యూనిట్ -4
కర్రసామాగ్రిని తయారు చేయుటలో ఉపకరించు ఇతర వస్తువులు
7.1 ఉపోధ్ఘాతము :
కర్రసామాగ్రిని తయారు చేయుటకు గాను వుపకరించు వివిధ
పనిముట్లును గురించి , వాటిని ఉపయోగించెడి విధానము గురించి
మనము తెలుసుకున్నాము. విడి, విడి భాగములుగా చేయబడిన వివిధ
కర్రవస్తువులను కలుపుకొని కర్రసామాగ్రికి తగిన ఆకారము,
పరిమాణమును తెచ్చుటకుగాను ఈ పనిముట్లు వుపయోగిస్తాయి.
అయితే తయారు చేయబడిన కర్రసామాగ్రి ఆకర్షణీయంగా
వుండుటకుగాను మరియు ఎక్కువకాలము మన్నికగా వుండుటకు
గాను దానిపై పెయింట్ , వార్నిష్ మొదలగు వాటిని పూయవలసి
యుంటుంది. అంతేకాకుండా పనిముట్లును పదును పెట్టుటకు ,
వివిధ కర్ర జాయింట్లను దృఢపరచుటకు కొన్ని వస్తువుల
అవసరము వుంటుంది. కర్రసామాగ్రిని తయారు చేయుటలో ఈ
విధముగా వుపయోగపడెడి వివిధ వస్తువులను గురించి
తెలుసుకొందాము.
7.2 సాండ్ పేపర్ :
ఇది కాగితము లేదా గుడ్డ వంటి మెత్తగాయుండి
వంచుటకు తగినటువంటి పదార్థమును కలిగియుండి, దానిపై
రాపిడి చేయునపుడు అరగదీసెడి పదార్థము
అంటించబడియుంటుంది. ఈ రాపిడి పదార్థము ప్రకృతిలో
సహజముగా లభ్యమయ్యెడిదిగాని లేదా కృత్రిమముగా తయారు
చేయబడినదిగాని అయి వుంటుంది.
ఫ్లింట్ క్వార్ట్ జ్ , గార్నెట్ మొదలగునవి సహజమైన రాపిడి
పదార్థములు. సిలికాన్ కార్ బైడ్, అల్యూమినియం ఆక్సైడ్
మున్నగునవి కృత్రిమ రాపిడి పదార్థములు. వీటిలో ఫ్లింట్ క్వార్ట్
జ్ తక్కువ కాఠిన్యత, గార్నెట్ సాధారణ కాఠిన్యతను
కలిగియుండి తక్కువ కాలము మన్నికగా వుంటాయి. సిలికాన్ కార్
బైడ్, అల్యూమినియం ఆక్సైడ్ ఎక్కువకఠినంగా యుండి దానిపైన
అరగదీసెడి వస్తువు నుండి పదార్థమును త్వరగా తొలగిస్తాయి.
రాపిడి పదార్థముపై వస్తువుపైగల మలినపదార్థములు
తొలగిపోయి అది శుభ్రపడుతుంది. వస్తువు అరగదీయబడుటయే
కాకుండా , దాని ఉపరితలము నునుపుపరచబడి మెరుగు
పెట్టబడుతుంది. పెయింట్ చేయబడిన లేదా వార్నిష్ పూత కలిగిన
కర్రవస్తుతలమును నునుపు పరచినపుడు తక్కువధరను కలిగిన
ఫ్లింట్ క్వార్ట్ జ్ వుపయోగించాలి. వస్తుతలమును
రాపిడిగావించినపుడు దాని ఉపరితలము నుండి పదార్థము
తొలగింపబడుటకు ముందుదానిపై పూయబడిన పెయింట్ లేదా
వార్షిష్ తొలగింపబడుటకు ఎక్కువ రాపిడి కాగితము
అవసరపడుతుంది.
సాండ్ పేపరు తేమ తగిలినచో దానిపై గల రాపిడి పదార్థము
మెత్తబడి అకాఠిన్యత కోల్పోతుంది. దీని వలన సాండ్ పేపర్
మన్నిక తగ్గిపోతుంది. సాండ్ పేపర్ ను వాడునపుడు మధ్య మధ్య
దాని రాపిడి పదార్ధమందు చిక్కి నిలిచిపోయిన కర్రపొట్టును బ్రష్
ద్వారా తొలగించాలి.
సాండ్ పేపర్ రేకులు, బెల్టులు, టేపులు, గుండ్రముగా చుట్టబడిన
చుట్టల రూపములో లభ్యమగుతుంది. వీటిలో రేకులు 2255 మి.మీ.
x275 మి.మీ. లేదా 110 మి.మీ.x 135 మి.మీ. సైజులలో మరియు
బెల్టులు 50 మి.మీ. నుండి 300 మి.మీ. వెడల్పుతో మార్కెట్ లో
లభ్యమగుతాయి.
7.3 ఫ్రెంచి పాలిష్ :—
దీని నుపయోగించి కర్రత్తలమును నునుపు పరిచి అద్దమువలె
మెరయునట్లు మెరుగుపెట్టవచ్చును. ఇది షెల్లాక్ మరియు ఆల్కహాల్
లతో చేయబడిన మిశ్రమ ద్రావణము. చిన్న మెత్తవంటి ప్యాడును
ఉపయోగించి వస్తుతలముపై దీనిని పూయాలి. చిన్న మెత్తవంటి
ప్యాడును ఉపయోగించి వస్తుతలముపై దీనిని పూయాలి కొన్ని
చుక్కల లిన్ సీడ్ ఆయిల్ ను ఈ ద్రావణము. చిన్న మెత్తవంటి
ప్యాడ్ ను ఉపయోగించి వస్తుతలముపై దీనిని పూయాలి. కొన్ని
చుక్కల లిన్ సీడ్ ఆయిల్ ను ఈ ద్రావణములో కలిసినయెడల
ఇది లూ బ్రికేటింగ్ గుణమును పొందగలుగుతుంది.
7.4 వార్నిష్ :—
కర్రసామాగ్రికి తుదిమెరుగులు దిద్దుటకుగాను వార్నిష్, పెయింట్,
ఎనామిల్ , మైనము మరియు కొన్ని ప్రత్యేకమైన నూనెలు
మెదలగు పదార్థములను దాని ఉపరితలముపై
పూయవలసియుంటుంది. వీటిని బ్రష్ తో గాని, స్ర్పే చేయుట
ద్వారా గానీ లేదా పై ద్రావణములో వస్తువును ముంచి
యుంచుటవలన అవి వస్తువుపై పొరవలె పూయబడతాయి.
పై విధముగా పూతపూయబడిన కర్రవస్తువు పరిసరములు నుండి
తేమ, పొగ మొదలగు వాటిని గ్రహించుటవలన అది
సంకోచింపబడుట, వంగిపోవుట లేదా నూనెల ను గ్రహించి
అక్కడక్కడ ఉబ్బిపోవుట జరుగుతుంది. అంతేగాకుండా అది
కీటకములు, ఫంగస్ చే తినివేయబడి క్షీణిస్తుంది. దాని సహజ
రంగును కోల్పోతుంది కూడా.
పైన తెలిపిన పదార్థములచే దానిపై రక్షితపొరలను కల్పించుట
వలన యీలోపములను నివారించుటయే కాకుండా కర్రయొక్క
అగ్నినిరోధకశక్తిని, రసాయనిక చర్యలకు గురికాకుండుట మొదలగు
గుణములు వృద్ధి చెందుతాయి.
వార్నిష్ కర్రకు కొంత దృఢత్వము నిచ్చుటయేకాకుండా, అది
తేమకు గురికాకుండా దానిని కాపాడుతుంది. కర్ర వస్తువుపై
అంటుకొని వార్నిష్ పారదర్శక పొరగా యేర్పడుతుంది.
వార్నిష్ లు రెండు రకములుగా లభ్యమగుతాయి.
1. ఆయిల్ వార్నిష్ :—
కొన్ని రకముల జిగురు పదార్థములు లేదా గుగ్గిలము, రెజిన్
మొదలగు పదార్థములను నూనె లేదా టర్పెంట్ యివ్ లో
కరిగించుటవలన ఆయిల్ వార్నిష్ యేర్పడుతుంది. వార్నిష్ లో
నూనె ఎంతభాగము వుండవలెనన్నది వార్నిష్ నకు వుండవలసిన
ధర్మములను బట్టి నిర్ణయించబడుతుంది. నూనె ఎక్కువుగా
కలిపినపుడు వార్నిష్ తేమకు గురికాకుండా కర్రను కాపాడుతుంది.
అంతేకాకుండా అది స్థితి స్థాపక గుణము కలిగిన పూతగా
యేర్పడుతుంది. తక్కువ నూనె కలిగిన వార్నిష్ పెళుసైన పూత
నొసుగుతుంది. సాధారణ పనులకు వాడబడే వార్నిష్ యందు
నూనె ఎక్కువ లేదా తక్కువ కాకుండా మధ్యతరంగావుంటే
సరిపోతుంది.
ఆయిల్ వార్నిష్ ను బ్రష్ లేదా స్ర్పేద్వారా పూయవచ్చును.
ఇది తక్కువు కాఠిన్యతతో హెచ్చు మన్నికనుకలిగి యుంటుంది.
ఇది పారదర్శక పొరగా యేర్పడి కర్రవస్తువు తేమకు గురి
కాకుండా కాపాడుతుంది. ఇది ఆరిపోవుటకు 45 నిముషములనుండి
48 గంటలవరకు కాలవ్యవధి తీసుకుంటుంది. సాధారణముగా
వాడబడెడి వార్నిష్ గంటలలో ఆరిపోతుంది
2. స్పిరిట్ వార్నిష్ :—
జిగురు పదార్థములు మరియు గుగ్గిలమును టర్పెంటయిన్,
ఆల్కహాల్ , బెంజాల్ మొదలగు ద్రావణములలో కరిగించుటవలన
స్పిరిట్ వార్నిష్ యేర్పడుతుంది. దీనినే ' షెల్లాక్ ' అని కూడా
అంటారు.
ఇది కూడా పారదర్శక పూత నొసుగుతుంది. ఇది త్వరగా
ఆరిపోతుంది. అయితే దీని వలన ఎక్కువ నునుపుదనము
పొందలేము.
వార్నిష్ ను నిలువయుంచుట :—
1. వార్నిష్ ను 27॰c వద్ద నిలువయుంచాలి.
2.ఇది నిలువ యుంచెడి పాత్రలో గాలి చొరబడకుండా చూడాలి.
పాత్రమూతను ఎప్పుడు గట్టిగా బిగించియుంచాలి.
3. దీనిని వుపయోగించినప్పుడు చిన్న పాత్రలోనికి కొద్ది కొద్దిగా
వంచుకొని వాడాలి. వాడగా చిన్న పాత్రలో మిగిలిన వార్నిష్ ను
నిలువయుంచిన పాత్రలోనికి తిరిగి వంపరాదు.
బ్రష్ తో వార్నిష్ ను పూసెడి విధానము :—
1. కర్ర వస్తువుపై వార్నిష్ ను పూయునపుడు గదియందు యే
విధమైన ధూళి, దమ్ము లేకుండా చూడాలి. వెలుతురు, గాలి
తగినంతగా వుండాలి. వస్తుతలముపై వెలుతురు సరియైనదిశలో
పడాలి. గది ఉష్ణోగ్రత 25॰C నుండి 30॰C వరుకు వుండాలి.
2. సన్నని వెంట్రుకలు గల వెడల్పైన బ్రష్ ను ఉపయోగించాలి. బ్రష్
పొడవులో సగభాగము వార్నిష్ లో ముంచి, బ్రష్ ను బయటకు
తీయునపుడు ఎక్కువైన వార్నిష్ ను తొలగించునపుడు, బ్రష్ ను
మెల్లిగా పాత్రఅంచుపై తట్టవలెను.
3. వార్నిష్ పూయుటకు ముందుగా వస్తుతలమును శుభ్రపరచాలి.
టర్పెంటయిన్ పూతపూసి దానిపై వార్నిష్ ను చుక్కలుగా చల్లాలి.
దీనితో వస్తుతలము అంటుకొనెడి స్వభావమును కలిగియుంటుంది.
4. ముందుగా బ్రష్ ను కర్రవస్తువుపై కణములు అమర్చబడిన
దిశలో కదిలిస్తూ వార్నిష్ ని పూయాలి. పిదపపై దిశకు అడ్డముగా
బ్రష్ ను కదిలిస్తూ వార్నిష్ పూతను సమపర్చాలి. చివరగా బ్రష్
ను తిరిగి కణములమర్చబడిన దిశలో మెల్లిగా కదిలిస్తూ వార్నిష్ ను
నునుపుపరచాలి.
5.కొన్ని రకముల వార్నిష్ లు విషపూరితమైనటువంటి. వీటిని
వుపయోగించినపుడు నోటికి, ముక్కుకి అడ్డముగా బట్టను
కట్టుకొనాలి. గాలి చొరబడని గదులలో వార్నిష్ పని చేయరాదు.
మంటలకు దగ్గరగా వార్నిష్ పని చేయరాదు.
7.5 పెయింట్ :
వార్నిష్ పారదర్శక పూత నొసగితే, పెంయింట్ కాంతినిరోధక
పొరగా యేర్పడుతుంది. కీటకములు, పురుగులు, ఫంగస్, తేమ,
దుమ్ము, ధుళి మొదలగువాటినుండి పెంయింట్ కర్రవస్తువును
కాపాడుతుంది. అంతేకాకుండా ఆకర్షనీయమైన రంగు నిస్తుంది.
మార్కెట్ లో వీవిధ రకముల పెయింట్లు లభ్యమగుచున్నవి. వీటిని
ఆయిల్ పెయింట్ మరియు ఎనామిల్
పెయింట్ అనబడు రెండురకములు పెయింట్లుగా విభజించవచ్చును.
1. ఆయిల్ పెయింట్ :—
ఆయిల్ పెయింట్ యందు లిన్ సీడ్ అ ఆయిల్, చేపనూనె
మొదలగునవి వాడతారు. ఈ నూనెను వాహానము ( Vehical )
అంటారు. దీనిలో ' పిగ్ మెంట్ ' ( Pigment ) అనబడు రంగు
పదార్థమును కలుపుటచే పెయింట్ ఏర్పడుతుంది. పిగ్ మెంట్ గా
తెల్లసీసము ( వైట్ లెడ్ ), జింక్ ఆక్సైడ్, టైటానియమ్ మొదలగు
రంగు నొసిగెడి ఖనిజములను వాడతారు.
2. ఎనామిల్ పెయింట్ :—
ఇది వార్నిష్ మరియు పెయింట్ కలుపుటచే యేర్పడు మిశ్రమ
పదార్థము. దీనినే ' వార్నిష్ పెయింట్ ' అని కూడా అంటారు.
ఆయిల్ పెయింట్ కన్నా యిది తక్కువ వైశాల్యమును కవర్
చేస్తుంది. అనగా ఆయిల్ పెయింట్ కన్నా యిది తక్కువ
వైశాల్యమును కవర్ చేస్తుంది. ( అనగా ఆయిల్ పెయింట్ కన్నా
దీనిని ఎక్కువ పరిమాణములో వాడవలసియుంటుంది. ) ఇదీ
ఆయిల్ పెయింట్ కన్నా ఎక్కువ పెళుసుదనమును కలిగి
యుంటుంది.
మార్కెట్ లో పెయింట్ డబ్బాలలో లభ్యమగు పెయింట్ ఎక్కువ
చిక్కదనమును కలిగి యుంటుండి బ్రష్ తో ఉపయోగించుటకు
వీలుగాకుండా యుంటుంది. ఇందుకుగాను ' తిన్నర్ '
( Thinner ) అనబడు ద్రావణమును పెయింట్ కు కలుపుతారు. బెంజీన్
, కిరోసిన్ , స్పిరిట్ , సింధెటిక్ సాల్వెంట్లు పెయింట్ ను
పలుచబరచబడి ద్రావణములుగా వాడబడుచున్నవి. కర్రవస్తువుపై
పెయింట్ చేసినపిదప, అది ఆవిరవుపోవుటకుగాను పెయింట్ లో '
డ్రైయర్స ' ను కలుపుతారు. పెయింట్ ను తయారుచేయునపుడు '
డ్రైయర్ ' దానితో కలుపబడుతుంది. లిన్ సీడ్ ఆయిల్ డ్రైయర్
మరియు రోజిన్ వార్నిష్ కలిపిన జపాన్ డ్రైయర్ ఎక్కువగా
వాడబడుచున్నవి. పెయింట్ ను కొనుగోలు చేయునపుడు క్రింద
పేర్కొనబడిన గుణములను గమనించాలి.
1. పెయింట్ చేయబడిన పిదప ఆరంగు పొందికగా ఎక్కువకాలము
మన్నికను కలిగియుండాలి.
2. బ్రష్ తో సులభముగా వాడబడాలి.
3. తగినంత వైశాల్యమును కవర్ చేయాలి.
4. త్వరగా ఆరిపోవాలి.
పెయింట్ ను నిలువయుంచుట :—
1. పెయింట్ ను గాలిచొరని పాత్రలో నిలువయుంచాలి.
పాత్రముతలను గట్టిగా బిగించి యుంచాలి.
2. వెచ్చని వాతావరణములో పెయింట్ ను నిలువయుంచాలి.
పెయింట్ ను బ్రష్ తో లేదా స్ర్పే చేయుటకు ఉపకరించు స్ర్పే గన్
ద్వారా కర్రవస్తువుపై పూయవచ్చును. వార్నిష్ ను బ్రష్ తో వాడెడి
పద్ధతిలోనే పెయింట్ ను కూడా బ్రష్ తో కర్రవస్తువుపై పూయాలి.
7.6 జిగురు పదార్థము :--
విడి విడి భాగములుగా చేయబడిన కర్రవస్తువులను కలిపి
కర్రసామాగ్రిగా కూర్పుచేయునపుడు ఒకదానితో ఒకటి కలిపియున్న
రెండు విడిభాగములను అంటించి కలుపుటకుగాను జిగురు పదార్థము
వుపయోగిస్తుంది. జాయింట్ యందు జిగురు పదార్థము వాడుటవలన
అది ఎక్కువ దృఢంగా యేర్పడుతుంది.
మార్కెట్ లో వివిధరకముల జిగురు పదార్థములు
లభ్యమగుచున్నవి. వీటిని క్రిందపేర్కొన్న విధముగా
విభజించవచ్చును.
1. ' రెజిన్ ' తో కృత్రిమముగా తయారుచేయబడిన జిగురు :—
ప్లాస్టిక్ ను తయారు చేయుటకు వుపయోగపడు ముడిపదార్థమైన '
రెజిన్ ' ( Resin ) తో దీనిని తయారుచేస్తారు. యూరియా , ఫినాల్ ,
ఎపాక్సీరెజిన్ మున్నగు వాటితో తయారగు జిగురు ఈ రకమునకు
చెందినది. ఇది పౌడరు లేదా సేస్ట్ లేదా ద్రావణరూపములో
లభ్యమగుతుంది. ఇది తేమ నిరోధక గుణమును కలిగియుంటుంది.
2. పశువుల నుండి తయారుచేయబడిన జిగురు :—
ఇది పశువులతోలు, డెక్కలు , ఎముకలనుండి
తయారుచేయబడుతుంది. ఈ జిగురును వాడుటకు ఒక రోజుముందు
దానిని నీటిలో నానబెట్టి, వేడిచేయాలి. వేడిచేసిన జిగురు త్వరగా
అంటుకొంటుంది. అయితే ఎక్కువగా వేడిచేయుటవలన జిగురు
యొక్క పటిష్టత తగ్గిపోతుంది. దీని తేమనిరోధకత తక్కువగా
యుంటుంది. ఇది పౌడరు, బిళ్లలు, కడ్డీలు, ద్రావణము మొదలగు
వివిధ రూపములలో లభ్యమగుతుంది.
3. చేపలనుండి తయారుచేయబడిన జిగురు :—
ఇది చేపయొక్క తల, వెన్నెముక, రెక్కలు, కణజాలము నుండి
తయారు చేయబడుతుంది. ఈ జిగురు త్వరగా ఆరిపోదు. దీని తేమ
నిరో ధకత తక్కువగా వుంటుంది. ఇది ద్రావణ రూపములో
లభ్యమగుతుంది.
4. మొక్కలనుండి తయారుచేయబడిన జిగురు :— ఇది పిండి
పదార్థములు మరియు మొక్కల ప్రోటీన్ల నుండి తయారు
చేయబడుతుంది. ఫ్లైవుడ్ లోపలి పొరలను కలుపుటకు యిది
ఎక్కువగా వుపయోగిస్తుంది. ఇది అంటుకొన్నపిదప త్వరగా
ఆరిపోయి గట్టిపడుతుంది. దీని తేమ నిరోధకత తక్కువగా
యుంటుంది. ఇది పౌడరు లేదా ద్రావణ రూపములో
లభ్యమగుతుంది.
కర్రవస్తువు యొక్క ఉపయోగమునుబట్టి మరియు దాని
పరిమాణమును బట్టి పైనపేర్కొనబడిన వాటిలో తగినటువంటి
జిగురు పదార్థమును యెన్నుకొనవలెను.
ద్రావణ రూపములోయున్న అన్నిరకముల జిగురు పదార్థములు
బిగువైన మూతగల పాత్రలో నిలువయుంచుకొనాలి.
ద్రావణములోయున్న జిగురు గట్టిపడినపుడు, దానికి వేడినీటిని
కలుపుటద్వారా పలుచబరచాలి.
జిగురుపదార్థమునుపయోగించి జాయింటును చేయుట :
1. ముందుగా కలుపవలసిన రెండు ముఖతలములు ఒకదానితో
మరియొకటి ఖచ్చితముగా అమర్చబడుచున్నవా, లేదా అన్నది
గమనించాలి. లేనియెడల వాటిని సరిచేయాలి. సరిగా అమర్చబడని
రెండు తలముల మధ్యజిగురు పదార్థమును ఉపయోగించి
యేర్పరచిన జాయింటు తగినంత దృఢంగా యుండదు.
2. కలపవలసిన ముఖతలముల పై జిగురు పదార్థమును పూయాలి.
పిదప క్లాంప్ ద్వారా ఆ రెండు ముఖతలములను ఒకదానికి
మరియొకటి తగిలించి నొక్కిపెట్టి యుంచాలి. అయితే మరీ ఎక్కువ
బలముతో క్లాంప్ ను ఉపయోగింపరాదు. దీనివలన కలపవలసిన
ముఖతలముల మధ్యగల జిగురు బయటకు నెట్టివేయబడి జాయింట్
సరిగా యేర్పడదు.
3. జాయింటు చుట్టూవున్న జిగురు పదార్థమును తడిగుడ్డతో
తుడిచివేయాలి.
4. జిగురు పదార్థము గట్టిపడునంత వరకు క్లాంప్ ను విడదీయరాదు.
కొన్ని జిగురు పదార్థములు ఒకగంటలో గట్టిపడతాయి. మరికొన్ని
జిగురు పదార్థములు గట్టిపడుటకు 4 నుండి 8 గంటలు పడుతుంది.
జిగురు పదార్థములు తయారుచేసిన కంపెనీవారు యిచ్చిన
సూచనలు గమనించి వాటిని సరిగ్గా పాటించాలి.
యూనిట్ -5
మేకులు
కర్రసామాగ్రిని చేయునపుడు విడి విడి భాగములుగా చేయబడిన
వస్తువులను కలిపి బిగించుటకుగాను మేకులు పనికివస్తాయి. ఇవి
ఉక్కు, రాగి, ఇత్తడి, అల్యూమినియం, జింకు మొదలగు లోహములతో
తయారు చేయబడును. కొన్ని మేకులు ఇనుముతో చేయబడి
వాటిపైన రాగి, ఇత్తడి, జింకు మొదలగు లోహపు పూతను
కలిగియుండి త్రుప్పుపట్టకుండా వుంటాయి. మేకును కర్రవస్తువులోనికి
దింపినపుడు అదికర్ర పొరలను విడదీసి, ప్రక్కలకు వంచుచు
ముందుకు సాగుతుంది. మేకు కర్రలోనికి దిగిన పిదప ప్రక్కకు
వంగి పొరలు మరల తమ పూర్వపు స్థానమునకు వచ్చుటవలన
అవి మేకు పైకి నొక్కిపెట్టబడుతవి. దీనివలన కర్రవస్తువులో మేకు
గట్టిగా బిగింపబడుతుంది.
( పటము 7.1)
మేకు సన్నని పొడవైన కడ్డీభాగమును కలిగియుండి దాని
అడుగుభాగమున పదునైన మొనను కలిగియుంటుంది. కడ్డీ పై
భాగమున పలుచని వెడల్పైన గుండ్రటి హెడ్ భాగమును
కలిగియుంటుంది.
( B ) కీళ్ల సైజులు :—
వివిధ రకముల కీళ్ల యొక్క సైజులు క్రింది విధముగా వుంటాయి.
కీలుపేరు 1. తలుపులకు ఉపయోగించు పిన్ను ద్వారా కలుపబడిన కీలు
పలక పొడవు 12 మి.మిా. నుండి 50 మి.మిా.
పలక వెడల్పు 12 మి.మిా. నుండి 36 మి.మిా.
కీలుపేరు 2. బల్లలపై ఉపయోగించు కీలు
పలక పొడవు 25 మి.మిా. నుండి 50 మి.మిా.
పలక వెడల్పు 50 మి.మిా. నుండి 36 మి.మిా.
కీలుపేరు 3. బీరువాలకు ఉపయోగించు సన్నని స్ర్టాప్ కీలు
పలక పొడవు 100 మి.మిా.
పలక వెడల్పు 25 మి.మిా.
పలక పొడవు 150 మి.మిా.
పలక వెడల్పు 28 మి.మిా.
కీలుపేరు 4. T - ఆకారపు కీలు
పలక పొడవు 50 మి.మిా.
పలక వెడల్పు 50 మి.మిా.
పలక పొడవు 75 మి.మిా.
పలక వెడల్పు 30 మి.మిా.
పలక పొడవు 36 మి.మిా.
పలక వెడల్పు 10 మి.మిా.
పలక పొడవు 25 మి.మిా.
పలక వెడల్పు 10 మి.మిా.
పలక పొడవు 15 మి.మిా.
పలక వెడల్పు 15 మి.మిా.
7.10 ఆయిల్ స్టోన్ :
వివిధ పనిముట్లను పదును పెట్టుటకు ఆయిల్ స్టోన్
ఉపయోగిస్తుంది. దీని ముఖభాగమునగల పదునైన మొనలపైన
పనిముట్టును ఆనించి రాపిడి గావించిన యెడల పనిముట్టునుండి
లోహపు పదార్థము అతి కొద్దిగా తొలగింప బడుటవలన అది
నునుపు పరచబడుతుంది. అంతేకాకుండా దానిని ఖండించెడి
అంచు లేక మొన పదునుపెట్టబడుతుంది.
ఆయిల్ స్టోన్ సాధారణంగా దీర్ఘచతురస్రాకారపు దిమ్మవలె
వుంటుంది. అయితే ఒకవైపు ముఖభాగము లేదా రెండు వైపులగల
ముఖతలములు ఏటవాలుగా వుండు ఆకారమును కలిగిన
ఆయిల్ స్టోన్ లు కూడా కలవు. స్థూపాకారము, శంఖు ఆకారము ,
త్రిభుజాకారపు ఆయిల్ స్టోన్ లు ప్రత్యేకమైన పనులకు
ఉపయోగపడుతవి.
ఆయిల్ స్టోన్ ఒక విధమైన రాపిడి పదార్థముతో చేయబడిన
ముఖభాగములను కలిగివుంటుంది. ప్రకృతిలో సహజముగా
లభ్యమగు ఆరుగ దీసెడి గుణముకలిగిన ప్రత్యేకమైన రాతితో గానీ
లేదా కృత్రిముగా తయారు చేయబడిన రాపిడి పదార్థముతో గానీ
ఇది చేయబడి వుంటుంది.
కృత్రిమముగా తయారు చేయబడిన ఆయిల్ స్టోన్ ఒకవైపు
ముఖతలము మృదువైన రాపిడిపదార్థము మరియు రెండవవైపు
ముఖతలము గరుకైన రాపిడి పదార్థమును కలిగియుంటుంది.
పనిముట్టును ముందుగా గరుకైన ముఖతలముపై రాపిడిగావించిన
యెడల దానినుండి పదార్థము త్వరగా తొలగింపబడుతుంది.
ఎక్కువగా నునుపుపరచి పదునైన మొనలను ఏర్పరచుటకుగాను
చివరగామృదువుగా యున్న
ముఖతలముపై రాపిడిగావించాలి.
అల్యూమినియం ఆక్సైడ్ తో చేయబడిన " ఇండియా స్టోన్ "
లేత బూడిద రంగులో వుంటుంది. ఇది సాధారణ పనులకు పనికి
వస్తుంది.
సిలికాన్ కార్బైడ్ తో చేయబడిన
' కార్బొరన్ డమ్ ' అనబడు ఆయిల్ స్టోన్ ఎక్కువ త్వరగా వస్తువును
అరగదీస్తుంది. ఎక్కువగా వాడబడిన ఆయిల్ స్టోన్ యీ రకమునకు
చెందినది. ఫైల్ తో అరగదీసిన పిదప నునుపుదనము యిచ్చి
మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగిస్తారు.
ఆయిల్ స్టోన్ సైజులు క్రింద పేర్కొనిన విధంగా వుంటాయి.
1. పదును పెట్టుకొనెడి సాధారణ ఆయిల్ స్టోన్ దీర్ఘచతురస్రాకారపు
దిమ్మ ఆకారముతో 100 మి.మిా. నుండి 200 మి.మిా. పొడవు, 40 మి.మిా.
నుండి 50 మి.మిా. వెడల్పు మరియు 15 నుండి 25 మి.మిా. వరకు
మందమును కలిగియుంటుంది.
2. స్లిప్ స్టోన్ ఏటవాలుగా ముఖతలములతో 100 మి.మిా. నుండి 115
మి.మిా. పొడవును
కలిగియుంటుంది. దీని మందము ఒకవైపు 10 నుండి 12 మి.మిా.
రెండవవైపు 2 మి.మిా. నుండి 6 మి.మిా. వరకు వుంటుంది.
3. గౌజులను అరగదీసి పదును పెట్టుకొనుటకుగాను శంఖు ఆకారపు
స్లిప్ స్టోన్ వట్రుతలమును కలిగియుంటుంది.
4. స్థూపాకారపు ఆయిల్ స్టోన్ 50 మి.మిా. నుండి 100 మి.మిా.వ్యాసమును
కలిగివుంటుంది.
5. ఆగర్ బిట్ స్టోన్ త్రిభుజాకారములో సుమారు 100 మి.మిా. పొడవును
కలిగియుంటుంది.
6. కార్బొరన్ డమ్ ఫైల్ స్టీలుతో చేయబడిన సాధారణ ఆకురాయివలె
చేయబడి దానికి హాండిల్ బిగింపబడి యుంటుంది. ఇది 350 మి.మిా.
వరకు పొడవును కలిగియుంటుంది.
ఆయిల్ స్టోన్ ను ఎక్కువగా వుపయోగించినపుడు దాని
ముఖతలము పైన
గల రాపిడి పదార్థపు మొనలు అరిగి పోవచ్చును. దాని
ముఖతలముపై తిరిగి పదునైన మొనలు ఏర్పరచుటకు గాను దాని
ముఖభాగము పై ఎమెరీ పౌడర్ ( పొడి రూపములో నున్న రాపిడి
పదార్థము ) మరియు కిరోసిన్ నూనెను లేదా ఇసుక మరియు నీటిని
వేసి సాధారణ ఫైల్ తో అరగదీయాలి. దీనితో పదునైన మొనలు
తిరిగి ఏర్పడుతవి.
పటము 7.19 లో ఆయిల్ స్టోన్ ద్వారా ఉలిని , గౌజ్ ను , ప్లేన్ ను
అరగదీసి పదును పెట్టుకొనుట చూపబడింది.
7. గ్రైండింగ్ స్టోన్ : — ఉలి , ప్లేన్ మొదలగు పనిముట్లకుగల పదునైన
అంచులు మొద్దుబారినపుడు వాటిని తిరిగి పదును పెట్టుటకు గాను
గ్రైండింగ్ స్టోన్ లేదా గ్రైండింగ్ వీల్ వుపయోగపడుతుంది. గ్రైండింగ్
చక్రమువలన ఏటవాలుగా యున్న పదునైన అంచులను తిరిగి
రూపొందించవచ్చును.
గ్రైండింగ్ చక్రము పై యేర్పరచబడిన అరగదీసెడి
పదార్థమువలన దానిపై రాపిడి కలిగించిన వస్తువునుండి పదార్థము
అమర్చబడుతుంది. ఈ చక్రము విద్యుత్ యంత్రమునకు కలుపబడి
దాని ద్వారా ఎక్కువ వేగముతో గుండ్రముగా త్రిప్పబడుతుంది. దీని
వేగము ఒక నిమిషమునకు 400 నుండి 3600 చుట్లు వుంటుంది.
దీనినే R.P.M అని అంటారు. వేగముతో తిరిగెడి యీ చక్రమునకు
పనిముట్టు యొక్క మొద్దు బారిన అంచును ఆనించి నొక్కిపెట్టాలి.
రాపిడి వలన పనిముట్టు అరగదీయబడి పదును పెట్టబడుతుంది.
గ్రైండింగ్ చక్రముతో వివిధ పనిముట్లను అరగదీయుట పటము 7.20
లో చూపబడింది.
గ్రైండింగ్ చక్రము పైన యేర్పరచబడిన అరగదీసెడి గట్టి
పదార్థము సిలికాన్ కార్ బైడ్
లేదా అల్యూమినియం ఆక్సైడ్ తో చేయబడి యుంటుంది.
గ్రైండింగ్ చక్రమును ఉపయోగించునపుడు గమనించవలసిన
విషయములు:
1. ఎల్లప్పుడు గ్రైండింగ్ చక్రముయొక్క ముఖతలమునే
వుపయోగించాలి. ప్రక్కతలములు ఉపయోగించరాదు.
2. పనిముట్టును చేతితో గట్టిగా పట్టుకొనాలి. అది ఎక్కువ
వేడెక్కునంత వరకు గ్రైండింగ్ చేయరాదు. మధ్య మధ్యలో దానిని
గ్రైండింగ్ చక్రము నుండి బయటకు తీసి చల్లారిన పిదప మరల
పదును పెట్టుకొనాలి.
3. గ్రైండ్ చేయునపుడు రక్షక అద్దములు ధరించాలి.
7. మక్కు :—
కర్రవస్తువుల యందు పగుళ్లు మరియు రంధ్రములు
యేర్పడినపుడు వాటిని నింపి కర్రవస్తువు ఉపరితలముతో
సమపరచుటకుగాను వుపయోగించెడి ఱంపము పొడిని 'మక్కు'
అంటారు. ఈ ఱంపపుపొడిని రంధ్రములలో మెత్తి, దానిపైన పేస్ట్
రూపములో నున్న ' ఫిల్లర్ ' ( Filler ) ను బ్రష్ ద్వారా పూసి కర్ర
ఉపరితలముతో సమపరచాలి. ఫిల్లర్ కు తగినంత టర్పెంటైన్
కలిపి దానిని పలుచబరచి బ్రష్ తో పూయవచ్చును.
అభ్యసము
1. కర్రసామాగ్రి తయారితో సాండ్ పేపరు ఉపయోగమును గురించి
వివరింపుము.
2. ఫ్రెంచ్ పాలిష్ వుపయోగమును పేర్కొనుము.
3. వార్నిష్ వలన కర్రసాముగ్రిని రక్షించు విధానమును పేర్కొని
వార్నిష్ ను నిలువయుంచు విధానమును వివరింపుము.
4. ఆయిల్ వార్నిష్ మరియు స్పిరిట్ వార్నిష్ లకు గలభేదమును
వివరింపుము. కర్రవస్తువుపై బ్రష్ తో వార్నిష్ ను పూసెడి
విధానమును వివరింపుము.
5. వివిధ రకముల పెయింటులను గురించి పేర్కొని , పెయింటును
కొనుగోలు చేయునపుడు గమనించవలసిన విషయములను
పేర్కొనుము.
6. కర్రముక్కల మధ్య జాయింటును యేర్పరచుటకు జిగురు
పదార్థమును ఉపయోగించు విధానమును వివరింపుము.
7. కర్రవస్తువులను కలిపెడి వివిధ రకముల మేకులను గురించి
వివరింపుము.
8. రెండు కర్రపలకను కలిపెడి కీళ్లను గురించి వివరింపుము.
9. ఆయిల్ స్టోన్ ను, గ్రైండింగ్ స్టోన్ ను వుపయోగించి పనిముట్టును
పదును పెట్టుకొనెడి విధానమును వివరింపుము.
No comments:
Post a Comment