బుక్ బైండింగు
అధ్యాయము — 1
కాగితములు — వాటి కొలతలు
ముద్రణా పరిశ్రమలోను, పుస్తకములు బైండింగ్ చేయుటకును కాగితము ముఖ్యమైన వస్తువు. కావున కాగితమును గురించి కొన్ని విషయములను తెలిసికొనవలయును. కాగితము యొక్క ఆవశ్యకత ఏవిధముగా ఏర్పడినదో తెలిసికొందాము. శిలాయుగమునందు మానవుడు తన భావనలను రాళ్లపైన, చెట్లమొదళ్ళ మీద మరియు మట్టి బిళ్ళలమీద, చెక్కుకొనెడివాడు. కాలక్రమేణ నాగరికత అభివృద్దిచెంది, జంతు చర్మములను, ఆకులను, సిల్కు గుడ్డలను వ్రాయుటకు ఉపయోగించెను. అటుతరువాత అనగా క్రీస్తుకు పూర్వమే కాగితమును తయారుచేసుకొను పద్ధతులను తెలిసికొనిరి. కాగితమును వెదరు, చెరకుపిప్పి, మొదలగు వృక్షసంబధమైన వస్తువులను నానపెట్టి, ఉడకపెట్టి గుజ్జుగా తయారుచేసి, ఆ గుజ్జు పదార్ధమునకు కొన్ని రసాయన పదార్ధములను, రంగును కూడా చేర్చి, ప్రత్యేకమైన జల్లెడల ద్వారా ఆ గుజ్జును వడపోసెదరు. ఈ కాగితపుగుజ్జునందు షుమారుగా 90 నుండి 95 శాతము ద్రవముగాను, మిగిలినది పొడిరూపములోనున్న పీచు పదార్ధము కల్గియుండును.
కాగితమును తయారుచేయు పద్ధతి: కాగితమును చేతితో తయారు చెయుటకు తీగలతోచేసిన జల్లెడ చట్రము కావలయును. ఈ చట్రములు వివిధ కొలతలలో దొరకును. కాగితపు గుజ్జును ఈ చట్రమునందు నింపుతారు. అటుతరువాత ఈ జల్లెడపై మరియొక frame ( deckle ) చెక్క వుంచి కాగితపు గుజ్జును అదిమెదరు. కాగితము నిర్ణయించబడ్డ మందము మరియు కొలతలలో తయారగును. తరువాత కాగితము పై సైజింగ్, అనగా వ్రాయుటకు అనువుగా వుండునట్లుగా చేస్తారు. కాగితము అవసరమునుబట్టి, కోటింగ్ , క్యాలండరింగ్ చేస్తిరు. కాగితమును తయారుచేయువారు వారియొక్క వ్యాపార ముద్రను ( Water mark ) కాగితమును తడిగా నున్నపుడే వేస్తారు. ఈ ముద్ర సాధారణముగా mould లో వుండును లేదా ప్రత్యేకమైన రోలర్ ( roller ) ద్వారా ( Dandy roller ) కాగితముపై తడిగా నున్నప్పుడు అద్దుతారు.
ఆ విధముగా తయారైన తడి కాగితములను బ్లాంకెట్సు ( Blankets ) మధ్యన వుంచుతారు. కాగితము కొంచెముగట్టిపడిన తరువాత ప్రెస్ చేసి ఆరవేయుదురు. ఈ దశలో కాగితము ఎక్కువ గరకుగా నుండును. కావున వ్రాయుటకు అనువుగా వుండుటకు కాగితమును సైజింగ్ మరియు కోటింగ్ ద్రవములో ముంచి ఆరపెట్టుదురు. తరువాత కాగితములను 500 లేదా 480 ప్రకారం కట్టలు కట్టి బద్రపరచెదరు. కాగితమును యంత్రముల సహాయముతో చేయుట ఎక్కువగా వాడుకలోనికి వచ్చెను. యంత్రముల సహాయమున కాగితము భారీ ఎత్తున చేయుటకు వీలుకల్గినది. ఎంత సన్నని కాగితమునైనా, ఎంతటి వెడల్పు, పొడవు అయినను సులభముగా చేయుటకు వీలు అగును. యంత్రముల ద్వారా చేసిన కాగితము ఎంతో నాణ్యత కల్గియుండును. కాగితపు గుజ్జు తయారు చేయుటనుండి సైజింగ్ , calendering, drying చివరగా కాగితమును వుండగా చుట్టుట అనునవి ఒకేసారి చేయుటకు యంత్రముల ద్వారా వీలుకల్గును.
కాగితములో అనేకరకములు గలవు. న్యూస్ ప్రింటు, కోటెడ్ పేపర్, సూపర్ క్యాలెండర్ కాగితము, డూప్లెక్స్ కాగితము, బాండు పేపరు, టిష్యూ పేపరు, కవరు పేపర్, పోస్టరు పేపరు, క్రాఫ్ట్ పేపరు, కాట్రిడ్జి పేపరు, అని అనేక రకములలో గలవు. కావున పైన తెల్పిన కాగితముల అవసరమునుబట్టి వాటి కాగితపు గుజ్జును ఇతర loading, sizing, colouring, finishing ను చేస్తారు. కావున కాగితమును కొనునప్పుడు, మన అవసరమును, కాగితపు నాణ్యతను ముఖ్యంగా తెలుసుకొనవలెను. సాధారణముగా కాగితములు నాల్గు విధములుగా వుండును. (1) Machine finishing (2) Super calendering (3) Coated (4) Antique . కావున కాగితమును కొనునప్పుడు కేటలాగునందు చూచి కావల్సిన finish, colour, size, మందములోను కొనవలయును. కాగితమును ఎక్కువ మొత్తంలో కొనునప్పుడు ఎన్ని రీములు కావలయునో, ఏవిధముగా pack చేయాలో అట్లా transport చేయాలి అనేది వివరముగా తెలియపరచవలెను. బద్రపరచుకొనుటకు ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవలెను.
కాగితమును అనేక పనులకు వాడుతారు. అనగా అనేక రకములైన చదువుకొను పుస్తకములకు మరియు వ్రాయుటకు ఉపయోగించు అన్ని రకములైన పుస్తకములను ఉపయోగించుతారు. పైన తెల్పిన అన్నిరకముల పుస్తకములు ఒకే మాదిరిగా వుండవు. వాటి కొలతలలను, నాణ్యత లోను, ఖరీదులోను, మరియు మన్నికలోను చాలా వ్యత్యాసముండును. కావున ఒక్కొక్కరకమునకు తగిన కొలతలుగల కాగితమును ఎంచుకొనవలయును. లేనిచో కాగితము కొలతలు ఎక్కువ అగుటయో లేక సరిపడక వృధా అగుటయో జరుగును. అందువలన మనము కాగితము ఎన్ని రకముల కొలతలలోఏయేపేర్లలో లభించున్నదో తెలిసికొందాము. పేపరు కొనునప్పుడు ఈ దిగువ తెలిసిన వివరములను బట్టీ, తగిన కొలతలు పేర్లలోని కాగితమును కొని ఉపయోగించుట లాభదాయకము. కాగితము తయారు చేయువారు రూపొందించిన వివిధ కాగితముల వివరములు దిగువన పెర్కొనబడినవి. కాగితములో సింగిల్ సైజు అనియు, డబుల్ సైజు అనియు, క్వాడ్ సైజు అనియు గలవు.ప్రతి సింగిల్ సైజు కాగితము యొక్క తక్కువ కొలత మాత్రము వెచ్చించిన దాని డెబుల్ కొలత మరియు అదే ప్రకారముచేసిన క్వాడ్ సైజును తెలుసుకొనవచ్చును. సాధారణముగా కాగితములు తయారుచేయువారు పెద్ద సైజులోనే అనగా క్వాడ్ సైజులోనే సరఫరా చేస్తారు. అందువలన కాగితము ఖరీదులో కొంత తగ్గును. చిన్న సైజు కాగితములు కూడా సరఫరా చేస్తారు కాని వాటికి కట్టింగ్ చార్జి ,ప్యా కింగ్ చార్జి అనేవి ఎక్కువ అగును. అందువలన కాగితమును పెద్ద సైజులో కొని, మన కట్టింగ్ మిషన్ మీద కావల్సిన సైజులోనికి కత్తిరించుకొనుట మంచి పద్ధతి.
కాగితము పేర్లు మరియు కొలతలు
Quality : FOOLSGAP
single Size in inches : 13 1/2 x 17
Double Size in inches : 17 x 27
Quad size in inches : 27 x 34
Quality : GROWN
single Size in inches : 15 x 20
Double Size in inches : 20 x 30
Quad size in inches : 30 x 40
Quality : DEMY
single Size in inches : 17 1/2 x 22 1/2
Double Size in inches : 22 1/2 x 35
Quad size in inches : 35 x 45
Quality : MEDIUM
single Size in inches : 18 x 23
Double Size in inches : 23 x 36
Quad size in inches : 36 x 46
Quality : ROYAL
single Size in inches : 20 x 25
Double Size in inches : 25 x 40
Quad size in inches : 40 x 50
Quality : IMPERIAL
single Size in inches : 22 x 30
Double Size in inches : 30 x 44
Quad size in inches : 44 x 60
Quality : SUPER ROYAL
single Size in inches : 20 1/2 x 27 1/2
Double Size in inches : 27 1/2 x 41
Quad size in inches : 41 x 55
Quality : ELEPHANT
single Size in inches : 23 x 28
Double Size in inches : 28 x 46
Quad size in inches : 46 x 56
Quality : POST
single Size in inches : 15 3/4 x 19 1/2
Double Size in inches : 19 1/2 x 31 1/2
Quad size in inches : 31 1/2 x 39
Quality : POTT
single Size in inches : 12 1/2 x 15 1/2
Double Size in inches : 15 1/2 x 25
Quad size in inches : 25 x 31
గమనిక : పేపరు కొలతలతో చిన్నకొలత డబుల్ గా మారుటకు గమనించవలయును.
ఏ సైజు కాగితమునైనా అవసరమునుబట్టి రకరకాలుగా మడవవచ్చును. ఈ విధముగా మడచుటకు రెండు పద్ధతులు గలవు. మొదటిది Regular sub - division Irregular sub - divisions అనియు అంటారు. కావున ఏదేని ఒక సైజు కాగితమును దాని పొడవునందు సగమునకు మడచిన దానిని regular sub - divisions అని అంటారు. ఆ విధముగా చేయుటవలన వచ్చుసగభాగమును Folio అని అంటారు. పై మాదిరిగానే Folio లోని పొడవు సైజును మడచిన Quarto లేదా 4 to లభించును. అదే ప్రకారము Quarto ను మడిచిన 8vo లేదా Octavo మరియు అదే ప్రకారము 16 mo అనెడి చిన్న చిన్న ముక్కలుగా తయారగును.
ఉదా:— కాగితమును సక్రమముగా మడచు విధమును చిత్రములలో గమనించండి
ఇదే మాదిరి ఒక సైజు కాగితమును తక్కువ సైజులలో ( అనగా వెడల్పు నందు ) సగమునకు మడచిన దానిని Long Folio అని అంటారు. దానిని సగమునకు అదే ప్రకారము మడిచిన Long Quarto అని అంటారు. Long Quarto పొడవులో సగమునకు మడిచిన దానిని Long slip octavo అని అంటారు.
ఇదే మాదిరి ఏదేని ఒక సైజు కాగితమును దాని పొడవునందు మూడుసమభాగములు చేసిన దానిని thirds లేదా 1\3 part అని అంటారు. thirds ను పొడవు వైపున మడచిన 6 to ( sixto ) అనగా 1\6 భాగము వచ్చును. దానిని మడవగా 12 mo ( Duodecime ) అనగా 1\12 భాగము వచ్చును. అదే మాదిరి 24 mo వచ్చును. వీటిని Irregular sizes అని అంటారు. కాబట్టి కాగితమును అనేక విధములుగా అవసరమునకు తగినట్లుగా మడచుకొనుట తెలుసుకొనవలయును. ఈ క్రింద కొన్ని regular sub - divisions కొలతలను తెలుపుచున్నాము. ఆ ప్రకారము మిగిలిన పద్ధతులలో ఇతర కొలతలు తెలుసుకొనవలసినది.
కాగితమును క్రమపద్ధతిన మడచు విధము :
Quality : Foolscap
Single size in inces : 13 1/2 x 17
Folio (1/2) : 8 1/2 x 13 1/2
Quarto (1/4) : 6 3/4 x 8 1/2
Octavo (1/8) : 4 1/4 x 6 3/4
16mo (1/16) : 3 3/8 x 4 1/4
Quality : Crown
Single size in inces : 15 x 20
Folio (1/2) : 10 x 15
Quarto (1/4) : 7 1/2 x 10
Octavo (1/8) : 5 x 7 1/2
16mo (1/16) : 3 3/4 x 5
Quality : Demy
Single size in inces : 17 1/2 x 22 1/2
Folio (1/2) : 11 1/4 x 17 1/2
Quarto (1/4) : 8 3/4 x 11 1/4
Octavo (1/8) : 5 5/8 x 8 3/4
16mo (1/16) : 4 3/8 x 5 5/8
Quality : Medium
Single size in inces : 18 x 23
Folio (1/2) : 11 1/2 x 18
Quarto (1/4) : 9 x 11 1/2
Octavo (1/8) : 5 3/4 x 9
16mo (1/16) : 4 1/2 x 5 3/4
Quality : Royal
Single size in inces : 20 x 25
Folio (1/2) : 12 1/2 x 20
Quarto (1/4) : 10 x 12 1/2
Octavo (1/8) : 6 3/4 x 10
16mo (1/16) : 5 x 6 3/4
Quality : Imperial
Single size in inces : 22 x 30
Folio (1/2) : 15 x 22
Quarto (1/4) : 11 x 15
Octavo (1/8) : 7 1/2 x 11
16mo (1/16) : 5 1/2 x 7 1/2
సూచన :— ఒక్కో సైజు కాగితమును మడిచి వాటి కొలతలను గుర్తించవలయును.
ప్రశ్నలు
ఈ క్రింది ప్రశ్నలకు క్లుప్తముగా సమాధానము వ్రాయుము.
1. కాగితము తయారు చేయుటకు కావల్సిన మూలపదార్ధములేవి?
2. కాగితములో ముఖ్యంగా ఎన్ని రకములు గలవు?
3.కాగితమును కొనుటకుముందు తీసుకొనవలసిన నిర్ణయములేవి ?
4.కాగితములో అనేక సైజులు వుండుటకు కారణమేమి?
5. కాగితములో సైజులు తెలుపుము.
6. కాగితములోని రకముల పేర్లు తెల్పుము.
7. కాగితమును ఎట్లు చేయుదురు?
అధ్యాయము—2
బైండింగ్ పనులకు ఉపయోగించు అట్టలు మరియు వాటిలోని రకములు
స్ర్టా బోర్డులు మరియు మిల్ బోర్డులు :—
పుస్తకములు బైండింగ్ చేయుటకు అట్టలు చాలా ముఖ్యమైన వస్తువులు. కావున అట్టలు ఎన్ని రకములుగా దొరకునో మరియు వాటిని తయారుచేయుట, ఉపయోగించుటను గూర్చి తెలిసికొందాము. అట్టలు చేయుటకు కాగితపు గుజ్జు అనేది అవసరము. కానీ ఈ కాగితపు గుజ్జునందు పనికిరాని చెత్త, గడ్డి, చెరకుపిప్పి, వెదరు, నార పీచులు, పొట్టు మొదలగునవి ఎక్కువగా వాడతారు. కాగితము గుజ్జులలో అనేక రకములుగలవు. కాని ముఖ్యమైనవి మెకానికల్ ఉడ్ పల్పు అనియు, కెమినల్ ఉడ్ పల్పు అనియు గలవు. అట్టలు చేయుటకు ఉపయోగించు గుజ్జు చాలా తక్కువ రకమునకు చెందినది. అందువలన దీని ధరకూడా తక్కువగా నుండును. అట్టలయొక్క విశిష్టతనుబట్టి kraft pulp, Rag pulp మరియు Flaxpulpఅనునవి కూడా అంటారు.
అట్టలు అనునవి గట్టిగాను, మందముగాను ధర తక్కువగాను వుంటాయి. అట్టల రకములలో ముఖ్యమైనవి Straw boards, Gips boards, Grey boards, pulp boards , అనునవి. Straw board అనునది 1\2lbమందము నుండి 4lbమందమువరకు దొరకును. ఇంకా మందమైన అట్టలు కావలెననిన ఒకదానితో మరియొకటి అతికించుకొనవలయును. Straw board ఎక్కువగా వంచుటకు వీలుకాదు. పెళుసుగా నుండి చేతితో విరచిన అక్రమాకారముగా విరిగిపోవును.
ఇవి బరువుగా వుండును. తేమను అధికముగా గ్రహించును. వంకరలు తిరుగును. వీటియందు ఆల్కహాలు లక్షణములు గలవు. అట్టలు వేయుటకుముందు వీటిని pressingలో పెట్టిన తరువాత పుస్తకమునకు బిగించవలెను. వీటిమిద ముందుగా కాగితమును అంటించి దానిపై మార్బుల్ పేపరును గాని ఇంకా ఇతర క్యాలికోను గాని అతికించిన బాగుండును. లేనిచో కొన్ని దినములకు కవరింగ్ చేసిన కాగితపు రంగు మాయును. ఇవి ముద్రించుటకు పనికిరావు. ఈ అట్టలు మిఠాయి పెట్టెలు, పుస్తకములకు అట్టలు వేయుటకు, వ్రాత అట్టలు తయారుచేయుటకు బట్టలు చుట్టుటకు మొదలగునవానికి వాడతారు.
అట్టలు గ్రేబోర్స్డు, చిప్ బోర్స్డు, అనునవి ఇతర రకములు. వీటిని చెత్త, చెదారముల నుండి తయారు చేస్తారు. ఇవి సన్నని పొరలుగా ఒకదానికొకటి అంటుకొనియుండును. ఇవి 0.04mm మందమునుండి 4.54mm మందమువరకు లభ్యమగును. ఇవి తేలికగాను, మెత్తగా నుండును. వీటిని రకరకాలుగా వంచుకొనవచ్చును. వీటిని ప్యాకింగ్ లకు వాడతారు. ముద్రించుటకు అనువుగా వుండును. మందుపెట్టెలు, చెప్పుల దుపెట్టెలు, బ్యాటరీ పెట్టెలు, బేకరీ పెట్టెలు మరియు పుస్తకాల అట్టలకు మొదలగు పనులకు వాడతారు.
మిల్ బోర్స్డు, లేదా పల్పు బోర్స్డు, అనేవి అట్టరకములలో ఖరీదైన కాగితపు అట్టలు. ఇవి సన్నగాను , గట్టిగాను, నునుపుగానుండి అనేక రకములైన మందములలో దొరకుచున్నవి. వీటిని వంచినయెడల విరగవు. అట్టలు వేయుటకు, carton లు ముద్రించుటకు, Files తయారుచేయుటకు వాడతారు. ఇవి వ్రాయుటకు, ముద్రించుటకు అనువుగా వుండును. ఇవి అనేకరంగులలో కూడా దొరకును. మిల్ బోర్స్డులో ఇంకా ఇతర రకములుగలవు.డూప్లెక్స్ కార్డు, సెంచరీకార్డు, బ్రిష్టల్ కార్డు ఐవరీకార్డు అనునవి ముఖ్యంగా ముద్రణకు వాడతారు. కారుగేటెడు బోర్డులను ప్యాకింగ్ లకు వాడతారు.
అట్టలు అనెడివి కాగితపు సైజుకన్నా కొంచెము పెద్దవిగా నుండును. కాగితములులోనే అట్టలలోకూడా వివిధ సైజులుగలవు. కాని Straw boards ముఖ్యంగా రెండు సైజులలో లభ్యమగును. మిల్ బోర్స్డు అనునవి చాలా సైజులలో దొరకును. అందువలన వాటినిగురించిన వివరములు దిగువన ఇవ్వబడినవి.
STRAW BOARDS
1. 22"x 32"
2. 25"x 30"
MILL BOARDS
1. Pott 141\4" x 171\4"
2. Foolscap 141\2" x 181\2"
3. Crown 161\6" x 20"
4. Small half Royal 13" x 201\4"
5.Large half Royal 14" x 21"
6.Small Demy 181\2"x 221|2"
7. Large Demy 181\2" x 233\4"
8. Medium 19" x 24"
9. Extra Royal 211\2" x 281\2"
గమనిక : అట్టల కొలతలు కాగితపు కొలతలకన్నా కొంచెము పెద్దనిగా నుండుటను గమనించవలసినది.
ప్రశ్నలు
1. అట్టలలోని రకములను తెల్పుము.
2. Straw boards ను ముఖ్యంగా ఎందుకు వాడతారు? వాటి స్వభావము ఏమిటి?
3. పల్పుబోర్డునకు, గ్రేడ్ బోర్డునకుగల తేడాలేమిటి?
అధ్యాయము —3
I.S.O. పేపరు సైజులు
మనము మొదటి పాఠములో కాగితమును గురించి మరియు వివిధ కాగితపు కొలతలను గురించి తెలీసికొని యుంటిమి. బ్రిటిష్ స్టాండర్ ప్రకారము ముద్రణాకాగితములు, ముద్రణాయంత్రములు అవే సైజులలో వుండెడివి. కానీ ఈ నాటికి ఆ పద్ధతులు గొప్పగా మారలేదు. ఇప్పటికిని అనేక ముద్రణాలయములో మెట్రిక్ పద్ధతి కొలతలు తెలియవు. కావున కాగితములు అనేక సైజులలోను వివిధ పేర్లతో వున్నందువలన వాటిని ప్రత్యేకీంచి తయారుచేయుట, బద్రపరచుట , వాడుకొనుటలో అనేక జాగ్రత్తలు తీసుకొనవలయును. కొన్ని సందర్బములలో కేవలము కొన్ని సైజుల కాగితములకే గిరాకి, మిగీలినవి వాడుకలోనికి అంతగా రాలేకపోయినవి. అందువలన తయారుచేయువారు, కొనినవారు కూడా ఆ కాగితమును వేరే సైజు పనికి వినియోగీంచి కొంత నష్టపోవుచుండిరి. పలురకముల కొలతలలో కాగితములు వున్నందువలన అనేక ఇబ్బందులు కల్గుచుండెను. ఇంతలో ప్రపంచములోని కాగితములు ఉత్పత్తి చేయువారు, కాగితమును ఒక స్టాండర్ సైజుకు తయారుచేయవలయునవి అనుకొనిరి. ఈ ఇంటర్నేషనల్ పేపర్ సైజులు మెట్రిక్ పద్ధతిలో అనుసరించుట జరిగినది. దీనిని ముందుగా జర్మనీ దేశస్థులు అనుసరించిరి. అందువలన వీటికి DIN సైజులు అని పేరు కూడా గలదు.
మన దేశములో కూడా స్వాతంత్ర్యము వచ్చిన తరువాత క్రమేణా మెట్రిక్ పద్ధతిని అవలంభించుట జరిగినది. అదే ప్రకారము కాగితపు కొలతలు కూడా మెట్రిక్ పద్ధతి అయిన మి.మీ. ,సెం.మీ.లలో తయారుచేయుచున్నారు. ఈ కొలతలు I.S.I వారు కూడా అనుమతించినారు. ఇంతకుముందు మాదిరి వివిధ పేర్లతో కాకుండా ప్రస్తుతం కాగితములు ముఖ్యముగా మూడు రకములలో దొరకుచున్నవి. అవి అందరికి తెలియులాగును A సిరీస్ , B సిరీస్ మరియు C సిరీస్ అని పిలవబడుచున్నవి. ఈ పేర్లు గుర్తుంచుకొనుట చాలా సులభము. కొలతలులోను, ఉపయోగములలోను ఒకదానికి మరియొకదానికి చాలా తేడాగలదు. I.S.O. పేపరు సైజువలన ఇంకా ఇతర లాభము లేవనగా, కొలతలు గుర్తించుకొనుట, బద్రపరచుట సులభము. అనేక రకముల సైజుల పేపర్లను కొనుటకు డబ్బును వెచ్చించ నవసరములేదు. ఒకేరకము కాగితమును అనేక సైజులలో ఉపయోగించుకొనవచ్చును. అందువలన ముద్రణ పుస్తకములు కొలతలలో కూడా మార్పువుండదు. మరియు కాగితము వృధాకాదు.
ఈ A, B, C, అను మూడు రకముల కాగితములలో A సిరీస్ అనునది చాలా ముఖ్యమైనది. దీనిని వ్రాతపుస్తకములకు, ప్రచారపత్రములకు, మ్యాగజైన్స్ కు, కేటలాగ్సు, లిటరేచర్ ముద్రణకు, మొదలగు అనేక ఇతర ముద్రణా పత్రాలకు వినియోగించవచ్చును.
B సిరీస్ అనునది A సిరీస్ కన్నా పెద్ద సైజు కాగితము. దీనిని పెద్ద పెద్ద Charts ( చిత్రములు) , Maps , Folders, Wall posters మొదలగువానికి వాడుతారు.
ప్రస్తుతం మనము A, B, C, సిరీస్ యొక్క సక్షజులను వాటి Sub — divisons ను తెలిసికొందాము.
I.S.O. కాగితపు కొలతలు తెల్పునట్టి చిత్రములు.
A. సిరీస్ కాగితపు కొలతలు
B. సిరీస్ కాగితపు కొలతలు
C. సిరీస్ కాగితపు కొలతలు
కాగితము ఉత్పత్తిదారులు A, B, C, సిరీస్ ను Trimmed size అనియు, Raw size అనియు మరియు, Special raw size అనియు తయారుచేస్తారు. కావున మనము కావలసిన తీరులో కాగితమును ఎన్నుకొనవలయును. సాధారణముగా AO అనునది Single size కాగితము. దానిలో సగము A1, అలాగే A2, A3, A4, A5, అని చిన్న సైజులుగా మార్చుకొనవచ్చును. AO కన్నా పెద్ద సైజు కాగితము 2A. 2A కన్నా పెద్ద సైజు 4A ఆ విధముగా A సిరీస్ లోనే పెద్ద సైజు మరియు చిన్న సైజు కాగితమును పొందవచ్చును. వాటి కొలతలు కూడా సమాన నిష్పత్తిలో వుండును. Trimmed size ను ముఖ్యముగా గుర్తుంచుకొనవలెను
Paper Series :
A. సిరీస్ —
AO —
Trimmed size in mms : 1189 x 841
Raw size in mms : 1220 x 860
A1 —
Trimmed size in mms : 841 x 594
Raw size in mms : 860 x 610
A2 —
Trimmed size in mms : 594 x 420
Raw size in mms : 610 x 430
A3 —
Trimmed size in mms : 420 x 297
Raw size in mms : 430 x 305
A4 —
Trimmed size in mms : 297 x 210
Raw size in mms : 305 x 215
B. సిరీస్ —
BO —
Trimmed size in mms : 1414 x 1000
Raw size in mms : 1500 x 1050
B1 —
Trimmed size in mms : 1000 x 707
Raw size in mms : 1050 x750
B2 —
Trimmed size in mms : 707 x 500
Raw size in mms : 750 x 525
B3 —
Trimmed size in mms : 500 x 353
Raw size in mms : 525 x 375
C సిరీస్ —
CO —
Trimmed size in mms : 1297 x 917
Raw size in mms : 1340 x 940
C1 —
Trimmed size in mms : 917 x 648
Raw size in mms : 940 x 670
C2 —
Trimmed size in mms : 648 x 458
Raw size in mms : 670 x 470
C3 —
Trimmed size in mms : 458 x 324
Raw size in mms : 470 x 335
ఈ విధముగా మిగిలిన సైజులను తయారుచేసుకొని కొలతలను గుర్తుంచుకొనవలయును.
ప్రశ్నలు
(1) I.O.S సైజు కాగితము కొలతల ఆవశ్యకత ఏమిటి ?
(2) A,B,C సిరీస్ కాగితముల ఉపయోగము లేమిటి ?
(3) A సిరీస్ కాగితము sub divisions వ్రాయుము.
No comments:
Post a Comment