని    జరుగును.   పుస్తకాలు    రౌండింగ్    చేయునప్పుడు   ఎడ్జిడెకరేషన్   చేయునప్పుడు,   సాకట్సుచేయునప్పుడు   దీని   ఉపయోగము   చాలా    కలదు.   దీనికి   ఏటవాలు   అంచులుగల   ప్రెస్సింగ్   బోర్డ్సును   ఉపయోగించి   పైన   తెల్పినటువంటి   పనులు  చేయవలయును.

5.  నిప్పింగ్   ప్రెస్స్   ( Nipping  Press ) :

              ఈ    పరికరమును    పుస్తకాల   వెనుకభాగములను   అదుముటకు   ఉపయోగింతురు.   పుస్తకాల   అంచులపై    అందమైన   డిజైన్సు   వేయుటకు,   మెరుగులు   పెట్టునప్పుడు   కూడా   దీనిని   వాడుతారు.  

                            ప్రశ్నలు

1.  బైండింగ్   షాపులో   కావల్సిన   పరికరములు   ఏవి?

2.  హార్డు   ప్రెస్   ఎందుకు   వాడుతారు?

3.  లైయింగ్   ప్రెస్   బొమ్మనుగీచి   దాని   ఉపయోగములు   వ్రాయుము.

అధ్యాయము  — 5

    బైండింగ్   చేయుటకు  ఉపయోగించు       

                   యంత్రములు

         Book  -  Binding  Machines

      

                పుస్తకాలు   రకరకాల   పద్ధతిలలో   తయారుచేయుటకుగాను   రకరకాల    యంత్రములను  వాడుదురు.   కాబట్టి   బైండింగ్   చేయువారు   అట్టి   యంత్రములను  సరియైన   పద్ధతిలోను,   సమర్థవంతముగాను   పనిచేయించవలెనంటే    అట్టి   యంత్రములను   గురించి   ముందుగా   క్షుణ్ణంగా   తెలిసికొని   యుండవలెను.   ప్రతి  యంత్రముయొక్క   సామర్థ్యము,   పనిచేయు   విధము,   అనుసరించవలసిన  జాగ్రత్తలు  ముఖ్యంగా   తెలుసుకొనవలెను.   

1.   కాగితములపై   రంధ్రములు   వేయునట్టి   యంత్రము   ( పరికరము )   ( Perforating  Machine )  :

        ఈ   యంత్రము   సహాయమున   కాగితములపైన   కావలసిన   ప్రదేశములో   వరుసగా   సన్ననిరంధ్రములు   వేయుదురు.   ఆ  విధముగా   చేసినందున   కాగితములను   చింగుటకు    సులభముగా   వుండును.  దీని    అవసరము   ముఖ్యంగా   రసీదుపుస్తకాలకు,   చెక్కుబుక్కులకు    వుండును.   ఈ   యంత్రమును   మోటారు   సహాయములొకుండా    నడపవచ్చును.  ఇందు   ఒక   ఇనుప   చట్రములో    దగ్గరదగ్గరగా   సూదులు    పేర్చబడియుండును.   ఆ   సూడులకు   క్రిందిభాగమున    వాటికి   ఎదురుగా   అంతే   మందముగల   రంధ్రముల   రేకు   వుండును.   ఈ   యంత్రమును   ' ఫెడల్ '  సహాయమున   వత్తినప్పుడు   సూదులన్నీ   క్రిందికి    దిగును.  కాబట్టి     కొద్దికొద్దిగా   కాగితములను   సూదుల   క్రింద  పెట్టి   వత్తవలెను.   వాటిలో  సన్నని   రంధ్రములు   ఏర్పడును.    ఎక్కువ కాగితములుపెట్టి   వత్తినయెడల    సూదులు  విరిగిపోవును.   కాగితములు  సరైన   ప్రదేశములో   వుంచుటకు  అనువుగా   సైడ్  గైడ్స్ మరియు   ఫ్రంట్  గైడ్స్    ఈ  యంత్రము   యొక్క  ' టేబుల్ ' మీదగలవు.   ఈ   యంత్రములు   మోటారు    సహాయమునుకూడా   నడప్పవచ్చును.  అట్టి  యంత్రములలో    సూదులకు    బదులు   ఇత్తడి   పళ్ళ   చక్రములు  Shaft   పైన   బిగింపబడియుండును.   వాటి   సహాయమున    కావలసినన్ని    వరుసలలో    రంధ్రములు   వేసుకనవచ్చును.  అట్టివాటిని   రోటరీ   పర్ ఫరేటర్సు   ( Rotary  perforators )  అని  అంటారు.   దీనిని   ముఖ్యంగా   స్టాంపులకు   ఉపయోగించుతారు.

2.  నంబరింగ్  యంత్రము  ( Numbering  Machine )  :

            నంబరింగ్  యంత్రములు   ( పరికరములు )   అంకెలు   వేయుటకు   ఉపయోగింతురు.  ఈ   పరికరములను  చేతితోగాని   లేదా  ఫెడల్   సహాయముతోగాని  పనిచేయవచ్చును.   ఈ   పరికరములో   6  సంఖ్యా   చక్రములుండును.  ఒక్కొక్క   చక్రములోను   సంఖ్యలు   1 నుండి  0  వరకు   వుండును.   ఈ   అంకెలు   ఎత్తుగా   వుండును.  స్ర్పింగ్   వత్తిడివలన   అంకెలు   జరుగును.   ఈ   పరికరములో   ప్రత్యేకత   ఏమనగా   ఒక   అంకెను     ఒక్కసారి,   రెండుసార్లు,   మూడుసార్లు   లేక   నాలుగుసార్లు   ముద్రించవచ్చును.   దీనికి   ప్రత్యేకమైన    ' యింక్  '   గలదు.   దానిని   ' యింక్   ప్యాడ్ '   మిాద   వేస్తారు.    ఈ   యింక్   ప్యాడ్   అమర్చుటకు   ప్రత్యేక   సదుపాయముగలదు.   ఈ      ప్యాడ్   సహాయమున   అంకెలకు  ' యింకు '  అంటుకొనును.   ఈ   పరికరములోని   అంకెల   చక్రములను  మార్చుటకు  కొయ్య   పుల్లలను   వాడవలెను.   లోహపు   చీలలను   వాడరాదు.   ఈ   పరికరములను   పని  అయిన   వెంటనే   కిరసనాయిల్ తో    కడిగి   భద్రపరచవలెను.   దీనికి   అప్పుడప్పుడు    పల్చటి   చమురు   వేయవలెను.    దీనిని   వాడునప్పుడు   క్రింది   కొన్ని   కాగితములు    వుంచవలెను.  లేనిచో    అంకెలు   చెడిపోవును.

3.   గీతలు   గీయు  యంత్రము  ( Ruling Machine ) :

               ఈ    గీతలు   గీయు  యంత్రములు   రెండు   విధములు   ఒకటి   ' పెన్ '   రూలింగ్   అనియు,   రెండవది   ' డిస్క్ '   రూలింగ్   అనియు   అంటారు.   వీటి   సహాయమున   నిడివి   గీతలు,   అడ్డుగీతలు   వేయవచ్చును.   పెన్   రూలింగ్   అనునది   ముఖ్యముగా   అకౌంటు   పుస్తకాలకు  మరియు   ముందుగా   ప్రింటు   అయిన  కాగితాలపై   కావలసినచోట   మాత్రము   గీతలు  వేయుటకు   ఉపయోగింతురు.  కాని  ' డిస్క్  రూలింగ్ '    యంత్రములో   వరుసగా   గీతలు  వేయబడును.  అందువలన  ఈ   యంత్రము   పైన   తెల్పినటువంటి  పనులకు  సరిపడదు.  దీని   ముఖ్యమైన   ఉపయోగమేమనగా   రూళ్ళకాగితములకు  కాంపోజిషన్   బుక్సు,   ఎక్సర్ సైజు    పుస్తకాలకు   వాడుదురు.  ఈ   రెండు   రకముల   యంత్రములకు   ఫీడ్    టేబుల్  ( Feed  Table )  మరియు  కన్యేయర్    బట్ట   ( Conveyor  Cloth )  వుండును.   వీటికి   కావలసిన   యింకులను   తయారుచేసుకొనవచ్చును.   పెన్   రూలింగ్   యంత్రములో    ' ఇంకు   నిబ్స్ ' ను   కావలసిన   దూరములో   అమర్చుకొను   వసతిగలదు.   వీటిద్వారా   కాగితముపై   గీతలు   పడును.   డిస్క్  రూలింగ్ లో   ఒక    చట్రమునకు  మరియొక   చట్రమునకు   మధ్యన   స్పే స్   ( Space )   అను   ఖాళీచట్రములు    బిగింతురు.   ఈ    స్పే స్   వలన     గీతల    మధ్యదూరమును   సవరించుకొనవచ్చును.

పై    రెండురకముల     యంత్రములను   చేతితో    నడపవచ్చును.  ఈ   యంత్రముల   సహాయమున   రెండురంగులు   ఒకేసారి   వేయవచ్చును.   మరికొన్ని   రకముల   యంత్రములలో     రెండురంగులు   కాగితమునకు   రెండువైపులా   వేయుటకు   వీలుగలదు.   ఈ   యంత్రములను  ప్రతినిత్యం   ' ఆయిలింగ్ '  చేయవలయును.   ఒక్కొక్క   కాగితము   మించి   రూలింగ్ కు   పంపకుడదు.  కాగితములు  క్రాస్   పోకుండా   గైడ్సును   సరిగా   అమర్చుకోవలెను.   రూలింగ్   అయిన   కాగితములను   జాగ్రత్తపరచవలెను.

4.  పేపర్లు   కత్తిరించు   యంత్రము  ( Paper  Cutting  Machine )  :

                ఈ    యంత్రము   బైండింగ్    వర్కుషాపులో   చాలా   ముఖ్యమైనది.   దీని   నిర్మాణములోను,   పనిచేయుటలోను   ప్రత్యేకత   గలదు.  పాతకాలపు  Plough  cutter  కు   దీనికి    చాలా    తేడాగలదు.   ప్రస్తుతపు   కట్టింగ్   మిషన్ లో    అన్ని     కాగితములు    ఒకేమారు    ఖండించబడును.   కాగితములు    ఖండించుటకు   దృఢమైన,   పదునైన    కత్తిగలదు.   ఈ   కత్తిని   అప్పుడప్పుడు   మార్చుకొను   సదుపాయముగలదు.    ఈ    యంత్రము    పనిచేయునప్పుడు    కత్తి   ఏటవాలుగా    క్రిందికిదిగి    కాగితములన్నింటిని    ఖండించును. ఈ    యంత్రములలో   చాలా   సైజులుగలవు.    ఈ    యంత్రమునకు   దిట్టమైన,    పదునైన   బెడ్ గలదు.    దీనిపై   స్కేలు    గుర్తించబడియుండును.     దీనికి   సవరించుకొనుటకు   అనువైన   బ్యాక్  గేజి    కలదు.   కాగితములను   ఖండించునప్పుడు    అదిమిపట్టుటకు  ' క్లాంప్ '  ( Clamp )   గలదు.   కత్తి    క్రింది    భాగమున    కట్టింగ్   స్టిక్   ( Cutting stick )   కలదు.   దీనివలన   కత్తి   పొరపాటున   ఇనుప   బెడ్ కు   తగలదు.    కాగితములు   ఖండించుటకు   ముందు  ఈ  యంత్రము  బెడ్ ను   శుభ్రముగా   తుడపవలెను.   కాగితపు  కట్ట   క్రింద,  పైన   అట్టలుపెట్టి   ఖండించవలెను.   ఈ  యంత్రముపై   పనిచేయునప్పుడు   అత్యంత   జాగ్రత్తగా   వుండవలెను.   కట్టింగ్   చేయునపుడు   ఏ   విధముగా   చేసిన    ఎక్కువముక్కలు   లభించుకొని   ఆలోచించి   చేయవలయును.   కాగితము    ఎక్కువ   వృధాకాకుండా    మడవవలెను.   కత్తిరించిన   కాగితపు   కట్టలను   పదిలపరచవలెను.    ఈ  యంత్రముపై   పుస్తకములుకూడా    కట్టింగ్   చేయవచ్చును.  ఈ  యంత్రమును    చేతితోను,   మోటారుయంత్రముతోను   నడపవచ్చును.   ఈ  కట్టింగ్  మిషన్    పద్థతులు   ఎంతగానో   అభివృద్ధి   చెండినవి.

5. ఇనుప  తీగతో   కుట్టు  యంత్రము ( Wire  Stitching   Machine ) :

        పుస్తకములను   కుట్టుపద్థతులలో   ఇది   అత్యంత   సులభమైనవి   ఖర్చుతో  అతి   తక్కువ  వ్యవధిలో   పుస్తకాలను   కుట్టవచ్చును.   ఈ  యంత్రము  సహాయమున 1\16  మందముగల   పుస్తకమునుండి 4"  అంగుళముల   మందముగల  పుస్తకములవరకు     కుట్టవచ్చును.  ఈ  యంత్రములలో   ఉపయోగించు   తీగచుట్టలు  18 గేజ్ ల నుండి  28  గేజ్ లవరకు ( Gauge )  వుండును.   పుస్తకముల    మందమును   బట్టి   తీగ  గేజ్ ని    నిర్ణయించుకోవలెను.   ఈ   తీగలలో   అనేక   రకములుగలవు.   కొన్ని  రాగి,  ప్లాస్టిక్ ,   అల్యూమినియమ్   కోటింగ్    వేయబడి   వుండును.   ఇట్లు    కోటింగ్    వేసినందువలన   తీగలు   త్రప్పు   పట్టకుండా    వుండును.   ఈ  యంత్రము   సహాయమున  పుస్తకముల   మధ్యన, మరియు   ప్రక్కవైపున   కుట్టుటకు   యంత్రములో    వసతిగలదు.  ఈ  యంత్రము   చేతితోను,   కాలితోను  మరియు   మోటారు  సహాయమునకు  పనిచేయవచ్చును.    కొన్నియంత్రములలో   రెండు  తీగచుట్టలు,   రెండు   కుట్టుభాగములు   కలల్గియుండును.   పుస్తకములు   సరిగా   కుట్టుటకు   సహాయపడు  ' గైడ్స్ '  కూడా   వీటికిగలవు.    ఈ  యంత్రములను   ప్రత్యేకముగాను   లేదా   మరికొన్ని   ఇతర   బైండింగ్    యంత్రములతోను   కలిపిగాని   ఉపయోగించవచ్చును.   పిన్నింగ్   చేయునప్పుడు   డబుల్   పిన్నింగ్   చేయరాదు.    లూజ్  పిన్నింగ్,  టైట్    పిన్నింగ్   కుడా   చేయరాదు.   పిన్నింగ్  అయిన   వెంటనే   ఫెడల్   మీద    నుండి  కాలు   తొలగించవలయును.

        బైండింగ్   సెక్షన్ లో    ఉపయోగించు  ఇతర   యంత్రములలో    ముఖ్యమైనవి :

1. సూయింగ్   మిషన్  ( Sewing  Machine)

2. ఫోల్డింగ్  మిషన్  ( Folding Machine )

3. స్టాబింగ్  మిషన్ ( Stabbing Machine )

4. బుక్  బ్యాకింగ్ ,  రౌండింగ్   మిషన్ (Book Backing, Rounding Machine )

5. గేదరింగ్   మిషన్   (Gathering Machine )

6. ఇన్  డెక్స్   కట్టింగ్   మిషన్  ( Index  cutting Machine )

7. కవరు   పంచింగ్  మిషన్  (Cover  Punching Machine )  మొదలైనవి.

                             ప్రశ్నలు

1. బైండింగ్   వర్క్   షాప్ కు  కావలసిన   యంత్రములేవి?

2. నంబరింగ్   మిషన్  గురించి   వ్రాయుము?

3. పేపర్  కట్టింగ్   మిషన్   గూర్చి   వ్రాయుము?

4. వైర్   స్టిచ్చింగ్  మిషన్    ( Wire Stitching Machine  )   గురించి  వ్రాయుము?

అధ్యాయము  — 6

   బైండింగ్   చేయుటకు   కావలసిన   వుస్తువులు

               ( Binding  Materials )

        

         బైండింగ్   చేయుటకు    అనేక    రకములైన   వుస్తువులను    వాడెదరు.    పుస్తకము   విలువను   బట్టి   మంచి   నాణ్యత,   మన్నికగల   వుస్తువులు   ఉపయోగించవలెను.   అందువలన   పుస్తకములు   చాలాకాలము   బైండింగ్ తో    బద్రముగానుండును.   మంచివుస్తువులు   వాడినందున   బైండింగ్    చేసిన   పుస్తకములు   చూచుటకు   అందముగా   నుండును.   తక్కువరకము   వుస్తువులు   వాడుట   మంచిదికాదు.   అట్టివాటివలన    పుస్తకముల   నాణ్యత   చెడిపోవును.   మరియు   ఎక్కువ   కాలము   మన్నిక   వుండవు.   కాబట్టి    బైండింగ్   చేయువారు   కావలసిన   వివిధ    రకములైన   వుస్తువులను   కొనునపుడు   వాటియొక్క    గుణగణములను,   వాడుపద్ధతులను   క్షుణ్ణంగా   తెలిసికొనవలయును.   ఎక్కువమొత్తంలో   వుస్తువులను   కొన్నపుడు   వాటిని   భద్రపరచుటలో   తగిన   శాస్తీయ    పద్ధతులను    అమలుపరిచి   వుస్తువులను   చెడిపోకుండా   కాపాడుకొనవలయును.

           ఈ     క్రింద    తెలుపబడిన   వుస్తువులను   బైండింగ్   పనులలో   విరివిగా   వాడుదురు.

1.  కాగితము   ( Paper ) :—   

                   ఈ    కాగితములు    వివిధరకములలో    గలవు.   వాటిని   వివిధ   పనులకు   వాడుతారు.   ( ఉదా :  రకరకాల   పుస్తకాలు   ముద్రించుటకు,  వార్తాపత్రికలకు,  రకరకాల  వ్రాత   పుస్తకములకు,   కవర్లు,  పెద్దపెద్ద   పోస్టర్లు   మొదలైనవి ).   ఈ   కాగితాలు   వివిధ   సైజులలోను,  నాణ్యతలోను,  మందములోను   మరియు   రంగులలోను   దొరకును.  కాని  అవసరమునకుతగిన    రకపు   కాగితమును  ఎన్నుకొనవలయును.   కాబట్టి    కాగితమును  ఎన్నుకొనునపుడు   దాని   ఖరీదు,   నాణ్యత   మరియు    వాడుక    విధానములను   గ్రహించి   ఎన్నుకొనవలయును.  కాగితములను   యంత్రముల   సహాయమున   మరియు   చేతిపని   ద్వారాను   తయారుచేయవచ్చును.   చేతిపనిద్వారా   చేసిన   కాగితము    మందముగాను,   గరకుగాను   వుండును.   ఒక్కొక్క   కాగితమును   ప్రత్యేకముగా   తయారుచేయుదురు.   యంత్రములద్వారా   చేసిన   కాగితములు   నాణ్యతగాను,   నునుపుగాను,   సన్నగాను   మరియు    పెద్దపెద్ద   రీళ్ళుగాను   తయారుచేస్తారు.   అటుపిమ్మట    వాటిని   కావలసిన   సైజులకు   కత్తిరించి   ఒక్కొక్కరీము    ప్రకారము   కట్టకట్టుతారు.   కాగితము   మందమునుబట్టి    'రీము'   బరువులో   మార్పులు   వచ్చును.   యంత్రములద్వారా   చేసిన   కాగితములలో   అనేక    రకములుగలవు.   కాని   చేతితోచేసిన   కాగితములు   చిన్నచిన్న   పనులకు,   ఖరీదైన   పనులకు   మరియు ' యండ్ '    పేపర్స్   ( End  Papers )కు   వాడుతారు.

                కాగితములను   బద్రపరచుట   చాలా   ముఖ్యము.   లేనిచో   కాగితములు    ఎండకు   ఆరిపోయి,   వాటి   స్టైలలోను    స్వభావములలోను    కొంతమార్పుకల్గును.   అట్టి    మార్పులవలన   బైండింగ్   చేయుటలోగాని   లేదా      ముద్రించుటలోగాని   కొన్ని   ఇబ్బందులు   ఎదుర్కొనవలసివచ్చును.   కావున   కాగితములోని   తేమను   కాపాడుటకుగాను   కాగితములను   వుంచిన   గదికి    శీతలీకరణ   పద్ధతులను   అమలుపరచి   గాలిలోని    తేమను   ఒకేమాదిరిగా     వుండునట్లు   చేయవలయును.   అట్లు    చేసిన   యెడల   కాగితములు   చెడిపోకుండా   వుండును.

కొన్నిరకముల   కాగితములు  :

1.  M.F.  కాగితము  ( M.F.  Paper )

2.  లెడ్జరు   కాగితము  ( Ledger  Paper )

3.  బాండు  పేపరు  ( Bond  Paper )

4.  సూపరు  కేలండరు   కాగితము  ( Super  Calender  Paper )

5.  కాట్రిడ్జి    కాగితము  ( Cotridge  Paper )

6.  మనిలా   కాగితము  ( Manila  Paper )

7.  మైనపు   కాగితము  ( Wax  Paper )

8.  ఇమిటేషన్   ఆర్ట్   కాగితము  ( Imitation  art  Paper )

9.  కోటెడ్    ఆర్ట్   కాగితము  ( Coated  art Paper )

10.  అజుర్   లెయిడ్   కాగితము  ( Azurlaid  Paper  )

11.  ఏర్  మెయిలు   కాగితము  ( Air  Mail  Paper )

12.  మార్బుల్   పేపర్సు   ( Marble  Papers  )  మొదలగునవి.

No comments:

Post a Comment