యూనిట్ —7
కర్రసామాగ్రికి తగినంత కలప పరిమాణమును
లెక్కవేసి నిర్ణయించుట
8.1 ఉపోద్ఘాతము :
వివిధ రకముల వృక్షముల నుండి లభ్యమయూడి పలురకములైన
కలపలను గురించి మనము ఎనిమిదవ తరగతిలో చదివి
యున్నాము. వృక్షము నుండి లభ్యమగు కలపను సీజనింగు చేసి
దానిని దానిని కర్రసామాగ్రులను తయారుచేయుటకు
వుపయోగించవచ్చును. అయితే కర్రసామాగ్రిని తయారుచేయుటలో
మన ఉద్దేశము నెరవేరుటకుగాను దాని తయారీలో తగిన రకపు
కలపలను వుపయోగించాలి. చేయబోవు కర్రసామాగ్రి ఉపయోగము,
ఆకారము, పరిమాణము, మన్నిక మొదలగునవి ముందుగా
నిర్ణయించుకొని, వాటిని నెరవేర్చుగుణము కలిగిన కలపను
అందుకు ఎన్నుకొనాలి. మార్కెట్ లో కలప లభ్యమగు ధరలను
కనుగొని, వాటిని బట్టి కూడా తగిన రకపు కలపను
ఎన్నుకొనవలసియుంటుంది. కర్రయెక్కనాణ్యత, ధర తెలుసుకొని,
చేయవలసిన కర్రసామాగ్రి కొలతల ఆధారంగా కొనుగోలు
చేయవలసిన కలప పరిమాణమును నిర్ణయించి, యీ రెండిటి
ఆధారముగా సరియైన కర్రను ఎన్నుకొని తగు పరిమాణములో
కొనుగోలు చేయాలి.
8.2 కర్ర నాణ్యత :—
కర్రనాణ్యతను తెలుసుకొనుటకుగాను దానిని సరిగా పరీక్షించాలి.
కర్రగట్టితనము, మన్నిక, వివిధ పనిముట్లతో సులభముగా
పనిచేసుకొను సదుపాయము, లోపములను కలిగియుండక పోవుట
మొదలగునవి క్షుణ్ణముగా పరిశీలించాలి. కొన్ని సందర్భములలో
కర్రయెక్క అగ్ని నిరోధకత, ఉష్ణనిరోధకత మొదలగు ప్రత్యేక
ధర్మములను గమనింకవలసియుంటుంది. కలపయందు యేర్పడు
వివిధ లోపములను
గురించి మనము తెలుసుకొని యున్నాము. వీటివలన
కర్రదారుఢ్యత, మన్నిక తగ్గుతుంది. అనగా లోపములు
ఎక్కువకలిగిన కర్ర తక్కువ నాణ్యత కలిగియుంటుంది.
కర్రనాణ్యతను యేవిధముగా నిర్ణయించాలి అన్న విషయము ఈ
లోపములను నిర్ణయించుట వలన సాధ్యపడుతుంది. కర్రయందలి
లోపములు మరియు తద్వారా దాని నాణ్యత క్రింద సూచించిన
విధముగా నిర్ణయింపబడుతవి.
( A ) లోపములను గుర్తించుట :—
1. కర్రయందు 30 మి.మీ. వ్యాసము గల ఒక ముడి ( Knot )ని
కలిగిన యెడల అది లోపముగా పరిగనించాలి.
2. 15 మి.మీ. వ్యాసములో రెండు ముళ్లను కలిగియుంటే అది కూడా
ఒక లోపము.
3. 60. మి.మీ. వ్యాసము గల రెండు లోపములుగా పరిగణించాలి.
4. 120. మి.మీ. వ్యాసము గల ముడి నాలుగు లోపములకు
సమానము.
5.కలపను ఆరబెట్టినపుడు, దాని వార్షిక వలయములకు అడ్డముగా
కర్ర చీలిపోయివుండుట లోపముగా గుర్తింపబడుతుంది. ఈ విధమైన
చీలిక కర్ర రెండు ప్రక్కభాగముల నుండి 25. మి.మీ. వెడల్పు
మరియు సుమారు 300. మి.మీ. పొడవుతో వ్యాపించియున్నయెడల
అది ఒక లోపముగా పరిగణింపబడుతుంది.
6. కర్రమొద్దును పలకలుగా కోసినపుడు కర్రవస్తువు ప్రక్క
అంచులపైన లోతు వంపులు యేర్పడిన యెడల వాటి సైజును
గమనించాలి. ఈ వంపు 25. మి.మీ. వెడల్పుతో, కర్రపలక
పొడవులో కంటే 1/6 ఎక్కువ పొడవుతో యేర్పడిన యెడల అది
ఒక లోపముగా పరిగణించాలి.
7. కర్రపైన గల రంధ్రములు 30 మి.మీ. వ్యాసము లేదా లోతును
కలిగియున్నయెడల అది ఒక లోపముగా పరిగణించాలి.
( B ) కర్ర నాణ్యతను నిర్ణయించుట:—
1. కర్ర సంపూర్ణ తల వైశాల్యములో 91% లేదా అంతకన్నా
ఎక్కువభాగము యేవిధమైన లోపము లేకుండా యున్నయెడల
అది మొదటి తరగతి కర్రగా పరిగణించాలి.
2. కర్ర సంపూర్ణ తలములో సుమారు 83% నుండి 91% వరకు
లోపములు లేనియెడల దానిని రెండవ తరగతి కర్రగా
పరిగణించాలి.
3. 83% కన్నా తక్కువ కర్ర సంపూర్ణ తల భాగము లోపములు
లేకుండాయున్న యెడల అది మూడవతరగతి కర్రగా
గుర్తింపబడుతుంది.
మార్కెట్ లో లభ్యమగు వివిధ రకపు కలపలు వాటి ధరలు
పట్టిక 8.1 లో సూచింపబడినవి.
పట్టిక 8.1 వివిధ రకపు కలపల ధరలు
కలపపేరు : 1. మీడియం టేకు కర్ర
కర్ర పొడవు 2 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 320/—
కర్ర పొడవు 3 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 350/—
కర్ర పొడవు 4 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 400/—
కర్ర పొడవు 6 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 450/—
కలపపేరు : 2. మేలురకపు బల్హార్షా టేకు కర్ర
కర్ర పొడవు 2 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 550/—
కర్ర పొడవు 3 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 600
కర్ర పొడవు 4 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 650/—
కర్ర పొడవు 6 1/2'
కర్ర వెడల్పు x మందము 4" x 3"
సుమారు ధర 700/—
కలపపేరు : 3. నల్లమద్ది
కర్రపొడవు వెడల్పు ( వివిధసైజులలో )
సుమారు ధర 160/—
కలపపేరు : 4. బీర్జాసాల్
కర్రపొడవు వెడల్పు ( వివిధసైజులలో )
సుమారు ధర 250/—
కలపపేరు : 5. అందూక్ కర్ర
కర్రపొడవు వెడల్పు ( వివిధసైజులలో )
సుమారు ధర 110/—
కలపపేరు : 6. అస్సాం కర్ర
కర్రపొడవు వెడల్పు ( వివిధసైజులలో )
సుమారు ధర 200/—
కలపపేరు : 7. బట్టకలం కర్ర
కర్రపొడవు వెడల్పు ( వివిధసైజులలో )
సుమారు ధర 180/—
కలపపేరు : 8. మేలురకపు రోజ్ కర్ర
సుమారు ధర 800/—
కలపపేరు : 9. డీల్ కర్ర ( ప్యాకింగ్ బాక్సులకు )
సుమారు ధర 150/—
కలపపేరు : 10. గంధపు కర్ర ( అలంకరణ సామాగ్రి కొరకు )
సుమారు ధర 700/—
కలపపేరు : 10. ఫ్లైవుడ్ ( మందము ) ...18 మి.మిా
సుమారు ధర 18—00 చదరపు అడుగునకు
మందము ...15 మి.మిా
సుమారు ధర 15—00 చదరపు అడుగునకు
మందము ...12 మి.మిా
సుమారు ధర 10—00 చదరపు అడుగునకు
మందము ... 8 మి.మిా
సుమారు ధర 8—00 చదరపు అడుగునకు
మందము ... 6 మి.మిా
సుమారు ధర 6—00 చదరపు అడుగునకు
మందము ... 4 మి.మిా
సుమారు ధర 5—00 చదరపు అడుగునకు
మందము ... 3 మి.మిా
సుమారు ధర 4—00 చదరపు అడుగునకు
కలపపేరు : 12. నల్లబల్లలకుపయోగించు కర్ర
కర్ర మందము 18 మి.మిా
సుమారు ధర 15—00 చదరపు అడుగునకు
కలపపేరు : 13. డెకోలామ్ లేదా వుడ్ లామ్
కర్ర మందము 3 మి.మిా
సుమారు ధర 9—00 చదరపు అడుగునకు
మొదలగు ప్రత్యేక రకపు కర్ర లేదా 4 మి.మిా.
1 అడుగు = 30 సెం.మిా.
1 ఘ.అ = 27000 ఘ.సెం.మిా.
కర్రపలకల సంఖ్య =30,000÷6250=5
లేదా 50 . సెం.మీ. వెడల్పు మరియు 2.5 .సెం.మీ. మందముగల కర్రపలకను ( 5 x50 ) = 250 సెం.మీ. లేదా 2.5 మిటార్లు కొనుగోలు చేయవలసియుంటుంది.అనగా వస్తుఘణపరిమాణమును కనుగొని, దానిని లభ్యమగు కర్రపలకల మందము, వెడల్పును గుణించుటవలన వచ్చెడి లబ్ధముచే భాగించవలెను. దీనివలన కర్రపలక పొడవు సెం.మీ. లలో వస్తుంది. దీనిని మిాటర్లలోనికిమార్చుకొనాలి. కర్రను అమ్మినపుడు మిాటరునకు Rs —X అనిగాని, ఘణపరిమాణమును Rs —ఘణపరిమాణమును అనిగానీ ధరను నిర్ణయిస్తారు. కొనుగోలు చేయవలసిన కర్ర పొడవును X తో లేదా కర్రఘణపరిమాణమును Y తో గాని గుణించి కర్ర ఖరీదును తెలుసుకొనాలి. ప్లైవుడ్ , వాల్ బోర్డు మొదలగు కర్రను చదరపు అడుగులలో కొలచి ఖరీదును నిర్ణయిస్తారు.
కర్రసామాగ్రి ఘణపరిమాణమును దాని వివిధకొలతల ఆధారముగా నిర్ణయిస్తాముగదా! అయితే కర్రను కొనుగోలు చేయునపుడు తయారుచేరవలసిన కర్రసామాగ్రి కొలతలకన్నా తీసుకొనవలసిన కర్రకొలతలు సుమారు 1 సెం.మీ. ఎక్కువుగావుండిలి. దీనికి కారణము కర్రను తగిన ఆకారములోనికి కోసి, చదును పరచి నునుపు చేయునపుడు కొంత కర్రనష్టపడుటయే! ఉదాహారణకు, చదరపు అవచ్చేదముతో చేయవలసిన ఒక కుర్చీ కాలుకొలతలు 5 సెం.మీ. x 5 సెం.మీ. x 40 సెం.మీ. వున్నవని అనుకొందుము. కుర్చీకి కావలసిన నాలుగు కాళ్లకొరకు కొనుగోలు చేయవలసిన కర్రపరిమాణమును నిర్ణయించుటకుగాను ముందుగా కర్ర
మందము, వెడల్పు 6 సెం.మీ. వుండెడి కర్రను ఎన్నుకొన్నాలి. నాలుగు కాళ్లకు కావలసిన కర్రపొడవు 50x 4 = 200 సెం.మీ. ప్రతికాలును సరియైన పొడవుతో చేయుటలో నష్ట పడెడి కర్ర 2 సెం.మీ. చొప్పున వుంటుంది. అనగా నాలుగు కాళ్ళకు కలిపి 8 సెం.మీ. వుంటుంది. అనగా మొత్తము కొనుగోలు చేయవలసిన కర్రపొడవు 208 సెం.మీ. వుండాలి. దీనిని నాలుగు భాగములుగా ఖండించి ప్రతిభాగమును చదునుపరిచి, నునుపుచేసి తగిన కొలతలతో నాలుగు కుర్చీ కాళ్లను పొందవచ్చును. కర్రను కొనుగోలు చేయునపుడు దానిని తగిన సైజులో కొనుటద్వారా తక్కువ కర్ర నష్టతడుతుంది. ఇందుకుగాను తయారు తయారు చేయవలసిన కర్రసామాగ్రికొలతలతోపాటు, మార్కెట్ లో లభ్యమగు కలప కొలతలు వివరములు యివ్వబడినవి. ఈ రెండు పట్టికల నుపయోగించి కావలసిన కర్రవస్తువు పరిమాణమునకు తగిన కర్ర పరిమాణమును నిర్ణయించవచ్చును.
పట్టిక : 8.2 కర్రతో చేయబడు వివిధ గృహోపకరణముల కొలతలు
గృహోపకరణము పేరు : 1. బల్లలు
( a ) డైనింగ్ బల్ల
వెడల్పు ( సెం.మీ. ) 75 — 150
పొడవు ( సెం.మీ. ) 100 —240
ఎత్తు ( సెం.మీ. ) 60 —75
( b ) డ్రెస్పింగుబల్ల
వెడల్పు ( సెం.మీ. ) 38 — 55
పొడవు ( సెం.మీ. ) 90 —125
ఎత్తు ( సెం.మీ. ) 60
( c ) టీ— పాయి
వెడల్పు ( సెం.మీ. ) 35 — 90
పొడవు ( సెం.మీ. ) 90 —180
ఎత్తు ( సెం.మీ. ) 70
( d ) T.V. బల్ల
వెడల్పు ( సెం.మీ. ) 50 — 60
పొడవు ( సెం.మీ. ) 60 —75
ఎత్తు ( సెం.మీ. ) 40 — 60
గృహోపకరణము పేరు : 2. డెస్కుబల్ల
వెడల్పు ( సెం.మీ. ) 40 — 75
పొడవు ( సెం.మీ. ) 75 —150
ఎత్తు ( సెం.మీ. ) 70 — 85 ( వ్రాసెడి ఉపరితలము )
గృహోపకరణము పేరు : 3. వర్కుబెంచి
వెడల్పు ( సెం.మీ. ) —
పొడవు ( సెం.మీ. ) —
ఎత్తు ( సెం.మీ. ) 75 — 85
గృహోపకరణము పేరు : 4. కుర్చీ
సీటు వెడల్పు ( సెం.మీ. ) 32 —80
సీటు పొడవు ( సెం.మీ. ) 32 —50
సీటు ఎత్తు ( సెం.మీ. ) 38 — 45
కుర్చీ చేతుల ఎత్తు ( సెం.మీ. ) 55 —62.5
వీపు ఆనించెడి వెనుక భాగపు ఎత్తు ( సెం.మీ. ) 75 — 120
గృహోపకరణము పేరు : 5. బీరువా
వెడల్పు ( సెం.మీ. ) 45 — 55
పొడవు ( సెం.మీ. ) 90 — 120
ఎత్తు ( సెం.మీ. ) 150 లేదా అంతకన్నా ఎక్కువ
గృహోపకరణము పేరు : 6. పుస్తకములు పెట్టుకొను ర్యాక్ ( షెల్పు )
వెడల్పు ( సెం.మీ. ) 18 — 30
పొడవు ( సెం.మీ. ) 25 — 44
ఎత్తు ( సెం.మీ. ) 35 — 45
గృహోపకరణము పేరు : 7. గోడలయందు బిగించెడి షెల్పులు
వెడల్పు ( సెం.మీ. ) 8 —15
పొడవు ( సెం.మీ. ) 45 — 65
ఎత్తు ( సెం.మీ. ) 55 — 65
గృహోపకరణము పేరు : 8. మంచములు
( a ) సింగిల్ మంచము
వెడల్పు ( సెం.మీ. ) 90 — 110
పొడవు ( సెం.మీ. ) 205
ఎత్తు ( సెం.మీ. ) 55 ( పరుపు వరకు )
( b ) 3/4 మంచము
వెడల్పు ( సెం.మీ. ) 105 — 120
పొడవు ( సెం.మీ. ) 205
ఎత్తు ( సెం.మీ. ) 55 ( పరుపు వరకు )
( c ) డబుల్ మంచము
వెడల్పు ( సెం.మీ. ) 145 — 150
పొడవు ( సెం.మీ. ) 205
ఎత్తు ( సెం.మీ. ) 55 ( పరుపు వరకు )
( d ) చిన్నమంచము
వెడల్పు ( సెం.మీ. ) 80
పొడవు ( సెం.మీ. ) 180
ఎత్తు ( సెం.మీ. ) 55 ( పరుపు వరకు )
గృహోపకరణము పేరు : 9. ఇంటి తలుపులు
( a ) బయటి తలుపులు
వెడల్పు — 80; 85; 90 సెం.మీ.
పొడవు — 200; 205; 210 సెం.మీ.
( a ) లోపలి తలుపులు
వెడల్పు — 65; 70; 75; 80; 85; 90 సెం.మీ.
పొడవు — 195, 200, 205, 210 సెం.మీ.
10. కిటికీలు :— అనేక నమూనాలతో, వివిధ సైజులలో కిటికీలు తయారుచేయబడుచున్నవి. గది కొలతలనుబట్టి కిటికీ కొలతలు నిర్ణయింపబడాలి. కిటికీ పై భాగము మరిము తలుపుల పై భాగము ఒకే లైనులో వుండునట్లు కిటికీలు అమర్చబడుతవి.
పట్టిక 8.3 సాధారణముగా లభ్యమగు కలప కొలతలు
( క్రింద సూచింపబడిన కొలతలలో మొదటి కొలత మందమును రెండవ కొలత వెడల్పును సెం.మీ.లలో సూచిస్తుంది. )
లభ్యమగు సైజులు
( 1 ) ( 2 ) ( 3 )
*5x8 *10x10 *20x20
*5x10 *10x15 *20x25
*5x15 10x20 20x30
*5x20 10x25 20x35
*5x25 10x30 20x40
*5x30 10x35 20x45
5x35 10x40 20x50
5x40 10x45 20x55
5x45 10x50 20x60
5x50
*7.5x10 *15x15
*7.5x15 *15x20
*7.5x20 15x25
7.5x25 15x30
7.5x30 15x40
7.5x35 15x45
7.5x40 15x50
7.5x45 15x55
7.5x50
పైన తెలిపిన కొలతలే కాకుండా కలప 25 సెం.మిా. x 25 సెం.మిా. నుండి 60 సెం.మిా. x 75 సెం.మిా. సైజువరకు వివిధ సైజులలో లభ్యమగుతుంది. కర్రపలకల మందము 5 సెం.మిా. చొప్పున 60 సెం.మిా. వరకు , వెడల్పు 5 సెం.మిా. చొప్పున 75 సెం.మిా. వరకు పెరుగుచు కర్ర వివిధ సైజులలో లభ్యమగుతుంది.
గమనించవలసిన విషయములు :
1. * గుర్తుగల సైజులు ఇంటి నిర్మాణములో ఎక్కువగా ఉపయోగిస్తారు.
2. చదును పరచి సరిచేయబడిన కొలతలతో అమ్మబడెడి కర్రయందు పై కొలతలు సుమారు 1 నుండి 1.3 సెం.మిా. తగ్గించబడుతవి.
అభ్యసము
1. కర్ర నాణ్యతను తెలుసుకొనెడి విధానమును వివరింపుము.
2. కర్రవస్తువును చేయుటకు కొనుగోలు చేయవలసిన కర్రపరిమాణమును గణించు విధానమును వివరింపుము.
3. వివిధరకముల కర్రలు, వాటిధరలను గురించి తెలుసుకొని పట్టిక నొకదానిలో సమకూర్చుకొనుము.
4. మార్కట్ లో కలప లభ్యమయ్యెడి వివిధ సైజులను కనుగొని, వాటిని పట్టిక రూపములో వివరింపుము.
No comments:
Post a Comment