Tuesday, September 28, 2021

బుక్ బైండింగ్ - 8 - కాగితపు అట్టలు

 కాగితపు   అట్టలు  :—

           పుస్తకములు   బైండింగ్   చేయుటకు   అట్టలు   చాలా    ముఖ్యమైనవి.   అట్టలలో   రకరకాలు   గలవు.   అట్టలను   గడ్డి,   పాతబట్టలు,   కాగితము,  చెరుకు  పిప్పి   మొదలగు  పీచుపదార్థములతో,   మరికొన్ని   రసాయనపదార్థములు   కలిపి   గుజ్జుగా   చేసి,  అట్టి    గుజ్జును    రకరకాల   మందముల్లోను,  సైజుల్లోనుపోసి   అట్టలుచేస్తారు.   గడ్డితో   చేసిన  అట్టలు  దృడముగాను   బరువుగాను  వుంటాయి.   కాని   వంచినయెడల   వెంటనే   విరిగిపోయే  స్వభావముగలదు.    సాధారణముగా   ఈ   అట్టలు  25"  x  30"  సైజులోను,   1 lb,  1 1/2  lb   మరియు  2 lb   మందములో   దొరకును.   యింకా   మందమైన   అట్టలు   కావలసిన   యెడల   రెండుఅట్టలను    కలిపి    అంటించవలయును.   ఈ    అట్టలను   పుస్తకాల    బైండింగ్   చేయుటకు,   స్వీట్సు   పెట్టెలు   ( Sweets  boxes )   తయారీలోను,   రైటింగ్   ప్యాడ్సుకు   విరివిగా   వాడుతారు.  ఈ   అట్టలలోని   ఇతర   రకములు   ఏవనగా   చిప్  బోర్డ్సు   ( Chip boards ),   గ్రే  బోర్డ్సు   ( Gray  boards ),   పల్పు  బోర్డ్సు   ( Pulp boards )   మరియు   కారుగేటెడ్   బోర్డ్సు  ( Corrugated  boards ).   సాధారణముగా   ఈ   రకపు   అట్టలు   0.05m.m.   మందమునుండి  4.50 m.m   మందము   వరకు   వుండును.  అనేక   సైజులు,   రంగులలో   దొరుకును.   అట్టల   రకములలో   Straw  boards   తప్ప   మిగతా   అన్నిరకములు   సున్నితముగా,   కావలసిన   పద్ధతులలో   వంచుకొనవచ్చును.   అట్టిస్వభావము   కల్గినందువలన   పల్పు  బోర్డ్సును   ఎక్కువగా   కార్టన్   ( Cartons )   తయారీలో   ఉపయోగించుచున్నారు.   ఈ    అట్టలను   కూడా    తగుజాగ్రత్తలో    దాచిపెట్టవలయును.   లేనిచో   అవి   వంకరలు   తిరిగిపోవును.   ఉపయోగించుటకు   కష్టముగానుండును.   పుస్తకముల   నాణ్యత   చెడిపోవును.

     పుస్తకములకు   కవరు   వేయుటకు   ఉపయోగించు  వస్తువులు   ( Covering Materals ) :—  కవరు   వేయుటకు    రకములైన   వస్తువులను    వాడుతారు.    అట్టివాటిలో   కాగితము,  గుడ్డు,  క్యాలికో,   రెక్సిన్  మరియు   తోలు   ముఖ్యమైనవి.   పైన   తెల్పిన   రకములలో   కావలసిన    వస్తువును,  అవసరమునుబట్టి   పుస్తకాల    ఖరీదును  బట్టి   ఉపయోగించుకొంటారు.   విలువైన  పుస్తకాలకు   తోలు   లేదా   క్యాన్ వాన్   వాడతారు.   పైన   తెల్పిన    వస్తువులను  అట్టలకు   అంటించుటకు   మైదా   ( Paste )ను  జాని   లేదా   గ్లూ ( Glue )ను  గాని   వాడుదురు.    తోళ్ళలో   వివిధ    రకములైన   నాణ్యతగలవు.

      దారపు  వస్తువులు ( Textile Materials ) :—

   దారములను,   లెనిన్ ,  ప్రత్తి,  మరియు ' నైలాన్ 'ద్వారా   తయారుచేయుదురు.   మంచిరకపు   దారమును   ఎనుకొనవలయును.  నైలాన్  దారమువలన    పుస్తకము    ఎక్కువలావురాదు.  దారములు   కండెలల   లభించును.  వీటికి   రంగు పూత   వేయబడియుండును.   కార్స్డ్ అనునవి  దారములకన్నా   మందముగానుండును.   వీటినికూడా   పుస్తకము  కుట్టుటలో     ఉపయోగింతురు.  ' సిల్కు   రిబ్బన్స్ '   మరియు  సూయింగ్  టేపులు,   లేసులు   మొదలగునవి  కూడా   అప్పుడప్పుడు   కొనిరకముల  బైండింగ్    పనులకు  వాడుతారు.

లోహాపు   వస్తువులు  ( Metal Items ) :—

            పుస్తకాలు   కుట్టుటకు   ఉపయోగించు   తీగలు  కోటింగ్   వేయబడి   వివిధ   గేజ్ లలో   దొరుకును.    స్ర్పింగ్   తీగ   చుట్టలు  ( Spirals ) కుడా  ఒక  రకమైన   బైండింగ్   పద్థతికి   వాడుతారు.   క్యాలండర్    రిమ్మింగ్   ప్లేటులు   మొదలైన  లోహాసంబందమైన   వస్తువులు    కూడా   కవలసియుండును.

అంటించుటకు   ఉపయోగించు  వస్తువులు ( Adhesives ) :— 

    ' గ్లూ '   మరియు   పేస్టు   అనునవి   సాధారణముగా   అంటించుటకు   ఉపయోగించు   వస్తువులు    ' గ్లూ '     అనునది  జంతుసంబంధమైన   వస్తువు.   ఇది   చిన్న  చిన్న   కేకులరూపములో   దొరకును.   దీనిని    ప్రత్యేకమైన   పాత్రలో   కరుగపెట్టుదురు.    దీనిని   వేడిచేసి   ఉపయోగించవలయును.   పేస్టు   అనునది   మైదా   పిండితో   ఉడికించి   తయారుచేస్తారు.   దీనిలో   క్రిమిసంహారకపు   మందీలు   కూడా   వాడుతారు.     ' గ్లూ '   వెంటనే   అంటుకొనును.   పేస్టు   అంటుకొనుటకు   కొంత   వ్యవధి   పట్టును.  P.V.G  అను  అంటించు   పదార్థమును   కూడా       పుస్తకాలు   బైండింగ్   చేయుటలో    వాడుచున్నారు.   ఈ    అతికీంచు   పదార్థములను   జాగ్రతపరచవలెను.   లేనిచో    బూజుపట్టి   చెడిపోవును.   వాటిలొ   నాణ్యత   లోపించును.

                           ప్రశ్నలు

1. బైండింగ్ కు   కావలసిన   వస్తువులను   ఎనుకొనుటలో   ఏమి   జాగ్రత్తలు   పాటింతురు?

2. కాగితములు    కొనునప్పుడు  ఏ  విషయములను   గుర్తుంచుకొనవలెను? 

3. పుస్తకములు   కవరుచేయుటకు   ఉపయోగించు   వస్తువులేవి?

4. పుస్తకాలు   అతికించుటకు 

  ఉపయోగించు  పదార్ధములేవి?

అధ్యాయము—7

బైండింగ్  వస్తువులను  ఉంచు   గిడ్డంగీ  మరియు  అందుచేయు   వివిధ  పనులు ( Binding Ware House )

      బైండింగ్    వేర్  హౌసు   ( Ware House ) అనగా   బైండింగ్ కు   కావలసిన    వివిధ   రకముల   వస్తువులను   బద్రపరచునటువంటి   గిడ్డంగీ  అని   అర్ధము.  ఈ   గీడ్డంగులను   ముఖ్యముగా   రెండు   వీధములుగా  విభజించవచ్చును.   మొదటిది   తెల్ల    కాగితము   గిడ్డంగి  ( White Paper Ware House )అనియు,  రెండవదిముద్రిత   కాగితముల   గిడ్డంగి ( Printed Paper Ware House )  అనియు  అంటారు.  తెల్ల  కాగితముల   గిడ్డంగి   బైండింగ్    షాపునకు   దగ్గరలో   ఉండవలయును.   అందువలన   బైండింగ్ కు   కావలసిన   వివిధ   రకముల  వస్తువులను    పదార్థములను   సులువుగా,   వసతిగా   చేరవేసుకోవచ్చును.    ఈ    గిడ్డంగులలో   వస్తువులను   బద్రపరచుటకు   శాస్తీయ   పద్థతులు   గలవు.   కాగితపు   కట్టలను    ఎత్తుగా    కొయ్య    చట్రములలో   ( Racks  )  పెట్టవలయును.   ఆవిధముగా   పెట్టిన    కాగితపు   కట్టలకు    సంబందించిన    వివరములను   అంటే    ఆ    కాగితము    యొక్క   కొలతలు   మందము,   తయారుచేసిన   కంపెనీ,   కొన్న    తారీఖు,   ఎన్ని   కొన్నది,   మరియు,   ఎన్ని    మిగులు   వున్నవి   అనే   వివరములు   తెలుపు   పట్టీని   తయారుచేసి    ఒక్కొక్కరకపు   కాగితము   అరలకు   లేదా   ఇతర   వస్తువులకు,   వాటిని   బద్రపరచిన   చట్రములకు   వ్రేలాడదీయవలయును.    అట్లా    చేయకపోయిన   గిడ్డంగిలో   ఏ  యే    వస్తువులు   ఎంతెంత   వున్నవి   తెలియదు.   అవసరమునకు    కావలసిన   వస్తువులు   లేకపోయిన   పని   అంతా   స్థంభించిపోవును.   దానివలన   కావలసిన   వస్తువులు   అనుకొన్న   సమయానికి   దొరకకపోవచ్చును.   అందువలన   గిడ్డంగిలోని   వస్తువుల    వివరములను   ముందుగానే   తెలిసికొని,   వాటిని   కొని   బద్రపరచినయెడల   పైన    తెల్పిన    ఇబ్బందులను   ఎదుర్కొనుటకు   వీలుకల్గును.    పెద్ద   పెద్ద   ముద్రణాలయములలో   దీనికిగాను   ప్రత్యేకముగా   గిడ్డంగి   అధికారులు   వుంటారు.  వారు   గిడ్డంగి   నిర్వహణ   వ్యవహారములు  చూస్తారు.

      పేపర్   ర్యాక్స్ ను   పెట్టునప్పుడు   అవి   గోడలకుగాని,   క్రింద   నేలకుగాని    తగులకుండా   వుంచవలయును.   అందువలన   కాగితములకు   చదలుపట్టకుండా  వుండును.   పేపర్సుకు   బాగా   గాలి    వెల్తురు    తగులునట్లుగా   వుండవలెను.   

కాగితములు   ఏ   యే   పనికి   ఎంతెంత   విడుదలచేసినది   వివరముగా   పట్టీలో   వ్రాసి,   సంతకము    చేయవలయును.   కాగితములు   వాతావరణ    పరిస్థితులకు   మార్పుచెందును.   అందువలన    ముద్రించునప్పుడుగాని   లేదా   బైండింగ్   చేయునప్పుడు   గాని    ఇబ్బందులు   ఏర్పడును.   కాబట్టి    కాగితముల   గిడ్డంగిలో    వాతావరణమును   క్రమబద్ధము    చేయవలయును.   గిడ్డంగిలోని   గాలిలోని   తేమ   సుమారు   50॰  నుండి  60॰   వుండులాగున   చూడవలయును.    ఉష్ణోగ్రత   20॰ — 21॰C   వుండులాగున   చూడవలయును.    పైనతెల్పిన   పరిస్థితులలో    కాగితములు   ఏమి    చెడిపోవు.   ఒక్కొక్క   పనికి   ఎంత   కాగితముకావలసినది,  ' పనిచీటి '   ప్రకారము   లెక్కించి  సరఫరా   చేయవలయును.

ముద్రణా   కాగితముల   గిడ్డంగి   ( Printed paper Ware  House ) :

         ఇది   బైండింగ్   సెక్షన్   లోనే   ఒక   ప్రత్యేక   ప్రదేశములో   కేటాయించుతారు.   ముద్రణాలయములో   వివిధ   పద్ధతులలో   ముద్రించబడిన   కాగితములు   పుస్తకాలుగా   తయారుచేయుట   కొరకై   బైండింగ్ కు   వచ్చును.    ఒక    పుస్తకములోని    వివిధ   ఫారములు   ఒకేసారి   బైండింగుకు   చేరవు.   కాని   క్రమేణ   వస్తూనే    వుంటాయి.   అట్లా   వచ్చిన   వివిధ   ఫారములకు   సంబంధించిన   కాగితములను   లెక్కించి   తీసుకొనవలెను.   లేనిచో   చివరికి   కొన్ని    పుస్తకములు   తక్కువగును.   ముందుగా  ఒక్కొక్క   ఫారమును   లెక్కించి,   తక్కువకాబడ్డ  కాగితముల    వివరములను    తెల్పినయెడల,   ముద్రించి    సరఫరాచేయగలరు.   లేనిచో    అనుకున్నదానికన్నా   తక్కువ   పుస్తకములు   చేయుట   జరుగును.   ఇంకొక    ముఖ్యమైన   విషయమేమనగా   బైండింగ్ లోనికి   ఫారములు   పుచ్చుకొనునప్పుడు,   అవి    రెండువైపుల   ముద్రించబడ్డవా?  లేదా?   అనేది   చూడాలి    తరువాత  అన్నిరంగులు   ముద్రించబడ్డవా?  లేదా?   అనేది   చూడాలి.    జబ్  డాకెట్టు   ప్రకారము   అన్ని   ఫారాలు,   కాపీలు   ముద్రించినది   లేనిది   కూడా   తెలుసుకొనవలయును.

ఆ   విధముగా   ప్రింటు   అయివచ్చిన    కాగితములను   లెక్కవ్రాసి    పెట్టుకొనవలెను.   ప్రింటింగ్   అయిన   కాగితములను   జాగ్రత్తగా   ఉపయోగించవలెను.   బైండింగ్   అగుచున్న    కాపీలను   పదిలపరచుటకు   తగిన   స్థలము   వుండవలెను.   ఈ   ప్రదేశమునకు   గాలి   వెలుతురు   బాగుగా  ఉండవలయును.   


       బైండింగ్    గిడ్డంగిలో   చేయు   వివిధ   

                           పనులు

            ( Ware  House  Operation )

1.   కాగితములు   లెక్కపెట్టుట    ( Counting ) :

          తెల్లకాగితములు   గాని,   ముద్రించిన   కాగితములు   గాని    ముందుగా   లెక్కించవలయును.  కాగితములను   ఒక   పద్ధతిలో   ఏటవాలుగా   వంచి,  కాగితములను   కుడిచేతితో   పట్టుకొని   ఎడమచేతి   బ్రొటనవ్రేలితో

 లెక్కించవలెను.   లెక్కించిన    కాగితములను  శుభ్రమైన   ప్రదేశములో   పెట్టవలెను.   లెక్కించునప్పుడు   చేతులు   శుభ్రముగా   నుండవలెను.   చిరిగిన   కాగితములను,   బాగా   ముద్రణకాని   కాగితములను   లెక్కలోనికి   తీసుకొనరాదు.   కాగితములను   కచ్చితముగా   లెక్కపెట్టి   ఎక్కువ   తక్కువ   కాకుండా   చూడవలెను.

2.  కాగితములను  ఆరపెట్టు   పద్ధతి  ( Hot  and  Cold Pressing )  :

           ఒక్కొక్కసారి   ప్రింటు   అయిన   కాగితములు    వెంటవెంటనే   పుస్తకము   తయారు   చేయవలసియుండును.   అటువంటి   పరిస్థితులలో   ప్రింటు   సరిగా  ఆరిపోదు.   అప్పుడు   ప్రింటు   అయిన   కాగితములను  రెండు   నున్నని  ఇనుప   వేడి   రోలర్సు   మధ్యనుండి   పంపుదురు.  ఆ  వేడికి   ప్రింటు   ఆరిపోవును.

            మరి   ఒక    పద్ధతిలో   ప్రింటు   అయిన   కాగితముల   పై   వేరొక    మామూలు    కాగితమును   పరచి  ( Slip Sheeting )  కొన్ని  కాగితములను   ఒకేమారు   హార్డుప్రెస్   క్రింద   కొంతసేపు   కదిలించకుండా   వుంచుతారు.   దీనిని   కోల్డు   ప్రెస్  ( Cold Press )  అని  అంటారు.   దీనివలన   ప్రింటు   చెడిపోదు.  కాని   వ్యవధి   ఎక్కువగా   పట్టును.

3.  జాగింగ్  ( Jogging ):

            దీనివలన     కాగితములమధ్య  నున్నటువంటి   చినిగిపోయిన   కాగితములు,   దుమ్ము, గాలి,  వగైరాలు   బయటకు  నెట్టబడి,   కాగితములు  సమాన   అంచులుగా   ఏర్పడును. కాగితము   చదునుగా  ఏర్పడును.  మరకలు   పడకుండా    కాగితములను   శుభ్రముగా   నుంచవలెను.  జాగింగ్   చేసిన   కాగితములు  యంత్రములలోకి    పంపుటకు  ( Feeding )  బాగా   వుండును.

4.  కాగితములు  మడచుట  ( Folding ) :

            కాగితములను  చేతితోగాని,   యంత్రముల   సహాయమునగాని   మడవవచ్చును.   కాగితములు  మడచునప్పుడు   జాగ్రత్తలు   తీసుకొని   ఎక్కువ  వృధా   కాకుండా   చుడవలెను.  మడతలు   సరిఅయిన   పద్ధతిలో   చేయవలెను.   లేనిచో   ముందు   పేజీలు   వెనుకకు,  వెనుకవి    ముందుకువచ్చును.  కాగితములు  మడచునప్పుడు   ఫారమ్ నంబరును  ( లేదా )  సిగ్నేచరు   మార్కును   గైడుగా   పెట్టుకొని   మడవవలెను.   ఒక్కొక్కసారి    యింపోజింగు   స్కీమును   కూడా   ఆలోచించి   మడవవలెను.   మందమైన   కాగితములు  మడచునప్పుడు    మడతల   మధ్య   గాలి   బంధించబడును.   దానిని   జాగ్రత్తగా    తొలగించవలెను.   మడతలు   వేయునప్పుడు   ఫోల్డింగ్  టు   ప్రింటు   అనియు   ఫోల్డు   టు   పేపరు   అనియు   రెండు   పద్ధతులుగలవు.   అందులో   మొదటి    పద్ధతి   చేయునప్పుడు   తగుజాగ్రత్తతో   నిదానముగా   చేయవలెను.

5.  కట్టలు   కట్టుట  ( Bundling ) :

            మడచిన    కాగితములను    జాగ్రత్తగా   కట్టలు   కట్టవలెను.   అట్లాచేసినందు   వలన   సెక్షన్ లు   శుభ్రముగా   నుండును.   వేరే   సెక్షన్స్ లో     కలిసిపోవు.    ప్రమాదముండదు.   సెక్షన్    మధ్య   గాలి   బయటకువెళ్ళగొట్టబడుటచే   అవి   చదునుగా    నుండును.    కట్టలను   గుర్తుగా   ఒకచోట   పెట్టవలెను.   ఈ   కట్టలు   కట్టు     విధానము   చేతితోగాని,   యంత్రముల   సహాయమునగాని     చేయవచ్చును.

6.  గేదరింగ్  ( Gathering ) :

            గేదరింగ్   అనగా   ఫోల్డు   అయినటువంటి      సెక్షన్ లన్నిటిని   వరుసక్రమములో   జమచేయడము.   ఈ    పనిని    చేయుటకు   ముందు   సెక్షన్ లను    అన్నిటిని    వరుసక్రమములో    పేర్చుకొనవలెను.   అటుపిమ్మట     ఆఖరు    సెక్షన్   నుండి    మొదలుపెట్టి    మొదటి    సెక్షను   వరకు    ఒక్కొక్క    సెక్షన్ ను    వరుసక్రమములో    తీసుకొనవలెను.   అప్పుడు    ఆఖరి    సెక్షన్     మొదలుపేజి    పైకివచ్చును.   ఈ   విధముగా   కూర్చిన   పుస్తకాలు    టేబుల్  పై    పెట్టి,   మళ్ళీ    అదే     విధముగా   అన్ని    పుస్తకాలు   అయిపోవువరకు    గేదరింగ్   చేయవలెను.   ఈ   గేదరింగ్    పద్ధతిని   యంత్రముల    సహాయమున     కూడా    చేయవచ్చును.   గేదరింగ్    అయిన    సెక్షన్స్ ను    మరియొక    మారు   సరిగా    వున్నదీ    లేనిదీ    పరీక్షచేయవలెను.   ఆ   విధముగా   పరీక్షచేయుటను   "  కొలేటింగ్ "  ( Collating )   అని    అంటారు.  ఫారమ్   నంబర్లు   అన్నీ   సరిగా    వున్నవా  లేదా !   ఏవైన   సెక్షన్ లు    తలక్రిందులుగా    పెట్టబడినవా!   అన్ని   సెక్షన్ లు       ఒకేపనికి   సంబంధించినవా   లేదా!   అనే   విషయములు   ముఖ్యముగా   గమనించవలసిన    పనులు.   తదుపరి    పుస్తకమును    కుట్టుటకు   తీసుకొనిపోవుదురు.   

             పైన   తెల్పిన    పనులేకాకుండా   ఇంకా   ఇతరత్రా  ( Miscellaneous )  పనులు  చాలా   గలవు.   అట్టివాటిలో   Punching ,  Drilling ,  Eyeleting ,  Index  cutting ,  Round  cornering ,   Label  punching ,  Gumming ,  Guarding ,  మరియు  Numbering   అనునవి   గలవు.

                         ప్రశ్నలు

1.  కాగితపు   గిడ్డంగులు   ఎన్నిరకములు ?   వాటి   ఉపయోగమేమిటి  ?

2.  కాగితపు   గిడ్డంగి   నిర్వహణాధికారి  భాధ్యతలేవి?

3.  కాగితములు   ఏ   విధముగా   జాగ్రత్తపరచుదురు?

4.  ముద్రణా   కాగితపు   గిడ్డంగిలో    తీసుకొనవలసిన   జాగ్రత్తలేవి?

5.  కాగితపు   కౌంటింగ్   వలన   ఏమి  లాభము ?

6.  గేదరింగ్   అనగానేమి?  దానివలన   ఉపయోగములేమిటి?  

7.  Ware  House  Operations  ఏవి?

అధ్యాయము —8

             పుస్తకాలు   కుట్టు   పద్ధతులు

                  ( Book  Stitching )

        వేర్   హౌస్   ఆపరేషన్స్   అయిన   తరువాత    ముఖ్యంగా   గేదరింగ్   పని   అయిన   తరువాత,   కుట్టడము   మొదలవుతుంది.   పుస్తకాలు   కుట్టుటకు  ముందుగా   ఏ   విధంగా   కుట్టవలయునో,   ఏ   విధంగా   బైండింగ్   చేయవలయునో   అనే   అనేక   విషయాలు   వాటివల్ల   వచ్చు   ఇబ్బందులు   ఆలోచించుకోవాలి.   పుస్తకాలను   స్వల్పవ్యవధిలో    అందించాలి    అనుకుంటే   మెషిన్ కుట్టు   చాలా   త్వరగాను,   తక్కువ   ఖర్చుతోను   అగును.  మెషిన్ కుట్టుకు   ' తీగ '   నుపయోగించి   కుట్టుతారు.   ఆ   పద్ధతి   చాలా   ఆదాయమైన   పద్ధతి.   దారమును   ఉపయోగించి   మెషిన్   సహాయమున   ( Machine  Sewing )  కూడా   పుస్తకాలను   కుట్టవచ్చును.   తక్కువ   కాపీలు   కుట్టవలసినప్పుడు    చేతితో    కుట్టుదురు.   అట్లాంటప్పుడు   3  రంధ్రాలు,  5  రంధ్రాలు   లేక 7   

రంధ్రాలు   వేసి   కుట్టుతారు.   పుస్తకాల    సైజునుబట్టి    రంధ్రాలను   నిర్ణయించుకోవాలి.   పై     పద్ధతులను   అనుసరించి   పుస్తకాలను   ప్రక్కవైపునుండిగాని   లేదా    మధ్యవైపునుండిగాని         కుట్టవచ్చును.

            పుస్తకాలు    కుట్టుపద్ధతిలో   మరియొక   విధమును   సూయింగ్   ( Sewing )  అని   అంటారు.   ఇందులో    పైన    తెల్పిన   విధముగా    అన్ని    సెక్షన్ లను   ఒకేమారు   కుట్టరు.   ఒక్కొక్క  

సెక్షన్ ను   అల్లిక    పద్ధతిలో   కుట్టుతారు.   ఒక   సెక్షన్   కుట్టడము   అయిన    తరువాత,    దానిని   మరియొక    సెక్షన్ తో    కలిపి   మెలికముడి    వేసి,   క్రొత్త    సెక్షన్ ను   పూర్వపు   పద్ధతిలోనే   కుట్టుతారు.    ఆ  విధంగా   ఆఖరి    సెక్షన్ తో     మొదలుపెట్టి   మొదటిసెక్షన్   పైకి    వచ్చులాగున    కుట్టుతారు.   ఈ    సూయింగ్    చేయడానికి   ముందు,   పుస్తకము   వెనుకభాగమున    రంపముతో   గాట్లు    చేస్తారు.   ( సూయింగ్   సాకట్సు )   ఈ   సాకట్సు   సంఖ్యను   పుస్తకము   పొడవునుబట్టి   నిర్ణయించుకోవాలి.   ఆ   తరువాత    సూయింగ్  టేపుగాని,   సూయింగ్   కార్డు    ( Cord )  గాని    ఉపయోగించుతారు.   ఈ    

సెక్షన్ ల    రెండు   చివరలయందు   కెటిల్   స్టిచ్  ( Kettle  Stitch )  వేయుటకుగాను   రెండుగాట్లు   వేస్తారు.   అందువలన   సూదిని   సులభముగా   కాగితములలోనికి   దింపుటకు   వీలు   అవుతుంది.

           సూయింగ్    చేతితో   చేయునప్పుడు   సూయింగ్   ఫ్రేమ్ ను    ఉపయోగించి   చేయవచ్చును.   సూయింగ్   పద్ధతిలో     పుస్తకము   ఎంత   లావుగానైనా   కుట్టవచ్చును.   అదే  స్టిచ్చింగ్   పద్ధతిలో     పుస్తకాలను   పరిమితమైన    మందమువరకే    కుట్టవచ్చును.    పుస్తకము   ఎక్కువ   మందముగా   వుండిన    స్టిచ్చింగ్   బాగా   పడదు.    పైగా   పుస్తకాన్ని    తెరచుట   చాలా   కష్టముగానుండి,    చదువుటకు    వీలుకాదు.    కావున   తక్కువ    పేజీలువున్న   పుస్తకాలను    వైర్    స్టిచ్చింగ్    పద్ధతిలోగాని   దారపు    స్టిచ్చింగ్    పద్ధతిలోగాని   కుట్టుతారు.   ఎక్కవ   పేజీలు   ఉన్న    పుస్తకాలను    సూయింగ్

పద్ధతిలో   కుట్టుతారు.   సూయింగ్   అయిన    పుస్తకాలు    బైండింగ్    చేయటానికి   బాగా   వుంటాయి.

దారముతో   కుట్టువిధానము   ( Thread  Stitching ) :

          పుస్తకములోని    అన్ని   ఫారమ్సును   మడిచిన   తరువాత   వాటిని   గేదరింగ్   చేసి,    కుట్టవలయును.    కుట్టుటకుముందు    ఎన్ని    రంధ్రములువేసి   కుట్టవలయునో   నిర్ణయించుకోవాలి.   మూడు   రంధ్రముల   కుట్టునకు   బాడ్ కిన్    సహాయముతో    పుస్తకమునకు   వెనుకవైపునుండి   సుమారుగా  1/8"  అంగుళస్థళమువదలి    సమాన    దూరములో   3    రంధ్రములు   చేయాలి.   అదేమాదిరి   పుస్తకము   పై  వైపున    క్రింద   వైపున   తగిన   మార్జిన్   చూసుకోవాలి.   తరువాత   సూదికి   దారము   ఎక్కించుకొని    రెండవ   రంధ్రమునుండి   కుట్టుట   మొదలుపెట్టాలి.   సూది   2వ   రంధ్రము   క్రింది   నుండి   వచ్చి  3వ   రంధ్రము    ద్వారా   పైకివచ్చును.   తరువాత   సూది   తిరిగి    మూడవ   రంధ్రము   నుండి   రెండవ   రంధ్రములోనికి   పోవును.   అక్కడ  నుండి    1వ   రంధ్రము  పై  నుండి   క్రిందికి   వచ్చును.   ప్రస్తుతం   2వ   రంధ్రమువద్ద   దారము   ముడి   వేయుదురు.   

దారమును   గట్టిగాలాగి   ముడి   వేయవలయును.   రెండు   ముడులువేసిన    తరువాత   కత్తెరతో   మిగులు   దారమును    కత్తిరించవలయును.   ఇదే   ప్రకారము  అన్ని   కాపీలు   కుట్టవలయును.   5  రంధ్రాల   కుట్టునకు  

 సూది   మూడవ   రంధ్రము   నుండి     మొదలగును.  7  రంధ్రాల   కుట్టుకు   4వ రంధ్రము   నుండి     మొదలగును.    పుస్తకము  సైజునుబట్టి  రంధ్రాలను   వేసుకోవాలి.   దారముతో   కుట్టు   పుస్తకాలు  1  అంగుళము   మందముకన్నా   ఎక్కువ   వుండిన   అట్టివాటిని   వైర్  స్టిచ్చింగ్   ద్వారా   కుట్టుట  మంచిది.  పుస్తకాల   మందము  2  అంగుళముల  పైన   వుండిన   అట్టివాటిని   సూయింగ్   పద్ధతి   ద్వారా  కుట్టుట   మంచిది.


పుస్తకాలను   తీగకుట్టు   యంత్రముతో  కుట్టు   విధానము  ( Wire  stitching ) :

       ఎక్కువ   పుస్తకాలను   అతితక్కువ   ఖర్చుతో 

అతితక్కువ  కాలములో   ఈ   తీగకుట్టు   యంత్రమును   ఉపయోగించి   కుట్టవచ్చును.    ఈ   తీగకుట్టు   యంత్రములను,   మోటారు   సహాయముతోగాని   లేదా   కాలి   పెడల్   సహాయముతోగాని   నడపవచ్చును.   కాలి   పెడల్ తో    కుట్టుయంత్రములు    1  అంగుళము  మందమును  మించి   కుట్టలేవు.   కాని   మోటారుతో    నడపబడు   యంత్రములు  2  అంగుళముల  మందమునుండి    సుమారు   4  అంగుళముల   వరకు   కూడా  కుట్టగలవు.   కాని   ఎక్కువ   మందముగల   పుస్తకాలను   ఈ   పద్ధతిలో   కుట్టుటవలన    అట్టి   పుస్తకాల   మధ్య   పేజీలను   తెరచి   చదువుటకు   కష్టముగా  నుండును.   అందువలన   పుస్తకమునకు   పైన   క్రీంది   అంచీలు   గల    కాగితములు   త్వరగా   చిరిగి   ఊడిపోవును.   ఎక్కువ    మందముగల   పుస్తకాలను   సూయింగ్   చేయుట   మంచిది.

ఈ    యంత్రములకు     తీగచుట్టలు   బిగింపబడి   యుండును.   తీగచుట్టలలో   అనేక    రకములైన   మందముగల   తీగలుగలవు.   అనగా   16 గేజి,  18 గేజి,  22 గేజి,  24 గేజి   అనెడి   రకములు   గలవు.   తక్కువ   గేజిగల   తీగలు   మందము   ఎక్కువగా   నుండును.   పుస్తకము   సైజునుబట్టి   ఏదో   ఒక   రకపు   తీగను   నిర్ణయించుకొనవలయును.   తరువాత   తీగచుట్ట   నుండి    తీగను   చక్కబరచు   రంధ్రములనుండి    కుట్టు   ప్రదేశమునకు   అందించవలయును.   పుస్తకము   మందమును,   గేజి   సహాయమును   కొల్పుకొనవలెను.   మిషన్   బ్యాక్   గేజిని,   ప్రక్కవైపు  గేజిని   సవరించుకొనవలయును.   తరువాత   పుస్తకమును   కుట్టు   ప్రదేశమున   వుంచి,   పెడల్ ను   కాలితో   అదమవలెను.  అప్పుడు   యంత్రము   కుట్టును.   కుట్టుపడిన   వెంటనే   కాలి   పెడల్   పై   నుండి   తీయవలయును.   లేనిచో   యంత్రము   వరుసగా   కుట్టుచునే   వుండును.   అందువలన   యంత్రము   త్వరలో   చెడిపోవును.

            ఈ     కుట్టు   యంత్రములు    అనేకరకములు.   వీటిలో   కొన్నింటికి   రెండు  తీగచుట్టలు   బిగించి    కుట్టు   వసతులుగలవు.   అన్ని   యంత్రములలోను,    పుస్తకాలమధ్యనుండి   గాని,    ప్రక్కవైపునుండిగాని   కుట్టుటకు   వసతిగలదు.      ఈ    యంత్రములు   నడుపువాడు   వానిని   నడుతుపద్ధతులు   బాగా   తెలిసికొని   వుండవలెను.   లేనిచో    పుస్తకములు     సరిగా   కుట్టబడవు.   మరియు   యంత్రముకూడా    అతిత్వరలో   చెడిపోవును.   యంత్రమును   వాడుటకుముందు   దానిని   శుభ్రముగా   తుడిచి,   చమురువేసి,   తరువాత   పనిచేయవలను.

         

                            ప్రశ్నలు

1.  పుస్తకములు   కుట్టుటకు   ముందు   ఏ   విషయములను   గురించి   ఆలోచించాలి.  

2.  Book  Stitching  నకు   Book  Sewing  నకు   గల   తేడా   ఏమిటి?

3.  Thread  Stitching   ఏ   విధముగా   చేస్తారు?

4.  Wire  Stitching   ఏ   విధముగా   చేస్తారు?


                     అధ్యాయము —9

        పుస్తకాలకు   అట్టలువేయు    పద్ధతులు

                     ( Book  Covering )


             పుస్తకాలకు   అట్టలువేయడము    అనేది    అన్నిపనులవలెనే    ముఖ్యమైనది.    పుస్తకముల     యొక్క    అందము,   ఆకర్షణ   ఈ   కవరింగ్    పద్ధతులపైననే     ముఖ్యముగా   ఆధారపడియుండును.   కావున   పుస్తకాలకు   కవరింగ్    చేయునపుడు   వాటి   విలువను,   వాడునట్టి   విధానమును   దృష్టిలో   వుంచుకొని   వాటికి   తగినటువంటి   కవరింగ్    వస్తువులను   ఎన్నుకొనవలయును.   ఉదా :    తోలు,   రెక్సిన్ ,   కేన్ వాస్   అను   కవరింగ్    వస్తువులను   ఖరీదు   అయిన    పుస్తకాలకు   ఎక్కువకాలము    మన్నిక   కల్గి   యుండుటకు   వాడుతారు.   ఇవి   ఖరీదు   అయిన    వస్తువులు.    తక్కువ   ధరగల   పుస్తకాలకు   క్యాలికో,   గుడ్డ,   మరియు   రంగు   కాగితములు   వాడుతారు.   ప్రస్తుతం   ప్లాస్టిక్    అట్టలను   కూడా   తయారుచేసి   పుస్తకములకు   బిగించుచున్నారు.   ఇట్టి    ప్లాస్టిక్   కవరులను   అంటించు  అవసరములేదు.   వాటిని   కేవలము   పుస్తకమునకు   తొడగవలసి   యుండును.   అందువలన   పేస్ట్    గాని   లేదా   ' గ్లూ '   అనే    పదార్థములను   అతికించుటకు   వాడనవసరములేదు.   కొన్ని    ప్రత్యేకమైన    కాగితములు    చూచుటకు   ' తోలు '    మాదిరి   ( Leathered  paper )   గాను   లేదా   ప్లాస్టిక్   షీటు   ( Plastic  paper )   మాదిరిగాను   వుండి   చూచుటకు   అందముగా   నుండును.   కాని   అవి   ఒక    ప్రత్యేక    పద్ధతిలో    చేయబడిన   కాగితములే.   అందువలన    వాటిని   తక్కువ   ధరలో   కొని,   అట్టపై    కవరింగ్ కు   వాడుతారు.

    

       పుస్తకములను   కవరింగుచేయు   పద్ధతులు

1.   కాగితపు   అట్టవేయు    పద్ధతి  ( Paper Wrapper )  :—

         పుస్తకములు   కుట్టిన   తరువాత,   వాటిపై   దళసరి    అట్టలను   వేసెదరు.   ఈ   అట్టలను   పుస్తకపు   వెనుక   భాగమున   మైదాతో   అతికించుతారు.   అందువలన    అట్ట    పుస్తకమునుండి  విడిపోదు.

2.  కాగితపు   కవరింగ్   అట్టపద్ధతి  ( Paper  Covering )  :

           ఈ    పద్ధతిలో   పై   విధముగానే    అట్టలను   వేయుదురు.   కాని   అట్టను   పుస్తకము  యొక్క    వెనుక   భాగమున,   ప్రక్క   వైపులను    మైదాతో   అతికించుతారు.  అందువలన    అట్ట   పుస్తకమును    పూర్తిగా   అంటియుండును.   ఇది   పై   పద్ధతి   కన్నా   కొంచెము   గట్టి    పద్ధతి.

3.  అట్టలు    పుస్తకముకన్నా    కొంచెము   పెద్దగా   కవరింగ్ చేయు   పద్ధతి   ( Paper  covered  and  overlapped ) :

            ఈ    పద్ధతిలో    అట్టను     పై   విధముగానే      అతికించుతారు.   కాని   అట్టయొక్క    అంచులు   పుస్తకముకన్నా    1/8"  అంగుళము   పెద్దవిగా   నుండి,   మూడువైపులా   కొంచెము    ముందుకు   వచ్చియుండును.   అందువలన   పుస్తకపు   అంచులు   చెడిపోకుండా   వుండును.

4.  కాగితపు    అట్టలు   పెద్దవిగావేయుట  ( Paper  wrapper  and  overlapped ) :

              ఈ    పద్ధతిలో    అట్టలను    పుస్తకపు   వెనుకభాగమునకు   మాత్రమే    అంటించుతారు.    ప్రక్కవైపున   అంటించరు.   అట్టయొక్క   అంచులు   పుస్తకముకన్నా    కొంచెము   ముందుకువచ్చియుండును.

5.  కాగితపు   అట్టను  అంచులయందు  లోనికి  ముడుచు   పద్ధతి  ( Paper  wrapper  and  turned - in )  :—

          ఈ    విధానములో   అట్టను   పుస్తకపు   వెనుకకు   అంటించుతారు.     ఎక్కువగా   వున్న     కాగితమును    పుస్తకపు   అంచులకు   సమానముగా    వుండునట్లుగా   లోనికి    ముడిచెదరు.

6.   గుడ్డతో   అతికించుట  ( Cloth covered )

             ఈ    పద్ధతి,   పైనతెల్పిన    పద్ధతులకన్నా    గట్టిపద్ధతి.    గుడ్డతో   అట్టవేసిన    కవర్సు   త్వరగా   చినిగిపోవు.   మరియు   కాగితపు   అట్టవలె   నలిగిపోదు.   గుడ్డను   పుస్తకమునకు   పైన    పూర్తిగా    అతికించుతారు.   

7.  కాగితపు   లేక   గుడ్డను   పల్పుబోర్డునకు   అతికించి   దానిని   అట్టగావేయు   పద్ధతి  ( Cloth  or  paper  stiffened )  :

           కాగితముతో    అట్టవేసి   వెనుకవైపున   మాత్రము   పల్పు   బోర్డు   ముక్కను   గాని   లేదా   గుడ్డనుగాని    అతికించుతారు.   ఈ    విధముగా   అట్టవేయుట   వలన   కవరింగ్ కు    ఉపయోగించిన    గుడ్డగాని   లేదా   కాగితముగాని    మడతలు   లేకుండా   చినిగిపోకుండా   గట్టిగావుండును.    ఈ   పద్ధతిలో   కవరుచేసిన   పుస్తకాలు   పై   అన్ని    పద్ధతులకన్నా   గట్టిగా   నుండును.

         పైన     తెల్పిన   రకరకముల   అట్టలువేయు    పద్ధతులను,   తక్కువఖరీదు    పుస్తకాలకు,   వాటి   విలువను   బట్టి   ఎక్కువ   రోజులు   మన్నికగావుండుటకు   తక్కువ   ధరలో   సులభ   పద్ధతిలో   చేయవచ్చును.   ఉదా :—   దేశపటములు,   సర్వీసు   రిజిష్టర్సు,   లైసెన్సు   పుస్తకాలు  ( Maps,  Service  registers,  pass  books,   Lisence  book  Etc.  )  మొదలగునవి.

               పైన    తెల్పిన     పద్ధతులే    కాకుండా   వేరే   బైండింగ్   చేయు   పద్ధతులు   కూడా   గలవు.   ఈ   బైండింగ్    పద్ధతులు   మూడు   రకములు.  ఒక్కొక్క    పద్ధతికి    కొన్ని   ప్రత్యేకతలుగలవు.    అందువలన   ఈ   పద్ధతులు   అనుసరించుటకుముందు   పుస్తకము   యొక్క   స్వభావము,   దాని   ఖరీదు,   వాడు  విధానము   మరియు   పుస్తకాలను   అందించవలసిన    గడువునుకూడా   ఆలోచించుకొని,   బైండింగ్   పద్ధతిని   అనుసరించాలి.

Sunday, September 19, 2021

బుక్ బైండింగ్ - 7 - బైండింగ్ ఉపకరణములు

 21.  ఫిలెట్స్   ( Fillets ) :

22.  గౌజస్   ( Gouges ) :

23.  ప్యాలెట్స్   ( Pallets )  :

24.  వివిధ  రకములైన   గుర్తులు ( Small pattren Tools ) :

25. చేతితో   ఉపయోగించు  అక్షరములు ( Hand Letters ) :

26. రోల్సు  ( Rolls ) :

27.  స్టౌ( Stove )  :

28.వేడి   పనిముట్లను  చల్లబరచుటకు  వినియోగించు   స్పాంజి ( Goolers ) :

29. మెరుగులు  పెట్టు  దిమ్మె  ( Polishing Iron ) :

30.  బంగారు  పూతరేకులు  పెట్టు   దిండు ( Gold Cushion ):

31. బ్యాండ్  నిప్పర్సు ( Band Nippers ):

32. పదునైన  ఇనుపరేకు ( Steel Scraper ):

33. బర్  నిషర్స్  ( Burnishers ):

34.స్ర్పింగ్  డివైడర్సు 

               మొదలైన   పరికరములు   కావలయును.

                         ప్రశ్నలు

1. బ్యాకింగ్   బోర్స్డు   యొక్క   పటమును   గీచివాటి   ఉపయోగములను   తెల్పుము.

2. ప్రెస్సింగ్  బోర్స్డు   యొక్క  ఉపయోగమేమిటి?

3. పుస్తకములు   మెరుగుపెట్టుటకు   ఉపయోగించు  పరికరములను   తెల్పుము.

4. బైండింగ్   చేయుటకు  ఉపయోగించు   పనిముట్లను   వేటినైనా   ఐదింటినివేసి, వాటి   ఉపయోగములను  వ్రాయుము.

               అధ్యాయము —4

    పుస్తకముల   బైండింగ్   ఉపకరణములు

     BOOK  BINDING  EQUIPMENTS

   పుస్తకముల   బైండింగ్    చేయుటకు   వివిధ   రకములైన   పనిముట్లుతోపాటు   ఇతర   ఉపకరణములను   కూడా   వాడుదురు.   కాబట్టి  బైండింగ్   చేయు    వ్యక్తికి    అన్ని   ఉపకరణములను   వాడు   విధానము,   వాటి  స్థాయిలు   తెలిసికొని   యుండువలయును.   వీటిని   వాడునప్పుడు   తగు   జాగ్రత్తలు    తీసుకొనవలయును.  మనము   కొన్ని    బైండింగ్   ఉపకరణములను    గూర్చి   తెలిసికొందాము.   

1.  కుట్టుచక్రము  ( Sewing  Frame ) :

               దీనిని   పుస్తకాలు   చేతితో   కుట్టునప్పుడు   వాడుతారు.   ఇది  చెక్కతో   చేయబడి   వుండును.  దీనిసహాయమున   లైబ్రెరీ   సూయింగ్   ( Library Sewing ),   ఫ్లక్సబుల్   సూయింగ్   ( Flexible  Sewing ),  సాన్   యిన్   సూయింగ్   ( Sawn - in -  Sewing )  మొదలైన   రకముల  కుట్లువేయుటకు   ఉపయోగింతురు.   ఈ    కుట్టుచక్రములో   సుమారుగా   10 నుండి 15  పుస్తకాలను,   మార్చకుండా   ఒకే  వరుసలో   ఒకదాని   తరువాత   ఒకటి   కుట్టవచ్చును.  దీనికి   9"  x  14"   అంగుళముల   సైజుగల   చదునైన   బెడ్ కలదు.   క్రాసుబార్   మరియు   సూయింగ్   కీస్   ( Keys )  అనునవి  ఈ   చట్రమునకు  ముఖ్యమైనవి.

2.  బోర్డు  కట్టర్   ( Board Cutter ) :

                ఇది   అట్టలు   కత్తిరించుటకు   ఉపయోగింతురు.  అట్టలు  కట్టింగ్  మిషన్   ( Cutting  Machine )లో   కత్తిరించిన,   దాని   కత్తి  అతిత్వరలో   మొద్దుబారిపోవును.   అందువలన   అట్టలను   కత్తిరించుటకు    ప్రత్యేకమైన    కట్టర్ ను   రూపొందించినారు.   ఈ  బోర్డు   కట్టరుకు   సైడు  గేజీ   ( Side gauge ),  ముందుగేజీలు  ( Front gauge )  గలవు.   దీనికి   చదునైన  25"  x  30"  బెడ్  గలదు.   బోర్డులు    కత్తిరించుటకు   పెద్ద   బరువైన   కత్తిగలదు.  దీనిని  చేతితో  నడుపుతారు.  కరెంటు  మోటారు   సహాయమున   అట్టలుకత్తిరించు  యంత్రములు  కూడా  కలవు.

3.   గట్టిగా   ఆదుము   ఉపకరణము  ( Hard press ) :

                 ఇది   నిటారుగా   వుండును.   దీనికి   రెండుగాని   లేదా   నాల్గు   ప్తంభములు   కలిగియుండును.   ఈ   ఆదము    పరికరములు  వివిధ   సైజులలో   లభించును.  దీనికి   రెండు  చదునైన   మందమైన   షలకములు   గలవు.   క్రింది   షలకము   కదలదు.   కాని   పై   షలకము   మరసహాయమున   క్రిందికి   పైకిత్రిప్పవచ్చును.   పుస్తకములను  కుట్టుటకుముందు,   కుట్టిన   తరువాత   అవసరమును   బట్టి,   ఈ   ఆదము    పరికరమును    వాడుతారు.   ఇందులో    పుస్తకములను   ప్రెస్సింగ్   బోర్డ్సు   మధ్యన   పెట్టి   ఆదుమవలయును.   ఈ   విధముగా   చేసినందువలన   పుస్తకములు   చదునుగా   వుండును.

4.  లైయింగ్   ప్రెస్   ( Lying Press ) :

            ఇది   అడ్డముగా   పెట్టుబడి   యుండును.   దీనిని   వసతి  అయిన    ఎత్తులో    టేబుల్ పై    పెట్టుకొనవలయును.  దీనిని   ఉపయోగించుటకు   రెండు  స్ర్కూలు   వుండును.   వాటిని   త్రిప్పినయెడల   లైయింగ్   ప్రెస్   బ్లాకులు   తెరుచుకొనుట   గాని,    మూసుకొనుటగాని    జరుగును.   పుస్తకాలు    రౌండింగ్    చేయునప్పుడు   ఎడ్జిడెకరేషన్   చేయునప్పుడు,   సాకట్సుచేయునప్పుడు   దీని   ఉపయోగము   చాలా    కలదు.   దీనికి   ఏటవాలు   అంచులుగల   ప్రెస్సింగ్   బోర్డ్సును   ఉపయోగించి   పైన   తెల్పినటువంటి   పనులు  చేయవలయును.

5.  నిప్పింగ్   ప్రెస్స్   ( Nipping  Press ) :

              ఈ    పరికరమును    పుస్తకాల   వెనుకభాగములను   అదుముటకు   ఉపయోగింతురు.   పుస్తకాల   అంచులపై    అందమైన   డిజైన్సు   వేయుటకు,   మెరుగులు   పెట్టునప్పుడు   కూడా   దీనిని   వాడుతారు.  

                            ప్రశ్నలు

1.  బైండింగ్   షాపులో   కావల్సిన   పరికరములు   ఏవి?

2.  హార్డు   ప్రెస్   ఎందుకు   వాడుతారు?

3.  లైయింగ్   ప్రెస్   బొమ్మనుగీచి   దాని   ఉపయోగములు   వ్రాయుము.

అధ్యాయము  — 5

    బైండింగ్   చేయుటకు  ఉపయోగించు       

                   యంత్రములు

         Book  -  Binding  Machines

      

                పుస్తకాలు   రకరకాల   పద్ధతిలలో   తయారుచేయుటకుగాను   రకరకాల    యంత్రములను  వాడుదురు.   కాబట్టి   బైండింగ్   చేయువారు   అట్టి   యంత్రములను  సరియైన   పద్ధతిలోను,   సమర్థవంతముగాను   పనిచేయించవలెనంటే    అట్టి   యంత్రములను   గురించి   ముందుగా   క్షుణ్ణంగా   తెలిసికొని   యుండవలెను.   ప్రతి  యంత్రముయొక్క   సామర్థ్యము,   పనిచేయు   విధము,   అనుసరించవలసిన  జాగ్రత్తలు  ముఖ్యంగా   తెలుసుకొనవలెను.   

1.   కాగితములపై   రంధ్రములు   వేయునట్టి   యంత్రము   ( పరికరము )   ( Perforating  Machine )  :

        ఈ   యంత్రము   సహాయమున   కాగితములపైన   కావలసిన   ప్రదేశములో   వరుసగా   సన్ననిరంధ్రములు   వేయుదురు.   ఆ  విధముగా   చేసినందున   కాగితములను   చింగుటకు    సులభముగా   వుండును.  దీని    అవసరము   ముఖ్యంగా   రసీదుపుస్తకాలకు,   చెక్కుబుక్కులకు    వుండును.   ఈ   యంత్రమును   మోటారు   సహాయములొకుండా    నడపవచ్చును.  ఇందు   ఒక   ఇనుప   చట్రములో    దగ్గరదగ్గరగా   సూదులు    పేర్చబడియుండును.   ఆ   సూడులకు   క్రిందిభాగమున    వాటికి   ఎదురుగా   అంతే   మందముగల   రంధ్రముల   రేకు   వుండును.   ఈ   యంత్రమును   ' ఫెడల్ '  సహాయమున   వత్తినప్పుడు   సూదులన్నీ   క్రిందికి    దిగును.  కాబట్టి     కొద్దికొద్దిగా   కాగితములను   సూదుల   క్రింద  పెట్టి   వత్తవలెను.   వాటిలో  సన్నని   రంధ్రములు   ఏర్పడును.    ఎక్కువ కాగితములుపెట్టి   వత్తినయెడల    సూదులు  విరిగిపోవును.   కాగితములు  సరైన   ప్రదేశములో   వుంచుటకు  అనువుగా   సైడ్  గైడ్స్ మరియు   ఫ్రంట్  గైడ్స్    ఈ  యంత్రము   యొక్క  ' టేబుల్ ' మీదగలవు.   ఈ   యంత్రములు   మోటారు    సహాయమునుకూడా   నడప్పవచ్చును.  అట్టి  యంత్రములలో    సూదులకు    బదులు   ఇత్తడి   పళ్ళ   చక్రములు  Shaft   పైన   బిగింపబడియుండును.   వాటి   సహాయమున    కావలసినన్ని    వరుసలలో    రంధ్రములు   వేసుకనవచ్చును.  అట్టివాటిని   రోటరీ   పర్ ఫరేటర్సు   ( Rotary  perforators )  అని  అంటారు.   దీనిని   ముఖ్యంగా   స్టాంపులకు   ఉపయోగించుతారు.

2.  నంబరింగ్  యంత్రము  ( Numbering  Machine )  :

            నంబరింగ్  యంత్రములు   ( పరికరములు )   అంకెలు   వేయుటకు   ఉపయోగింతురు.  ఈ   పరికరములను  చేతితోగాని   లేదా  ఫెడల్   సహాయముతోగాని  పనిచేయవచ్చును.   ఈ   పరికరములో   6  సంఖ్యా   చక్రములుండును.  ఒక్కొక్క   చక్రములోను   సంఖ్యలు   1 నుండి  0  వరకు   వుండును.   ఈ   అంకెలు   ఎత్తుగా   వుండును.  స్ర్పింగ్   వత్తిడివలన   అంకెలు   జరుగును.   ఈ   పరికరములో   ప్రత్యేకత   ఏమనగా   ఒక   అంకెను     ఒక్కసారి,   రెండుసార్లు,   మూడుసార్లు   లేక   నాలుగుసార్లు   ముద్రించవచ్చును.   దీనికి   ప్రత్యేకమైన    ' యింక్  '   గలదు.   దానిని   ' యింక్   ప్యాడ్ '   మిాద   వేస్తారు.    ఈ   యింక్   ప్యాడ్   అమర్చుటకు   ప్రత్యేక   సదుపాయముగలదు.   ఈ      ప్యాడ్   సహాయమున   అంకెలకు  ' యింకు '  అంటుకొనును.   ఈ   పరికరములోని   అంకెల   చక్రములను  మార్చుటకు  కొయ్య   పుల్లలను   వాడవలెను.   లోహపు   చీలలను   వాడరాదు.   ఈ   పరికరములను   పని  అయిన   వెంటనే   కిరసనాయిల్ తో    కడిగి   భద్రపరచవలెను.   దీనికి   అప్పుడప్పుడు    పల్చటి   చమురు   వేయవలెను.    దీనిని   వాడునప్పుడు   క్రింది   కొన్ని   కాగితములు    వుంచవలెను.  లేనిచో    అంకెలు   చెడిపోవును.

3.   గీతలు   గీయు  యంత్రము  ( Ruling Machine ) :

               ఈ    గీతలు   గీయు  యంత్రములు   రెండు   విధములు   ఒకటి   ' పెన్ '   రూలింగ్   అనియు,   రెండవది   ' డిస్క్ '   రూలింగ్   అనియు   అంటారు.   వీటి   సహాయమున   నిడివి   గీతలు,   అడ్డుగీతలు   వేయవచ్చును.   పెన్   రూలింగ్   అనునది   ముఖ్యముగా   అకౌంటు   పుస్తకాలకు  మరియు   ముందుగా   ప్రింటు   అయిన  కాగితాలపై   కావలసినచోట   మాత్రము   గీతలు  వేయుటకు   ఉపయోగింతురు.  కాని  ' డిస్క్  రూలింగ్ '    యంత్రములో   వరుసగా   గీతలు  వేయబడును.  అందువలన  ఈ   యంత్రము   పైన   తెల్పినటువంటి  పనులకు  సరిపడదు.  దీని   ముఖ్యమైన   ఉపయోగమేమనగా   రూళ్ళకాగితములకు  కాంపోజిషన్   బుక్సు,   ఎక్సర్ సైజు    పుస్తకాలకు   వాడుదురు.  ఈ   రెండు   రకముల   యంత్రములకు   ఫీడ్    టేబుల్  ( Feed  Table )  మరియు  కన్యేయర్    బట్ట   ( Conveyor  Cloth )  వుండును.   వీటికి   కావలసిన   యింకులను   తయారుచేసుకొనవచ్చును.   పెన్   రూలింగ్   యంత్రములో    ' ఇంకు   నిబ్స్ ' ను   కావలసిన   దూరములో   అమర్చుకొను   వసతిగలదు.   వీటిద్వారా   కాగితముపై   గీతలు   పడును.   డిస్క్  రూలింగ్ లో   ఒక    చట్రమునకు  మరియొక   చట్రమునకు   మధ్యన   స్పే స్   ( Space )   అను   ఖాళీచట్రములు    బిగింతురు.   ఈ    స్పే స్   వలన     గీతల    మధ్యదూరమును   సవరించుకొనవచ్చును.

పై    రెండురకముల     యంత్రములను   చేతితో    నడపవచ్చును.  ఈ   యంత్రముల   సహాయమున   రెండురంగులు   ఒకేసారి   వేయవచ్చును.   మరికొన్ని   రకముల   యంత్రములలో     రెండురంగులు   కాగితమునకు   రెండువైపులా   వేయుటకు   వీలుగలదు.   ఈ   యంత్రములను  ప్రతినిత్యం   ' ఆయిలింగ్ '  చేయవలయును.   ఒక్కొక్క   కాగితము   మించి   రూలింగ్ కు   పంపకుడదు.  కాగితములు  క్రాస్   పోకుండా   గైడ్సును   సరిగా   అమర్చుకోవలెను.   రూలింగ్   అయిన   కాగితములను   జాగ్రత్తపరచవలెను.

4.  పేపర్లు   కత్తిరించు   యంత్రము  ( Paper  Cutting  Machine )  :

                ఈ    యంత్రము   బైండింగ్    వర్కుషాపులో   చాలా   ముఖ్యమైనది.   దీని   నిర్మాణములోను,   పనిచేయుటలోను   ప్రత్యేకత   గలదు.  పాతకాలపు  Plough  cutter  కు   దీనికి    చాలా    తేడాగలదు.   ప్రస్తుతపు   కట్టింగ్   మిషన్ లో    అన్ని     కాగితములు    ఒకేమారు    ఖండించబడును.   కాగితములు    ఖండించుటకు   దృఢమైన,   పదునైన    కత్తిగలదు.   ఈ   కత్తిని   అప్పుడప్పుడు   మార్చుకొను   సదుపాయముగలదు.    ఈ    యంత్రము    పనిచేయునప్పుడు    కత్తి   ఏటవాలుగా    క్రిందికిదిగి    కాగితములన్నింటిని    ఖండించును. ఈ    యంత్రములలో   చాలా   సైజులుగలవు.    ఈ    యంత్రమునకు   దిట్టమైన,    పదునైన   బెడ్ గలదు.    దీనిపై   స్కేలు    గుర్తించబడియుండును.     దీనికి   సవరించుకొనుటకు   అనువైన   బ్యాక్  గేజి    కలదు.   కాగితములను   ఖండించునప్పుడు    అదిమిపట్టుటకు  ' క్లాంప్ '  ( Clamp )   గలదు.   కత్తి    క్రింది    భాగమున    కట్టింగ్   స్టిక్   ( Cutting stick )   కలదు.   దీనివలన   కత్తి   పొరపాటున   ఇనుప   బెడ్ కు   తగలదు.    కాగితములు   ఖండించుటకు   ముందు  ఈ  యంత్రము  బెడ్ ను   శుభ్రముగా   తుడపవలెను.   కాగితపు  కట్ట   క్రింద,  పైన   అట్టలుపెట్టి   ఖండించవలెను.   ఈ  యంత్రముపై   పనిచేయునప్పుడు   అత్యంత   జాగ్రత్తగా   వుండవలెను.   కట్టింగ్   చేయునపుడు   ఏ   విధముగా   చేసిన    ఎక్కువముక్కలు   లభించుకొని   ఆలోచించి   చేయవలయును.   కాగితము    ఎక్కువ   వృధాకాకుండా    మడవవలెను.   కత్తిరించిన   కాగితపు   కట్టలను   పదిలపరచవలెను.    ఈ  యంత్రముపై   పుస్తకములుకూడా    కట్టింగ్   చేయవచ్చును.  ఈ  యంత్రమును    చేతితోను,   మోటారుయంత్రముతోను   నడపవచ్చును.   ఈ  కట్టింగ్  మిషన్    పద్థతులు   ఎంతగానో   అభివృద్ధి   చెండినవి.

5. ఇనుప  తీగతో   కుట్టు  యంత్రము ( Wire  Stitching   Machine ) :

        పుస్తకములను   కుట్టుపద్థతులలో   ఇది   అత్యంత   సులభమైనవి   ఖర్చుతో  అతి   తక్కువ  వ్యవధిలో   పుస్తకాలను   కుట్టవచ్చును.   ఈ  యంత్రము  సహాయమున 1\16  మందముగల   పుస్తకమునుండి 4"  అంగుళముల   మందముగల  పుస్తకములవరకు     కుట్టవచ్చును.  ఈ  యంత్రములలో   ఉపయోగించు   తీగచుట్టలు  18 గేజ్ ల నుండి  28  గేజ్ లవరకు ( Gauge )  వుండును.   పుస్తకముల    మందమును   బట్టి   తీగ  గేజ్ ని    నిర్ణయించుకోవలెను.   ఈ   తీగలలో   అనేక   రకములుగలవు.   కొన్ని  రాగి,  ప్లాస్టిక్ ,   అల్యూమినియమ్   కోటింగ్    వేయబడి   వుండును.   ఇట్లు    కోటింగ్    వేసినందువలన   తీగలు   త్రప్పు   పట్టకుండా    వుండును.   ఈ  యంత్రము   సహాయమున  పుస్తకముల   మధ్యన, మరియు   ప్రక్కవైపున   కుట్టుటకు   యంత్రములో    వసతిగలదు.  ఈ  యంత్రము   చేతితోను,   కాలితోను  మరియు   మోటారు  సహాయమునకు  పనిచేయవచ్చును.    కొన్నియంత్రములలో   రెండు  తీగచుట్టలు,   రెండు   కుట్టుభాగములు   కలల్గియుండును.   పుస్తకములు   సరిగా   కుట్టుటకు   సహాయపడు  ' గైడ్స్ '  కూడా   వీటికిగలవు.    ఈ  యంత్రములను   ప్రత్యేకముగాను   లేదా   మరికొన్ని   ఇతర   బైండింగ్    యంత్రములతోను   కలిపిగాని   ఉపయోగించవచ్చును.   పిన్నింగ్   చేయునప్పుడు   డబుల్   పిన్నింగ్   చేయరాదు.    లూజ్  పిన్నింగ్,  టైట్    పిన్నింగ్   కుడా   చేయరాదు.   పిన్నింగ్  అయిన   వెంటనే   ఫెడల్   మీద    నుండి  కాలు   తొలగించవలయును.

        బైండింగ్   సెక్షన్ లో    ఉపయోగించు  ఇతర   యంత్రములలో    ముఖ్యమైనవి :

1. సూయింగ్   మిషన్  ( Sewing  Machine)

2. ఫోల్డింగ్  మిషన్  ( Folding Machine )

3. స్టాబింగ్  మిషన్ ( Stabbing Machine )

4. బుక్  బ్యాకింగ్ ,  రౌండింగ్   మిషన్ (Book Backing, Rounding Machine )

5. గేదరింగ్   మిషన్   (Gathering Machine )

6. ఇన్  డెక్స్   కట్టింగ్   మిషన్  ( Index  cutting Machine )

7. కవరు   పంచింగ్  మిషన్  (Cover  Punching Machine )  మొదలైనవి.

                             ప్రశ్నలు

1. బైండింగ్   వర్క్   షాప్ కు  కావలసిన   యంత్రములేవి?

2. నంబరింగ్   మిషన్  గురించి   వ్రాయుము?

3. పేపర్  కట్టింగ్   మిషన్   గూర్చి   వ్రాయుము?

4. వైర్   స్టిచ్చింగ్  మిషన్    ( Wire Stitching Machine  )   గురించి  వ్రాయుము?

అధ్యాయము  — 6

   బైండింగ్   చేయుటకు   కావలసిన   వుస్తువులు

               ( Binding  Materials )

        

         బైండింగ్   చేయుటకు    అనేక    రకములైన   వుస్తువులను    వాడెదరు.    పుస్తకము   విలువను   బట్టి   మంచి   నాణ్యత,   మన్నికగల   వుస్తువులు   ఉపయోగించవలెను.   అందువలన   పుస్తకములు   చాలాకాలము   బైండింగ్ తో    బద్రముగానుండును.   మంచివుస్తువులు   వాడినందున   బైండింగ్    చేసిన   పుస్తకములు   చూచుటకు   అందముగా   నుండును.   తక్కువరకము   వుస్తువులు   వాడుట   మంచిదికాదు.   అట్టివాటివలన    పుస్తకముల   నాణ్యత   చెడిపోవును.   మరియు   ఎక్కువ   కాలము   మన్నిక   వుండవు.   కాబట్టి    బైండింగ్   చేయువారు   కావలసిన   వివిధ    రకములైన   వుస్తువులను   కొనునపుడు   వాటియొక్క    గుణగణములను,   వాడుపద్ధతులను   క్షుణ్ణంగా   తెలిసికొనవలయును.   ఎక్కువమొత్తంలో   వుస్తువులను   కొన్నపుడు   వాటిని   భద్రపరచుటలో   తగిన   శాస్తీయ    పద్ధతులను    అమలుపరిచి   వుస్తువులను   చెడిపోకుండా   కాపాడుకొనవలయును.

           ఈ     క్రింద    తెలుపబడిన   వుస్తువులను   బైండింగ్   పనులలో   విరివిగా   వాడుదురు.

1.  కాగితము   ( Paper ) :—   

                   ఈ    కాగితములు    వివిధరకములలో    గలవు.   వాటిని   వివిధ   పనులకు   వాడుతారు.   ( ఉదా :  రకరకాల   పుస్తకాలు   ముద్రించుటకు,  వార్తాపత్రికలకు,  రకరకాల  వ్రాత   పుస్తకములకు,   కవర్లు,  పెద్దపెద్ద   పోస్టర్లు   మొదలైనవి ).   ఈ   కాగితాలు   వివిధ   సైజులలోను,  నాణ్యతలోను,  మందములోను   మరియు   రంగులలోను   దొరకును.  కాని  అవసరమునకుతగిన    రకపు   కాగితమును  ఎన్నుకొనవలయును.   కాబట్టి    కాగితమును  ఎన్నుకొనునపుడు   దాని   ఖరీదు,   నాణ్యత   మరియు    వాడుక    విధానములను   గ్రహించి   ఎన్నుకొనవలయును.  కాగితములను   యంత్రముల   సహాయమున   మరియు   చేతిపని   ద్వారాను   తయారుచేయవచ్చును.   చేతిపనిద్వారా   చేసిన   కాగితము    మందముగాను,   గరకుగాను   వుండును.   ఒక్కొక్క   కాగితమును   ప్రత్యేకముగా   తయారుచేయుదురు.   యంత్రములద్వారా   చేసిన   కాగితములు   నాణ్యతగాను,   నునుపుగాను,   సన్నగాను   మరియు    పెద్దపెద్ద   రీళ్ళుగాను   తయారుచేస్తారు.   అటుపిమ్మట    వాటిని   కావలసిన   సైజులకు   కత్తిరించి   ఒక్కొక్కరీము    ప్రకారము   కట్టకట్టుతారు.   కాగితము   మందమునుబట్టి    'రీము'   బరువులో   మార్పులు   వచ్చును.   యంత్రములద్వారా   చేసిన   కాగితములలో   అనేక    రకములుగలవు.   కాని   చేతితోచేసిన   కాగితములు   చిన్నచిన్న   పనులకు,   ఖరీదైన   పనులకు   మరియు ' యండ్ '    పేపర్స్   ( End  Papers )కు   వాడుతారు.

                కాగితములను   బద్రపరచుట   చాలా   ముఖ్యము.   లేనిచో   కాగితములు    ఎండకు   ఆరిపోయి,   వాటి   స్టైలలోను    స్వభావములలోను    కొంతమార్పుకల్గును.   అట్టి    మార్పులవలన   బైండింగ్   చేయుటలోగాని   లేదా      ముద్రించుటలోగాని   కొన్ని   ఇబ్బందులు   ఎదుర్కొనవలసివచ్చును.   కావున   కాగితములోని   తేమను   కాపాడుటకుగాను   కాగితములను   వుంచిన   గదికి    శీతలీకరణ   పద్ధతులను   అమలుపరచి   గాలిలోని    తేమను   ఒకేమాదిరిగా     వుండునట్లు   చేయవలయును.   అట్లు    చేసిన   యెడల   కాగితములు   చెడిపోకుండా   వుండును.

కొన్నిరకముల   కాగితములు  :

1.  M.F.  కాగితము  ( M.F.  Paper )

2.  లెడ్జరు   కాగితము  ( Ledger  Paper )

3.  బాండు  పేపరు  ( Bond  Paper )

4.  సూపరు  కేలండరు   కాగితము  ( Super  Calender  Paper )

5.  కాట్రిడ్జి    కాగితము  ( Cotridge  Paper )

6.  మనిలా   కాగితము  ( Manila  Paper )

7.  మైనపు   కాగితము  ( Wax  Paper )

8.  ఇమిటేషన్   ఆర్ట్   కాగితము  ( Imitation  art  Paper )

9.  కోటెడ్    ఆర్ట్   కాగితము  ( Coated  art Paper )

10.  అజుర్   లెయిడ్   కాగితము  ( Azurlaid  Paper  )

11.  ఏర్  మెయిలు   కాగితము  ( Air  Mail  Paper )

12.  మార్బుల్   పేపర్సు   ( Marble  Papers  )  మొదలగునవి.

Saturday, August 28, 2021

బుక్ బైండింగ్ -6- బైండింగ్ ను గురించిన చరిత్ర మరియు దాని పరిచయము

  అధ్యాయము— 1

పుస్తకముల   బైండింగ్ ను  గురించిన   చరిత్ర   మరియు   దాని   పరిచయము 


 పుస్తకములను   బైండింగ్   చేయు   వృత్తి   అన్ని   వృత్తులవలెనే   ప్రసిద్ధి    చెందిన   చరిత్రగలది.  ఈ   వృత్తి   ఎన్నో   మార్పులు   చెందుతూ   నేటికిని   అత్యంత   ఆదరణ   పొందుతున్నది.   ప్రస్తుత   ఆధునిక   యంత్ర   సాంకేతిక   పద్ధతులకు   అనువుగా   కొన్ని     బైండింగ్   పనులు   చేయుచున్నారు.   అందువలన   అసంఖ్యాకముగా    ముద్రించబడుచున్న    వివిధ   రకములైన    పుస్తకములను  స్వల్ప   వ్యవధిలోనే    పుస్తకములుగా   బైండింగు   చేయుట   జరుగుచున్నది.   మనము   బైండింగు   అనగా    నేమిటో     తెలుసుకొందాము.  కాగితములను   సక్రమముగా   మడిచి,   అనువుగా   పుస్తకరూపములో   కుట్టి,    దళసరి   అట్టలు   వేసి   భద్రపరచు   విధానమని   అర్థము.

                పూర్వము    పుస్తకములను   కుట్టి    వాటిని   చెక్కలమధ్యన   భద్రపరిచెడివారు.   అటుతరువాత    చెక్కలకు    బదులుగా    తోలును    ఉపయోగించి    పుస్తకములను   భద్రపరచిరి.   ఈ   విధముగా    బైండింగ్    పద్ధతులు   మార్పు    చెందుతూ,    ప్రస్తుతం   కాగితపు   గుజ్జుతో   చేసిన   అట్టలను   ఉపయోగించి    బైండింగు   చేయుట   వాడుకలోనికి   వచ్చినది.   ఈ    అట్టలను   క్యాలికోతోగాని,    రెక్సిన్ తోగాని    లేదా   తోలుతోగాని   కవరు    చేసి   అలంకరించుచున్నారు.

          మనము    పుస్తకముల   బైండింగ్   ఆవశ్యకత     ఏ    విధముగా   ఏర్పడినదో    తెలిసికొందాము.   ' శిలాయుగమున '  ఏవిధముగా జీవించవలయునో     తెలిసియుండలేదు.   క్రమేణ    ఆదిమానవుని    జీవితములో    కొన్ని   మార్పులు   ఏర్పడసాగెను.   అతని   మనోభావాలను   చిత్రరూపములో,    చెట్ల పైన,   గుహగోడలపైన    చిత్రించి,   తన   ఊహలను   వ్యక్తపరచుకొనెను.   అటుతరువాత    కొన్ని   శబ్దముల   ద్వారా   మాటలను   నేర్చుకొనెను.   ఆ    విధముగా   వారి   భాషా    పరిజ్ఞానము   అపారముగా   పెరిగిపోయెను.   కావున   వారి    తెలివితేటలను   వదిలపరచుటకు   అనేక   పద్ధతులను   అన్వేషించిరి.   అట్టి   పద్ధతులలో   ముఖ్యమైనవి    వివిధరకములైన   మట్టిబిళ్ళలను   మరియు   చెట్ల      బెరడులపైన    వ్రాసిన     వాటిని    భద్రముగా    దాచుకొనిరి.   మట్టి     బిళ్ళలవలెనే    మైనపు    బిళ్ళలను    కూడా   తయారుచేసికొన్నట్లు    ఆధారములుగలవు.

           మట్టి     బిళ్ళల   వివిధ    ఆకారములలో    ముఖ్యమైనవి  :

1.   Oblong   clay   tablet      2.  స్థూపాకారపు   బిళ్ళ   ( Cylindrical  shape )  3.   పీపా   ఆకారపు   బిళ్ళ   ( Barrel  shape )   4.  షట్ భుజ     ఆకారము   ( Hexagonal  clay  tablet )

మరియు   5.  అష్టభుజములుగల   బిళ్ళలు  ( Octagonal )   మొదలైనవి.

         క్రీ.పూ.  3000  సం.   క్రిందట   ఈజిప్టు    దేశములోని   నైలునది    ప్రవాహక   లోయ   ప్రాంతములలో    పేపరస్    అనుచెట్టు    అభివృద్ది    చెందినది.   ఆ   చట్ల    బెరడులు   కాగితమును    పోలియుండెడివి.   అందువలన   ఆ   చెట్టు   బెరడులను   సన్నముగా   తీసి   ఒకదాని    కొకటి   కలిపి   అతికించెడివారు.   ఆ   విధముగా   ఎంతటి    పొడవైన   కాగితమునైనను   తయారుచేసుకొనవచ్చును.

ఆ   బెరడుయొక్క   గరకు  స్వభావమును   వ్యూమిస్  అనెడి   రాయితో  రుద్ది  నునుపుగా  వ్రాయుటకు  అనుకూలముగా   తయారుచెసెడివారు.  అటుపిమ్మట   వృక్షసంబంధమైన  వనరులను   ఉపయోగించి,   ప్రత్యేకమైన  వ్రాతపుడకతో   పేపరస్ పై   వ్రాసెడివారు.  పేపరస్  చుట్టల  పై  ( Scrolls )  ఒకవైపున   అడ్డముగాను,  నిలువుగాను   వ్రాసి,  చుట్టగా  చుట్టెడి  వారు


.ఈ    పేపరస్   చుట్టకు   రెండు   అంచుల   యందు    కొయ్యపిడుగులను   బిగించి,  పట్టుకొనుటకు   వసతిగా   తయారుచేసినారు.   ఈ   విధముగా   చేసిన   పేపరస్  చుట్టలను   తోలు  తిత్తిలో   పెట్టి   భద్రపరచెడివారు.   పేపరస్   చుట్టపైన   వరుసగా   వ్రాసిన   వ్రాతలవలస    విప్పి   చదువుటకు   కష్టముగా   వుండెను.  పైగా   స్ర్కోలు   త్వరగా   చినిగిపోవుచుండెను.   అందువలన  విషయములను  కాలమ్స్ గా   వ్రాయుట   వలన    పై   ఇబ్బందులు   తొలిగినవి,   పైగా   చదువుకొనవలసిన   విషయమును  త్వరగా   వెతుకుటకు   సాధ్యపడేది.

       ఈ   పేపరస్  చుట్టలు   దొరకనిచోట,   పార్చ్ మెంటు   ( Parchment ),  వెల్లమ్  ( Vellum )  అను   సన్నని  జంతుసంబంధమైన    తోళ్ళమిాద   వ్రాసినారు.  ఆ   విధముగా   ఒకేవైపున    వ్రాసిన   పత్రులను  ( Zigzag )  పద్ధతులను   ఆధారముగా   చేసికొని   పుస్తకములను  తయారుచేయుట    నేర్చుకొనిరి.  చుట్టలుగా   పేపరస్ ను   వాడు   పద్ధతికి   బదులుగా,   మడతలు  వేసి   రెండువైపులా   వ్రాయు   పద్ధతిని   అనుసరించిరి.   అట్లా  కుట్టిన     పుస్తకములను  దళసరి   అట్టలు   వేసి   బైండింగ్   చేసిరి.  పుస్తకముల  పై   రకరకములైన   నగిషీ   ( Finishings )  పనులను,   వెండి,  బంగారు   పూతలతో   చేసిరి.  దీనినే   ( Gold Embosing )  అని   అంటారు.   అటుతరువాత   రాజుల   కాలములో   రాజ్య  చిహ్నములను   ( Monograms )   పుస్తకముల  పై   ముద్రించిరి.   పూర్వము   పుస్తకములను  వ్రాయుటకు   తయారుచేయుటకు  చాలా   కష్టముగా   నుండెడిది.   కావున   విలువైన  పుస్తకాలను   గ్రంథాలయములలో   దొంగలింపకుండా   పుస్తకములను   సన్నని గొలుసుతో    టేబుల్ నకు   బిగించి   భద్రపరచెడివారు.  

      పైన    తెల్పిన    పేపరస్ ,  పార్చ్ మెంటు,  మరియు   వెల్లమ్   అను   వ్రాయుటకు   ఉపయోగించు   వస్తువులు   దొరకని   దేశాలలో   వేరేవిధమైన   వస్తువులను   వ్రాయుటకు   ఉపయోగించినారు.   చైనాదేశస్తులు   శిల్కు   గుడ్డపైన,   భారతీయులు,   బర్మా   దేశస్తులు   తాళపత్రముల    పైన    వ్రాసి,  వాటిని   అట్టల  మధ్యన   భద్రపరచినారు.   12 వ   శతాబ్దమునాటికే   కాగితమును  చేతితో   తయారుచేసి   వాణిజ్యపరముగా   ఉపయోగించినట్లు   ఆధారములు   గలవు.  అటుపిమ్మట   18వ   శతాబ్ది  అంతమునకు   కాగితమును   యంత్రములద్వారా    చేయుట   ఆరంభమైనది.   కాగితముతో   పుస్తకములు   తయారుచేయుట   పైన  తెల్సుకొన్న  పద్ధతులకన్నా   తేలిక   అయినది.

          15 వ   శతాబ్దములో   అక్షరములనుకూర్చి   ముద్రించు   పద్ధతులు   వచ్చినవి.   అందువలన   పుస్తకము   సైజులోను,   తయారుచేయు   పద్ధతులలోను   చాలా   మార్పులు  వచ్చినవి.  పూర్వకాలపు   పుస్తకముల   తయారుచేయు   విధానమునకుపోల్చి   చూచిన,   ప్రస్తుత  పద్ధతులతో   ఎంతో   సులభముగాను   త్వరగాను   ( పుస్తకములను )    తయారుచేయవచ్చును.   మరియు   ఎన్ని    పుస్తకములనైనా   తక్కువధరలో ,   తక్కువ   కాలములో   చేయుటకు    వీలుకల్గినది.   పుస్తకాలు   బైండింగ్   చేయుటకు   రకరకములైన    యంత్రములు   తయారుచేసినారు.   అట్టివాటిలో   పేపరు  కట్టింగ్    యంత్రము,   సూయింగ్   యంత్రము  మరియు   యితర   పరికరములు  తయారుచేయుటవలన   బైండింగ్   పనులు   సులభముగా    చేయుటకు  వీలుకల్గినది.    అందువలన   బైండింగ్    పరిశ్రమకూడా   ప్రింటింగ్    పరిశ్రమతోపాటు   అభివృద్ధి   చెందుచున్నది.


                              ప్రశ్నలు

1.  పుస్తకములు   బైండింగ్   చేయుట   అనగానేమి?

2.  పూర్వము   ఆదిమానవుడు   తన   భావాలను    ఏ   విధముగా   వ్యక్తపరచినాడు.

3.  పెపరస్   ఎక్కడ   దొరకును ?  దానిని  ఉపయోగించి   స్ర్కోలును   ఏ   విధముగా   తయారుచేస్తారు?

4.  స్ర్కోలును   వాడుటలో   గల   ఇబ్బందులేవి?   వాటిని   ఏ   విధముగా   అధిగమించిరి?

5.  15వ   శతాబ్దము   తరువాత   బైండింగ్ లో  వచ్చిన   మార్పులేవి?

                       అధ్యాయము — 2

    పుస్తకముల    బైండింగ్   వర్గీకరణ   పద్థతులు

 పుస్తకముల    బైండింగ్  చేయు   పద్థతులను   ముఖ్యంగా    రెండు  విధములుగా   వర్గీకరించవచ్చును.   అవి   (1)  లెటర్   ప్రెస్  బైండింగ్    (2)  స్టేషనరీ   బైండింగ్.   పై   రెండు  విధములైన   బైండింగ్ పద్థతులు   ఒక్కొక్కదాని    క్రింద    నాల్గు   ఉపభాగములుగా   విభజింపబడి   యూన్నవి.   బైండింగ్  పనులు   సులభముగా   అర్థము   చేసుకొనుట.    అవసరమైన   పద్థతిని   అనుసరించుటకు   ఆ   విధముగా   చేయబడినది.   లెటర్   ప్రెస్   బైండింగ్ ను.   చదువుకొను   పుస్తకాలు   తయారుచేయుటకు   అనుసరించుదురు.   స్టేషనరీ   బైండింగ్  అనునది   వ్రాసుకొను    పుస్తకాలు   తయారుచేయుటకు   అనుసరించుదురు.

                   బైండింగ్   వర్గీకరణము

   CLASSIFICATION  OF   BINDING


LEETTER PRESS BINDING    

                                                   

1.  Extra  Leather Binding

  ప్రత్యేకమైన   లెదర్  బైండింగ్ 

2. Liberary  Binding

గ్రంథాలయ   పుస్తకములకు   చేయు  బైండింగ్ 

3. Miscellancous Binding

వివిధ రకములైన   పద్థతులతో    బైండింగ్ 

4. Publishers Binding

పుస్తక   ప్రచురణలకు    చేయు  బైండింగ్ 

STATIONARY   BIND

1. Extra  Account   Book  Binding

 ప్రత్యేకమైన   అకౌంటు   పుస్తకాలు  బైండింగ్ 

2. Manifold   Books

 రశీదు  పుస్తకాలు   బైండింగ్ 

3.Exercise   Note  Books

 వ్రాసుకొను   పుస్తకాలు    ( నోట్సులు )  తయారు  చేయుపద్థతి

4. General   Office Stationory

 సాధారణముగా   ఆఫీసులలో    వాడునట్టి   పుస్తకాలు

            LEETTER PRESS BINDING


1. Extra  Leather Binding  :

     ప్రత్యేకముగా    తోలు  వేసి   బైండింగ్   చేయు  పద్థతి :

          ఈ   విధముగా    తయారుచేయునటువంటి    పుస్తకాలు   చాలా    ఖరీదు   అయినవి.   కావున    తక్కువ    పుస్తకాలు    చేయుటకు   పై   పద్థతిని   వాడుతారు.   ఈ   రకము    పుస్తకాలు   చేయుటకు   యంత్రములను    తక్కువగా    ఉపయోగించుతారు.   గట్టి    దారము,  అట్టలు   మరీయు  కవరింగుకు   తోలు    వాడుతారు.    End papers   గట్టివి    వేస్తారు.    పుస్తకము   వెనుక    వైపున    గుండ్రముగా    ( Rounding   and  Backing ) చేసి    అట్టలు   బిగించుతారు.   పుస్తకము   సులభముగా    తెరుచు    కొనుటకు,   మధ్య     కాగితములు    కూడా    పూర్తిగా    చదువుటకు    వసతిగా    నుండుటకుగాను  స్ర్పింగ్ బ్యాక్ లను ( spring Back )  తయారుచేసి   బింగించుతారు.   బైండింగ్    చెడిపోకుండా    Dust  Cover  ను    తయారుచేసి    బింగించుతారు.   ఈ   విధముగా   ఎన్నో    ప్రత్యేక  పద్థతులు    ( Extra  Operations )   చేసి    పుస్తకాలను    బైండింగ్    చేస్తారు.   అందువలన     దీనిని    Extra   Leather Binding    అని   అంటారు.

2. Liberary  Binding

గ్రంథాలయ   పుస్తకములకు  బైండింగ్ చేయు  పద్థతి   :

         పైన     తెల్పిన    పద్థతికన్నా    ఈ   పద్థతి   కొంత    తక్కువ    రకము.   కాని    గ్రంథాలయములలో    పుస్తకములలో    పుస్తకములను    ఎంతో  మంది   రకరకాలుగా    వాడుదురు.  కావున   అటువంటి   వాడుకమునకు   తగినట్లుగా    పుస్తకాలను    ప్రత్యేకముగా    తయారు    చేయాలి.  ఎన్నో    పుస్తకాలను    స్వల్పవ్యవధిలో    చేయాలిగనుక    యంత్రములను    విరీవిగా  వాడుదురు.    ముఖ్యముగా   గమనించవలసిన    విషయమొమనగా,   ఇట్టి    బైండింగ్    చేయుటకు   మంచి    నాణ్యమైన    వస్తువులను   వాడవలెను.   పుస్తకములు   తయారుచేయుటకు   అగునట్టి   ఖర్చును    తగ్గించవలెను.

3.  Miscellancous Binding

వివిధ రకములైన   బైండింగ్   పద్థతులు  :

   ఈ   పద్థతిలో    కొంత    క్రొత్తదనము   వుండవలెను.   చూచుటకు   అందము    గాను,   నాజూకుగాను   వుండవలెను.   ఇది   చేయుటకు   యంత్రములను   వాడుదురు.   ఈ   పద్థతి  పైన    తెల్పిన   పద్థతుల   కన్నా   తక్కువ   ఖరీదగును.  ఆకర్షణీయమైన   కొత్త   పద్థతులను   అనుసరించుట   దీని    ప్రత్యేకత.

4. Publishers Binding

పుస్తక   ప్రచురణలకు    చేయు  పద్థతి  :

      ఈ   పద్థతి   అన్ని   బైండింగ్    పద్థతులకన్నా    చాలా   ముఖ్యమైనది.   ఇది    లాభసాటి    అయిన   పద్థతి.  ఇందులో    అన్ని   పనులు   యంత్రములసహాయమున    అతితక్కువ   వ్యవధిలో   ఎక్కువ    పుస్తకములను    తయారుచేయుదురు.   వీటికి     అందమైన,  ఆకర్షణీయమైన    అట్టలు   వేయుదురు.   ఈ   పుస్తకములు     ఎక్కువ   విలువ    కల్గినవికావు.   ఉదా :— నవలలు,    మ్యాగజైన్ లు    తదితర    పుస్తకములు,   వార  పత్రికలు,   పక్షపత్రికలు ,  పాఠ్యపుస్తకములు.  ఈ   పద్థతిని    ఎడిషన్    ( Edition )   బైండింగ్     అని  కూడా   అంటారు.

       

            STATIONERY    BINDING

1.  Extra  Account  Books :

     దళసరి   ఖాతా   పుస్తకాలు  చేయు  పద్ధతి  :

                  ఇది   చాలా  గట్టి   రకమైన   బైండింగ్   పద్ధతి.  దీని   తయారుచేయు  పద్ధతులకు  పైన  తెల్పిన   Letter  Press  Binding   పద్ధతులకు   చాలా   తేడాగలదు.   మంచిరకమైన   కాగితముల  పై    రూలింగ్స్    చేసి   గట్టి    దారముతో   కుట్టుతారు.  పుస్తకపు   అంచులకు   లోహపు  బిళ్ళలు   బిగించుతారు.  అందువలన   అంచులు  విరిగిపోవు.   తాళమువేయు   వసతి,  ఇండెక్సు   కాగితములు   మొదలగు   ఎన్నో   క్రొత్త    పద్ధతులు   కలిపిచేయుదురు.   అందువలన  ఎక్కువ   సమయము  పట్టును.   కాని  చాలా  కాలము  దృఢముగా  వుండును.   ఈ   పద్ధతిని   వెల్లమ్   బైండింగ్   అనియు  మరియు  లెడ్జరు   బైండింగ్   అనియుకూడా   అంటారు.

2.  Manifold   Binding :

రశీదు   పుస్తకాల  తయారీ   పద్ధతి  :

             ఈ    పుస్తకాల  తయారీలో   కొన్ని   ప్రత్యేక   పద్ధతులు   గలవు.   ఇది   చాలా   చౌకరకము.   యంత్రములు   విరివిగా   వాడుతారు.   నంబరింగ్   మరియు  perforation    చేయుదురు.   ఈ   సన్నని   వరుసరంధ్రములవలన    కాగితము   సులభముగా  ఎంచుటకు   వీలుకల్గును.  ఉ  :—  చెక్కు   పుస్తకాలు,   రశీదు  పుస్తకాలు   వగైరా.

3.  Exercise  Note  Books  :

వ్రాసుకొను   పుస్తకాలు  ( నోట్సులు )   తయారుచేయు   పద్ధతి  :

        ఈ   రకపు   పుస్తకాల    తయారీ   చాలా   సులభమైన   పద్ధతి   మరియు   తక్కువ   ఖరీదైనది.   కాగితముల   పై   గీతలు   వేయుటకు   Pen  ruling   మరియు  Dise  ruling   అను  యంత్రములను   వాడుదురు.   వీటి  సహాయమున   నిలువు   గీతలు,  అడ్డ   గీతలు   రకరకాల   పద్ధతుల్లో   వేయవచ్చును.   ఒకేసారి   రెండురంగుల   గీయవచ్చును.  కొన్ని  యంత్రములలో   రెండువైపులా   ఒకేసారి   రెండురంగుల   గీతలు  వేయవచ్చును.   అట్లా   గీతలు   వేసిన   కాగితములను   మడిచి,   తక్కువ      ఖరీదైన    కాగితపు   అట్టవేసి   యంత్రము   సహాయమున   కుట్టి   పుస్తకము   మూడువైపులా   కత్తిరించుదురు.   పైనతెల్పిన   పద్ధతులన్నీ    యంత్రముల   సహాయమున   ఎంతో   తొందరగా   చేయవచ్చును.   

4.  General  Office  stationery  :

సాధారణముగా   ఆఫీసులలో   వాడు   పుస్తకములు  :

             ఈ    పద్ధతులకు   పుస్తకములు   తయారుచేయు  పద్ధతులకు  కొంత   తేడా  కలదు.     ఉదా  :   Letter  Head  Pads,  Tear  Off  Pads etc.  ఈ   పద్ధతిలో   ( Writing pads ),  సిరా  అద్దుకొనే   అట్టలు  ( Blotting Pads ),  కాగితపు   బరువులు   ( Paper Weights ),   ఫైళ్ళు,  కవర్లు  మొదలైనవి.

   

                            ప్రశ్నలు

1.  బైండింగ్   పనులను  ఎన్ని   విధములుగా  వర్గీకరించినారు?  అవి   ఏవి?

2.  లెటర్  ప్రెస్   బైండింగ్ లోని  రకములు  ఏవి?  వాటిని  తయారుచేయు  పద్ధతులు  తెల్పుము.

3.  స్టేషనరీ   బైండింగులోని   రకములు   ఏవి ?  వానిని  తయారుచేయు  పద్ధతులులేవి?

అధ్యాయము —3

    పుస్తకాలు   బైండింగు   చేయుటకు  కావలసిన   

                         పరికరములు

                Book   Binding  Tools

         బైండింగ్    పనులుచేయుటకు   తగినటువంటి   పరికరములు   కావలయును.   వీటిసహాయమున   వివిధరకములైన   పనులను   సులువుగాచేయవచ్చును.   ఈ    పరికరములను    వాడునప్పుడు   తగుజాగ్రత్తలు   పాటించవలెను.   సరిఅయిన   పరికరములను   వాడుట   మంచిపద్ధతి.   

1.  ఫోల్డర్  ( Folder ) :

                  దీనిని   దంతముతో   చేయుదురు.   ఇది   సుమారు   6   అంగుళముల    పొడవు   వుండును.   దీనికి   ఒకవైపున   గుండ్రముగాను   మరియొక    వైపున   ఏటవాలుగాను   చేయబడియుండును.   ఇది    కాగితములను   మడచుటకు   ( అనగా  మడిచిన   కాగితము  పై   రుద్దుటకు )  మరియు   అతికించునట్టి   కాగితములు,   గుడ్డ,   వగైరాలపై   రుద్దుటకు   కూడా   దీనిని   వాడుదురు.   ఈ   ఫోల్డర్సు   ప్లాస్టిక్ తోను,   చెక్కతోను   గూడా   తయారుచేయుదురు.   

2.  సూదులు  ( Needle ) :

               వీటిని    పుస్తకములను   కుట్టుటకు   ఉపయోగించెదరు.   ఇవి   దృఢముగా   నుండి  దారము   పెట్టుటకు  అనువైన   రంధ్రము  కలిగియుండవలెను.

3.  కంఠాణి  ( Bodkin ) :

              వీటిని    కాగితములపైనను,   అట్టలపైనను   రంధ్రములుచేయుటకు   ఉపయోగింతురు.   వీటిని   ఇనుముతో   తయారుచేయుదురు.    వీటికి  ఒకవైపున    సన్నముగాను   మరియు   పదునుగానుండి,   మరియొకవైపున   చదరముగానుండును.   వీటిని   వాడునపుడు   పుస్తకముక్రింద     అట్టనుపెట్టవలెను   లేనిచో   టేబుల్ పై   రంధ్రములుపడి   టేబులు   మరియు   కంఠాణి    చెడిపోవును.   అందువలన   దీనిని   ఉపయోగించునపుడు  జాగ్రత్త    తీసుకొనవలెను.  ఎక్కువకాగితములకు   రంధ్రములు   వేయునపుడు   ఇనుపసుత్తి   సహాయమున   ఈ   కంఠాణి పై   కొట్టవలయును.

4.  రంపము  ( Tenonsaw ) :

              పుస్తకములు   కుట్టునపుడు   సెక్షనుల   వెనుకవైపున   రంధ్రము   చేయుటకు   దీనిని   ఉపయోగింతురు.   అట్లా   చేసినందువలన   కుట్టుటకు   సులభముగా   నుండును.

5.   కత్తి   ( Knife ) :

                   మంచి   పదునైన   కత్తి   కాగితములు,   గుడ్డ,  క్యాలికో   టేపు   మొదలగు   వాటిని   చించుటకు   ఉపయోగపడును.   

6.  ప్యారియింగ్   కత్తి   ( Paring Knife ) :

               రకరకముల   పద్నతులలో   ప్యారియింగ్    కత్తులు   దొరకును.   వీటిని   తోలు   బైండింగ్   చేయునపుడు   తోలు   అంచులను   సన్నబరచుటకు   ఉపయోగింతురు.   

7.  నునుపురాయి  ( Paring  stone ) :

             దీనిని   తోలు   అంచులు   ప్యారియింగ్   కత్తి   ద్వారా   సన్న   పరచునపుడు   తోలు  క్రింద   ఆధారముగా   పెట్టుకుందురు.

8.  గరుకురాయి   ( Oil  Stone ) :

               దీనిని    కత్తులు   పదును   చేసుకొనుటకు   వాడుదురు.  దీనిని   చెక్కపెట్టెలో    బద్రపరచుదురు.   దీనిపై   కొన్ని   చుక్కల   నూనె   వేసి  కత్తులను  పదునుచేయుదురు.   ఇవి  రెండు   సైజులలో   దొరకును.

9.  బ్రష్ లు   ( Brushes ) :

            ఈ    బ్రష్  లను  ' పేస్టు '    పూయుటకు   ' గ్లూ '   పూయుటకు   వాడుదురు.   పని   అయిన   వెంటనే   వీటిని   నీటిలో   శుభ్రముగా   కడిగి   పదిలపరచవలెను.   

10.  కత్తెర  ( Scissors ) :

            కత్తెరతో   క్యాలికో ,   తోలు,  రెగ్ జీన్   మొదలైన   వస్తువులను   కత్తిరించుటకు   వాడుదురు.   

11.  సుత్తి  ( Hammer ):

            రకరకముల    ఇనుప   సుత్తులను   వివిధరకముల   పనులకు  వాడుదురు.   ఉ:—   పుస్తకాలు   Rounding   and   Backing   చేయుటకు  మరియు   కాగితములపై   Bodkin తో    రంధ్రములు   వేయునపుడు   కొట్టుటకు   వాడెదరు.   

12.   మూల   మట్టము   ( Straight  edge ) :

                దీనిని   నేరుగా   గీతలు   గీయుటకు   మరియు   కాగితములు   మొదలగునవి   వంకరలేకుండా   కత్తిరించుటకు   సహాయకారిగా   ఉపయోగింతురు.   

13.  నాకింగ్   డౌన్    ఐరన్  ( Knocking  down  iron ) :

               ఇది   8 x 4  అం. ల    సైజుగల   ఇనుపదిమ్మె.   దీనిని   పుస్తకములు   కుట్టునపుడు   Sections   level  గా   తట్టుటకు   ఉపయోగింతురు.

14.  బాక్సింగ్   బోర్డ్స్   ( Backing  Boards ) :

              ఇవి    ఏటవాలుగా    నుండు   చెక్కలు.   వీటిని   Saw  cuts   చేయునప్పుడు,   మరియు  పుస్తకము   వెనుకభాగమును  గుండ్రముగా   చేయునప్పుడు   పుస్తకమునకు   రెండువైపులా   ఆధారముగా   వుంచుదురు.   

15.  ప్రెస్సింగ్    బోర్డ్స్   ( Pressing  Boards )  :

            ఇవి   నునుపైన    అల్యూమినియమ్ తో   చేయబడ్డ   ప్లేట్లు .    ఇవి  10"  x  12"   సైజులో   వుండును.  పుస్తకాలను  అదుముటకు   ముందు  ఈ   అట్టలను  పైన   క్రిందపెట్టుదురు.   అందువలన   పుస్తకములపై   ఎలాంటి   గుర్తులుగాని   మరకలుగాని   పడవు.

16.  గ్లూ    కెటిల్  ( Glue  Kettle )  :

               ఇవి   రెండుపాత్రలు   ఒకదానిలో   నొకటి   అమర్చబడి   యుండును.   ఆ   రెండు   పాత్రలమధ్య   నీటిని   నింపుదురు.   లోపలిపాత్రలో   ' గ్లూ '   ముక్కలను   పొడిచేసి   నీటిలో   కలుపుతారు.   బయటి   పాత్రను  వేడిచేయుదురు.   కాబట్టి   లోని   పాత్ర   కూడా   మధ్య   నీటిద్వారా   వేడి   చెందెను.   ఈ    విధముగా    చేసినందున    ' గ్లూ '   మాడకుండా  వుండును.  మరియు   గట్టిగా   కరచుకొను   గుణములు   కలిగియుండును.   

17.  ప్లయర్లు  ( Pliers )  :

ఇవి   ఒకరకమైన    కత్తెరలు.   వీటికి   పొడవైన   దవడలు   ( Jaws )    కలిగియుండును.  వీటి  సహాయమున   తీగలు   వంచుట   మరియు   త్రుంచుటకు   ఉపయోగపడును.   

18.  పంచ్ లు  ( Punches )  :

            ఇవి    రంధ్రములు   చేయుటకు   ఉపయోగించు    ఇనుప   పనిముట్లు .   ఇవి   వివిధ   సైజులలో   దొరకును.   ఇవి   పదునుగ  నుండును.   వీటిని   ఆఫీసు   ఫైళ్ళు   ( Files ),   ఫోటోఆల్బమ్ లను   చేయునప్పుడు   రంధ్రములు   చేయుటకు   ఉపయోగింతురు.  

eg  :-  Round  punch ,  slit  punch  and  T  —  shape  punch.

19.  ఉలి  ( Chisel )  :

                ఇవి   పదునైన   ఇనుప   పనిముట్టు.   అట్టలపైన   చతురస్రాకారపు   రంధ్రములు   చేయుటకు   దీనిని  ఉపయోగింతురు.

20.  మైదా  గిన్నెలు  ( Paste vessels ) :

              ఇవి   ప్లాస్టిక్   లేదా   పింగాణి   పూత   పూసిన   ఇనుప   గిన్నెలు.   వీటిలో    గట్టి   Paste ,  పల్చటి   Paste ను   వేరు  వేరుగా   కలిపి   ఉంచుదురు.   

మెరుగుపెట్టు   పనిముట్లు  ( Finishing  Tools ) :—

         సాధారణముగా   విలువైన   పుస్తకాలు   బైండింగ్    చేయునప్పుడు,   వాటిని  చివరిదశలో   అనగా,   అట్ట  వేయుట,   కవరింగ్   చేయుట   అనుపనులు   అయిన   తరువాత,  అట్టి   బైండింగ్   

 పుస్తకమునకు  మెరుగులు   పెట్టుపనిని   చేయుదురు.  అట్లా   చేసినందువలన   పుస్తకముయొక్క    బైండింగ్   ఆకర్షణీయముగా   వుండును.  కాని   ఈ   చివరిదశలో   ఎలాంటి  పొరపాటు   జరిగినను  అది   పుస్తకముయొక్క   స్వరూపమును   చెడగొట్టును.  అందువలన   ఈ   మెరుగుపెట్టు   పనిని   అతి   జాగ్రత్తగా   చేయవలయును.   అట్లాగే   ఈ   మెరుగుపెట్టుటకు   ఉపయోగించు   పనిముట్లను   సరిగా   సక్రమపద్ధతిలో   వాడుకొనవలయును.   పుస్తకముల   మెరుగుపెట్టుటకు   ఉపయోగించు   పరికరములన్నియూ   ఇత్తడి   లోహముతో    చేయబడినవి.   ఈ   పరికరములను   వేడిచేసి   వాడవలయును.   వీటికి   ఉపయోగించుటకు   తగిన   Handles  వుండును.   అట్టి   పరికరములలో   ముఖ్యమైనవి  ఈ   దిగువన   తెలుపబడినవి.