1.6.1 డిస్క్ సాండర్ ను ఉపయోగించు విధానము :—
1. కర్రవస్తువును టేబుల్ పై అమర్చాలి.
2. చేతితో కర్రవస్తువును రాపిడి పళ్లెము వైపునకు జరిపి, దానికి తగులునట్లుగా చేయాలి.
3. చేతితో వస్తువును ముందుకు, వెనుకకు కదిలిస్తూ, గుండ్రముగా తిరిగెడి చక్రమునకు ఒక అంచునుండి, దాని కేంద్రభాగము వరకు మరియు వెనుకకు కదులునట్లు జరుపుతూరివాలి. ఈ విధంగా కర్రవస్తువును రాపిడి గావించినపుడు, టేబుల్ వైపునకు చక్రము కదిలెడి అంచు భాగమునుండి మాత్రమే వస్తువును కేంద్రభాగము వైపునకు కదలించాలి.
4. డిస్క్ సాండర్ పై చదునైన సమతలములను నునుపుపరచుట కష్టసాధ్యమైన పని. దీనికి కారణము చక్రము వెలుపలి భాగము, కేంద్రభాగముకన్న ఎక్కువ వేగముతో తిరుగుటయే దీనివలన వెలుపలి భాగమువైపు ఆనించియున్న కర్రవస్తుతలము నుండి హెచ్చు కర్రభాగము మరియు కేంద్రభాగమువైపు ఆనించియున్న కర్రవస్తుతలమునుండి కొద్ది కర్రభాగము తొలగింపబడుటవలన చదునైన ఉపరితలము యేర్పడదు.
5. ఏటవాలుగా తలములను నునుపుపరచుటకు టేబుల్ ను కావలసిన కోణములోనికి వంచవలసియుంటుంది.
2. స్పిండిల్ సాండర్ :—
దీనియందు రబ్బరు తొడుగును కలిగిన స్ధూపాకారపు కడ్డీ నిలువుగా అమర్చబడియుంటుంది. దీనిని
' స్పిండిల్ ' అంటారు. దీనికి రాపిడి పదార్ధమును కలిగిన గొట్టము బిగింపబడి యుంటుంది. స్పిండిల్ గుండ్రముగా తిరుగుతూ, పైకీ క్రిందకూ కదులుతుంది.
స్పిండిల్ సాండర్ క్రింద తెలుపబడిన వివిధ భాగములను కలిగియుంటుంది.
1. పీఠము ( Base ) :—
ఇది పోతయినుము లేదా గట్టి ఉక్కు లేదా మేలురకపు కర్రతో చేయబడియుండి, దానిపైన అమర్చబడిన విద్యుత్ మోటారు, టేబుల్ , స్పిండిల్ మరియు యితర అనుభంధకములకు ఆధారంగా వుంటుంది.
2. విద్యుత్ మోటారు :—
ఇది సుమారు 0.5 H.P ని కలిగియుండి 2500 R.P.M. తో తిరుగుచు స్పిండిల్ నకు కావలసిన యంత్రశక్తి నిస్తుంది.
3. టేబుల్ :—
ఇది పోతయినుముతో చేయబడి కర్రవస్తువును దీనిపైన పెట్టుకొని రాపిడి గావించుకొనెడి సదుపాయమును కలిగియుంటుంది.
4. స్పిండిల్ :—
ఇది మంచి ఉక్కుతో చేయబడి విద్యుత్ మోటారు నుండి యంత్రశక్తిని పొందుతుంది. ఇది గుండ్రముగా తిరుగుతూ దానిపైన అమర్చిన రాపిడి గొట్టమును గుండ్రముగా త్రిప్పుతుంది.
5. రబ్బరు స్పిండిల్ :—
దీనిపైన రాపిడి గొట్టము అమర్చబడియుంటుంది. ఇది స్పిండిల్ పైన అమర్చబడియుంటుంది.
6. ఇతర అనుబందకములు :—
స్పిండిల్ ను పైకీ, క్రిందకు కదిలించెడి వివిధభాగములు మరియు టేబుల్ ను ఏటవాలుగా అమర్చుకొనెడి వివిధ భాగములు కూడా స్పిండిల్ సాండర్ నకు బిగింపబడి వుంటాయి.
స్పిండిల్ సాండర్ వట్రుతలప అంచులను నునుపుపరచుటకు పనికివస్తుంది. దీని రాపిడి గొట్టము వ్యాసము 18 .మి.మీ. నుండి 75.మి.మీ. వరుకు మరియు పొడవు 150 .మి.మీ. నుండి 225 .మి.మీ. వరకు వివిధ సైజులలో వుంటుంది.
1.6.2 స్పిండిల్ సాండర్ ఉపయోగించుట :
1. ముందుగా కర్రవస్తువును టేబుల్ పై అమర్చాలి.
2. కర్రవస్తువును చేతితో గట్టిగా పట్టుకొని దానిని గుండ్రముగా తిరిగెడి స్పిండిల్ వైపునకు తగులునట్లు జరపాలి. కర్రవస్తువును తగిన దిశలో కదిలిస్తూ దాని వట్రుతలపు అంచు నునుపుపరచునట్లు చూడాలి. ( పటము 1.54 )
పైకీ, క్రిందకు కదిలెడి స్పిండిల్ వట్రుతలపు అంచుపైన ఏ విధమైన చీలికలు లేకుండా చూస్తూ అంచును నునుపుపరుస్తుంది.
3. డ్రమ్ సాండర్ :—
దీనియందు అడ్డముగా అమర్చబడిన పెద్ద సైజు స్థూకాపారపు స్పిండిల్ గుండ్రముగా తిరుగుతుంది. ఇది సుమారు 300 .మి.మీ. వ్యాసమును కలిగీయుండి, దాని ఉపరితలముపై రాపిడి పదార్థము తగిలింపబడియుంటుంది. పెద్ద సైజుగల ఈ స్పిండిల్ ను డ్రమ్ ( Drum ) అంటారు. స్పిండిల్ సాండర్ ను డ్రమ్ సాండర్ వలన వట్రుతల అంచులు, ఉపయోగించుట సమతలములు నునుపుపరచవచ్చును.
4. బెల్ సాండర్ :—
దీనియందు రాపిడి పదార్థము బెల్టు ఆకారమును కలిగియుండి దానికి ఆధారముగా బట్ట బెల్టు ఆకారములో అమర్చబడియుంటుంది. రాపిడి బెల్టు రెండు చక్రములపై తిరుగుతుంది. విద్యుత్ మోటారుతో గుండ్రముగా త్రిప్పబడెడి ఒక చక్రము ( దీనిని ' డ్రైవర్ చక్రము' అంటారు. ) బెల్టును కదిలిస్తుంది. రెండువవైపు గల చక్రము ( దీనిని ఐడిల్ చక్రము అంటారు. ) బెల్టు దిశను మార్చి, అది గుండ్రముగా తిరుగునట్లు చేస్తుంది. దీని బెల్టు నిలువుగా లేదా అడ్డముగా అమర్చబడియుంటుంది.
బెల్టు సాండర్ చదునైన వస్తుతలమును నునుపుపరుస్తుంది. దీని బెల్టు 100 నుండి 200 మి.మీ వరకు మరియు పొడవు 1.2 నుండి 7.8 మీటర్ల వరకు వుంటుంది. బెల్టు సాండర్ క్రింద సూచిపబడిన వివిధ భాగములను కలిగియుంటుంది.
1. స్టాండ్ :—
ఇది పోతయినుము లేదా గట్టి ఉక్కు లేదా గట్టి ఉక్కు లేదా మేలురకపు కర్రతో చేయబడి ఇతర యంత్రభాగములకు ఆధారముగా పనిచేస్తుంది.
2. టేబుల్ :—
దీనినే ' పీఠము ' అనికూడా పిలుస్తారు. దీనిపైన కూడా పిలుస్తారు. దీనిపైన కర్రవస్తువును పెట్టుకొని నునుపుపరుస్తారు. ఇది మేలురకపు ఉక్కుతో చేయబడియుంటుంది.
3. చట్రము :—
ఇది పోతయినుముతో చేరబడి చక్రములను టేబుల్ కు ఆధారంగా పనిచేస్తుంది.
4. చక్రములు :—
ఇవి మేలురకపు ఉక్కుతో చేయబడి పైన రబ్బరు తొడుగును కలిగి యుంటాయి. ఒక చక్రము బెల్టును గుండ్రముగా త్రిప్పితే, రెండవ చక్రము ( Idle Pully ) బెల్టు బిగువును సమపరచుటకు, దాని దిశమార్చి గుండ్రముగా త్రిప్పుటకు ఉపకరిస్తుంది.
5. ఇతర అనుబంధములు :—
కర్రపొట్టును తొలగించు అనుబందము ( దీనిని ' డస్ట్ డిఫ్లెక్టర్ ' అంటారు. ) బెల్టు, పుల్లీల పైన అమర్చెడి రక్షక సాధనములు మొదలగునవి కూడా యంత్రమునకు అమర్చబడి వుంటాయి.
1.6.3 బెల్టు సాండర్ ను ఉపయోగించుట :
1. ముందుగా కర్రవస్తువును టేబుల్ పై అమర్చాలి.
2. పిదప యంత్రమును పనిచేయిస్తూ ( అనగా బెల్టు గుండ్రముగా తిరుగునట్లు చేస్తూ ), కర్రదిమ్మతో కదిలెడి బెల్టును కర్రవస్తువుతలముపై నొక్కిపెట్టాలి. పటము ( 1.59 )
3. టేబుల్ పై కర్రవస్తువును కదిలిస్తూ, మరియు చేతితో పట్టుకొని కర్రదిమ్మను బెల్టుపై కదిలిస్తూ కావలసిన రీతిలో వస్తువునునుపుపరచాలి.
పైన తెలిపిన యంత్రములు స్థిర యంత్రములు. ఇవి ఒక ప్రదేశములో ( అనగా వర్క్ షాప్ లో ) నెలకొల్పబడిన యంత్రములు. వీటిని ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు కదిలించలేము. అయితే కావలసిన ప్రదేశమునకు సాండర్ ను తీసుకొనిపోయి పనిచేయుటకు వీలుకలిగించు యంత్రములుకూడా లభ్యమగును. వీటిని
' పోర్ట్ బుల్ సాండర్ ' ( Portable sander ) అంటారు. వీటిలో డిస్క్ సాండర్ , బెల్టు సాండర్ మొదలగు వివిధరకములు కలవు ఇవి పనిచేయు విధానముపైన తెలిపిన స్ధిర యంత్రముల మాదిరిగానే వుంటుంది. అయితే ఇవి చిన్న సైజులో చేయబడి, తక్కువ భారముల దూర ప్రదేశములకు తేలికగా తీనుకొనిపోవు సదుపాయమును కలిగివుంటది. పటము 1.59 లో పోర్ట్ బుల్ సాండర్ చూపబడింది.
6.4 సాండర్ ను ఉపయోగించునపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. కర్రవస్తువును పట్టుకొన్న చేతివ్రేళ్లు కదులుచున్న రాపిడి పదార్ధమునకు తగలకుండా చూడాలి.
2. డిస్క్ సాండర్ నందు చక్రము టేబుల్ వైపునకు కదిలెడి అంకునుండి కేంద్రభాగమువరకుగల మధ్యభాగమును మాత్రమే నునుపుపరచడానికి వుపయోగించాలి. ( అనగా యీ భాగమునకు మాత్రమే కర్రవస్తు తలమును ఆనించియుంచాలి. )
3. పోర్ట్ బుల్ సాండర్ యొక్క రాపిడి భాగముపై ఆనించి దానిని నిలబెట్టి యుంచినపుడు యంత్రమును ' స్టార్టు ' చేయరాదు. దానిని ప్రక్కగా పడుకొనబెట్టి స్టార్టు చేయాలి.
4. . పోర్ట్ బుల్ సాండర్ యందు విద్యుత్ మోటారునకు కలిపిన ఎలక్ర్టిక్ తీగ ( వైర్ ), రాపిడి భాగము క్రిందకి రాకుండా చూడాలి. లేదా కదిలెడి రాపిడి భాగమునకు తగులుకొని చిక్కుపడకుండా చూడాలి.
1.7. ప్లేనింగ్ యంత్రము :
కర్రవస్తువు మందమును తగ్గించుచు దాని ఉపరితలమును చదును పరిచెడి యంత్రమును ' ప్లేనర్ ' లేదా ' ప్లేనింగ్' యంత్రము అంటారు. దీని యందు గుండ్రముగా తీరిగెడి స్ధూపాకారపు ' కట్టర్ హెడ్ ' ( Cutter head ) అను భాగమునకు మూడు చాకలు అమర్చబడివుంటవి. ఇవి యంత్రముపై చదును చేయబడు కర్రవస్తువు గరిష్ట వెడల్పునకు సమానముగా వెడల్పును కలిగివుంటవి. ఇవికూడక ట్టర్ హెడ్ తో పాటు 3600 నుండి 7200 R.P.M. వేగముతో తిరుగును. వీటి అడుగు భాగమున అమర్చబడిన కర్రవస్తు మొత్తము వెడల్పు ఉపరితలమును యివి ఒకేసారి ఖండిస్తూ దానిని చదునుపరుస్తాయి.
ప్లేనింగ్ యంత్రముల సైజు యంత్రముపై చదునుపరచబడు కర్రవస్తు గరిష్ట వెడల్పును సూచిస్తుంది. సాధారణంగా వాడబడెడి ప్లేనర్ సైజులు 300 మి.మీ. 600 మి.మీ. 900 మి.మీ.
1.7.1 ప్లేనర్ వివిధ భాగములు :—
ప్లేనింగ్ యంత్రము వివిధ భాగములు, పనీచేయు విధానము గురించి క్రింద వివరించనైనది.
1. పీఠము లేదా బెడ్ :—
ఇది పోతయిమనుముతో చేయబడి దీనిపైన యితర యంత్రభాగములు అమర్చబడివుంటవి.
2. ఫ్రేమ్ లేదా చట్రము :—
పీఠము పైన ఫ్రేమ్ అమర్చబడి దీనికి టేబుల్ , ఫీడ్ రోలర్లు, కట్టర్ హెడ్ మొదలగు భాగములు బిగింపబడివుంటుంది. ఇది పోతయిమనుము లేదా మేలురకపు ఉక్కుతో చేయబడి వుంటుంది.
3. టేబుల్ :—
ఇది పోతయిమనుము లేదా గట్టి ఉక్కుతో చేయబడి వస్తువు ఖండిపబడినపుడు దానికి ఆధారముగా పనికివస్తుంది. టేబుల్ పైన వస్తువును పెట్టుకొని ప్లేనింగ్ చేస్తారు. కర్పవస్తువును ఖండిచెడి లోతు ఖండిచెడి చాకు ( బ్లేడు ) మరియు టేబుల్ నకు మధ్యగల ఖాలిస్థలముపై ఆధారపడియుంటుంది. కర్రవస్తువును బెడ్ ఉపరితలమునకు సమాతరంగా ఖండింపబడుతుంది.
4. ఫీడ్ రోలర్లు :—
కర్రవస్తువును యంత్రములోనికి ( అనగా ఖండించెడి బ్లేడుల క్రింద భాగమునకు ) పంపించుటకు ఫీడ్ రోలర్లు ఉపయోగిస్తాయి. ఇవి మేలురకపు ఉక్కుతో చేయబడి వుంటవి.
5. కట్టర్ హెడ్ :—
ఇది మేలురకపు ఉక్కుతో చేయబడి ఖండించెడి మూడు బ్లేడులను కలిగియుంటుంది.
6. బ్లేడులు :—
ఇవి గట్టి ఉక్కుతో చేయబడి కర్రవస్తువును వేగంగా ఖండించటానికి వుపయోగిస్తారు.
7. డెలవరీ రోలర్లు :—
ఇవి మేలురకపు ఉక్కుతో చేయబడి కర్రవస్తువును యంత్రమునుండి బయటకుతీయుటకు ఉపకరీస్తాయి.
8. చేతితో త్రిప్పుకొనెడి చక్రము :—
దీనినిత్రిప్పుటద్వారా టేబుల్ ను పైకీ క్రిందకూ కదిలించవచ్చును. ఈ విధంగా చేయుటవలన టేబుల్ పైన పెట్టుబడిన కర్రవస్తువు ఖండించెడి బ్లేడులవైపు లేదా వాటినుండి దూరంగా క్రిందకు కదులుతుంది. దీనివలన బ్లేడు ఖండించినపుడు కర్రలోనికి దిగెడి లోతును క్రమబద్ధము చేసుకొనుట సాధ్యపడుతుంది.
9. ఫీడ్ సెలెక్టర్ :—
కర్రవస్తువు యంత్రంలోనికి ప్రవేశించి దాని ఉపరితలము బ్లేడుల క్రిందకి వచ్చు వేగమును ' ఫీడ్ ' ( Feed ) అంటారు. కర్రగట్టిదనమునుబట్టి మరియు చదును పరిచినపుడు దాని ఉపరితలము పై కావలసిన నునుపుదనమునుబట్టి దాని ' ఫీడ్ 'ను క్రమబద్దము చేసుకొనాలి. తక్కువ ఫీడ్ తో కదిలెడి కర్రవస్తువు ఎక్కువ నునుపుదనమును పొందగలుగుతుంది. సాధారణంగా ఫీడ్ ఒక నిమిషమునకు 5 నుండి 15 మీటర్ల వరకు వుంటుంది. దీనిని క్రమబద్దము చేసుకొనుటకుగాను ఫీడ్ సెలెక్టర్ అనబడు చక్రము వుంటుంది. దీనిని త్రిప్పుకొని ఫీడ్ ను మార్చుకొనవచ్చును.
10. మందమును సూచించు సూచిక :—
కర్రవస్తువును యంత్రముపై అమర్చి ప్లేనింగ్ చేసుకొనినపుడు చదునుచేసిన తదుపరి దాని మందము ఎంత వుంటుందో సూచించు గేజిని ' మందమును తెలిపెడి గేజి ' అంటారు. ఇది ఫ్రేమ్ పై టేబుల్ కు ప్రక్కగా అమర్చబడి వుంటుంది.
11. విద్యుత్ మోటారు :—
కట్టర్ హెడ్ ను, ఫీడ్ మరియు డెలవరీ రోలర్లను త్రిప్పుటకుగాను విద్యుత్ మోటారు ఉపయోగిస్తుంది. దీని సైజు ప్లేనర్ సైజు పై ఆధారపడి యుంటుంది. ఉదాహరణకు 300 మి.మీ. సైజు యంత్రమునకు 3 H.P. మోటారు మరియు 900 మి.మీ. సైజు యంత్రమునకు 5 H.P. మోటారు కావలసివస్తుంది. పెద్దసైజు యంత్రములలో రెండు విద్యుత్ మోటార్లు వుంటాయి. ఒక మోటారు కట్టర్ హెడ్ ను పనిచేయిస్తే, రెండవ మోటారు ఫీడ్ మరియు డెలవరీ రోలర్లను త్రిప్పుతుంది.
ఇవికాకుండా కర్రను ఖండించునపుడు వెలువడు కర్రముక్కలను విడిచి వాటిని ప్రక్కకు తొలగించుటకుగాను ' చిప్ బ్రేకర్ ' ( Chip breaker ) మరియు కర్రవస్తువును బ్లేడు ఖండించునపుడు, అది బ్లేడునుండి తొలగిపోకుండా దానిని టేబుల్ పై గట్టిగా అదిమి పెట్టుటకుగాను ' ప్రెషర్ బార్ ' ( Pressure bar ) అనబడు సాధనములు యంత్రముపై అమర్చబడి వుంటవి.
1.7.2 ప్లేనర్ ను ఉపయోగించు విధానము :—
కర్రవస్తువు పొడవు 300 మి.మిా. కన్నా మరియు మందము 6 మి.మిా. కన్నా తక్కువ యున్నపుడు దాని ఉపరితలములను చదును చేయుటకు ప్లేనర్ ను ఉపయోగించరాదు. ప్లేనర్ యందు ఉపయోగించెడి కర్రవస్తువు శుభ్రముగా వుండాలి. దానిపైన పెయింట్ , కర్రపొట్టు మరియు యితర మలిన పదార్థములు వుండరాదు.
1. ముందుగా టేబుల్ ను పైకీ లేదా క్రిందకు జరుపుకొని కట్టర్ హెడ్ , టేబుల్ కు మధ్య తగినంత ఖాళీస్థలము యేర్పడునట్లు చూడాలి. కర్రవస్తువును మందము మరియు దాని గట్టిదనమునుబట్టి యీ ఖాళీస్థలము నిర్దేశింపబడుతుంది.మెత్తని కర్రను లేదా తక్కువ వెడల్పుగల కర్రపలకను చదునుచేయునపుడు ఎక్కువ లోతుగా ఖండించవచ్చును. ఎక్కువ వెడల్పుగల కర్రను లేదా గట్టి కర్రను చదునుచేయునపుడు తక్కువ లోతుగా ఖండించాలి. సాధారణంగా ఖండిచెడి లోతు 1.5 మి.మీ. కంటే ఎక్కువ వుండరాదు. టేబుల్ ను పైకీ లేపుటకు ఉపయోగించు చక్రమును ఒకచుట్టు త్రిప్పినచో అది టేబుల్ ను 1.5 మి.మీ. పైకీ లేపుతుంది.
2. కర్రవస్తువుయందు కణముల అమరికను పరిశీలించాలి. కణముల అమర్చబడిన దిశను గమనించి, ఆదిశలోనే కర్రను యంత్రములోనికి ప్రవేశపెట్టాలి.
3. కర్రవస్తువును కట్టర్ హెడ్ కు లంభదిశలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
4. ఒకసారి చదునుచేయబడిన కర్రవస్తువును మరల యంత్రమునందు ప్రవేశపెట్టాలి. ఈ విధంగా చేస్తూ తగినంత మందము ఏర్పడునట్లు చూడాలి. పిదప కర్రవస్తువు రెండవ ఉపరితలమును కూడా చదునుచేసి, ఆ రెండు తలములు సమాతరంగా వుండేట్లుగా చేయాలి.
5. పొడవైన కర్రపలకను చదునుచేయునపుడు రెండువైపులా దానికి ఆధారము కల్పించాలి. అంతేకాని వంగిపపోవుట, నేలను తాకుట జరగకూడదు.
6. యంత్రము నుపయోగించినపుడు చేతులు ఫీడ్ రోలర్లకు దూరంగా వుంచాలి. కర్రవస్తువు ఒకవైపుగా నిలబడి దానిని యంత్రములోనికి ప్రవేశపెట్టుట లేదా బయటకు తీసుకొనుటచేయాలి.
7. పనిచేయునపుడు కర్రవస్తువు యంత్రములో చిక్కుకొనియెడల వెంటనే యంత్రమును ఆపివేయాలి. యంత్రము పూర్తిగా ఆగినపిదప టేబుల్ ను క్రిందకు కదిలించి కర్రవస్తువును బయటకుతీయాలి.
8. తడిగావున్న కర్రవస్తువును చదునుపరచనపుడు టేబుల్ పై కిరోసిన్ లేదా మైనం పూయాలి.
1.8 గ్రైండింగ్ యంత్రము :
కర్రపనియందు వుపయోగించు వివిధ పనిముట్లు ఖండించెడి అంచులను పదును పెట్టుటకు గ్రైండింగ్ యంత్రము ఉపకరిస్తుంది. దీనినే గ్రైండర్ అనికూడా అంటారు.
దీనియందు రాపిడి పదార్ధము చిన్నచిన్న ముక్కలుగా చేయబడి తగిన బాండింగ్ ( Bonding ) పదార్ధముచే కలపబడి చక్రము ఆకారములో చేయబడియుంటుంది. దీనినే ' గ్రైండింగ్ చక్రము ' అంటారు. విద్యుత్ మోటారు షాఫ్ట్ కు కలుపబడిన గ్రైండింగ్ చక్రము, దానినుండి యంత్రశక్తిని పొంది వేగంగా గుండ్రముగా తిరుగుతుంది. ఈ విధముగా తిరిగెడి చక్రమునకు పనిముట్టు అంచును తగీలించి నొక్కి పెట్టుట ద్వారా, రాపిడి పదార్ధము ఆ అంచు భాగమునగల లోహపదార్ధమును ఖండిస్తూ దానివి పదును పెట్టుటయే కాకుండా తగిన రూపములోనికి తెచ్చుటకు వుపయోగిస్తుంది. గ్రైండింగ్ చక్రము పైగల ప్రతి రాపిడి పదార్ధము ముక్క ఒక చిన్న పదునైన మొనవలె పనిచేస్తూ అంచుభాగపు లోహ పదార్ధమును తొలగిస్తుంది. గ్రైండింగ్ చక్రము 400 నుండి 3600 R.P.M. వేగముతో తిరుగుతుంది.
గ్రైండింగ్ యంత్రములు వివిధ రకములుగా లభ్యమగుతవి. అయితే పనిముట్లను పదును పెట్టుకొనెడి గ్రైండింగ్ యంత్రమును ' టూల్ మరియు కట్టర్ గ్రైండర్ ' (Tools and cutter grinder ) అంటారు. దీనిని బెంచి పైన గాని ( బెంచి గ్రైండరు ) లేదా నేలపై స్టాండు ద్వారా గాని ( ఫ్లోర్ గ్రైండరు ) నెలకొల్పవచ్చును.
8.1 బెంచి గ్రైండరు వివిధ భాగములు :
బెంచి గ్రైండరు పేర్కొనబడిన వివిధ భాగములను కలిగియుంటుంది.
1. బేస్ లేదా పీఠము :—
గ్రైండరు యొక్క వివిధ భాగములకు యిది ఆధారముగా పనిచేస్తుంది. ఇది వర్క్ బెంచికి బోల్టుల ద్వారా బిగింపబడియుంటుంది. ఫ్లోర్ గ్రైండరు యందు పీఠము స్ధానే స్టాండ్ వుంటుంది. ఇది అడుగు భాగమున నేలకు బిగింపబడి, పైన గ్రైండర్ ను కలిగియుంటుంది.
2. విద్యుత్ మోటారు :—
ఇది 1 H.P. దాకా శక్తిని కలిగియుండి గ్రైండర్ చక్రమును గుండ్రముగా త్రిప్పుటకు కావలసిన యంత్రశక్తినిస్తుంది.
3. స్పిండల్ :—
ఇది మోటారు షాఫ్ట్ కు కలుపబడి దీనిపైన గ్రైండింగ్ చక్రము బిగింపబడియుంటుంది. ఇది గుండ్రముగా తిరుగుట ద్వారా దీనిపై నగల గ్రైండింగ్ చక్రము కూడా తిరుగుతుంది. దీనినే ఆర్బర్ ( Arbor ) అంటారు. ఇది మేలురకపు ఉక్కుతో చేయబడియుంటుంది.
4. ' గ్రైండింగ్ చక్రము :—
దీనినే ' రాపిడి చక్రము ' ( Abrsive wheel ) అనవచ్చును. దీనియందు వుపయోగించు రాపిడి పదార్ధము ' అల్యూమినియం ఆక్సైడ్ ' లేదా' సిలికాన్ కార్బైడ్ ' ను కలిగియుంటుంది. చిన్ చిన్న ముక్కలుగా చేయబడిన రాపిడి పదార్ధము యొక్క పరిమాణము సైజును బట్టి వివిధ రకముల గ్రైండింగ్ చక్రము కలవు. రాపిడి పదార్ధము సైజు తక్కువగా వున్నయెడల అది మృదువైన ( Fine ) గ్రైండింగ్ చక్రముగా, సైజు ఎక్కువగా యున్నయెడల అది రఫ్ ( ముతక ) గ్రైండింగ్ చక్రముగా పరిగణింపబడీతుంది. రాపిడి పదార్ధము సైజును సూచించెడి సంఖ్యను
' గ్రిట్ సంఖ్య ' ( Grit Number ) అంటారు. అదే విధముగా రాపిడి పదార్ధము ముక్కలను కలిపెడి బాండింగ్ పదార్ధము యెక్క దారుఢ్యతనుబట్టి కూడా రకరకముల
గ్రైండింగ్ చక్రములున్నాయి. దీనిని సూచించెడి అక్షరమును ' గ్రేడ్ ' ( Grade ) అంటారు. ఈ రెండు గుర్తులు గ్రైండింగ్ చక్రముపై గుర్తింపబడివుంటవి. లేదా తయారీదారు కేటలాగులో సూచింపబడివుంటవి. కర్రపనియందు వుపయోగించు గ్రైండింర్ చక్రము గ్రేడ్ ( N ) మరియు గ్రిట్ సంఖ్య 46 నుండి 60 వరకు వుండవలయును.
గ్రైండింగ్ చక్రము వివిధ ఆకారములలో లభ్యమగుతుంది. గుండ్రని పళ్లెము ఆకారము చక్రము వృత్తా కారపు అంచు చదునుగా లేదా ఏటవాలుగా ( Trapperd ) వుండవచ్చును. గిన్నె ( Dish ) లేదా సాసర్ ( Saucer ) ఆకారము చక్రములు మరియు స్ధూపకారపు చక్రములకూడ లభ్యమగుతవి. వీటిలో చదునుగా వున్న అంచుగల చక్రము ఒకవైపు మరియు ఏటవాలు అంచుగల చక్రము రెండవవైపు విద్యుత్ మోటారు షాఫ్ట్ నకు బిగించిన స్పిండిల్ పైన అమర్చబడివుంటవి.
5. టేబుల్ :—
ఇది పోతయినుముతో చేయబడి గ్రైండింగ్ చేయునపుడు కర్రవస్తువును దీనిపై పెట్టుకొనుటకు వుపయోగిస్తుంది.
6. రక్షక చట్రము :—
దీనినే గార్డ్ ( Guard ) అంటారు.ఇది పోతయినుముతో లేదా ఉక్కుతో చేయబడి, రెండు చక్రముల చుట్టు పై భాగమున బిగింపబడి యుంటుంది. తిరుగుచున్న చక్రముల ద్వారా పనిచేయు వ్యక్తికి యేవిధమైన హాని కలగకుండా యీ సాధనము కాపాడుతుంది.
ఇది కాకుండా గ్రైండింగ్ చేయు వ్యక్తి కండ్లకు రక్షక అద్దములు ( Safty glasses ) ఉపయోగించుట మంచిది.
ఈ రెండు రక్షక సాధనముల ద్వారా గ్రైండ్ చేయునపుడు పనిముట్టు అంచునుండి విడదీయబడిన లోహపు ముక్కలు ఎగిరి కండ్లలో పడకుండా వుంటుంది.
1.8.2 గ్రైండింగ్ యంత్రము సైజు :—
గ్రైండింగ్ యంత్రము సైజు దానిపై గల గ్రైండింగ్ చక్రము యొక్క వ్యాసము ఆధారముగా నిర్ణయింపబడుతుంది.
1.8.3 గ్రైండింగ్ యంత్రమును ఉపయోగించుట :
1. కర్రపనియందు వుపయోగించు ఉలి, గౌజు, ప్లేనర్ బ్లేడు మొదలగు పనిముట్ల పదునైన అంచు ఏటవాలుతలములతో యేర్పడి 20 నుండి 30 డిగ్రీల కోణములో వుంటుంది. ఎంత కోణములో ఇది యేర్పరచబడి వుండాలి అన్నది ఖండింపబడెడి కర్రవస్తువు గట్టిదనాన్ని బట్టి వుంటుంది. 20 డిగ్రీల కోణముగల అంచు పదునుగా వుంటుంది. అయితే యిది గట్టి కర్రను ఖండించునపుడు త్వరగా మొద్దుబారిపోతుంది.
కాబట్టి ముందుగా ఎంత కోణములో పదునైన అంచును యేర్పరచాలి అన్నది నిర్ణయించుకొనాలి.
2. ముందుగా పదునైన తిన్నని అంచును గ్రైండ్ చేయాలి. ఇందుకుగాను టేబుల్ ను ( దీనినే ' పనిముట్టు ఆధారపు పలక ' అనవచ్చును. ) చక్రము మధ్య ( కేంద్ర ) భాగముకన్న కొద్దిగా తక్కువ ఎత్తులో అమర్చాలి. దీనిపై పనిముట్టును పెట్టుకొని దాని తిన్నని అంచును గ్రైండింగ్ చక్రము వైపునకు జరిపి కొద్దిగా నొక్కిపెట్టి వుంచాలి. ఎక్కువ పీడనముతో పనిముట్టును నొక్కిపెట్టినయెడల దాని అంచు అధికంగా వేడెక్కుతుంది. ఈ విధముగా గ్రైండింగ్ చేయుటను ' సెంటర్ గ్రైండింగ్ ' అంటారు.
3. పిదప పదునైన అంచువద్దగల ఏటవాలు తలమును గ్రైండ్ చేయుటకుగాను టేబుల్ ను చక్రము మధ్య భాగముకన్న కొద్ది ఎత్తులో ఏటవాలు అమర్చాలి. దీనిపై పనిముట్టును పెట్టుకొని పనిముట్టు ఏటవాలు అంచు గ్రైండింగ్ చక్రమునకు తగులునట్లు జరిపి చేతితో నొక్కిపెట్టుచు గ్రైండింగ్ చేయాలి. దీనినే ' బివెల్ గ్రైండింగ్ ' అంటారు.
4. గ్రైండింగ్ చేయునపుడు మధ్య మధ్యలో పనిముట్టు అంచులను నీళ్ళలో ముంచి చల్లార్చి తిరిగి గ్రైండింగ్ చేస్తూరావాలి.
5. టేబుల్ ను ఉపయోగించకుండా పనిముట్టును చేతితో మాత్రమే పెట్టుకొని గ్రైండింగ్ చేయునపుడు దాని అంచు గ్రైండింగ్ చక్రమును తగిలెడి స్థానము గ్రైండింగ్ చక్రము కేంద్రభాగముకన్నా క్రిందుగా వుండాలి.
1.9 డ్రిల్లింగ్ యంత్రము :
కర్రవస్తువుయందు సరియైన రంధ్రములను ఖచ్చితంగా మరియు త్వరితముగా యేర్పరుచుటకుగాను డ్రిల్లింగ్ యంత్రము రూపొందింపబడింది. అయితే దీనిపైన కేవలము రంధ్రములు చేయుటయే కాకుండా రంధ్రముల సైజును పెంచుట, కర్రవస్తువుయందు చీలికలు చేయుట, దానిని నునుపు పరచుట మొదలగు పనులుకూడా చేసుకొనవచ్చును. ఇందుకుగాను వివిధ రకములైన అనుబంధములను డ్రిల్లింగ్ యంత్రమునకు అమర్చవలసియుంటుంది. డ్రిల్లింగ్ యంత్రముతోబాటు యీ అనుబంధములను అవసరమైనయెడల కొనుగోలుచేసుకొనవచ్చును.
1.9.1 డ్రిల్లింగ్ యంత్రము పనిచేయు విధానము :
కర్రవస్తువుయందు రంధ్రములను చేయుటకుగాను డ్రిల్లింగ్ యంత్రమునకు అమర్చెడి పనిముట్టును ' డ్రిల్ బిట్టు ' లేదా ' ట్విస్ట్ డ్రిల్ ' అంటారు. దీనినుపయోగించి వస్తువుయందు రంధ్రములను చేయుటను ' డ్రిల్లింగ్ ' అని అంటారు.
డ్రిల్లింగ్ యంత్రముయందు డ్రిల్ బిట్ట్ ను నిలువుగా యుండునట్లు అమరుస్తారు. కడ్డీ ఆకారపు డ్రిల్ బిట్ట్ అడుగు భాగమున కర్రవస్తువును ఖండించుటకుగాను రెండు పదునైన అంచులు యేర్పడబడి వుంటవి. ఏటవాలుగా యున్న యీ అంచులు కలిసెడి భాగమును ' మొన ' అంటారు. డ్రిల్లింగ్ యంత్రము టేబుల్ పైన అమర్చిన కర్రవస్తు ఉపరితలమునకు డ్రిల్ బిట్ట్ మొన తగులునట్లుగా అమర్చుతారు. బిట్ ను గుండ్రముగా తిరుగునట్లు డ్రిల్లింగ్ యంత్రమునకు అమర్చిన విద్యుత్ మోటారు తోడ్పడుతుంది. వేగంగా తిరిగే డ్రిల్ బిట్ట్ ను క్రమక్రమంగా వస్తువులోనికి దింపుటకుగాను దానిని నిలువుగా క్రిందకు కదలించుటకుగాను యంత్రమునకు అమర్చిన హాండిల్ తోడ్పడుతుంది. వేగంగా తిరుగుతూ క్రిందకు కదిలెడి డ్రిల్ బిట్ట్ , దాని వ్యాసమునకు సమానమైన రంధ్రమును చేస్తూ కర్రవస్తువులోనికి దిగుతుంది. డ్రిల్ బిట్ట్ తిరిగెడి వేగము 300 నుండి 7000 R.P.M. వరకు వుంటుంది. కావలసిన వేగములో డ్రిల్ బిట్ట్ ను త్రిప్పుకొనెడి సదుపాయము బెల్టు, పుల్లీలద్వారా అమర్చబడి యుంటుంది.
1.9.2 డ్రిల్లింగ్ యంత్రపు వివిధ భాగములు :
డ్రిల్లింగ్ యంత్రము వివిధ భాగములు, అవి పనిచేయు విధానము క్రింద వివరింపబడింది.
1. పీఠము :—
ఇది పోతయినుముతో చేయబడి యంత్రపు అన్ని భాగములకు ఆధారముగా పనిచేస్తుంది.
2. కాలమ్ :—
ఇది మేలురకపు ఉక్కుతో చేయబడి స్థూపాకారమును కలిగియుండి నిలువుగా పీఠము పైన బిగింపబడి యుంటుంది. దీనికి టేబుల్ , మోటారు, స్పిండిల్ హెడ్ మొదలగు భాగములు బిగింపబడి వుంటాయి.
3. టేబుల్ :—
ఇది పోతయినుముతో చేయబడి కాలమ్ కు బిగీంపబడియుంటుంది. దీనిని కాలమ్ పైకీ, క్రిందకూ జరుపుకొని కావలసిన ఎత్తులో అమర్చుకొనవచ్చును. కొన్ని యంత్రములలో దీనిని ఏటవాలుగా అమర్చుకొనే సదుపాయమును కలిగివుంటాయి. టేబుల్ పైన కర్రవస్తువును పెట్టుకొని డ్రిల్లింగ్ చేయాలి.
4. చక్ :—
ఇది మేలురకపు ఉక్కుతో చేయబడి, కదిలెడి మూడు జాలను ( Jaws ) కలిగియుంటుంది. ఈ జాలమధ్య అది డ్రిల్ బిట్ ను అమర్చి, వాటిని దగ్గరగా జరుపుటవలన జాలమధ్య అది బిగింపబడుతుంది. జాలను కదిలించుటకుగాను చక్ కీ ( Key ) ఉపయోగిస్తుంది.
5. హాండ్ లివర్ :—
ఇది పోతయినుముతో లేదా ఉక్కుతో కడ్డీ ఆకారములో చేయబడి స్పిండిల్ ను పైకీ, క్రిందకూ కదిలించుటకు ఉపకరిస్తుంది.
6. క్వీల్ :—
ఇది మేలురకపు ఉక్కుతో చేయబడి గుండ్రముగా తిరిగెడి, డ్రిల్ బిట్, నిలువుగా కదులుటకు దోహదము చేస్తుంది.
7. డెప్త్ గేజి :—
కర్రవస్తువుయందు చేయబడు రంధ్రము లోతును క్రమపరచుటకు ఈ పరికరము ఉపయోగిస్తుంది. దీనిని సరిగా అమర్చుకొని స్పిండిల్ కదలికను ఎక్కువ లేదా తక్కువ చేసుకొని, తద్వారా రంధ్రము లోతును ఎక్కువ లేదా తక్కువ చేసుకొనవచ్చును. ఇది స్పిండిల్ హెడ్ కు అమర్చబడియుంటుంది.
8. స్పిండిల్ హెడ్ :—
ఇది పోతయినుముతో చేయబడి బేరింగులు, బెల్టు పుల్లీలను కలిగియుంటుంది. స్పిండిల్ దీనికి బిగింపబడియుంటుంది. ఇది కాలమ్ కు పై భాగమునకు అడ్డముగా అమర్చబడియుంటుంది.
9. విద్యుత్ మోటారు :—
ఇది 0.5.H.P. వరకు శక్తిని కలిగియుండి స్పిండిల్ ను వేగంగా త్రిప్పుటకు కావలసిన యంత్రశక్తినిస్తుంది.
10. కోన్ పుల్లీలు :—
ఇది వివిధ వ్యాసములు చక్రముల ఒకదాని ప్రక్కగా ఒకటి వుండునట్లు ఒకే భాగముగా చేయబడియుంటుంది. బెల్టు వీటిలో ఏదో ఒక చక్రముమీద అమర్చినపుడు దాని సైజునుబట్టి స్పిండిల్ తిరుగు వేగము ఆధారపడి యుంటుంది. అనగా స్పిండిల్ ను వివిధ వేగములలో త్రిప్పుటకు కోన్ పుల్లీ ఉపయోగిస్తుంది. మోటారు షాఫ్ట్ కు ఒక కోన్ పుల్లీ మరియు స్పిండిల్ కు మరియొక కోన్ పుల్లీ బిగింపబడి వాటిమీదుగా బెల్టు అమర్చబడియుంటుంది.
పైన తెలిపిన భాగములే కాకుండా, V— బెల్టు, స్పిండిల్ లాక్ , రక్షక సాధనములు మొదలగునవి కూడా డ్రిల్లింగ్ యంత్రముపై అమర్చబడివుంటవి.
డ్రిల్లింగ్ యంత్రము సైజు స్పిండిల్ మధ్యభాగమునుండి కాలమునకుగల దూరమునుబట్టి నిర్ణయింపబడుతుంది. దీనిని వ్యిసమువలె పేర్కొంటారు. బెంచి డ్రిల్ యంత్రము సైజు 275 మి. మీ. నుండి 425 మి. మీ. వరకు వుంటుంది. స్పిండిల్ క్రిందకు కదిలెడి దురమును స్ర్టోక్ అంటారు. సాదారణ డ్రిల్లింగ్ యంత్రములు 100 మి. మీ. నుండి 125 మి. మీ. వరకు స్ర్టోకును కలిగియుంటాయి. టేబుల్ సైజు 250 మి. మీ.x 250 మి. మీ. లేదా
250 మి. మీ.x 350 మి.మీ. వ్యాసముతో వృత్తాకారపు ఆకారమును కలిగియుంటుంది.
1.9.3 డ్రిల్లింగ్ యంత్రమును ఉపయోగించు విధానము :—
డ్రిల్లింగ్ యంత్రము వివిధ పనులకు ఉపయోగించవచ్చని తెలుసుకున్నాము. ముందుగా కర్రవస్తువుయందు రంధ్రములను చేయుటకు డ్రిల్లింగ్ యంత్రము ఉపయోగించు విధానముగురించి తెలుసుకుందాము.
( a ) డ్రిల్ బిట్ ను స్పిండిల్ కు అమర్చుట :—
1. కర్రవస్తువుయందు చేయవలసిన రంధ్రము సైజును ( వ్యాసమును ) బట్టి తగిన సైజుగల డ్రిల్ బిట్ ను ఎన్నికచేసుకొనాలి.దీని షాంక్ గుండ్రముగా వుండాలి.
2. చక్ కు కీని అమర్చి దాని జాలను విడదీయునట్లు ' కీ ' ను అపసవ్యదిశలో త్రిప్పాలి. విడదీసిన జాల మధ్యగల ఖాళీస్థలము డ్రిల్ బిట్ షాంక్ కన్నా ఎక్కువ వుండునట్లు చూడాలి.
3. జాల మధ్యగల ఖాళీస్థలములో డ్రిల్ బిట్ షాంక్ ను అమర్చి , కీని సవ్యదిశలో త్రిప్పుట ద్వారా జాలను దగ్గరగా జరిపి అవి డ్రిల్ బిట్ ను బిగుతుగా పట్టుకునేట్లు చూడాలి.
4. చక్ నుండి కీని తీసివేయాలి. ఆపిదప మిగిలిన పనులు చేయాలి.
5. కొన్ని డ్రిల్లింగ్ యంత్రములయందు స్పిండిల్ లోపలిభాగమున స్లీప్ బిగింపబడియుంటుంది. గొట్టము ఆకారము స్లీవ్ లోభాగము ఏటవాలుగా ( దీనిని ' టేపర్ ' అంటారు. ) వుంటుంది. దీనిలో బిగించుటకు డ్రిల్ బిట్ షాంక్ భాగము కూడా టేపర్ ను కలిగియుండాలి. డ్రిల్ బిట్ మరియు స్లీవ్ ల మధ్యగల ఒత్తిడి మరియు రాపిడివలన డ్రిల్ బిట్ స్లీవ్ లో గట్టిగా బిగింపబడియుంటుంది.
( b ) టేబుల్ ఎత్తును క్రమపరచుట :
1. కాలమునకు టెబుల్ ను బిగించిన ' క్లాంప్ ' ను వదులు చేయాలి. అయితే టేబుల్ క్రిందికి పడిపోకుండా జాగ్రత్త వహించాలి.
2. టేబుల్ ను క్రిందకూ లేదా పైకి జరుపుకొని కావలసిన స్థలములోనికి తేవాలి. రంధ్రము చేయవలసిన కర్రవస్తువును టేబుల్ మీద నేరుగా పెట్టకుండా దాని అడుగున పనికిరాని కర్రముక్క నొకదానిని వుంచాలి. ఈ కర్రముక్క మందము మరియు చక్ నుండి క్రిందకువున్న డ్రిల్ బిట్ పొడవు కలిపితే ఎంతదూరము వుందో నిర్ణయించుకొని, డ్రిల్ బిట్ మొనభాగము నుండి టేబుల్ ను అంతదూరము వుండునట్లు అమర్చాలి.
3. టేబుల్ మధ్యభాగము ( అనగా కేంద్రభాగము ) మరియు డ్రిల్ బిట్ మధ్యభాగము ఒకే సరళరేఖలో వుండునట్లు టేబుల్ ను అమర్చి క్లాంప్ ను బిగించాలి.
( c ) డెప్త్ గేజిని క్రమపరచుట :
1. కర్రవస్తువుయందు పూర్తిగా కాకుండా లోతువరకు మాత్రమే రంధ్రములు చేయవలసి వచ్చినపుడు డెప్త్ గేజి ఉపయోగిస్తుంది. దీనివలన స్పిండిల్ నిలువుగా కదులుటను కొలచుట, మరియు క్రమబద్దముచేయుట జరుగుతుంది.
2. స్పిండిల్ మరియు దానికి బిగించిన డ్రిల్ బిట్ ను క్రిందకు కదిలించి తగినంత దూరము దించుకొనాలి. డ్రిల్ బిట్ మొనభాగము నుండి టేబుల్ పైన అమర్చబడిన కర్రముక్కకుగల దూరమును బట్టి స్పిండిల్ ను క్రిందకు కదిలించి దించుకొనాలి.
3. దించిన స్పిండిల్ ను అదే స్థానములోవుంచి,
డెప్త్ గేజికి గల నట్లను త్రిప్పుకొని క్రమపరచాలి.
( d ) డ్రిల్ బిట్ కు తగిన వేగమును నిర్ణయించుట :
1. డ్రిల్ సైజును బట్టి మరియు కర్రవస్తువు గట్టిదనాన్ని బట్టి డ్రిల్ బిట్ గుండ్రముగా తిరిగెడి వేగమును నిర్ణయించాలి.
2. ఎక్కువ వ్యాసముగల డ్రిల్ బిట్ లను తక్కువ వేగముతో , అతి తక్కువ వ్యాసముగల సన్నని డ్రిల్ బిట్ లను ఎక్కువ వేగముతో త్రిప్పునట్లు V — బెల్టును తగిన పుల్లీ పై అమర్చాలి.
( e ) కర్రవస్తువును టేబుల్ పై అమర్చుట :
1. పొడవైన కర్రవస్తువుపై చిన్నని రంధ్రములను చేయవలసి వచ్చినపుడు దానిని టేబుల్ పై అమర్చి చేతితో గట్టిగా పట్టుకొనవచ్చును.
2. చిన్న సైజు కర్రవస్తువులను టేబుల్ పై యేదైన క్లాంప్ ను ఉపయోగించి లేదా టేబుల్ పై బిగించిన ' వైస్ ' లో పెట్టుకొని కదలకుండా చేయవచ్చును.
3. గుండ్రని కర్రవస్తువులను వైస్ లో గాని లేదా V — బ్లాక్ పై గానీ అమర్చాలి.
4. సరియైన ఆకారము లేని ( సక్రమంగా లేని ) కర్రవస్తువులను తగిన విధంగా పట్టునివ్వాలి.
( f ) రంధ్రములను చేయుట :
1. రంధ్రము చేయవలసిన చోట కేంద్రభాగమువద్ద చిన్న గంటు పెట్టాలి. ఈ గంటులోనికి డ్రిల్ బిట్టును దించుతూ రంధ్రమును చేయడం ప్రారంభించాలి.
2. చేతితో హాండిల్ ను నొక్కిపెట్టి త్రిప్పుచు మెల్లిగా డ్రిల్ బిట్ ను క్రిందకు దించాలి. దీనివలన రంధ్రమును చేసినపుడు తొలగింపబడెడి కర్రపొట్టు రంధ్రము నుండి వెలువడిపోతుంది. అయితే అతిమెల్లగా కదిలెడి డ్రిల్ బిట్ రాపిడివలన ఎక్కువగా వేడెక్కుతుంది. ఎక్కువ వేగంగా దానిని క్రిందకు దించినయెడల హెచ్చు ఒత్తిడి కలిగి అది విరిగిపోవుట లేదా కర్రవస్తువు బీటలువారుట జరుగుతుంది.
3. పూర్తి రంధ్రములను చేయునపుడు డ్రిల్ బిట్ కర్రవస్తువు క్రింది ఉపరితలమునకు సమీపిస్తుండగానే హాండిల్అపై పీడనము తగ్గించాలి.
4.అసంపూర్ణ రంధ్రములను చేయునపుడు తగినంత లోతువరకు దిగగానే డ్రిల్ బిట్ ను ఆపివేయాలి.
5. ఎక్కువ లోతుగల రంధ్రములను రంధ్రములను డ్రిల్ బిట్ ను అప్పుడప్పుడు బయటకు తీస్తూ డ్రిల్లింగ్ పని కొనసాగించాలి.
1.9.4. డ్రిల్లింగ్ యంత్రముయందు చెసెడి ఇతర పనులు :
1. నునుపుపరచెడి సాండర్ ను ఉపయోగించుట ద్వారా వివిధ రకములైన వంపుతలములను నునుపుపరచవచ్చును. సాండర్ ను స్పిండిల్ నకు తగిలించెడి అనుబంధమువలన యిది సాధ్యపడుతీంది. పటము ( 1.72 )
2. గుండ్రముగా తిరిగెడి ప్లేనర్ ను స్పిండిల్ నకు తగిన అనుబంధము ద్వారా అమర్చి కర్రవస్తుతలమును నునుపుపరచవచ్చును.
3. చీలికలను చేసెడి పనీముట్టును తగిన అనుబంధము ద్వారా స్పిండిల్ నకు తగిలించి కర్రవస్తువుయందు మోర్ టైస్ లను ఏర్పరచవచ్చును.
1.9.5 పోర్టబుల్ ఎలక్ర్టిక్ డ్రిల్ :
ఈ డ్రిల్లింగ్ యంత్రమును ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశమునకు తీసుకొనిపోవచ్చును. ఇది చిన్న సైజు విద్యుత్త్ మోటారును కలిగియుండి దాని షాఫ్టుకు నేరుగా డ్రిల్ స్పిండిల్ ను కలిగియుంటుంది. స్పిండిల్ కుగల
చక్ యందు చక్ కీన్ ఉపయోగించి డ్రిల్ బిట్ ను బిగించాలి. దీనియందు 6 మి.మీ. వరకు సైజుగల డ్రిల్ బిట్ లను అమర్చవచ్చును. దీనివలన ఎక్కువ సంఖ్యలో రంధ్రములను త్వరగా యేర్పరచుటకు వీలుంటుంది.
పోర్టబుల్ డ్రిల్ ను ఉపయోగించుటకుగాను రెండు చెతులను ఉపయోగించాలి. ఒక చేతిలో డ్రిల్ యంత్రమును పట్టుకొని, రెండవ చేతితో డ్రిల్ బిట్ కదలకుండా నిశ్చలంగా వుండేట్లుగా చూడాలి.
కర్రవస్తువుయందు ఎక్కువ లోతుగల రంధ్రములను చేయుటకుగాను, డ్రిల్ బిట్ ను మధ్య మధ్యలో కర్రవస్తువునుండి దూరంగా పైకీ తీయవలసి వుంటుంది. దీనివలన చేయబడిన రంధ్రమునుండి కర్రపొట్టును తీసివేయుటయేకాకుండా, రాపిడివలన వెడెక్కిన డ్రిల్ బిట్ చల్లారుతుంది. రంధ్రమునుండి డ్రిల్ బిట్ ను వెలుపలికి తీసినపుడు తిరిగి దానిని రంధ్రము లోనికి అమర్చినపుడు డ్రిల్ యంత్రపు మోటారును పనిచేస్తూ వుండాలి. అంతేకాని డ్రిల్ బిట్ ను రంధ్రములోనికి దూర్చినపిదప మోటారును స్టార్టు చేయరాదు. ఈ విధముగా చేసినయెడల, డ్రిల్ బిట్ సరిగా అమర్చబడకపోయినచో అది విరుగుట లేదా వంగిపోవుట జరుగుతుంది.
యూనిట్ -2
కర్రసామాగ్రి తయారీలో వివిధ ఆకారములను తెలుపు పటములను గీయు విధానములు
2.1 ఉపోద్ఘాతము :
కర్రసామాగ్రిని తయారుచేయుటలో వివిధ ఆకారముల విడివిడిభాగములను తయారుచేసి పిదప వాటిని కలుపుకొనవలసి యుంటీంది. ఈ వివిధ ఆకారములను తయారుచేయుటకీ ముందు వాటి పటములను గీయుట ద్వారా ఆ ఆకారపు వివిధ కొలతలను సులభముగా గ్రహించవచ్చును. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఆ ఆకారమును సూచించెడి పటమును కర్రపలకపై నేరుగా గుర్తించి, పిదప తగిన పనిముట్టు నుపయోగించి ఖండించుట చెయబడుతుంది. అయితే ఆ ఆకారమును సూచించెడి పటమును సరిగా గీయగలిగినపుడే ఆ ఆకారపు కర్రవస్తు విడి భాగమును సరిగా తయారుచేసుకొనగలము. ఇందుకై వివిధ ఆకారములను ఏటవాలుగా గీయుట మనకు తెలియవలసి యుంటుంది.
2.2 రేఖా పటములు :
వివిధ ఆకారనులను రేఖా పటముల ద్వారా గుర్తించుటకై డ్రాయింగ్ పరికరములు వుపకరిస్తాయి. ఈ పరికరములను సరిగా ఉపయోగించినపుడే ఆ రేఖా పటములను ఖచ్చితముగా గీయవచ్చును. వివిధ డ్రాయింగ్ పరికరములను గురించి క్రింద వివరించచనైనది.
1. డ్రాయింగ్ బోర్డు :—
ఇది దీర్ఘచతురస్రాకారములో సీజనింగు చేయబడిన మెత్తని కర్రతో చేయబడియుంటుంది. సుమారు 25 మిమీ. మందముతో వివిధ సైజులలో ఇది లభ్యమగుతుంది. దీని వెడల్పును సూచించు ఒక అంచుయందు ' ఎబోనీ ' ( Ebony )తో చేయబడిన తిన్నని కర్రముక్క అమర్చబడియుంటుంది. ఈ అంచు ఆధారముగా టీ — స్క్వేర్ ను ఉపయోగిస్తూ డ్రాయింగ్ పేపర్ పై రేఖలను గీయాలి. కర్రపనియందు 500x650 నుండి 300x500 మి.మీ. ల కొలతలను కలిగిన . డ్రాయింగ్ బోర్డు ను ఉపయోగించవచ్చును. డ్రాయింగ్ పేపర్ ను డ్రాయింగ్ బోర్డు పై పిన్నులు లేదా క్లిప్పులద్వారా అమర్చి పటములను గీయాలి.
2. టీ —స్క్వేర్ :—
దీని నుపయోగించి డ్రాయింగ్ పేపర్ పై అడ్డముగా సరళ రేఖలను గీయవచ్చును. T — ఆకారములోయున్న దీని హెడ్ భాగము డ్రాయింగ్ బోర్డుకుగల ఎబోనీ అంచుకు ఆనించి బ్లేడు భాగము నుపయోగిస్తూ డ్రాయింగ్ పేపర్ పై రేఖలను గీయవచ్చును.
3. సెట్ — స్క్వేరులు :—
45॰ డిగ్రీల కోణముతో ఒకటి మరియు 60\30 డిగ్రీల కోణములతో రెండవది సెట్ స్క్వేర్లు త్రిభుజాకారములో యుండి 30,45,60 డిగ్రీల కోణములో ఏటవాలుగా రేఖలను గీయుటకు ఉపయోగిస్తాయి.
4. ప్రోట్రాక్టర్ :—
దీనినే ' కోణమానిని ' అంటారు. పైన తెలిపిన కోణములోనే కాకుండా యితర కోణములలో రేఖలను గీయుటకు యిది ఉపకరిస్తుంది.
ఇవి కాకుండా స్కేలు ( లేదా స్టీలు రూలు ), కంపాస్ ( వృత్తలేఖిని ), డివైడర్ మున్నగ యితర డ్రాయింగ్ పరికరములు వివిధ కొలతలను తెలుసుకొనుటకు, చాపములను, వృత్తములను గీయుటకు వుపకరిస్తాయి. వీటినేవిధముగా ఉపయోగించవలయున్నది ఎనిమిదవ తరగతిలో తెలుసుకున్నాము గదా. వివిధ డ్రాయింగ్ పరికరములు పటము 2.1 లో చూపబడ్డాయి.
కర్రపనియందు వివిద ఆకారముల పటములను గీయుటలో ముందుగా తెలుసుకొనవలసిన సాధారణ రేఖ పటముల నిర్మాణ పద్ధతిని తెలుసుకుండాము.
( a ) సరళ రేఖను రెండు సమభాగములుగా విభచించుట :
1. AB అనునది యివ్వబడిన ఒక సరళరేఖ. దీనిని రెండు సమభాగములుగా చేయాలి.
2. A కేంద్రముగా AB పొడవులో సగముకంటే ఎక్కువ వ్యాసార్ధముతో వృత్తలేఖనితో AB కి పైనా, క్రిందా రెండు చాపములను గీయాలి.
3. అదే వ్యాసార్ధముతో ' B ' కేంద్రముగా మరల రెండు చాప రేఖలను గీయుచు ఇంతకు ముందు గీచిన చాపరేఖలను ' C ' మరియు ' D ' ల వద్ద ఖండించాలి.
4. ' C ' మరియు ' D 'లను కలిపెడి రేఖ ABని మధ్యబిందువు ' O ' వద్ద రెండుగా విభజిస్తుంది.
( b ) చాపరేఖను సమద్విఖండన చేయుట :
1. AB అను చాపరేఖను రెండు సమభాగములుగా విభజించాలి.
2. పైన పేర్కొనిన పద్ధతినే అవలంబించాలి.
( c ) ఒక సరళరేఖను ఎక్కువ సంఖ్యలో సమభాగములుగా విభజించుట :
1. AB అను సరళరేఖను ఎక్కువ ( ఉదా ॥ ఆరు ) సంఖ్యలో సమభాగములుగా విభజించపాలి.
2. A నుండి AB కి కొద్దిగా కోణమును చేస్తూ ఏటవాలుగా ఒక రేఖను ( AC ని ) గీయాలి.
3. డివైడర్ తగినంత కొలతను తీసుకొని ఆ కొలతలతో AC పై సమభాగములు చేయాలి. ఈ విధముగా ఆరు సమభాగములు గుర్తించాలి.
4. చివరి ( అనగా 6వ ) భాగమును సూచించే బిందువును B కి కలపాలి.
5. మిగిలిన భాగములను సూచించెడి బిందువులగుండా B6 రేఖకు సమాంతరముగా రేఖలు గీయాలి. ఈ రేఖలు AB ని 6 సమభాగములుగా విభజిస్తవి.
( d ) కోణమును సమద్విఖండన చేయుట :
1. ABC అనునది యివ్వబడిన కోణము.
2. B కేంద్రముగా కొంత వ్యాసార్థముతో ఒక
చాపరేఖను గీయుము. ఇది AB ని బిందువు ' 1' వద్ద మరియు BCని బిందువు ' 2 ' వద్ద ఖండిస్తుంది.
3. బిందువు 1 కేంద్రముగా 1,2ల మధ్యదూరములో సగముకన్నా ఎక్కువగా వ్యాసార్థము వుండునట్లు ఒక చాపమును గీయాలి.
4. అదే వ్యాసార్థముతో ' 2 ' కేంద్రముగా మరొక
చాపరేఖను గీచి, మొదటి చాపరేఖను బిందువు ' O ' వద్ద ఖండించాలి.
5. OB ని కలిపితే అది ABCని రెండు సమభాగములుగా చేస్తుంది.
( e ) త్రిభుజములను గీయుట :
వివిధరకముల త్రిభుజముల ధర్మములను తెలుసుకొనియుండుట కర్రపనిచేయు వ్యక్తికి అవసరము. ఏటవాలుగాయున్న ఉపరితలముతో కూడిన కర్రసామగ్రిని చేయునపుడు యిది ఎక్కువ ఆవశ్యకత కలిగియుంటుంది.
ప్రతి త్రిభుజము మూడు భుజములను మరియు మూడు కోణములను కలిగియుంటుంది. భుజముల పొడవులనుబట్టి వివిధ రకముల త్రిభుజములున్నాయి.
1. సమబాహు త్రిభుజములో అన్ని భుజములు ( అన్ని కోణములు ) సమానము.
2. సమద్విబాహు త్రిభుజములో ఏవేని రెండు
భుజములు సమానముగా వుంటవి.
3. లంబకోణ త్రిభుజములో ఒక కోణము 90॰ కు సమానముగా వుంటుంది.
4. విషమబాహు త్రిభుజము అన్ని భుజములు అసమాన పొడవులను కలిగియుంటుంది.
వివిధ త్రిభుజములను పటము 2.6 లో చూపబడ్డాయి.
త్రిభుజములను గీయుటకుగాను యివ్వబడిన కొలతలు ( భుజముల పొడవులు, కోణములు లేదా యితర వివరములను ) ఆధారముగా తగిన పద్ధతి ననుసరించి గీయాలి. ఉదాహరణగా క్రింద సమబాహు త్రిభుజమును నిర్మించు పద్ధతి వివరింపబడింది.
1. సమబాహు త్రిభుజముయందు ఎత్తు ( 80 మి.మిా. ) యివ్వబడింది. ఈ ఎత్తును కలిగిన సమబాహు త్రిభుజాన్ని నిర్మించాలి.
2. ముందుగా AB అను రేఖను గీయాలి.
3. ఈ లంబ రేఖపై CD యివ్వబడిన ఎత్తునకు ( 80 మి.మిా. ) సమానముగా వుండునట్లు గుర్తించాలి.
5. O వద్ద CD రెండువైపులా 30॰ కోణముతో ఏటవాలుగా రేఖలను గీయాలి. ఈ ఏటవాలు రేఖలు AB ని E, F వద్ద ఖండిస్తాయి.
6. DEF మనకు కావలసిన సమబాహు త్రిభుజము.
( f ) బహుభుజులను గీయుట :
నాలుగు భుజములకన్నా ఎక్కువ భుజములుగల రేఖా పటమును 'బహుభుజి' ( Polygon ) అంటారు. దానికిగల భుజముల సంఖ్యనుబట్టి బహుభుజి ప్రత్యేక పేరుతో పిలవబడుతుంది. ఉదాహరణకు ఐదు భుజములుగల బహుభుజిని ' పంచభుజి ' ( Pentagon ) అనీ, ఆరు భుజములుగల బహుభుజిని ' షడుృజి '
( Hexagon ) అనీ, పిలుస్తారు. వివిధ బహుభుజములను పటము 2.7—2.12 లలో చూడవచ్చును.
అయితే బహుభుజిలో అన్ని భుజములు సమానముగా వుండవచ్చును లేదా వుండకపోవచ్చును. అన్ని భుజములు సమానముగావున్న బహుభుజిని ' క్రమ బహుభుజి ' అంటారు. సమానముగాలేని భుజములుగల బహుభుజిని ' అక్రమ బహుభుజి ' అంటారు. ముందుగా క్రమబహుభుజులను నిర్శించు పధ్ధతిని తెలుసుకుందాము. క్రమ బహుభుజిలో ఒక భుజము పొడవు తెలిసినచో దానిని నిర్శించవచ్చు.
( i ) ఏదేని బహుభుజిని నిర్శించుట :
1. ఇవ్వబడిన భుజము పొడవు ( 50మి.మీ.) తో క్రమ పంచభుజిని నిర్శించవలెననుకొందము.
2. ముందుగా AB అను సరళరేఖ 50మి.మీ. పొడవుతో గీయాలి. BA ను వరకు CA = AB
అగునట్లు పొడిగించాలి. AC వ్యాసార్ధముగా
' A ' కేంద్రముగా అర్ధ వృత్తమును గీయాలి. ఇది B గుండా పోతుంది. ఈ అర్ధ వృత్తమును 5 సమభాగములుగా చేయాలి. ( పటము 2.13 )
3.A2 మరియు AB సరళరేఖలను సమద్విఖండనము చేయాలి. ఈ సమద్విఖండన రేఖలు ' O ' బిందువద్ద ఖండించుకొంటాయి. 'O ' కెంద్రముగా OA వ్యాసార్ధముగా వృత్తమును గీయాలి. ఈ వృత్తము B మరియు 2 బిందువుల గుండాపోతుంది.
4. ' B ' కేంద్రముగా , AB ( 50మి.మీ.) పొడవుతో వృత్తమును E వద్ద ఖండించాలి. అదే వ్యాసార్ధముతో ' E ' కెంద్రముగా వృత్తమును ' O ' వద్ద ఖండించాలి. BE, BE ,D2 లను కలపాలి.
5. ABED2 మనకు కావలసిన పంచభుజి.
గమనిక :
1. ఇదే పద్దతి యితర బహుభుజులకుగూడా వర్తిస్తుంది.
2. పంచభుజికి అర్ధవృత్తమును 5 సమభాగములుగా విభజిస్తే, షడ్బుజికి ఆరు సమభాగాలుగా, సప్త భుజికి ఏడు సమభాగాలుగా విభజించాలి. అర్ధవృత్తమును సమభాగములుగా విభజింపవలసి సంఖ్యా = బహుభుజి కలిగిన భుజముల సంఖ్య.
3. అయితే ప్రతిసారి A ను 2వ బిందువుతోనే కలుపుకొనాలి.
( ii ) షడ్భుజిని నిర్మించుట :
షడ్భుజిని మరియొక సులభమైన పద్దతిలో గీయుట క్రింద వివరింపనైనది.
1. ముందుగా AB ( 50మి.మీ.) సరళరేఖను గీయాలి.
2. A మరియు B కేంద్రములుగా AB వ్యాసార్ధముతో రెండు చాపరేఖలు గీయాలి. ఇవి ' O ' కేంద్రముగా OA వ్యాసార్ధముగా ఒక వృత్తమును గీయాలి. ఈ వృత్తము ' B ' బిందువుగుండా పోతుంది.
3. ' B ' కేంద్రముగా AB వ్యాసార్ధముగా వృత్తమును ' C ' వద్ద, అదే వ్యాసార్ధముతో C కేంద్రముగా ' D ' వద్ద ; D కేంద్రముగా E వద్ద ; E కేంద్రముగా F వద్ద ఖండించాలి. ఈ బిందువులను కలుపుకుంటే ABCDEF క్రమ షడ్భుజి యేర్పడుతుంది.
4. ఈ పద్ధతి షడ్భుజికి మాత్రమే వర్తిస్తుంది.
( iii ) అష్టభుజిని నిర్మించు పద్ధతి :
అష్టభుజిని సులభమైన పద్ధతిలో నిర్మించు పద్ధతి క్రింద వివరించబడింది.
1. ముందుగా AB ( 50 మి.మిా. ) సరళరేఖను గీయాలి.
2. A మరియు B వద్ద లంబ రేఖలను గీయాలి.
3. A మరియు B కేంద్రముగా AB వ్యాసార్ధముగా రెండు అర్థవృత్తములను గీయాలి. ఇవి లంబ రేఖలను C,Dల వద్ద ఖండిస్తాయి.
4. A,D మరియు B,Cలను ( అడ్డముగా ) కలుపుకొని పొడిగించాలి. AD రేఖ A కేంద్రముగా గీచిన అర్థవృత్తమును ' E ' వద్ద BC రేఖ B కేంద్రముగా గీచిన అర్థవృత్తమును F వద్ద ఖండిస్తవి.
5. E,F లను కలుపుతూ అడ్డముగా సరళరేఖను గీయాలి. A మరియు B కేంద్రముగా AB ( 50 మి.మిా. ) వ్యాసార్ధముతో యీ సరళరేఖను G,Hల వద్ద ఖండించాలి.
6. అదే వ్యాసార్ధముతో H కేంద్రముగా పొడిగించబడిన AD రేఖను J వద్ద, G కేంద్రముగా పొడిగించబడిన BC రేఖను K వద్ద
ఖండించాలి.
7. JK లు కేంద్రములుగా అదే వ్యాసార్ధముతో A మరియు B వద్ద నిలువుగా గీచిన లంబ రేఖలను L మరియు Mల వద్ద ఖండించాలి.
8. A,B,H,J,M,L,K,G,A లను కలుపుకొనాలి.
9. ABHJMLKG మనకు కావలసిన అష్టభుజి.
( iv ) అక్రమ బహుభుజలను నిర్మించుట :
అక్రమ బహుభుజలను నిర్మించుటకు ఎక్కువ సమాచారము అవసరమవుతుంది. సాధారణంగా అన్ని భుజముల పొడవు, కొన్ని కోణములు లేదా కొన్ని కర్ణముల పొడవులు తెలిసివుండాలి.
పటములు 2.16—2.18 అక్రమ బహుభుజలను నిర్మించు పద్దతిని తెలుపుచున్నవి.
( g ) దీర్ఘవృత్తము ( Ellipse ) ను నిర్మించు పద్దతి :
దీర్ఘవృత్తము వృత్తమువలె గుండ్రముగా వుంటుంది. అయితే దీని వ్యాసము అన్ని దిశలలో సమానముగా వుండకుండా , క్రమంగా మారుతుంది. పెద్దగా వున్న వ్యాసమును ' పెద్ద అక్షము ' ( Major Axis ) అనీ, దానికి లంబముగా యున్న దానిని ' చిన్న అక్షము ' ( Minor Axis ) అంటారు.
ఒక శంఖువును రెండు ఏటవాలు భుజములగుండా ఖండించి పై భాగమును తీసివేస్తే, ఖండించబడిన అవచ్ఛేదము దీర్ఘవృత్తమును సూచిస్తూ వుంటుంది.
కదులుచున్న ఒక బిందువు, స్థిరముగా యున్న ఒక బిందువునుండి దానికిగల దూరము మరియు స్థిరముగా యున్న ఒక సరళరేఖనుండి దానికిగల లంబ దూరముల నిష్పత్తిని మార్చకుండా కదులుచుపోయెడి మార్గము దీర్ఘవృత్తమును యేర్పరుస్తుంది. ఈ నిష్పత్తిని ' ఏక్ సెంట్రిసిటీ ' ( Eccentricity ) అంటారు.
ఏక్ సెంట్రిసిటీ = కదులుచున్న బిందువు, స్థిర బిందువుల మధ్య దూరము / కదులుచున్న బిందువు స్థిర రేఖలనుండి గల లంబ దూరము
స్థిర బిందువును ' ఫోకస్ ' ( Focus ) అనీ, స్థిర రేఖను ' డైరెక్ర్టిక్స్ ' ( Directrix ) అనీ అంటారు.
అయితే దీర్ఘవృత్తములో యీ నిష్పత్తి ( ఏక్ సెంట్రిసిటీ ) ఎప్పుడూ ఒకటికంటే తక్కువ వుండాలి. అనగా కదులుచున్న బిందువు మరియు ఫోకస్ ల మధ్య దూరము, కదులుచున్న బిందువు మరియు స్థిర రేఖల మధ్య దూరముకన్న తక్కువ వుండాలి.
దీర్ఘవృత్తమునకు రెండు స్థిర బిందువులు ( Foci ) మరియు రెండు స్థిర రేఖలు ( Directrices ) వుంటాయి. స్థిర బిందువులు దీర్ఘవృత్తము లోపలివైపు మరియు స్థిర రేఖలు దాని వెలుపలివైపు వుంటాయి.
దీర్ఘవృత్తమును నిర్మించుటకుగాను వివిధ పద్దతులున్నాయి. అయితే కొన్ని సులువైన పద్దతులు క్రింద వివరింపబడ్డాయి.
( i ) ఏక కేంద్ర వృత్తముల పద్దతి :—
ఇందుకుగాను పెద్ద మరియు చిన్న అక్షరముల పొడవు తెలిసియుండాలి.
1. ముందుగా AB ( పెద్ద అక్షము ) ని తగిన పొడవు ( 120 మి.మీ ) గీయాలి. దీని సమద్విఖండన రేఖపై CD ( చిన్న అక్షము ) పొడవును ( 80 మి.మీ. ) గుర్తించాలి. AB , CD లు ' o ' వద్ద ఖండించుకొంటాయి.
2. O కేంద్రముగా OC వ్యాసార్ధముతో చిన్న వృత్తమును గీయాలి. అదే బిందువు ( O ) కేంద్రముగా OA వ్యాసార్ధముతో పెద్ద వృత్తమును గీయాలి. ఇవి రెండు ఏక కేంద్ర వృత్తములు.
3. చిన్న వృత్తమును అనేక సమభాగములుగా విభజించాలి. సమభాగములుగా విభజించు యీ రేఖలను ( O1, O2,O3 మొదలగునవి ) పొడిగించి పెద్ద వృత్తమునుకూడా ఖండించినట్లు ( 1',2',3' మొదలగు బిందువుల వద్ద ) పొడిగించాలి.
4. వెలుపలి వృత్తముపై లభించిన బిందువుల వద్దనుండి నిలువు రేఖలు మరియు చిన్న వృత్తము పై గల బిందువుల నుండి అడ్డు రేఖలు గీయాలి.
5. సంబంధిత రేఖలు ( అనగా 1' నుండి గీచిన నిలువ రేఖ మరియు 1 నుండి గీచిన అడ్డు రేఖ ) ఖండించుకొను బిందువులను గుర్తించాలి.
6. ఈ బిందువులను కలుపుతూ చాపరేఖను గీచినచో దీర్ఘవృత్తము యేర్పడుతుంది.
( ii ) పేపరు ముక్క పధ్ధతి :—
దీనికిగూడా పెద్ద అక్షము మరియు చిన్న అక్షము పొడవు తెలిసియుండాలి.
1. ముందుగా AB ( పెద్ద అక్షము ) మరియు ( చిన్న అక్షము ) ఒకదానితో నొకటి ' O ' వద్ద సమద్విఖండనము చేసుకొనునట్లు గీయాలి.
2. కార్డుబోర్డు లేదా గట్టి కాగితమును స్కేలు ఆకారములో యేర్పరిచి దానిపై బిందువు ' E ' ని గుర్తించినట్లు ఒక అడ్డుగీత గీయాలి.
3. పిదప పెద్ద అక్షములో సగము పొడవును సూచించు దూరమును E నుండి కొలచి F బిందువునుగుర్తించాలి.
4. అదే విధముగా చిన్న అక్షము పొడవును సూచించు దూరమును E నుండి కొలచి G బిందువునుగుర్తించాలి. ( అనగా కాగితపు ముక్క పై E, G, F, బిందువునుగుర్తింపుబడ్డాయి. )
5. F బిందువును చిన్న అక్షము పై వుంచి, అది కదలకుండా G బిందువును పెద్ద అక్షమును తాకునట్లు అమర్చాలి. ( అనగా F బిందువు చిన్న అక్షముపై మరియు G బిందువు పెద్ద అక్షముపై వున్నాయన్నమాట. )
6. ఇప్పుడు ' E ' బిందువుగల స్ధలమును డ్రాయింగ్ పేపర్ పై గుర్తింపుము.
7. పేపర్ ముక్కను డ్రాయింగ్ పేపరుపై కదిలిస్తూ ఎల్లప్పుడు F బిందువు చిన్న అక్షము పై మరియు G బిందువు పెద్ద అక్షముపై వుండునట్లు చేస్తూ E బిందువు స్ధలమును డ్రాయింగ్ పేపర్ పై గుర్తిస్తూపోవాలి.
8. ఈ విధముగా చిన్న అక్షము మరియు పెద్ద అక్షమునకు రెండు వైపులా గుర్తించాలి.
9. గుర్తింపబడిన బిందువులన్నింటిని కలిపితే దీర్ఘవృత్తము యేర్పడుతుంది.
( iii ) దారము నుపయోగించి దీర్ఘవృత్తము గీయుట :—
ఈ పద్ధతికిగూడ పెద్ద అక్షము మరియు చిన్న అక్షముల పొడవు తెలిసియుండాలి.
1. ముందుగా AB ( పెద్ద అక్షము ) మరియు CD ( చిన్న అక్షములను ) గీయాలి.
2. పెద్ద అక్షములో సగము పొడవును ( అనగా AO ) వృత్తలేఖినిపై తీసుకొని ' C ' కేంద్రముగా ABని రెండు బిందువుల వద్ద ఖండించినట్లు చాపరేఖలు గీయాలి. ఈ రెండు బిందువులు స్ధిరబిందువులు F1,F2
3. F1,F2 ల వద్ద రెండు సూదులను గుచ్చాలి.
3. బిగువైన ఒక దారము ఒక కొనకు F1 వద్ద గల పిన్నుకు గట్టిగా కట్టాలి.
5. పెన్సిల్ ములుకు పదునైన మొనను వద్ద G ఆనించి దానిని నిలీవు నిలబెట్టి దారమును ములుకుచుట్టూ పోనిస్తూ రెండవ కొనను F2 వద్దగల పిన్ను వద్దకు తీసుకురావాలి. దారమును గట్టిగా లాగి బిగువుగా వుండునట్లు చేసి F2 వద్ద రెండవ కొనను కట్టివేయాలి.
6. ఇప్పుడు పెన్సిల్ ను పేపర్ పై నుండి పైకి లేపకుండా దారము బిగువుగానే వుండునట్లు చూస్తూ పెన్సిల్ ను పేపర్ పై కదిలిస్తూపోతే దానిములకు దీర్ఘవృత్తమును గీస్తుంది.
ఇది చాలా సులువైన పద్ధతి.
2.3. కర్ర సామాగ్రిపైనగిషీ పని :
కర్రసామాగ్రి అందమును యినుమడింపజేసి అది కనులకు యింపుగా కనపడుటకుగాను దానిపై నగిషీల నేర్పరుస్తారు. నగిషీల నేర్పరచునపుడు కర్రసామాగ్రి ఆకారమును పూర్తిగా మార్చకుండా దానిపై వివిధ రకముల డిజైన్లను ఏర్పరచి దానికి ఎక్కువ అందమును కలుగచేయునట్లు చూడాలి. నగిషీపనివలన కర్రసామాగ్రి ఉపయోగమునకు యేవిధమైన అవరోధము కలుగకుండా వుండాలి. కర్రసామాగ్రిపై ఏర్పరచు నగిషీపని కర్రపనిచేసెడి వ్యక్తి అనుభవము, నైపుణ్యత మున్నగు విషయములపై ఆధారపడియుంటుంది. కర్రసామాగ్రిపై ఏర్పరచు కొన్ని నగిషీ పనులను గురించి క్రింద వివరించనైనది.
1. సహజ డిజైనులు :—
కొన్ని రకములు కలపలయందు కర్రరంగుకణముల అమరిక, కర్రపొరలు అసాధారణముగా వుండి ప్రత్యేకతను కలిగి యుంటవి. ఈ ప్రత్యేకత ఆకర్షణీయమైన డిజైనుగా యేర్పడుటవలన సహజమైన కర్రఅందము ఎక్కువవుతుంది. వృక్షాకిండము పై ఏర్పడుముళ్లు ( Knots ), వృక్షము పెరిగినపుడు వృద్దిచెందు వార్షి కవలయములు ( ఆన్యులర్ రింగులు ), మెడ్యూల్లరీ రింగులు మొదలగునవి మరియు వృక్ష కాండములో కణముల అమరికలో మార్పులు ( అలల మాదిరిగా, పలకల మాదిరిగా ) యీ విధమైన అసాధారణ డిజైన్లను యేర్పరుస్తవి.
ఈ డిజైన్లను కలిగిన కలపను ఎన్నుకొని, దానిని కోసి, కోయబడిన భాగములను తగిన విధముగా కలుపుకొని నునుపుపరచినయెడల కర్రసామాగ్రి అందము ఎక్కువవుతుంది. కలపరంగు , కణములు , డిజైను , ఆకారము మున్నగువాటిని పరిశీలించి తగిన నగిషీని నిర్ణయించవలసిన యుంటుంది.
2. అంతర కూర్పు :—
ఈ పద్ధతియందు తక్కువ మందముగల సన్నని కర్రముక్కలపై డిజైన్లను ఖండించి, అవే డిజైన్ల ఆకారముగల చీలికలను కర్రవస్తువుయందు ఏర్పరుస్తారు. ఈ చీలికలో కత్తిరించిన ముక్కలను జిగురు ద్వారా జాగ్రత్తగా అమరుస్తారు. అంతర కూర్పు నేర్పరుచుటకుగాను సన్నని కర్రముక్కలనే కాకుండా ఇత్తడి, రాగి మొదలగు లోహములు, ఎముక ముక్కలు, ముత్యపు చిప్ప మొదలగునవి వాడవచ్చును.
3. వినీరింగు ( Venecring ) :—
ఈ పధ్ధతియందు తక్కువ నాణ్యత కలిగిన కర్రపై మేలురకమైన ఖరీదెక్కువ గల సన్నని కర్రను వివిధ ఆకారములలో కోసీ జిగురు ద్వారా అంటిస్తారు. ఈ విధంగా దానినీ ఆకర్షణీయకంగా చేయవచ్చు.
4. కర్రను తొలుచు విధానము :—
ఇది చాలా పురాతనమైన పద్ధతి. దీని యందు ఉలి లేదా గౌజు లేదా చాకు ఉపయోగించి కర్రవస్తువును తొలిచి తగిన డిజైన్లను యేర్పరచవచ్చును.
5. పంచింగ్ ( Punching ) :—
ఈ పధ్ధతియందు కర్రవస్తువు ఉపరితలము యందు కొద్ది లోతులో కావలసిన డిజైను యేర్పరచుటకుగాను కర్రను తొలగిస్తారు. ఇందుకుగాను వివిధరఖముల ' పంచ్ ' లు ఉపయోగిస్తారు. అవసరమైన యెడల యీ విధముగా యేర్పడిన డిజైను పై పెయింట్ చేయవచ్చును.
6. బహిర్ కూర్పు :—
కర్రపై లేదా యేదైన లోహముపై తగిన డిజైనును కత్తిరించి, దానిని కర్రవస్తువులపై అమర్చుటను ' బహిర్ కూర్పు' అంటారు.
7. కర్రపలకలతో నేలలను చేయునపుడు వేరువేరు రంగులుగల కర్రదిమ్మలను ప్రత్యేక పద్ధతిలో అమర్చుట ద్వారా ఆకర్షణీయమైన డిజైన్లు యేర్పడుతవి.
మోల్డింగులు :—
కర్రచే తయారుచేయబడు ఉపకరణములపై నగిషీల నేర్పరచు మరియొక పధ్ధతిని ' మోల్డింగు ' ( Moulding ) అంటారు. ఈ పద్ధతి యందు కర్రవస్తు ఉపరితలమును చదునుగా వుంచుటకు బదులు దానిపై వంపులు, చీలికలు లేదా యితర ఆకారముల నేర్పరుచుట జరుగుతుంది. ఈ పనిచేతి పనిముట్టు లేదా యంత్ర పనిముట్టుతో చేయబడుతుంది. వీటి ఆకారములు కర్రవస్తుతలము నుండి వెలుపలివైపు ఉబ్బెత్తుగా లేదా లోపలివైపు వంపుదిరిగి యుంటవి.
వంపుదిరిగియున్న తలములతో కూడిన మోల్డింగులు దీర్ఘవృత్తము ( Ellipse ) , పారవలయము ( Parabola ) , లేదా అతిపారవలయము ( Hyperbola ) మున్నగు ప్రత్యేకరకపు వంపులను కలిగియుండవచ్చును. లేదా వివిధ సైజుల వృత్తములయొక్క చాపరేఖలచే యేర్పరచబడి వుండవచ్చును.
వివిధ రకముల మోల్డింగులు పటము 2.29 లో చూపబడ్డాయి. కర్రవస్తువుపై మోల్డింగును ఏర్పరుచుటకుగాను ప్రత్యేకరకపు ప్లేనులను ఉపయోగించాలి. ఈ ప్లేనులు ఖండించెడి బ్లేడు మరియు ప్లేను అడుగు భాగము మోల్డింగు ఆకారమునకు సరిపోవు ఆకారమును కలిగియుంటవి.
మోల్డింగులను, చీలికలను ప్లేను నుపయోగించి ఏర్పరచనపుడు ప్లేనింగ్ కర్రవస్తువు ముందువైపు ప్రారంభించి మెల్లిగా వెనుకవైపునకు సాగాలి.
యూనిట్ - 3
కర్రసామాగ్రి డిజైన్ మరియు నిర్మాణము
3.1 ఉపోద్ఘాతము :
కర్రతో చేయబడి వివిధ ఉపకరణములను తయారు చేయుటకుగాను ఆ ఉపకరణము ఉపయోగము, దానిని వాడెడి విధానము మున్నగు వివరములను ముందుగా తెలుసుకొనాలి. ఆ ఉపకరణము ఒకేచోట స్ధిరముగా వుంచబడెడిదా ఉదా: ( గోడలోనే అమర్చబడిన బీరువా ) లేక ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశమునకు తీసుకొని పోయెడిదా ( ఉదా : కుర్చీ, టేబుల్ మొదలగునవి ) అన్న విషయము గమనించాలి. వివిధ ఉపకరణములను నిర్మాణ పద్ధతి క్రింద తెలుపబడింది.
కర్రఉపకరణములను తయారుచేయుటలో ముఖ్యముగా మూడుభాగములు ( Steps ) కలవు. డిజైన్ చేయుట, డ్రియింగ్ చేయుట మరియు నిర్మాణ పద్ధతి అని వీటిని పేర్కొనవచ్చును.
A.డిజైన్ చేయుట :
కర్రసామాగ్రిని రూపకల్పన ( Design ) చేయుటకుగాను క్రింద పేర్కొనిన విషయములను ముందుగా గమనించాలి.
( i ) వస్తు ఉపయోగము :—
తయారుచేసిన పిదప కర్రసామాగ్రిని యేవిధముగా ఉపయోగించాలీ అన్న విషయమునుబట్టి ఆ సామాగ్రి ఆకారము సూచనామాత్రంగా మన మెదడులో రూపుదిద్దుకొంటుంది. ఉపయోగమును బట్టి కర్రసామాగ్రి ఆకారము, పరిమాణము మొదలగునవి నిర్ణయింపబడును.
( ii ) పరిమాణము :—
కర్రసామాగ్రి ఉపయోగమును ఆధారంగా పరిమాణము ( సైజు ) నిర్ణయింపబడుతుంది. అయితే దాని ఆకారము దానికి కావలసిన పటిష్టత, అవసరపడు కర్రకు అయ్యే ఖర్చు మున్నగు వివరములు కూడా పరిమాణమును నిర్ణయించుటలో తోడ్పడుతవి.
( iii ) ఇతర వివరములు :—
ఉపకరణములను తయారుచేయుటకుగాను ఉపయోగించెడి కర్ర వివరములు, వివిధ జాయింట్లను ఏర్పరచు విధానము , దానిపై నగీషీలు ఏర్పరుచు పద్దతి మున్నగు వివరములుకూడ కర్ర ఉపకరణము రూపకల్పన ( డిజైను ) లో తోడ్పడతవి. అయితే యీ వివరముల ఆధారముగా దానిని రూపకల్పన గావించినపుడు దాని ఉపయోగమునకు యే విధమైన అవరోధము లేకుండా చూడాలి.
B. పటమును గీయుట :
కర్రసామాగ్రిని రూపకల్పన చేయునపుడే దాని వివిధభాగముల చిత్తు పటములను గీస్తూ వాటి డిజైనుకు కావలసిన ఆవశ్యకతలను పొందుట జరుగుతుంది. విడిభాగముల చిత్తు పటములను ( Rough sketches ) దృష్టిలో పట్టుకొని, ఆ భాగములను కలిపినపుడు కర్రసామాగ్రి యే విధముగా ఏర్పడుతుందో తెలిపెడి పటమును గీయవలసి వుంటుంది. ఈ పటమును ' వర్కింగ్ డ్రాయింగ్ ' ( Working drawing ) అంటారు. దీనిలో తెలిపిన వివిధ సూచనలను గమనిస్తూ, వాటి ఆధారముగా వర్కషాప్ లోని కర్రపనిచేయువ్యక్తి ఆ కర్రసామాగ్రిని తయారుచేస్తాడు. ఈ డ్రాయింగ్ లో
కర్రసామాగ్రి ఆకారము, అన్ని కొలతలు మరియు దానిని తయారుచేయుటలో వర్కర్ తెలుసుకొనవలసిన అన్ని వివరములు పూర్తిగా సూచింపబడివుంటవి. కర్రసామాగ్రిని తయారుచేయుటలో ముందుగా విడి విడి భాగములను చేసుకొని వాటిని తగిన విధముగా కలపవలసి వుంటుంది కదా! కావున డ్రాయింగ్ లో విడి విడి భాగముల పటములు, వాటిని కలిపెడి జాయింట్ల వివరములు, పటములు మరియు మోల్డింగులు మొదలైన నగిషీ పనుల వివరములు చేర్చవలసియుంటుంది.
వర్కింగ్ డ్రాయింగ్ లను మూడు విధములుగా వేయవచ్చును.