2. 1.3 బ్యాండు రంపమును ఉపయోగించినప్పుడు గమనించవలసిన జాగ్రత్తలు :—
బ్యాండ్ ఱంపమును ఉపయోగించినపుడు క్రింద పేర్కొనబడిన జాగ్రత్తలు అవలంభించాలి.
1. బ్యాండ్ ఱంపము వేగముగా తిరుగుతూ కర్రనుకోస్తుంది. పనిచేయుచున్న వ్యక్తి చేతివ్రేళ్లు ఱంపము బ్లేడు పండ్లకు తగలకుండా జాగ్రత్తగా పనిచేయాలి. చేతివ్రేళ్లు బ్లేడుకు ప్రక్కగా వుండాలి. అంతేకాని బ్లేడుకు ముందుభాగమును పెట్టరాదు.
2. పదునైన పండ్లుైగల బ్లేడునూ ఉపయోగించాలి. మొద్దుబారిన పండ్లుగల బ్లేడును ఉపయోగించిన యెడల త్వరగా విరిగిపోతుంది. బ్లేడు విరిగినయెడల వెంటనే యంత్రము మోటారు స్విచ్ ను ఆపివేయాలి.
3. బ్లేడు తిరిగినపుడు యంత్రముపైన ఏ విధమైన అమరికలు చేయరాదు.
4. ఱంపముబ్లేడు కర్రనుకోసెడి స్ధలములో తగినంత వెలుతురు అవసరమైనయెడల యంత్రమునకు అమర్చబడిన విద్యుత్త్ బల్బును వెలుగించికొని ఆ ప్రదేశంలో వెలుగుపడునట్లు చూడాలి.
5. కర్రవస్తువును కోయుట పూర్తికాగానే వెంటనే మోటరును ఆపివేయాలి. బ్లేడు గైైడును టేబుల్ కు ఆనియుండునట్లుగా క్రిందికి దించాలి.
1.5 సర్కులర్ ఱంపము ( circular saw ) :—
కర్రపనులను చేసుకొనెడి వివిధ కర్రపని యంత్రములలో సర్కులర్ ఱంపము యెక్కువుగా వుపయోగిస్తుంది. దీనినే ' బెంచి ఱంపము ' ' టేబుల్ ఱంపము ' అంటారు. దీనినుపయోగించి కర్రవస్తువుపై రికరింగ్ మీటరింగ్ , క్రాస్ కటింగ్ మున్నగు పనులు , చీలికలు చేయవచ్చును.
1.5.1 సర్కులర్ ఱంపము వివిధభాగములు :
సర్కులర్ ఱంపము వివిద సైజులలో లభ్యమవుతుంది. అన్ని సైజుల సర్కులర్ ఱంపములు క్రింద వివరించబడిన భాగములను కలిగివుంటాయి.
1. బేస్ :—
ఇది పొతయినుముతో దృడంగా చేయబడియుంటుంది. సర్క్ బెంచిపైన లేదా నేలమీద తగినంత ఎత్తులో బేస్ బిగింపబడి యుంటుంది. వివిధ యితర యంత్రభాగములు దీనిపై అమర్చబడివుంటవి.
2. టేబుల్ :—
ఇది బెంచ్ పైన అమర్చబడియుంటుంది. కొన్ని సర్కులర్ ఱంపములలో టేబుల్ ను ఏటవాలుగా త్రిప్పుకొని 45॰ కోణములలో అమర్చుకొనెడి సదుపాయముంటుంది. టేబుల్ ను పైకీ, క్రిందకూ కదిలించుకొని కర్రవస్తువును కోయునపుడు ఱంపము కర్రలోనికి దిగెడి లోతును సరిచేరవచ్చును. రిప్పింగ్ ఫెన్స్, మీటర్ గేజ్ మరియు యితర అనుబంధములు టేబుల్ పైన అమర్చవచ్చును.
3. మీటర్ గేజి :—
ఇది పొతయినుముతో లేదా అల్యూమినియంతో చేయబడి కర్రవస్తువును అడ్డముగా కోయునపుడు ( అనగా కణముల అమరిక దిశకు అడ్డముగా ) దానికి ఆధారముగా వుపయోగిస్తూంది. టేబుల్ పైన గల సన్నని చీలికలో కదలించు కొని కావలసిన స్ధలములో దీనిని అమర్చుకొనవచ్చును. మీటర్ గేజిని ఱంపమునకు 30॰ నుండి 135॰ కోణములో వుండునట్లు అమర్చుకొనవచ్చును. :—
ఇది బెంచ్ పైన అమర్చబడియుంటుంది. కొన్ని సర్కులర్ ఱంపములలో టేబుల్ ను ఏటవాలుగా త్రిప్పుకొని 45॰ కోణములలో అమర్చుకొనెడి సదుపాయముంటుంది. టేబుల్ ను పైకీ, క్రిందకూ కదిలించుకొని కర్రవస్తువును కోయునపుడు ఱంపము కర్రలోనికి దిగెడి లోతును సరిచేరవచ్చును. రిప్పింగ్ ఫెన్స్, మీటర్ గేజ్ మరియు యితర అనుబంధములు టేబుల్ పైన అమర్చవచ్చును.
4. రిప్పింగ్ ఫెన్స్ :—
ఇది పొతయినుము లేదా ఉక్కుతో చేయబడి యంత్రమునకు కుడివైపు టేబుల్ పైన అమర్చబడియుంటుంది. కర్రవస్తువును పొడవు దీశలొ వెడల్పు తగిస్తూ కోయుటను రిప్పింగ్ అంటారు. రిప్పింగ్ చేయునపుడు కర్రవస్తువుకు ఆధారముగా రిప్పింగ్ ఫెన్స్ ఉపయోగిస్తుంది. దీనిని గుండ్రని ఱంపము బ్లేడునకు సమాంతరంగా అమర్చాలి.
5. ఆర్బర్ :—
ఆర్బర్ అనబడె గుండ్రని స్ధూపకారపు షాఫ్ట్ పైన ఱంపము బిగింపబడియుంటుంది. ఇది యంత్రపు బేస్ నకు బాల్ బేరింగుల ద్వారా అమర్చబడియుంటుంది. ఇది విద్యుత్ మోటారుకు నేరుగా లేదా బెల్టు ద్వారా కలపబడి ఒక నిమిషమునకు సుమారు 3500 చుట్లు తిరుగుతుంది. దీనికి బిగించిన 250 మి.మీ. వ్యాసముగల ఱంపము పండ్లు ఒక నిముషమునకు 2000 నుండి 3000 మీటర్లు వేగముతో కదులతవి. ఆర్బర్ ను త్రిప్పటానికి వుపయోగపడు విద్యుత్ మోటారు 0.75 నుండి 1HP వరకు శక్తిని కలిగియుంటుంది.
6. ఱంపము బ్లేడు :—
సర్కులర్ ఱంపము బ్లేడు గుండ్రముగా చేయబడి 150 నుండి 750 మి.మీ. వరకు వివిధ వ్యాసములతో లభ్యమగుతుంది. మూడు రకములైన ఱంపము బ్లేడులు సాధారణంగా వుపయోగిస్తారు. రిఫ్ ఱంపమును రిప్పింగ్ పనికి ' క్రాస్ కట్ ' ఱంపమును కర్రను కణముల అమరికకు అడ్డముగా కోయుటకు వుపయోగిస్తారు.
' మీటర్ ' ఱంపమును పై రెండు పనులకు వుపయోగించవచ్చును. సాదారణ ఱంపము బ్లేడును వివిధ రకములుగా కోయుటకు ఉపయోగిస్తారు.
ఇవి కాకుండా కర్రవస్తువుయందు చీలికలను చేసెడి ఆరురకముల ఱంపము బ్లేడుల సదుపాయమును ' డాడోహెడ్' ( Dado Head ) అంటారు. ఇవి సుమారు 3 మి.మీ. మందము గల రెండు సర్కులర్ ఱంపము బ్లేడులను రెండు చివరల కలిగియుండి, వాటి మధ్యలో ఉలి ఆకారపు పండ్లను కలిగిన నాలుగు గుండ్రని కట్టర్లను కలిగియుంటవి. వీటిని తగిన విధముగా అమర్చుకొని 3 మి.మీ. నుండి 20 మి.మీ. వరకు వెడల్పుగల చీలికలను చేయవచ్చును.
7. రక్షక కవచములు :—
ఇవి బ్లేడుకు ప్రక్కల అమర్చబడి ఱంపముపై పనిచేయు వ్యక్తికి ఱంపము వలన యేవిధమైన గాయము తగలకుండా కాపాడుతవి. ఱంపముతో చీల్చబడిన కర్ర తిరిగి బ్లేడు ప్రక్కభాగములపైకి తగులునట్లు దగ్గరగా రాకుండా స్ప్లిట్టర్ ( Splitter ) అపబడెడి రక్షక భాగము వుపయోగిస్తుంది. అంతేకాకుండా గుండ్రముగా తిరిగెడి బ్లేడును కర్రవస్తువు వెనుకకు ( అనగా పనిచేయు వ్యక్తి వైపునకు ) నెట్టివేయబడకుండా రక్షక కవచము నివారిస్తుంది
1.5.2 వివిధ రకముల సర్కులర్ ఱంపములు :—
సర్కులర్ ఱంపము సైజు దానిపై అమర్చెడి అతి పెద్ద ఱంపము బ్లేడు వ్యాసము పై ఆధారపడియుంటుంది.
యంత్రము పై అమర్చబడియున్న ఆర్బర్ల సంఖ్యను బట్టి రెండు రకముల సర్కులర్ గలవు.
1. సాధారణ సర్కులర్ ఱంపము :—
ఇది ఒక అర్బర్లను కలిగియుందిదానిపై ఒకే బ్లేడును కలిగియుంటుంది.
2. 1.5.2 వివిధ రకముల సర్కులర్ ఱంపములు :—
సర్కులర్ ఱంపము సైజు దానిపై అమర్చెడి అతి పెద్ద ఱంపము బ్లేడు వ్యాసము పై ఆధారపడియుంటుంది.
1. సాధారణ సర్కులర్ ఱంపము :—
ఇది ఒక అర్బర్లను కలిగియుంది . దానిపై ఒకే బ్లేడును కలిగియుంటుంది.
2. యూనివర్సల్ ఱంపము :—
ఇది రెండు అర్బర్లను కలిగియుంటుంది. వాటిపై రెండు బ్లేడులు అమర్చబడివుంటవి.
1.5.3 సర్కులర్ ఱంపము పై చేసెడి వివిధ పనులు :—
సర్కులర్ ఱంపము నుపయోగించి కర్రవస్తువును క్రింద వివరించబడిన విధములుగా కోయవచ్చును.
1. రిప్పింగ్ :—
రిప్పింగ్ ఫెన్స్ ఆధారముగా కర్రవస్తువును కదిలిస్తూ దాని పొడవు దిశలో ( కణములు అమర్చబడిన దిశలో ) కోయుటను రిప్పింగ్ అంటారు. ఫెన్స్ ను బ్లేడు నుండి తగినంత దూరములో వుంచి టేబుల్ పైకీ క్రిందకి కదిలిస్తూ బ్లేడు ( రిప్ ఱంపము లేదా కాంబినేషన్ ఱంపము ) కర్రవస్తువు ఉపరితలముపై న సుమారు 5—6 మి.మమీ. ఎత్తుగా వుండునట్లు చూడాలి. ఫెన్స్ ను ఱంపమునకు కుడివైపు అమరుస్తారు. రక్షక కవచము, స్పిట్టర్ తగిన స్ధలములో వుండునట్లు చూడాలి. కర్రవస్తువును ఫెన్స్ కు నొక్కి పెట్టూచూ, దానిని మెల్లిగా ఱంపము వైపు జరుపుతూపోవాలి. ఈ విధముగా కర్రవస్తువు ఱంపముచే కోయబడుతుంది. తక్కువ మందముగల సన్నని కర్రపలకను రిప్పింగ్ చేయునపుడు, ఒకవైపునుండి సగము పొడవు వరకు మాత్రమే కోసి, దానిని త్రిప్పుకొని రెండవ వైపు నుండి మిగిలిన సగము పొడవు కోయాలి. లేదా రక్షక కవచమును తొలగించి ' పుషర్ స్టిక్ ' ( pusher stick ) అనబడు కర్రను వాడుచూ, కర్రవలన చివరిభాగము సరిగా కోయుబడునట్లు చూడాలి. ( పటము 1.42)
రీ— సాయింగ్ చేయునపుడు ( మందమును తగ్గించుచు కోయునపుడు ) టేబుల్ ను జరుపుకొని ఱంపము బ్లేడు టేబుల్ ఉపరితలంపైకి కర్రవస్తువు వెడల్పులో సగముకన్న ఎక్కువ ఎత్తులో వుండునట్లుచూడాలి. ఒకసారి కోసిన పిదప, కర్రవస్తువును త్రిప్పుకొని రెండో వైపు నుండి కోయాలి.
2.క్రాస్ — కట్టింగ్ ( అడ్డముగా కోయుట ) :—
బ్లేడు కర్రవస్తువు ఉపరితలంపైన సుమారు 5 మి.మీ. ఎత్తుగా వుండునట్లు అమర్చాలి. ఫెన్స్ ను తీసివేసి మీటర్ గేజ్ ని టేబుల్ పై అమర్చి కర్రవస్తువుకు ఆధారపడివుంచాలి. కర్రవస్తువును మెల్లగా ఱంపమువైపు జరుపుచు, కర్రనుకోయాలి. ఇందుకుగాను క్రాస్ — కట్ట్ ఱంపము బ్లేడు లేదా మీటర్ ఱంపము లేదా కాంబినేషన్ ఱంపము వాడవలెను
3. చాంఫర్ మరియు బివెల్ కట్టింగ్ ( ఏటవాలుగా కోయుట ) :—
టేబుల్ ను తగ్గినంత కోణంలో అమర్చి రిప్పింగ్ ఫెన్స్ ను కర్రవస్తువు క్రిందవైపు అమర్చి రిప్పింగ్ చేసుకొనాలి. కర్రవస్తువు అంచుయందు ఏటవాలుగా కోయవలసినపుడు ఫెన్స్ స్ధానంలో మీటర్ గేజ్ ని ఉపయోగించాలి.
4. మీటర్ కట్టింగ్ :—
కర్రవస్తువు అంచుయందు ఏటవాలుగా కోసి మీటరింగ్ చేయుటకుగాను టేబుల్ ను ఏటవాలుగా త్రిప్పకుండానే చేరవచ్చును ఇందుకుగాను మీటర్ గేజిని తగిన కోణములో అమర్చాలి. అయితే కర్రవస్తువు గట్టిగా బిగింపబడి ఱంపము ప్రక్కలకు జారిపోకుండా వుండాలి.
5. రిబేటింగ్ :—
రిబేట్లను చేయటానికి కర్రవస్తువును ఆధారముగా రిప్పింగ్ ఫెన్స్ ను పెట్టుకొని టేబుల్ ను జరుపుకొని ఱంపము బ్లేడు తగినంత లోతుగా ఖండించినట్లు చేయాలి. కర్రవస్తువుయందు చీలికలో ఏర్పరుచునపుడు ఖండించిన కర్రభాగమును తొలగించుటకుగాను రెండు విధములుగా అమర్చి రెండుసార్లు కోయాలి.
6. చీలికలు చేయుట ( గ్రూవింగ్ ) :—
గ్రూవింగ్ పనికి రిప్పింగ్ బ్లేడును ఉపయోగించవచ్చును అయితే తగీనంత వెడల్పుగల చీలికను యేర్పరుచుటకు టేబుల్ ను జరుపుకుంటూ అనేక సార్లు కోయవలసివుంటుంది. ' డాడో హెడ్ 'ను ఉపయోగించినట్లయితే తగిన వెడల్పుతో ఒకసారి కోయవచ్చును కర్రవస్తువుకు ఆధారముగా రిప్పింగ్ ఫెన్స్ ని ఉపయోగించాలి.
7. ట్రెంచింగ్ ( అడ్డముగా చీలికలు చేయుట ) :—
కర్రవస్తువుయందు కణములు అమర్చబడిన దిశకు అడ్డముగా చీలికలు చేయుటను ' ట్రెంచింగ్ ' అంటారు. ఇందుకుగాను ' డాడో హెడ్ 'ను ఉపయోగించాలి లేదా క్రాస్ కట్ట్ ఱంపమును ఉపయోగించవచ్చును.
1.6 నునుపు చేసెడి యంత్రము ( sanding mechine ) :—
కర్రవస్తువును ఎక్కువగా నునుపుపరచుటకువుపయోగపడెడి యంత్రమును ' సాండర్ ' లేదా సాండింగ్ యంత్రము అని అంటారు. కర్రవస్తువును ప్లేన్ ద్వారా నునుపుపరచి పిదప సాండర్ పైన మరల నునుపు పరచినయెడల దాని నునుపుదనము హెచ్చి మెరుగుదిద్దబడును.
విద్యుత్ శక్తితో పనిచేయు సాండర్
యంత్రములు వివిద రకములుగా లభ్యమగు వీటన్నిటియందుకూడ రాపిడి పదార్ధమును కలిగిన కాగితము లేదా బట్ట ఉపయోగించబడుతుంది. కర్రవస్తువు ఉపరితలమును తగిలించియుంచి, దీనిని కదిలించుట ద్వారా కర్రవస్తువు ఉపరితలమునుండి అతి కద్దిగా కర్రపదార్ధము తొలగింపబడుట జరిగిఆ ఉపరితలము నునుపురచబడుతుంది. వివిధ రకముల సాండర్ యంత్రములను గురించి క్రింద వివరించనైనది.
1. డిస్క్ సాండర్ :—
దీని యందు రాపిడి పదార్ధమును కలిగిన పరికరము పళ్లెము ( డిస్క్ ) రూపమును కలిగియుండి సవ్యదిశలో గుండ్రముగా తిరుగుతుంది. సాండర్ వివిధ ముఖ్యభాగములు, అవి పనిచేయువిధానము క్రింద తెలుపబడింది.
1.డిస్క్ :—
ఇది మేలురకపు పోతయినుము లేదా అల్యూమిసియంతో చేయబడి, దానికి రాపిడి కాగితము అంటించబడియుంటుంది.
దీని వ్యాసము 210 నుండి 450 మి.మీ వరకు వుంటుంది.
2.స్టాండ్ :—
ఇది పోతయినుము లేదా గట్టి ఉక్కు లేదా కర్రతో చేయబడి మోటారు, టెబుల్ , డిస్క్ లు దీనికి బిగింపబడి వుంటాయి.
3. టేబుల్ :—
ఇది మేలురకపు పోతయినుము లేదా చేయబడి కర్రవస్తువును దీనిపై పెట్టుకొనుటకు వీలుగా వుంటుంది. దీనిని డిస్క్ వైపునకు 20॰ కోణములో, డిస్క్ నుండి దూరముగా 45॰ కోణము వరకు వంచుకని ఏటవాలుగా అమర్చవచ్చును.
4. మోటారు :—
డిస్క్ ను గుండ్రముగా త్రిప్పుకొనుటకుగాను అవసరపడెడి యంత్రశక్తి నిచ్చుటకుగాను విద్యుత్ మోటారు సాండర్ యంత్రమునకు బిగింపబడియుంటుంది. ఇది 0.5 నుండి 0.75 H.P. శక్తిని కలిగయుండి 1725 R.P.M తో పనిచేస్తుంది.
డిస్క్ సాండర్ వివిధ భాగములు పటము 1.51 లో చూపబడాయి.
No comments:
Post a Comment